'నిక్కీ హేలీ.. ఓ వేశ్య'
సాక్షి, వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీపై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. స్కర్ట్స్ వేసుకునే ఆమె ఓ వేశ్య అని పేర్కొంది. ఈ మేరకు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ప్రచురించింది. హేలీ నడిచేటప్పుడు ఆమె వేసుకున్న స్కర్ట్‌తో వింత శబ్దం చేస్తారని దూషించింది. అలాంటి ఆమెకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారని విమర్శించింది. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడానికి ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లో హేలీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. గుడ్డెద్దు చేలో పడ్డట్లు హేలీ వ్యవహిరిస్తున్నారని, ఉత్తరకొరియా గురించి మాట్లాడేటప్పుడు హేలీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించింది.
నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు పేలితే.. అందుకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. కాగా, హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం జరిగిన యూఎన్ సమావేశంలో 'యుద్ధం కోసం అడుక్కుంటున్నారు' అని ఉత్తరకొరియాను ఉద్దేశించి హేలీ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై భద్రతాపరమైన ఆంక్షలు విధించాలని, ఆ దేశానికి ఆయిల్ ఎగుమతిని నిలిపివేయాలని, అలాగే ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న టైక్స్‌టైల్స్ సంబంధిత వస్తువులను ఆపేయాలని ఐక్యరాజ్యసమితిలో హేలీ డిమాండ్ చేశారు.