helmets
-
రక్షణ చత్రమంటున్నా.. రెక్లెస్!
2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్ అర్షద్ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్ నాలా నుంచి సెవెన్ టూంబ్స్ మెయిన్ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్ పెట్టుకోవడం లేదు.కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.అడపాదడపా పోలీసుల స్పెషల్ డ్రైవ్లుహెల్మెట్ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు పట్టించుకోలేదు.తేజ్ దీప్ కౌర్ మీనన్ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్) సైతం హెల్మెట్ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాహనచోదకుల్లో నిర్లక్ష్యంనగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్ పెట్టించాలని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్ హెల్మెట్లు, హెల్మెట్ ధరించినా స్ట్రాప్ బిగించుకోకపోవడం, హెల్మెట్ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్ ధారణ సాకారం కావట్లేదు. నగరంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టిహైదరాబాద్లో వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓలోని రోడ్ సేఫ్టీ అండ్ ఇన్జ్యూరీ ప్రివెన్షన్ విభాగం టెక్నికల్ ఆఫీసర్ స్వేర్కర్ అల్మ్క్విస్ట్.. హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుతలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.మెదడు రక్షణ: హెల్మెట్ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్ బ్రెయిన్ ఇన్జ్యూరీస్) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.ఫేస్ ప్రొటెక్షన్: చాలా హెల్మెట్లు ఫేస్‌షీల్డ్ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.కంటి రక్షణ: విజర్ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్లు గాలి, దుమ్ము, సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగాఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.మార్పు కోసం కృషి చేస్తున్నాంగతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి. జంక్షన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకున్నా దాని స్ట్రాప్ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం. - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన కల్పించండి హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ధరించకుండా సంభవించే దు్రష్పభావాలపై వాహన చోదకులలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంది. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తప్పనిసరిగా బాడీఓర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలంది. తద్వారా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టు ముందుంచి వారికి శిక్ష పడేలా చేయొచ్చని తెలిపింది. అలాగే మోటారు వాహన చట్టంలో నిర్ధేశించిన ఇతర నిబంధనలను కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారం విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. అందువల్ల సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన చలాన్ల వివరాలను, వాహన తనిఖీల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. మంచి వ్యాజ్యం దాఖలు చేశారంటూ పిటిషనర్ తాండవ యోగేషన్ను ధర్మాసనం ఈ సందర్భంగా అభినందించింది.2022లో 3,042 మంది మృతి కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ట్రాఫిక్‌తో సహా మోటారు వాహన చట్ట నిబంధనల కింద ఇతర విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర అధికారులు బాడీఓర్న్ కెమెరాలను ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవించాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. విజయవాడలో హెల్మెట్ లేకుండా వాహన చోదకులు తిరుగుతుండటాన్ని తాము కూడా గమనించామంది. చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. దీనికి ముందు చట్ట నిబంధనల అమలుకు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
నిప్పులుగక్కే ఎండల్లో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. గంట చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలపాటు ఏసీ హెల్మెట్ పనిచేస్తుంది. రూ.13 వేలు విలువజేసే ఈ హెల్మెట్లను హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు. ముందుగా ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు డీఐజీ, ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌నాయక్ అనంతపురం క్లాక్‌టవర్ వద్ద బుధవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు స్వయంగా ఏసీ హెల్మెట్లు ధరింపజేశారు. హెల్మెట్ పెట్టుకున్నపుడు తలకు చల్లగా ఉందని, సౌకర్యవంతంగా ఉందని సిబ్బంది తెలిపారు. త్వరలోనే అవసరమైనన్ని హెల్మెట్లు తెప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. –అనంతపురం శ్రీకంఠంసర్కిల్ -
Union Budget 2023-24: హెల్మెట్లపై జీఎస్టీని తొలగించాలి
పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో హెల్మెట్లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయం ఉండాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాసినట్లు ఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రహదారుల కోసం ఐఆర్ఎఫ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ 11 శాతం వాటా కలిగి ఉందని ఐఆర్ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. -
హెల్మెట్ రూల్స్ కఠినతరం: ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు..
న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం. బైక్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు. చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు!
మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మనలో ఎంత మందికి తెలుసు, మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ కంపెనీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న రెండు హెల్మెట్లను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్) కొత్త బైక్ ఎక్కడ కొంటున్నారో ఆ షోరూం వారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాలని అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు వినియోగదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది. CTP appeals citizens to rightfully claim two standard helmets along with any type of motor cycle they purchase as per the Rule 138(4)(f) of the Central Motor Vehicles Rules, 1989.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/EEbx5ud8kC — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
ఏపీ: హెల్మెట్ లేని పోలీసులకు జరిమానా
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లా కేంద్రంలో 27 మంది పోలీసులకు ట్రాఫిక్ విభాగం అధికారులు శనివారం జరిమానాలు విధించారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బందరు ట్రాఫిక్ డీఎస్పీ భరత్‌మాతాజీ నగరంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే పోలీసులను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పోలీసు క్వార్టర్స్ల వద్ద కాపు కాసి హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన పోలీసులను పసిగట్టి మరీ పట్టుకున్నారు. 27 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించటాన్ని గమనించి అడ్డుకోవటంతో పాటు అక్కడికక్కడే ఆన్లైన్లో జరిమానాలు విధించారు. మరో 100 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఒక్క రోజులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులకు జరిమానాలు విధించిన భరత్మాతాజీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు. -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
ఈ జడ్జి గ్రేట్
దొడ్డబళ్లాపురం: సాధారణంగా హెల్మెట్లు ధరించకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తుంటారు.లేదా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ పనిని ఒక న్యాయమూర్తి చేయడం విశేషం. ఈ సంఘటన దావణగెరె జిల్లా హరపనహళ్లి పట్టణంలో చోటుచేసుకుంది. రోడ్డు భద్రతా వారోత్సవాల నేపథ్యంలో హరపనహళ్లి కోర్టు జడ్జీ మంజుళ శివప్ప తానే స్వయంగా రోడ్డు మధ్యలో నిలబడి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని నిలిపి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత గురించి వారికి వివరించారు. జడ్జి చొరవను అందరూ ప్రశంసించారు. -
హెల్మెట్ పెట్టుకోలేదని...
-
వైరల్ : హెల్మెట్స్ పెట్టుకోలేదని షూ విసిరారు
ఇటీవల కాలంలో కొంతమంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఇద్దరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదని బెంగళూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ షూస్ విసిరారు. ఇదంతా కెమెరాలో బంధించిన ఒకతను, యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే వెంటనే ఆ కానిస్టేబుల్ పోస్టు కూడా ఊడి, సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...రోడ్డుకు పక్కన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వేచిచూస్తూ ఉన్నారు. వారి పక్క నుంచే హెల్మెట్స్ పెట్టుకోకుండా ఇద్దరు బైకర్లు వెళ్తూ కనిపించారు. వారిని చూసిన ఒక ట్రాఫిక్ పోలీసాఫీసర్ షూ తీసి, వారిపైకి విసిరారు. బైకర్లలో ఒకరికి ఈ షూ తగిలింది. అయినా వాళ్లిద్దరూ ఆగకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటన్నంతటినీ ద్విచక్ర వాహనదారుల వెనుకాలే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న రిషబ్ ఛటర్జీ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న బీఈఎల్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు రిషబ్ పేర్కొన్నాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను తాము ప్రేమిస్తామని, కానీ ఇటు పోలీసులు, అటు బైకర్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఈ పోస్టుకు ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఎఫ్బీకి కూడా దీన్ని షేర్ చేయాలని కోరాడు. నెంబర్ ప్లేట్‌ను నమోదు చేసుకుని, వారికి జరిమానా విధించవచ్చు కదా అని యూజర్లంటున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని, బైకర్ల జీవితాలకు ప్రమాదం తెచ్చే బదులు, జరిమానా కోసం నోటీసులు పంపవచ్చని పేర్కొంటున్నారు. బైకర్లపైకి షూస్ విసిరే హక్కులు పోలీసులకు లేవన్నారు. కానిస్టేబుల్ ఈ పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండాల్సి ఉండేదని యూట్యూబర్ కూడా అన్నాడు. ‘ఈ సంఘటనను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఫోటో తీసి, జరిమానా విధించాలి. బెంగళూరులో చాలా మంది పోలీసులు వద్ద డిజిటల్ కెమెరాలు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించే వారిని రికార్డు చేయవచ్చు. పలు మార్గ కూడలిలో ఏర్పాటు చేసిన కెమెరాలతో వాహన నెంబర్‌ను ట్రాక్ చేయవచ్చు’ అని యూట్యూబర్ పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోతో, ఆ పోలీసు కానిస్టేబుల్ పదవి పోవడమే కాకుండా.. జలహాలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే బైక్‌పై వెళ్లిన ఆ ఇద్దరు యువకులు మాత్రం కానిస్టేబుల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు. -
