
సియోల్ : ఉత్తర కొరియా సమరశంఖాన్ని పూరించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసినట్టుగా దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా అత్యున్నత స్థాయి మిలటరీ జనరల్‌ను మార్చారు.
ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని సైనిక సన్నాహాలు మరింత వేగవంతం చేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఈ నెల 21 నుంచి 24 మధ్య సంయుక్తంగా మిలటరీ విన్యాసాలు చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం మిలటరీ జనరల్‌గా ఉన్న పాక్ సూ ఇల్ స్థానంలో జనరల్ రియాంగ్ గిల్‌ను నియమి స్తున్నట్టుగా ప్రకటించారు. గతవారంలోనే కిమ్ ఆయుధ ఫ్యాక్తరీని సందర్శించి మరిన్ని క్షిపణులు, శతఘ్నులు, ఇతర ఆయుధాలను తయారు చేయా లని ఆదేశించినట్టుగా తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment