సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చునే ప్రయాణించే మహిళలకూ (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకూడదని రవాణా విభాగం నిర్ణయించింది. స్కూటర్ లేదా మోటారు సైకిళ్ల వెనుక కూర్చుని ప్రయాణించే మహిళలకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతించాలని రవాణా విభాగం ఎన్నికల కమిషన్‌ను కోరనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నబీబ్ జంగ్ ఇప్పటికే ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు.
లింగ, మతం ప్రసక్తి లేకుండా పిలియన్ రైడర్లంతా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చింది. అయితే సిక్కులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం నాన్చివేత వైఖరిని పాటిస్తూ వచ్చింది. అయితే ద్విచక్ర వాహనాల దుర్ఘటనల్లో ప్రతిరోజు సంభవిస్తున్న మరణాలకు గల కారణాల్లో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని రవాణా విభాగం గుర్తించింది. అందుకే దీని వాడకాన్ని తప్పనిసరి చేసే దిశగా చర్యలు చేపట్టాలనుకుంటున్నామని అధికారులు అంటున్నారు.
మహిళలకూ హెల్మెట్లు
Published Thu, Apr 17 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement