Ammireddy
-
ఇక ఆక్టోపస్ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం
తిరుమల: తిరుమల ఆలయం వద్ద పటిష్ట భద్రత కోసం ఆక్టోపస్ బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను బుధవారం తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆక్టోపస్ అధికారులతో కలిసి డీఐజీ పరిశీలించారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ప్రవేశమార్గం వద్ద ఏర్పాటుచేసే ఈ చాంబర్లో ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ఆక్టోపస్ బృందం.. ఒక సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుదాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, డే విజన్ గ్లాసెస్, ఇతర అత్యాధునిక పరికరాలు ధరించి శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఐదు నుంచి ఆరుగురు చొప్పున నిరంతరాయంగా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. వీరు శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని ప్రధానంగా రక్షిస్తారని తెలిపారు. ఎప్పుడైనా అకస్మాత్తుగా శత్రువులు ఎక్కువమంది దాడి చేసేందుకు ప్రయతి్నస్తే వీరితో పాటు వెంటనే బ్యారెక్‌లోని మరో 20 మంది ఆక్టోపస్ సిబ్బందికి సమాచారం అందుతుందని వారు కాలినడకన ఇక్కడకు చేరుకుని శత్రువును ఎదుర్కొనేలా భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక భద్రతా దళం.. ఆక్టోపస్ రాష్ట్రంలో ఉగ్రవాదం, మత కలహాలను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగం ‘ఆపరేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్). దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ 2007, అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ సాయుధ బలగాల తరహాలో ఆక్టోపస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ నుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా ఎన్ఎస్జీ కమాండోల తరహాలో శిక్షణనిస్తారు. గ్లోక్–19 పిస్టల్స్, కోల్ట్ 9ఎంఎం ఎస్ఎంజీ, ఫ్రాంచి స్పాస్–15 డ్యూయల్ మోడ్ షాట్‌గన్స్, స్నైపర్ రైఫిల్స్, టేజర్ గన్స్, కార్నర్ షాట్స్ సిస్టం మొదలైన అత్యాధునిక ఆయుధాలతో విజయవంతంగా దాడులు చేయడంలో వీరు నిష్ణాతులు. ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యలకు యతి్నంచినా మెరుపువేగంతో తిప్పికొట్టగల సామర్థ్యం ఆక్టోపస్ సొంతం. -
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
నిప్పులుగక్కే ఎండల్లో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. గంట చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలపాటు ఏసీ హెల్మెట్ పనిచేస్తుంది. రూ.13 వేలు విలువజేసే ఈ హెల్మెట్లను హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు. ముందుగా ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు డీఐజీ, ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌నాయక్ అనంతపురం క్లాక్‌టవర్ వద్ద బుధవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు స్వయంగా ఏసీ హెల్మెట్లు ధరింపజేశారు. హెల్మెట్ పెట్టుకున్నపుడు తలకు చల్లగా ఉందని, సౌకర్యవంతంగా ఉందని సిబ్బంది తెలిపారు. త్వరలోనే అవసరమైనన్ని హెల్మెట్లు తెప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. –అనంతపురం శ్రీకంఠంసర్కిల్ -
బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సంబంధించి మరో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం ఐదుగురి బెంటింగ్రాయుళ్లను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మరో ఐదుగురు పరారయ్యారు. వారిని గురువారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వాటి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు ఎస్పీ వెల్లడించారు. గతంలోనే ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పట్టుకున్న ముఠా నుంచి రూ. 2.40 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం పోలీసులు పట్టుకున్న ముఠాలో రాజాం పట్టణానికి చెందిన గొర్లె దుర్గారావు, రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన కత్రి సింహాచలం, వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన గెంబలి అనిల్‌కుమార్, రేగిడి ఆమదాలవలస మండలం పెద్దశిర్లాం గ్రామానికి చెందిన లెంకా చిన అప్పలనాయుడు, రాజాం మండలం మొగిలివలసకు చెందిన ఆబోతుల భగవాన్ ఉన్నారన్నారు. క్రికెట్ బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ టీంకు బెట్టింగ్ కాయడం వల్ల లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తారని, దానికి అనుగుణంగా యువతను బెట్టింగ్‌లోకి దించుతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ సమాజానికి మంచిదికాదని ఎస్పీ అన్నారు. యువత బెట్టింగ్‌లోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయన్నారు. బెట్టింగ్ వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ‘ఆపరేషన్ లక్ష్య’.. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సుదీర్ఘ జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల నివారణకు మొబైల్ పోలీసు బృందాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ‘ఆపరేషన్ లక్ష్య’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాహనాలకు ముందు, వెనుక రేడియం స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వన్ స్టిక్కర్–వన్ లైఫ్ నినాదంతో వీటిని తయారుచేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతను మంచి మార్గంలో నడిపే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. భామిని మండలంలో ఇటీవల వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. త్వరలో సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసులకు సమాజ పరిస్థితులపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తరఫున లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎచ్చెర్ల ఏటీఎం చోరీపై మాట్లాడుతూ ఒక బృందం రాజస్థాన్ వెళ్లిందని, ఈ నెలాఖరు నాటికి ఈ కేసు విషయంలో ప్రగతి ఉండవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి.గంగరాజు, రాజాం సీఐ సి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
శిల్ప అత్మహత్యకు లైంగిక వేధింపులే కారణం
-
దోపిడీ యత్నం కేసులో ఐదుగురికి జైలు
ఉంగుటూరు : చేబ్రోలులో దోపిడీకి యత్నించిన కేసులో ఐదుగురు నిందితులకు ఐదేళ్ల జైలు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ సబ్‌జడ్జి పి.డేవిడ్ బుధవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గతేడాది మార్చి 1న చేబ్రోలు రామాలయం సమీపంలోని యెలిశెట్టి పాపారావు బాబ్జి ఇంట్లో మారణాయుధాలతో దోపిడీకి యత్నించిన సంఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన లక్కమెల పాండయ్య, దారా సంజీవ కుమార్, మణికంఠ మనోహరరెడ్డి, ఉడిసె యశ్వంత్‌రెడ్డి, అమ్మిరెడ్డి శివ నాగేశ్వరరావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి జైలు, జరిమానా శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో వానరాపి సతీష్(హైదరాబాద్), కడమంచి శ్రీను (గన్నవరం) కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. అడిషనల్ పీపీ శిరినీడి విజయకృష్ణ కేసు వాదించగా గణపవరం సీఐ ఎన్.దుర్గాప్రసాద్ ప్రాసిక్యూషన్‌కు సహకరించారని చేబ్రోలు ఎస్సై పైడిబాబు తెలిపారు.