ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు | Michigan University invents football players helmets | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు

Published Tue, Feb 9 2016 11:23 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు - Sakshi

ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు

వాషింగ్టన్: ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం మిచిగాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సురక్షితమైన హెల్మట్‌ను రూపొందించారు. తలకు గాయమైనప్పుడు దాని ప్రభావం మెదడుపై ఉండటం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు కొత్త హెల్మెట్ తయారీకి పూనుకున్నారు. దీని తయారీలో బైక్ హెల్మట్లలో ఉండే ఫార్ములాను ఆధారంగా చేసుకున్నారు.

బైక్ హెల్మెట్‌లకు ఎక్కువ బలంతో దెబ్బ తగిలినప్పుడు అందులో ఉండే ప్రత్యేకమైన మెకానిజం వల్ల అవి ఒత్తిడిని శోషించుకోవడంతో పాటు కొంత వ్యతిరేకమైన శక్తిని విడుదల చేస్తాయి. కానీ స్పోర్ట్స్ హెల్మెట్లలో ఇలాంటి ఫార్ములా లేకపోవడంతో తలకు బలమైన గాయాలు అవుతున్నాయని పరిశోధకులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement