
సాక్షి, హైదరాబాద్: అతివేగమో, మద్యం మత్తో, రేసింగ్ పిచ్చో, ఎదుటి వారి నిర్లక్క్ష్యమో కారణం ఏదైతేనేమి ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చెట్టంత ఎదిగిన బిడ్డలు కళ్లముందే తిరిగి రాని లోకాలకు తరలిపోతోంటే కన్నవారి గుండెలవిసిపోతున్నాయి. ఆ మానసిక క్షోభ జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు బాబూ మోహన్ భావోద్వేగం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తోంది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఆయనిచ్చిన సందేశం యువతలో ఆలోచన రేపుతోంది. వాహనాలు నడిపేటపుడు వాహదారులు పాటించాల్సిన నిబంధనల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment