![Donald Trump Says He Is Glad To Kim Jong Un Is Back And Well - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/3/Donald-Trump-2.jpg.webp?itok=PBlGPGQ0)
వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకు రావడం పట్ల అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కిమ్ ఆరోగ్యంగా తిరిగి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కిమ్ ఆరోగ్యంగా తిరిగొచ్చారు. సంతోషంగా ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, మూడు వారాలుగా పత్తాలేకుండా పోయిన కిమ్ జోంగ్ ఉన్ మేడే (శుక్రవారం) రోజున ప్రజలముందుకొచ్చారు.
రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టు ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోలో ఆయన ఎక్కడా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా.. కిమ్ ఆరోగ్యంపై రకరకాల కథనాలు వచ్చిన సందర్భంలో ట్రంప్ వాటిని కొట్టిపడేశారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వచ్చిన వార్తలు నిజం కాకపోయి ఉండొచ్చునని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
I, for one, am glad to see he is back, and well! https://t.co/mIWVeRMnOJ
— Donald J. Trump (@realDonaldTrump) May 2, 2020
Comments
Please login to add a commentAdd a comment