నిర్లక్ష్యం ఖరీదు...
హెల్మెట్ లేని కారణంగా సంభవిస్తున్న మరణాలపై పోలీసులు, రాష్ట్ర రవాణా సంస్థలు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ఇదే తొలిసారి. ప్రతి ఐదు బైక్ ప్రమాదాల మృతుల్లో ఒక మరణం హెల్మెట్ ధరించనందునే జరుగుతున్నదని ఈ తరహా మరణాలు 10.135 చోటుచేసుకున్నాయని రాష్ట్రాలు పేర్కొన్నాయి. 3818 మరణాలతో ఈ తరహా మృతుల్లో యూపీ టాప్‌లో ఉంది. ఇక తమిళనాడులో 1946, మహారాష్ట్రలో 1113 మరణాలు హెల్మెట్ ధరించని కారణంగా జరుగుతున్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కార్లలో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా ఆయా ప్రమాదాల్లో గత ఏడాది 5638 మంది మరణించారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించడం వల్ల 42 శాతం మేర మరణాలను నివారించవచ్చని గత ఏడాది ఐక్యరాజ్యసమితి అథ్యయనం అంచనా వేసింది.