నిప్పులుగక్కే ఎండల్లో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. గంట చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలపాటు ఏసీ హెల్మెట్ పనిచేస్తుంది. రూ.13 వేలు విలువజేసే ఈ హెల్మెట్లను హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు.
ముందుగా ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు డీఐజీ, ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌నాయక్ అనంతపురం క్లాక్‌టవర్ వద్ద బుధవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు స్వయంగా ఏసీ హెల్మెట్లు ధరింపజేశారు. హెల్మెట్ పెట్టుకున్నపుడు తలకు చల్లగా ఉందని, సౌకర్యవంతంగా ఉందని సిబ్బంది తెలిపారు. త్వరలోనే అవసరమైనన్ని హెల్మెట్లు తెప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. –అనంతపురం శ్రీకంఠంసర్కిల్
Comments
Please login to add a commentAdd a comment