వాతావరణ మార్పుల ఒప్పందం తొలి ముసాయిదాపై భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. తాము సూచించిన అన్ని అంశాలకు చోటు దొరికిందని
తాము సూచించిన అంశాలకు చోటు దక్కిందన్న భారత ప్రతినిధి
లీ బోర్గెట్ (ఫ్రాన్స్): వాతావరణ మార్పుల ఒప్పందం తొలి ముసాయిదాపై భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. తాము సూచించిన అన్ని అంశాలకు చోటు దొరికిందని, ఒప్పందం దిశగా ముందడుగు పడిందని పేర్కొంది. వాతావరణ మార్పుల అంశంపై ఫ్రాన్స్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందానికి సంబంధించి ఐదు పేజీల ముసాయిదా విడుదల చేశారు. దీనిపట్ల సదస్సులో భారత ప్రతినిధి అజయ్ మాధుర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇంకా దాదాపు 250 అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.
వీటిపై వీలైనంత త్వరగా ముందుకు వెళ్లాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఒక ఒప్పందానికి వచ్చేందుకు భారత్ కృషి చేస్తోంది’ అని మాధుర్ పేర్కొన్నారు. ముసాయిదాను 195 దేశాలకు గాను 184 దేశాలు ఆమోదించాయి. సిరియా, ఉత్తర కొరియా తదితరాలు ఆమోదించాల్సి ఉంది.