అమెరికాను మేం ముంచెత్తుతాం: కిమ్‌ దేశం | North Korea warns US will pay due price for spearheading UN sanctions | Sakshi
Sakshi News home page

అమెరికాను మేం ముంచెత్తుతాం: కిమ్‌ దేశం

Published Mon, Sep 11 2017 9:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

అమెరికాను మేం ముంచెత్తుతాం: కిమ్‌ దేశం - Sakshi

అమెరికాను మేం ముంచెత్తుతాం: కిమ్‌ దేశం

ప్యాంగ్‌యాంగ్ : తమ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేలా ఒత్తిడి తెస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఉత్తరకొరియా సోమవారం హెచ్చరించింది. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబు పరీక్ష అనంతరం అంతర్జాతీయ సమాజం నుంచి ఉత్తరకొరియాపై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే.

ఉత్తరకొరియా నుంచి ఆయిల్‌, టెక్స్‌టైల్స్‌ దిగుమతులు నిలిపేయాలని, కిమ్‌ జాంగ్‌ ఉన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలని అమెరికా ఐక్యరాజ్యసమితికి సమర్పించిన ఓ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఆత్మరక్షణలో పడే అమెరికా ఐక్యరాజ్యసమితిలో తమ దేశానికి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి కఠిన నిర్ణయాలు తీసుకుంటే అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అమెరికాను ముంచెత్తేది హరికేన్లు కాదని, వరుస చర్యలతో అంతకు పదింతలు శక్తిమంతమైన తామని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement