Seat belts
-
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
సైరస్ మిస్త్రీ విషాదం: గడ్కరీ కీలక నిర్ణయం, త్వరలోనే ఆదేశాలు
న్యూఢిల్లీ: టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కారులో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందడమే ఈ నిర్ణయానికి కారణమని గడ్కరీ తెలిపారు. సైరస్ మిస్త్రీ మరణం తర్వాత, కారులో వెనుక సీటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఒక మీడియా కార్యక్రమంలో వెల్లడించిన కేంద్రమంత్రి వెనుకసీటులో కూర్చున్నవారికి కూడా సీటు బెల్ట్ తప్పని సరిగి ధరించాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే వెనుకసీట్లో కూర్చున్న వారితో సహా కారులో ప్రయాణించే అందరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేస్తామని చెప్పారు. సీటుబెల్ట్ ధరించకుంటే సీట్‌బెల్ట్ బీప్ సిస్టమ్ కూడా అమలులో ఉంటుందని గడ్కరీ తెలిపారు. అంతేకాదు ఈ నిబంధన పాటించిక పోతే జరిమానా కూడా విధించేఅవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఆదేశాలనుమూడు రోజుల్లో జారీ చేస్తామని కూడా గడ్కరీ పేర్కొన్నారు. (పండుగ వేళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ) కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. మితిమీరిన వేగానికితోడు, వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ సీటు బెల్ట్ పెట్టుకోకోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!
న్యూఢిల్లీ: కారులో ఫ్రంట్ ఫేసింగ్ ప్యాసింజర్లందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్ తయారీ కంపెనీలకు సూచించింది. కారు వెనుక వరుసలో కూర్చొన్న మధ్య వ్యక్తికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా’ సదస్సులో తెలిపారు. "కారులో ముందు వైపు ఉన్న ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలనే నిబందనను ఆటోమేకర్లకు తప్పనిసరి చేయడానికి ఒక ఫైలుపై సంతకం చేశాను" అని రోడ్డు రవాణా & రహదారుల మంత్రి తెలిపారు. ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం, దేశంలో ఉత్పత్తి చేసే చాలా కార్లలో వెనుక సీట్లలో రెండు మాత్రమే మూడు పాయింట్ సీటు బెల్ట్ కలిగి ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చొనే వారికి మూడు పాయింట్ల సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇకపై తప్పనిసరి చేస్తున్నట్లు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు. (చదవండి: రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!) -
Terrific Road Accidents: తీరని విషాదాలు
-
తీవ్ర విషాదం నింపుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: అతివేగమో, మద్యం మత్తో, రేసింగ్ పిచ్చో, ఎదుటి వారి నిర్లక్క్ష్యమో కారణం ఏదైతేనేమి ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చెట్టంత ఎదిగిన బిడ్డలు కళ్లముందే తిరిగి రాని లోకాలకు తరలిపోతోంటే కన్నవారి గుండెలవిసిపోతున్నాయి. ఆ మానసిక క్షోభ జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు బాబూ మోహన్ భావోద్వేగం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తోంది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఆయనిచ్చిన సందేశం యువతలో ఆలోచన రేపుతోంది. వాహనాలు నడిపేటపుడు వాహదారులు పాటించాల్సిన నిబంధనల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. -
సీటు బెల్టు ప్రాణాలకు రక్షణ
పశ్చిమగోదావరి, తణుకు : రోడ్డుపై అడుగు పెడితే చాలు.. ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారి తీస్తుంది. సుఖవంతమైన ప్రయాణానికి, వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపాల్లా మార్చేస్తున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు, ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయట పడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక, రక్షణ వ్యవస్థలను సైతం తేలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. ఇటీవల నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. అయితే కేవలం ప్రముఖులు మృతి చెందిన సమయంలోనే గుర్తుకు వచ్చే రక్షణ చర్యలు నిరంతరం పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అటు పోలీసు, ఇటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో .. రెండేళ్ల క్రితం తణుకు మండలం దువ్వ గ్రామ పరిధిలోని పదహారో నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళుతున్న కంటైనర్‌ను తప్పించబోయిన కారు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇదే సమయంలో కంటైనర్ డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్‌పై బోల్తా పడింది. ఇదే సమయంలో కారు కూడా నుజ్జు కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే వీరు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు అప్పట్లో పోలీసు అధికారులు నిర్ధారించారు. ∙తణుకు మండలం తేతలి పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బటయ పడ్డారు. అన్నవరం నుంచి విజయవాడ వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు దాటి మురుగుకాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు కాగా కారులో ప్రయాణిస్తున్నవారు సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారు. ఇలా రోడ్డు ప్రమాదాలు కేవలం వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి. దీనికి తోడు వారు నిబంధనలు పాటించడం లేదని రవాణా, పోలీసు శాఖలకు చెందిన అధికారులు చెబుతున్నారు. ప్రతి మూడు ప్రమాదాల్లో ఒక దానికి అతివేగం కారణంగా కాగా మిగిలిన రెండు ప్రమాదాలు నిబంధనలు పాటించక పోవడంతోనే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాహన వేగం నిర్ణీత వేగం కంటే ఐదు శాతం తగ్గించి నడపడం వల్ల 30 శాతం ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 16–30 మధ్య వయసున్న వారే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ వాడకపోవడంతోనే కారణమని తెలుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాల సమయంలో కారులో నుంచి రోడ్డు మీదకు విసిరేయకుండా సీటు బెల్టు ఉపయోగపడుతుంది. దీంతో పాటు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెనై గాయాల తీవ్రతను తగ్గిస్తాయి. మరోవైపు ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు తలకు తీవ్ర గాయాలు కావడంతోనే చనిపోతున్నారు. హెల్మెట్ ధరిస్తే తలకు గాయాలు తగలవు. తగిలినా అవి స్వల్పంగా ఉంటాయి. తల నుంచి రక్తస్రావం కూడా జరగకుండా హెల్మెట్ రక్షణ కవచంగా కాపాడుతుంది. సీటు బెల్టు ఇలా పని చేస్తుంది... వాహనాల్లో వినియోగించే ప్రధాన రక్షణ వ్యవస్థల్లో కారుసీటు బెల్టు అత్యంత ప్రధానమైంది. ఎన్నో పరిశోధనలు చేసి వాహనాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలకు లోనైతే సీటుబెల్టు ధరించి ఉన్న వారిలో ప్రాణాపాయాన్ని 75 నుంచి 80 శాతం వరకు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. సాధారణంగా సీటు బెల్టుతో కారులోని సేఫ్టీ బెలూన్లకు అనుసంధానమై ఉంటాయి. ఇటీవల వస్తున్న కొత్త మోడళ్లలో అన్ని వైపుల నుంచి బెలూన్లు తెరుచుకునేలా డిజైన్ చేశారు. మరో వైపు సీటు బెల్టు ధరించకపోతే హెచ్చరిస్తూ సిగ్నల్ వ్యవస్థ ఒకటి పని చేస్తుంది. సీటు బెల్టు ధరించిన సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్లు వేగం దాటిన తర్వాత వాహనం బలంగా దేన్నయినా ఢీకొడితే ప్రయాణికుడి వేగవంతమైన కదలికల ద్వారా ఒత్తిడి సీటు బెల్టుపై పడి వెంటనే బెలూన్లు ఓపెన్ అయ్యేలా వ్యవస్థ నిర్మితమై ఉంది. అంతే కాకుండా ప్రయాణికుడు డేష్‌బోర్డు, సీలింగ్, స్టీరింగ్ లేదా అద్దాలపై పడిపోకుండా సీటు బెల్టు రక్షణ కల్పిస్తుంది. -
నిర్లక్ష్యం ఖరీదు...
చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నది. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోకపోవడంతో 2016లో రోజుకు 43 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 28 మంది ద్విచక్ర వాహనదారులుండగా, సీటు బెల్టు పెట్టకోని వారు 15 మంది వరకూ ఉంటారని రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 31 మంది మరణించారు. ఇది 2005లో 21 మరణాలుగా నమోదైతే 2015 నాటికి ప్రతి వంద ప్రమాదాల్లో మృత్యువాతన పడే వారి సంఖ్య ఆందోళనకరంగా 29కు చేరింది. హెల్మెట్ లేని కారణంగా సంభవిస్తున్న మరణాలపై పోలీసులు, రాష్ట్ర రవాణా సంస్థలు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ఇదే తొలిసారి. ప్రతి ఐదు బైక్ ప్రమాదాల మృతుల్లో ఒక మరణం హెల్మెట్ ధరించనందునే జరుగుతున్నదని ఈ తరహా మరణాలు 10.135 చోటుచేసుకున్నాయని రాష్ట్రాలు పేర్కొన్నాయి. 3818 మరణాలతో ఈ తరహా మృతుల్లో యూపీ టాప్‌లో ఉంది. ఇక తమిళనాడులో 1946, మహారాష్ట్రలో 1113 మరణాలు హెల్మెట్ ధరించని కారణంగా జరుగుతున్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కార్లలో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా ఆయా ప్రమాదాల్లో గత ఏడాది 5638 మంది మరణించారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించడం వల్ల 42 శాతం మేర మరణాలను నివారించవచ్చని గత ఏడాది ఐక్యరాజ్యసమితి అథ్యయనం అంచనా వేసింది. -
సీటు బెల్టే శ్రీరామ రక్ష
♦ కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. ♦ తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో ♦ రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. ♦ పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకుతాజా ఉదాహరణ ♦ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ ♦ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, హైదరాబాద్ ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
ఎయిర్‌బ్యాగ్ పనిచేసేదిలా...
హౌ ఇట్ వర్క్స్ వాహన ప్రమాదాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాల్లో సీటు బెల్టులు పెట్టుకోవడం ఒకటైతే.... వాహనంలో ఎయిర్‌బ్యాగులు ఉండేలా చూసుకోవడం రెండోది. సీట్బెల్టుల మాటెలా ఉన్నా... ఎయిర్‌బ్యాగ్‌ల వెనుక ఉన్న టెక్నాలజీ ఆసక్తికరమైంది. ఈ వ్యవస్థలో బ్యాగుతోపాటు ఓ యాక్సెలరోమీటర్, ఓ సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్, సూక్ష్మస్థాయి తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటాయి. మీ వాహనం వేగం ఎంత త్వరగా మారుతోందో యాక్సెలరోమీటర్ గమనిస్తూంటుంది. నిర్దిష్ట వేగాన్ని దాటినప్పుడు... లేదా ఇంకో వాహనాన్ని లేదా మరే ఇతర వస్తువును ఢీకొన్నా ఈ పరికరం సర్క్యూట్‌ను ఆన్ చేస్తుంది. ఆ వెంటనే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకునేందుకు వాడే హీటర్ తెలుసుగా... హీటింగ్ ఎలిమెంట్ దాదాపు ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం (సోడియం అజైడ్) పేలిపోయి ఉత్పత్తి చేసే నైట్రోజన్ గ్యాస్‌తో బ్యాగ్ నిండిపోతుంది. ఇంకో విషయం... నైట్రోజన్ గ్యాస్‌తో నిండిన ఈ బ్యాగ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా విచ్చుకున్న తరువాత నెమ్మదిగా దాంట్లోని గాలిని విడుదల చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఈ రెండు చర్యల ఫలితంగా వాహనం ఢీ కొనడంతో మన శరీరంపై పడ్డ ఒత్తిడి తోపాటు గాయాల తీవ్రత కూడా తగ్గిపోతుందన్నమాట! ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? సెకనులో నాలుగో వంతు మాత్రమే! -
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి
కడప అర్బన్ : ఈనెల 1వ తేది నుంచి ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా వాడాలని నిబంధనల అమలుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పట్టణాలతోపాటు కడప నగరంలోని వివిధ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు, ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది విసృ్తత తనిఖీలు చేశారు. ప్రధానంగా వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతోపాటు, వారి వాహనాన్ని అక్కడే ఉంచాలని చెప్పి హెల్మెట్‌ను తీసుకొచ్చిన తర్వాత పంపించారు. జరిమానా కట్టడం కంటే హెల్మెట్ తీసుకొచ్చి చూపిం చేందుకే ప్రాధాన్యత కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించి ప్రమాద సమయాల్లో తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. హెల్మెట్లకు పెరిగిన గిరాకీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని నిబంధనలు విధించడంతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి హెల్మెట్లు చూపించాల్సిందేనని కోరడంతో చేసేది లేక హెల్మెట్ల దుకాణాల వైపు వాహనదారులు గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో కడప నగరంలోని కూడళ్లకు సమీపంలో ఉన్న హెల్మెట్ దుకాణాలకు గిరాకీ పెరిగింది. రూ. 93వేలు జరిమానా వసూలు రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్టు తప్పని సరి అని ప్రకటించిన నేపథ్యంలో శని వారం జిల్లా వ్యాప్తంగా ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ పరిధిలో వానదారులకు కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా విధించారు. కడప నగరంతోపాటు ఆరు పోలీస్ సబ్ డివిజన్ల పరి ధిలో 751 మందికి రూ. 93వేల 100 జరిమానా విధించారు. కడప ట్రాఫిక్ పరిధిలో 368 మందికి రూ 36,800, కడప సబ్ డివిజన్ పరిధిలో 217 మందికి రూ. 24,500 , పులివెందుల పరిధిలో 189 మం దికి రూ .1600, జమ్మలమడుగులో 209 మం దికి రూ 5 వేలు, రాజంపేట పరిధిలో రూ. 400, మైదుకూరు పరిధిలో రూ. 24,500 జరిమానా విధించారు.