
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్‌పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
బంతికాదది భానుడే
చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప
సండే సందడి
వారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం