న్యూయార్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది మరోసారి విదేశీ యాత్రకు వెళ్లనున్నారు. త్వరలో ఆయన బ్రిటన్లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్తో న్యూయార్క్లో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ రావాలన్న కామెరూన్ ప్రతిపాదనకు మోదీ అంగీకారం తెలిపారు.అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండెలతో కూడా మోదీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సభ్య దేశాధినేతలకు ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా మోదీ సమావేశం అవుతారు.
ఈ ఏడాది బ్రిటన్లో పర్యటించనున్న మోదీ
Published Mon, Sep 28 2015 7:58 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM
Advertisement
Advertisement