హెల్మెట్ ధారణ బేఖాతరు
స్వల్ప జరిమానాలే కారణం రెండు నెలల్లో రూ.10.22 లక్షలు వసూలు నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్) : ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు ధరించాలని ఓ వైపు పోలీసులు చెబుతున్నా ద్విచక్ర వాహనదారుల్లో ఏ మాత్రం మార్పు రావటంలేదు. దీనికి జరిమానాలు స్వల్పంగా ఉండటమే ప్రధాన కారణంగా పోలీసులు పేర్కొం టున్నారు.మోటార్ వాహన చట్టం ఉల్లంఘనలకు పాల్పడే వారికి ప్రస్తు తం రూ. 100 లేదా, రూ. 200 వరకు జరి మానాలతో సరిపెడుతున్నారు. వాహనదారులు ఇంతేలే అన్న ట్లు జరిమా నా చెల్లిస్తూ వెళ్లిపోతున్నారు. దీంతో ప్రతినెల ప్రభుత్వ ఖజానాలో లక్షలాది రూపాయలు జమ అవుతున్నాయి. జిల్లా కేంద్రంలో గత సంవత్సరం 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పా టించని 31,170 మందికి రూ. 49,09,200 జరిమానాలు విధించారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఏ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్థమవుతోంది. ఈ ఏడాది జనవరి లో పోలీసులు 3,432 కేసులు నమోదు చేసి రూ. 4,63,900 జరి మానా విధిం చారు. ఫిబ్రవరిలో 2800 కేసులు నమోదు చేసి రూ. 5,58,900 జరిమానాలు విధించారు. గతంలో హెల్మెట్ల వాడకం విషయంలో జిల్లా పోలీసులు కఠిన ంగా వ్యవహరించడంతో వాహనదారులు దాదాపు 80 శాతం మంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. మధ్య లో ట్రా ఫిక్ పోలీసులు హెల్మెట్ల నిబంధనలు పెద్దగా పట్టించుకోక పోవటం తో కథ మళ్లీ మొదటికి వచ్చింది. హెల్మెట్లు ధరించకుండా దర్జగా ట్రాఫి క్ పోలీసుల ముందు నుంచే తిరుగుతున్నారు. వీరి ని పోలీ సులు పట్టుకుంటే హెల్మెట్లు ఇంట్లో ఉన్నాయని వాగ్వాదాలకు దిగుతున్నారు. పోలీసులు చిన్నపాటి జరి మానాలు విధిస్తుండటంతో చెల్లించి వెళ్లిపోతున్నారు. ఇలా చాలామంది కనీసం 10 నుంచి 15 సార్లు జరిమానాలు చెల్లించిన వారు ఉన్నా రు. జనవరిలో పోలీసుశాఖ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించి హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేసింది. ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ పేరుతో మోటార్ వాహన చట్టం ఉల్లంఘనల కు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ చాలన్ విధా నం అమలైతే భారీగా జరిమానాలు చలానాల రూ పంలో చెల్లించుకోవల్సి ఉంటుంది. ఈ చాలన్ విధానంతోనైనా వాహనదారుల్లో మార్పులు వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు. -
జవాన్లకు కొత్త హెల్మెట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ జవాన్లకు ప్రభుత్వం త్వరలో కొత్త హెల్మెట్లను అందించనుంది. ఈ మేరకు 1.58 లక్షల కొత్త హెల్మెట్ల తయారీ కోసం కాన్పూర్‌కు చెందిన ఎమ్కేయూ ఇండస్ట్రీస్ తో రూ.180 కోట్ల ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని హెల్మెట్ల తయారీ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. 20 ఏళ్ల తర్వాత పెద్ద సంఖ్యలో ఆర్మీ హెల్మెట్లను ఆర్డర్ చేయడం ఇదే తొలిసారి. కాగా, ఆర్డర్ ఇచ్చిన హెల్మెట్లన్నీ మూడేళ్లలోగా ఆర్మీకి అందనున్నాయి. 9 ఎంఎం బుల్లెట్లను తక్కువ దూరం నుంచి కూడా తట్టుకోగల సామర్ధ్యం ఈ హెల్మెట్లకు ఉంటుంది. ప్రపంచస్ధాయి రక్షణ దళాలన్నీ ఈ సాంకేతికత కలిగిన హెల్మెట్లనే ప్రస్తుతం వినియోగిస్తున్నాయి. వీటిలో కమ్యూనికేషన్ సాధనాలను కూడా అమర్చుకోవచ్చు. -
రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు
-
'హెల్మెట్ నిబంధనపై మినహాయింపు ఇవ్వండి'
హైదరాబాద్ : ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన నుంచి సిక్కులకు మినహాయింపు ఇవ్వాలంటూ సిక్కు అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరింది. శుక్రవారం ట్రాఫిక్ కమిషనరేట్‌లో ఆయన్ను కలిసిన అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రతినిధులు ఎస్.జస్పాల్ సింగ్, కొండారెడ్డి, తిరుపతి వర్మ, చింతల కృష్ణ, హర్మేంద్ర సింగ్, గుర్నమ్ సింగ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం సిక్కులకు హెల్మెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటూ జితేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలయ్యేలా చూడాలని కోరారు. -
టూ వీలర్ కొంటే హెల్మెట్ ఫ్రీ..!
కేరళ: ద్విచక్ర వాహనం నడిపేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్న నిబంధన దాదాపు అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రూల్స్ అధిగమించేవారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించినవారికి జరిమానాలు విధించడం, ఆర్టీఏ వెబ్ సైట్లో చలాన్లు పంపించడం చేస్తున్నారు. దీంతో ఇంతకు ముందు హెల్మెట్ లేని వారు కూడా ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న కేరళ రవాణా, రోడ్ సేఫ్టీ కమిషనర్ టామిన్ జె థచంకరీ నూతన దిశా నిర్దేశాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ను బహూకరించేందుకు కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీంతోపాటు వాహనానికి కావలసిన నెంబర్ ప్లేట్, అద్దాలు, శారీ గార్డ్, వంటి కొన్ని ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కేరళలోని సుమారు 50 మోటార్ సైకిల్ తయారీదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మార్చి 29న ఈ నూతన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉపకరణాలకు కొనుగోలుదారుల వద్ద ఎటువంటి డబ్బు వసూలు చేయకూడదని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇలా హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించటంతో పాటు, లైసెన్సులను సైతం రద్దు చేసేందుకు కేరళ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కేరళలో గతేడాది 20,000 లకు పైగా ప్రమాదాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. -
ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు
వాషింగ్టన్: ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం మిచిగాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సురక్షితమైన హెల్మట్‌ను రూపొందించారు. తలకు గాయమైనప్పుడు దాని ప్రభావం మెదడుపై ఉండటం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు కొత్త హెల్మెట్ తయారీకి పూనుకున్నారు. దీని తయారీలో బైక్ హెల్మట్లలో ఉండే ఫార్ములాను ఆధారంగా చేసుకున్నారు. బైక్ హెల్మెట్లకు ఎక్కువ బలంతో దెబ్బ తగిలినప్పుడు అందులో ఉండే ప్రత్యేకమైన మెకానిజం వల్ల అవి ఒత్తిడిని శోషించుకోవడంతో పాటు కొంత వ్యతిరేకమైన శక్తిని విడుదల చేస్తాయి. కానీ స్పోర్ట్స్ హెల్మెట్లలో ఇలాంటి ఫార్ములా లేకపోవడంతో తలకు బలమైన గాయాలు అవుతున్నాయని పరిశోధకులు వివరించారు. -
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి
కడప అర్బన్ : ఈనెల 1వ తేది నుంచి ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా వాడాలని నిబంధనల అమలుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పట్టణాలతోపాటు కడప నగరంలోని వివిధ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు, ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది విసృ్తత తనిఖీలు చేశారు. ప్రధానంగా వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతోపాటు, వారి వాహనాన్ని అక్కడే ఉంచాలని చెప్పి హెల్మెట్‌ను తీసుకొచ్చిన తర్వాత పంపించారు. జరిమానా కట్టడం కంటే హెల్మెట్ తీసుకొచ్చి చూపిం చేందుకే ప్రాధాన్యత కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించి ప్రమాద సమయాల్లో తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. హెల్మెట్లకు పెరిగిన గిరాకీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని నిబంధనలు విధించడంతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి హెల్మెట్లు చూపించాల్సిందేనని కోరడంతో చేసేది లేక హెల్మెట్ల దుకాణాల వైపు వాహనదారులు గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో కడప నగరంలోని కూడళ్లకు సమీపంలో ఉన్న హెల్మెట్ దుకాణాలకు గిరాకీ పెరిగింది. రూ. 93వేలు జరిమానా వసూలు రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్టు తప్పని సరి అని ప్రకటించిన నేపథ్యంలో శని వారం జిల్లా వ్యాప్తంగా ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ పరిధిలో వానదారులకు కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా విధించారు. కడప నగరంతోపాటు ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరి ధిలో 751 మందికి రూ. 93వేల 100 జరిమానా విధించారు. కడప ట్రాఫిక్ పరిధిలో 368 మందికి రూ 36,800, కడప సబ్ డివిజన్ పరిధిలో 217 మందికి రూ. 24,500 , పులివెందుల పరిధిలో 189 మం దికి రూ .1600, జమ్మలమడుగులో 209 మం దికి రూ 5 వేలు, రాజంపేట పరిధిలో రూ. 400, మైదుకూరు పరిధిలో రూ. 24,500 జరిమానా విధించారు. -
ఫేస్ బుక్‌లో హెల్మెట్లపై సెటైర్లు
చెన్నై: ద్విచక్రవాహన చోదకులు విధిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలన్న నిబంధన మరో మూడురోజుల్లో అమలులోకి రానుండగా, పోలీసులకు, ప్రజలకు మధ్య నెలకొనే పరిస్థితులపై ఫేస్బుక్లో సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు రెండేళ్ల క్రితం అమలులో ఉండిన హెల్మెట్ నిబంధన కాలక్రమేణా సన్నగిల్లింది. హెల్మెట్ లేని వాహనచోదకులకు జరిమానా విధించే పోలీసులు కూడా చూసీ చూడనట్లువదిలేస్తున్నారు. దాంతో హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలన్న సంగతి ప్రజలు దాదాపుగా మరిచిపోయారు. అయితే జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో హెల్మెట్ వాడకం మళ్లీ అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనాన్ని (బైక్‌లు) నడిపేవారే కాదు వెనుక కూర్చునేవారు సైతం హెల్మెట్ ధరించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ వినియోగం ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలల్లో పిల్లలను వదిలేందుకు, వారాంతపు సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుండి బీచ్‌లు, షికార్లకు వెళ్లడం ప్రజలకు పరిపాటి. పాఠశాల్లో వదిలేందుకు తీసుకెళ్లే పిల్లలకు సైతం హెల్మెట్‌ను ధరింపజేయాలా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. మరో మూడురోజుల్లో హెల్మెట్ వాడకం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించని పక్షంలో భారీ జరిమానా, మోటార్‌బైక్ డాక్యుమెంటు స్వాధీనం, డ్రైవింగ్ లెసైన్సు రద్దు వంటివి అమలుచేస్తారని తెలుస్తోంది. హెల్మెట్ లేనివారు జరిమానా ఎంత చెల్లించాలనే అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు. అయితే మార్గమధ్యంలో ఎవరినైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్న పక్షంలో రెండోవ్యక్తికి హెల్మెట్ లేకుంటే పరిస్థితి ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రెండు హెల్మెట్లు సిద్ధం చేసుకున్నా మోటార్ సైకిల్ స్టాండ్లవారు నిరాకరిస్తున్న పరిస్థితిలో వాటిని నిరంతరం కాపాడుకోవడం ఎలా సందేహం వ్యక్తం చేస్తున్నారు. విధిగా హెల్మెట్ నిబంధన ఆహ్వానించదగ్గదే, దాని అమలులో లోపాలే భయపెడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్లో సెటైర్లు: హెల్మెట్ వాడకంపై ప్రజలకు స్పష్టమైన సందేశాలు ఇవ్వకుండానే పోలీస్‌శాఖ అమలుకు సిద్ధం కావడంపై అయోమయం నెలకొంది. ఈ పరిస్థితిపై ఔత్సాహికులు ఫేస్‌బుక్‌పై సెటైర్లు సంధిస్తున్నారు. ‘ఈనెలాఖరు వరకు ప్రజల పక్షాన ఉన్న గురు మహర్దశ జూలై 1వ తేదీ నుంచి పోలీసుశాఖకు మారుతుంది. అలాగే గురుమహర్దశతో సంతోషంగా కాలం వెళ్లబుచ్చుతున్న ప్రజానీకానికి వచ్చేనెల 1వ తేదీ నుంచి శనిమహర్దశ చుట్టుకుంటుంది. గురుని చూపు కోటి లాభం అనే నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖకు జరిమానాల పేరిట కాసుల వర్షం ఖాయం. అలాగే శిరస్త్రాణం ధరించడం ద్వారా ప్రజలు శనిర్దశ నుంచి తప్పించుకోవచ్చని ఫేస్బుక్లో ప్రజలకు పరిహారం కూడా చూపిస్తున్నారు. -
మహిళలకూ హెల్మెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చునే ప్రయాణించే మహిళలకూ (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకూడదని రవాణా విభాగం నిర్ణయించింది. స్కూటర్ లేదా మోటారు సైకిళ్ల వెనుక కూర్చుని ప్రయాణించే మహిళలకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతించాలని రవాణా విభాగం ఎన్నికల కమిషన్‌ను కోరనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నబీబ్ జంగ్ ఇప్పటికే ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు. లింగ, మతం ప్రసక్తి లేకుండా పిలియన్ రైడర్లంతా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చింది. అయితే సిక్కులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం నాన్చివేత వైఖరిని పాటిస్తూ వచ్చింది. అయితే ద్విచక్ర వాహనాల దుర్ఘటనల్లో ప్రతిరోజు సంభవిస్తున్న మరణాలకు గల కారణాల్లో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని రవాణా విభాగం గుర్తించింది. అందుకే దీని వాడకాన్ని తప్పనిసరి చేసే దిశగా చర్యలు చేపట్టాలనుకుంటున్నామని అధికారులు అంటున్నారు. -
కాంగ్రెస్ నేతలకు కావాలి హెల్మెట్లు!
ఎల్.ఎన్.పేట, మెళి యాపుట్టి, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాలు నడిపేవారు ప్రమాదాల బారిన పడకుం డా హెల్మెట్లు ధరించాలని పోలీసులు సూచించడం మనకు తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాత్రం కాంగ్రెస్ నాయకులను హెల్మెట్లు ధరించమని సూచిస్తున్నారు. అదేమిటి.. వారికెందుకు హెల్మెట్లు అని ఆశ్చర్యపోతున్నారా!.. దానికి ఆయన చెప్పిన కారణమేమిటంటే.. తమ అభిప్రాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకత్వం బలవంతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో ప్రజలు పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు గానీ, రానున్న ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదని.. చెప్పులు, రాళ్లు పడినా ఆశ్చర్యంలేదని అన్నారు. అందువల్ల పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలంటే ముందుజాగ్రత్తగా తలలకు హెల్మెట్లు పెట్టుకోవాలని బుధవారం రాత్రి పాతపట్నం, మెళియాపుట్టిలలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చవిచూస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో పాతపట్నం నుంచే పోటీ చేస్తానని, లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీని ఒక బ్రహ్మపదార్థంగా చెప్పుకొచ్చారు. ఆ పార్టీలో చేరేది లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో త్వరలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తానని శత్రుచర్ల చెప్పారు. -
హెల్మెట్లు ఎవరు ధరించాలో మేమెలా చెబుతాం?
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. వాహనం నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడాన్ని తప్పని సరి చేయాలని పిటిషనర్ కోరడంపై ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, రాజీవ్ సహాయ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ‘హెల్మెట్లు ఎవరు ధరించాలో మేమెలా చెబుతాం.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి, మహిళలు కూడా ధరించేలా అమలు చేయాలి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు ఇక్కడ మేం లేమ’ని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది జుబేదా బేగమ్ మాట్లాడుతూ.. ‘సమాజంలోని కొన్ని సామాజిక వర్గాల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ మోటారు వాహనాల చట్టాన్ని సవరించలేకపోతున్నామ’న్నారు. కాగా ఈ పిటిషన్‌ను ఉల్హాస్ అనే వ్యక్తి దాఖలు చేశాడు. న్యాయవాది ఆర్కే కపూర్, ఉల్హాస్ తరఫున వాదిస్తూ... ఢిల్లీ మోటారు వాహనాల చట్టం, 1993ను సవరించాలని, అందరికీ ఒకరకమైన విధివిధానాలు ఉండేలా చూడాలని, లింగభేదం లేకుండా అందరూ హెల్మెట్లు ధరించేలా ఆదేశించాలని కోరారు. గతంలో కూడా మహిళలు హెల్మెట్లు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేసిన హైకోర్టు తాజాగా దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. -
స్కూటర్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి రహస్య సంచారం
రాత్రివేళ హెల్మెట్ పెట్టుకుని పారిస్‌లో నటి ఇంటికి రాకపోకలు పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే(59) హెల్మెట్ పెట్టుకుని పారిస్ వీధు ల్లో రాత్రివేళ సంచరిస్తున్నారు. ఎందుకోసం.. ప్రియురాలి కోసం! అధ్యక్షుడి రహస్య ప్రేమాయణం పేరుతో ‘క్లోజర్’ అనే వార పత్రిక శుక్రవారం సంచికలో హాలండేపై ఏడు పేజీల కథనాన్ని ప్రచురించింది. హాలండే ఒక నటితో సంబంధం నడుపుతున్నారని.. ఆమె ఇంటికి హాలండే రాత్రి వేళల్లో స్కూటర్‌పై వెళుతున్నారంటూ రాసింది. ఇలా చేయడం వల్ల ఆయన భద్రతపై సందేహాలను లేవనెత్తింది. నటి జూలీగాయెట్(41) ఫ్లాట్‌లోకి వెళుతున్న హాలండే ఫొటోలను సదరు పత్రిక బయటపెట్టింది. -
అవగాహనతోనే భద్రత సాధ్యం
పరిగి, న్యూస్‌లైన్: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి రోడ్డు ఎక్కితేగాని కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మనిషి తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేకుండాపోయింది. ప్రతి మనిషికి వాహనాలతో అవినాభావ సంబంధం ఏర్పడింది. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నప్పటికి ప్రమాదాలు జరుగుతూన ఉన్నాయి. సంస్థాగతమైన, సామాజికపరమైన మార్పులు చోటు చేసుకోనంత వరకు భద్రత అందనంత దూరంలోనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. చైనా లాంటి దేశాల్లో సైకిల్‌పై వెళ్లే వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధన ఉండగా మనం మోటార్ సైకిళ్లకే ఈ నిబంధనను వర్తింపజేయడంలో విఫలమవుతున్నాం. వాహనాలతో వచ్చే రెవెన్యూ కంటే ప్రమాదాల్లో నష్టపోయేదే ఎక్కువగా ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల భారం మన జీడీపీపై కూడా ఉంటోందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు కొనసాగనున్నాయి. కారణాలు - నివారణ మార్గాలు నేరాల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల శాతమే ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10నుంచి 15 వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేస్తున్నప్పటికి అవి మన అవరాలకు సరిపోవడం లేదు. రోజురోజు పెరుగుతున్న జనాభా, వాహనాల వాడకంతో పోలిస్తే రోడ్లు వేయటం, మనం అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం సరిపోవటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 70 శాతం నుంచి 80 శాతం వరకు రోడ్లు బాగాలేక, 15 శాతం అవగాహన లోపంతో, 5 శాతం మిగితా కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా వాడడం, పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండడం. జాగ్రత్తగా వాహనాలు నడపడం. (సేఫ్టీ ప్యాసింజర్ సిస్టం) రోడ్లపై ఆటోల్లో, ట్రాక్టర్లలో, లారీల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గడంతోపాటు రోడ్లపై (4 వీలర్) బస్సులు ప్రయాణికులకు సరిపోయే స్థాయిలో రావడం. ఆర్టీసీ తమ సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంది. సంస్థాగతమైన మార్పులు అవసరం ప్రమాదాల నివారణలో రోడ్డు తనిఖీ విభాగం, రవాణా శాఖల్లో సంస్థాగతమైన మార్పులు వస్తే తప్ప ప్రమాదాల శాతం తగ్గించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీఏ అధికారులను ఎక్కువ సంఖ్యలో నియమించడం ద్వారా రోడ్డు, వాహనాలను తనిఖీ చేయటం, విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన కల్పించడం నిరంతర ప్రక్రియగా మార్చడం, అవగాహన కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం వంటి సంస్థాగతమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.