హెల్మెట్‌ ధారణ బేఖాతరు | Disobeyed the helmet retention | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధారణ బేఖాతరు

Published Tue, Mar 14 2017 2:56 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

హెల్మెట్‌ ధారణ బేఖాతరు - Sakshi

హెల్మెట్‌ ధారణ బేఖాతరు

స్వల్ప జరిమానాలే కారణం
రెండు నెలల్లో రూ.10.22 లక్షలు వసూలు


నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌) : ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు ధరించాలని ఓ వైపు పోలీసులు చెబుతున్నా ద్విచక్ర వాహనదారుల్లో ఏ మాత్రం మార్పు రావటంలేదు. దీనికి జరిమానాలు స్వల్పంగా ఉండటమే ప్రధాన కారణంగా పోలీసులు పేర్కొం టున్నారు.మోటార్‌ వాహన చట్టం ఉల్లంఘనలకు పాల్పడే వారికి ప్రస్తు తం రూ. 100 లేదా, రూ. 200 వరకు జరి మానాలతో సరిపెడుతున్నారు. వాహనదారులు ఇంతేలే అన్న ట్లు జరిమా నా చెల్లిస్తూ వెళ్లిపోతున్నారు. దీంతో ప్రతినెల ప్రభుత్వ ఖజానాలో లక్షలాది రూపాయలు జమ అవుతున్నాయి. జిల్లా కేంద్రంలో గత సంవత్సరం 2016 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు పా టించని 31,170 మందికి రూ. 49,09,200 జరిమానాలు విధించారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఏ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్థమవుతోంది.

ఈ ఏడాది జనవరి లో పోలీసులు 3,432 కేసులు నమోదు చేసి రూ. 4,63,900 జరి మానా విధిం చారు. ఫిబ్రవరిలో 2800 కేసులు నమోదు చేసి రూ. 5,58,900 జరిమానాలు విధించారు. గతంలో హెల్మెట్ల వాడకం విషయంలో జిల్లా పోలీసులు కఠిన ంగా వ్యవహరించడంతో వాహనదారులు దాదాపు 80 శాతం మంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. మధ్య లో ట్రా ఫిక్‌ పోలీసులు హెల్మెట్ల నిబంధనలు పెద్దగా పట్టించుకోక పోవటం తో కథ మళ్లీ మొదటికి వచ్చింది. హెల్మెట్లు ధరించకుండా దర్జగా ట్రాఫి క్‌ పోలీసుల ముందు నుంచే తిరుగుతున్నారు. వీరి ని పోలీ సులు పట్టుకుంటే హెల్మెట్లు ఇంట్లో ఉన్నాయని వాగ్వాదాలకు దిగుతున్నారు. పోలీసులు చిన్నపాటి జరి మానాలు విధిస్తుండటంతో  చెల్లించి వెళ్లిపోతున్నారు.

ఇలా చాలామంది కనీసం 10 నుంచి 15 సార్లు జరిమానాలు చెల్లించిన వారు ఉన్నా రు. జనవరిలో పోలీసుశాఖ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించి హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేసింది.  ట్రాఫిక్‌ పోలీసులు జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో మోటార్‌ వాహన చట్టం ఉల్లంఘనల కు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ చాలన్‌ విధా నం అమలైతే  భారీగా జరిమానాలు చలానాల రూ పంలో చెల్లించుకోవల్సి ఉంటుంది. ఈ చాలన్‌ విధానంతోనైనా వాహనదారుల్లో మార్పులు వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement