
(ఫైల్ ఫోటో)
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ వారాంతంలో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వైట్‌హౌజ్ ప్రతినిధులు సరైన సమయంలో వెల్లడిస్తారని మీడియా బులెటిన్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఈవారం చివర్లో క్యాంప్ డేవిడ్ స్థావరానికి వెళ్లనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పలువురు విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, అలాగే పలువురు దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరపేందుకే అక్కడికి వెళ్తున్నట్టు తెలిపారు.
(చదవండి: మానని గాయం.. కొనసాగుతున్న ఆంక్షలు!)
కాగా, మూడు వారాలుగా పత్తాలేకుండా పోయిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మేడే (శుక్రవారం) రోజున ప్రజలముందుకొచ్చారు. రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టు ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటు అతని సోదరి కిమ్ యో జోంగ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇక తీవ్ర అనారోగ్యంతో కిమ్ మరణించారని వచ్చిన వార్తల్ని ట్రంప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి కిమ్ ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి.
(చదవండి: 20 రోజుల తర్వాత కనిపించిన కిమ్)
Comments
Please login to add a commentAdd a comment