జవాన్లకు కొత్త హెల్మెట్లు
Published Wed, Jan 18 2017 12:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
న్యూఢిల్లీ: భారత ఆర్మీ జవాన్లకు ప్రభుత్వం త్వరలో కొత్త హెల్మెట్లను అందించనుంది. ఈ మేరకు 1.58 లక్షల కొత్త హెల్మెట్ల తయారీ కోసం కాన్పూర్‌కు చెందిన ఎమ్‌కేయూ ఇండస్ట్రీస్ తో రూ.180 కోట్ల ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని హెల్మెట్ల తయారీ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. 20 ఏళ్ల తర్వాత పెద్ద సంఖ్యలో ఆర్మీ హెల్మెట్లను ఆర్డర్ చేయడం ఇదే తొలిసారి.
కాగా, ఆర్డర్ ఇచ్చిన హెల్మెట్లన్నీ మూడేళ్లలోగా ఆర్మీకి అందనున్నాయి. 9 ఎంఎం బుల్లెట్లను తక్కువ దూరం నుంచి కూడా తట్టుకోగల సామర్ధ్యం ఈ హెల్మెట్లకు ఉంటుంది. ప్రపంచస్ధాయి రక్షణ దళాలన్నీ ఈ సాంకేతికత కలిగిన హెల్మెట్లనే ప్రస్తుతం వినియోగిస్తున్నాయి. వీటిలో కమ్యూనికేషన్ సాధనాలను కూడా అమర్చుకోవచ్చు.
Advertisement