![PM Narendra Modi to visit US in September, address major community event in New York](/styles/webp/s3/article_images/2024/08/16/modi-us-tour.jpg.webp?itok=4ujyrcaJ)
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు.
భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment