కడప అర్బన్ : ఈనెల 1వ తేది నుంచి ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా వాడాలని నిబంధనల అమలుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పట్టణాలతోపాటు కడప నగరంలోని వివిధ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు, ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది విసృ్తత తనిఖీలు చేశారు. ప్రధానంగా వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతోపాటు, వారి వాహనాన్ని అక్కడే ఉంచాలని చెప్పి హెల్మెట్‌ను తీసుకొచ్చిన తర్వాత పంపించారు. జరిమానా కట్టడం కంటే హెల్మెట్ తీసుకొచ్చి చూపిం చేందుకే ప్రాధాన్యత కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించి ప్రమాద సమయాల్లో తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
హెల్మెట్లకు పెరిగిన గిరాకీ
రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని నిబంధనలు విధించడంతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి హెల్మెట్లు చూపించాల్సిందేనని కోరడంతో చేసేది లేక హెల్మెట్ల దుకాణాల వైపు వాహనదారులు గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో కడప నగరంలోని కూడళ్లకు సమీపంలో ఉన్న హెల్మెట్ దుకాణాలకు గిరాకీ పెరిగింది.
రూ. 93వేలు జరిమానా వసూలు
రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్టు తప్పని సరి అని ప్రకటించిన నేపథ్యంలో శని వారం జిల్లా వ్యాప్తంగా ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ పరిధిలో వానదారులకు కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా విధించారు. కడప నగరంతోపాటు ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరి ధిలో 751 మందికి రూ. 93వేల 100 జరిమానా విధించారు. కడప ట్రాఫిక్ పరిధిలో 368 మందికి రూ 36,800, కడప సబ్ డివిజన్ పరిధిలో 217 మందికి రూ. 24,500 , పులివెందుల పరిధిలో 189 మం దికి రూ .1600, జమ్మలమడుగులో 209 మం దికి రూ 5 వేలు, రాజంపేట పరిధిలో రూ. 400, మైదుకూరు పరిధిలో రూ. 24,500 జరిమానా విధించారు.
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి
Published Sun, Aug 2 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement