House of Representatives
-
యూఎస్ కాంగ్రెస్‌లోనూ రిపబ్లికన్ల హవా..సెనేట్‌పై పట్టు..!
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల గాలి వీచింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లోనూ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సత్తా చాటింది. ఈసారి ఎన్నికల్లో సెనేట్‌లో మెజార్టీకి అవసరమైన సీట్లు రిపబ్లికన్ పార్టీకి లభించాయి.మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు మంగళవారం(నవంబర్ 5) ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా సెనేట్‌లో డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా పోయింది. తాజాగా సెనేట్‌లో రిపబ్లికన్లకు 51 మంది డెమోక్రట్లకు 42 మంది సభ్యులున్నారు.మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.సెనేట్‌లో మెజారిటీతో కొత్త ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది.ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. దీంతో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవి గనుక చేపడితే ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్ద అడ్డంకులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
సెప్టెంబర్‌లో అమెరికాకు మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం నమోదు అయ్యింది. ఊహించని రీతిలో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మెక్కార్తి తన పదవిని కోల్పోయారు. ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానానికి motion to vacate.. సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు మద్దతు ప్రకటించడం గమనార్హం. తద్వారా అమెరికా 234 ఏళ్లలో తొలిసారిగా స్పీకర్ ఓటింగ్ ద్వారా తొలగింపు పరిణామం చోటు చేసుకున్నట్లయ్యింది. అధికారిక డెమొక్రట్స్‌కు సహకరిస్తున్నారనే ప్రధాన ఆరోపణపై రిపబ్లికన్లు ఆయనపై మంటతో ఉన్నారు. ఈ క్రమంలోనే డెమొక్రట్స్ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 216 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 210 ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది రిపబ్లికన్ రెబెల్స్ ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో రిపబ్లికన్ల రెబల్ గ్రూప్ నేత మ్యాట్ గాయెట్జ్ కూడా ఉన్నారు. డెమొక్రట్స్తో రెబల్స్ మెక్కార్తి వైఖరిపై రిపబ్లికన్లు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి మంజూరు చేయడంలోనూ ఆయన అలసత్వం ప్రదర్శించడంపై రగిలిపోయారు. అయితే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ట్రంప్‌పై న్యాయపరమైన చిక్కులు తదితరాలతో సంయమనం పాటించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించడానికి నిధులను పాస్ చేయడానికి డెమొక్రాట్లపై ఆయన ఆధారపడటాన్ని రిపబ్లికన్లలో కొందరు సహించలేకపోయారు. ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసే ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రోజు ఎవరూ ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఓటింగ్‌కు తర్వాత సభ్యులు నినాదాలు చేశారు. రిపబ్లికన్ రెబల్ మ్యాట్ గాయెట్జ్.. ఈ తీర్మానాన్ని ముందుండి నడిపించడం గమనార్హం. తద్వారా మెక్కార్తితో సుదీర్ఘకాలం వైరం ఉన్న గాయెట్జ్.. అదను చూసి దెబ్బ కొట్టినట్లయ్యింది. I will not seek to run again for Speaker of the House. I may have lost a vote today, but I fought for what I believe in—and I believe in America. It has been an honor to serve. https://t.co/4EMpOuwtzy — Kevin McCarthy (@SpeakerMcCarthy) October 3, 2023 ఎన్నిక కూడా ఉత్కంఠే 2022 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి సెనేట్‌లో స్వల్ఫ ఆధిక్యం లభించింది. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ దక్కడంతో స్పీకర్ ఛాన్స్ దక్కింది. రిపబ్లికన్ పార్టీ తరపున కాలిఫోర్నియా 20th కాంగ్రెసియోనల్ డిస్ట్రిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. 58 ఏళ్ల ఈ మాజీ ఎంటర్ప్రెన్యూర్.. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. 15 రౌండ్ల ఓటింగ్.. అతికష్టం మీద ఐదు రోజుల సమయం పట్టింది. ఓట్లకు ఓట్లు తగ్గించుకుంటూ పోగా.. చివరకు ఆయన స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ►చివరిసారిగా.. 1910లో తిరుగుబాటు తర్వాత జోసెఫ్ జి కెనాన్‌ను తొలగించేందుకు మోషన్ ప్రవేశపెట్టారు. కానీ, అది విఫలమైంది. ►ఇక 2015లోనూ జాన్ బోహెనర్ను తొలగించేందుకు ప్రతినిధి మార్క్ మెడోస్ మోషన్ ప్రవేశపెట్టగా.. బోహెనర్ రాజీనామాతో అది జరగలేదు. ►స్పీకర్ పదవికాలం రెండేళ్లు. కానీ, ఈలోపే మెక్కార్తి పదవిని కోల్పోయారు. తద్వారా.. అమెరికాలో 147 ఏళ్లలో అతితక్కువ కాలం స్పీకర్‌గా పని చేసిన మూడో వ్యక్తిగా మెక్కార్తి నిలిచారు. -
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
ప్రతినిధుల సభలో అమెరికా పౌరసత్వ చట్టం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్‌కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్‌కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. -
ప్రతినిధుల సభ స్పీకర్‌గా మెక్‌కార్తీ.. 15వ రౌండ్లో తేలిన ఫలితం
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి మద్దతు తెలిపారు నేతలు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు ఈ 57 ఏళ్ల కాలిఫోర్నియన్ నేత మెక్‌కార్తీకి మొదటి రౌండ్లోనే సులభంగా మెజారిటీ రావాల్సింది. కానీ, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల కారణంగా కొంత మంది నేతలను ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్ నేతలు 15 రౌండ్ల ఓటింగ్ వరకు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: స్పీకర్ పదవికి పోటీలో డొనాల్డ్ ట్రంప్.. వచ్చింది ఒకే ఒక్క ఓటు -
నవ్వులపాలైన ట్రంప్.. స్పీకర్ పదవికి పోటీ పడితే ఒకే ఒక్క ఓటు
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్ ఎన్నికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని మూడోరోజు సైతం అదృష్టం పలకరించలేదు. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "The honorable Donald J Trump of Florida has received one [vote]" *members start laughing* pic.twitter.com/B0q8nknZEP — Aaron Rupar (@atrupar) January 6, 2023 స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెక్‌కార్తీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెక్‌కార్తీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్ ఓటింగ్ నిర్వహించే క్రమంలో ట్రంప్ పేరును ఆయన నామినేట్ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెక్‌కార్తీని స్పీకర్ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు జో బైడెన్‌ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. New Trump Truth Social Post 😂 pic.twitter.com/ubgdTePnU9 — Benny Johnson (@bennyjohnson) January 5, 2023 ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు!
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజారిటీ. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి(స్పీకర్) ఎన్నిక నిర్వహించినా స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయారు రిపబ్లికన్లు. ఈ క్రమంలో ఘాటుగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ప్రతినిధుల సభ స్పీకర్‌ను ఎన్నికోలేకపోయిన రిపబ్లికన్ల తీరు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. యావత్ ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోందని గుర్తు చేశారు. కెంటకీ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడారు బైడెన్. ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవటం సిగ్గుచేటు, ఇబ్బందికరం. వారు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. యావత్ ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోంది. మనం కలిసి పని చేయగలమా అనే సందేహంలో ఉన్నారు.’ అని పేర్కొన్నారు అధ్యక్షుడు జో బైడెన్. హైడ్రామా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్ మెక్‌కార్తీ మెజారిటీ ఓట్లు కూడగట్టడంలో విఫలమయ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హెడ్రామా చోటు చేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌కు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిపబ్లికన్ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ -
రిపబ్లికన్ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి (స్పీకర్) ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్ మెక్‌కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌ను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మెక్‌కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. మెక్‌కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కావడం సొంత పార్టీలోనే కొందరికి ఇష్టం లేదన్నారు. మెక్‌కార్తీ స్పీకర్ కావడం కష్టమేనని రిపబ్లికన్ సభ్యుడు బాబ్గుడ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్‌గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
100 ఏళ్లలో తొలిసారి.. స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. మూడు రౌండ్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించినా స్పీకర్ విజయానికి కావాల్సిన మెజార్టీ 218 ఓట్లు రాలేదు. దీంతో సభలో 222 సీట్లున్న రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కెవిన్ మెకర్తీకి సొంత సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరిగినా ఆయన 218 ఓట్లు సాధించలేకపోయారు. 202 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా.. మరో 20 మంది వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ ఎన్నికకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం తేలకపోవడం అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో 100 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 1923లో స్పీకర్ ఎన్నికకు నిర్వహించిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం రాలేదు. అయితే స్పీకర్ అభ్యర్థికి కావాల్సిన మెజార్టీ వచ్చే వరకు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఫలితం వచ్చే వరకు ఎన్ని రౌండ్లయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరగగా.. బుధవారం మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. తాను మళ్లీ రేసులో నిలబడతానని మెకర్తీ స్పష్టం చేశారు. పార్టీ సభ్యులతో చర్చించి అందరూ తనకు మద్దతు తెలిపేలా చూస్తానన్నారు. అయితే 20 మంది రిపబ్లికన్ సభ్యులు మెకర్తీని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ట్రంప్ సన్నిహితుడు అయిన జిమ్ జోర్డాన్‌కు మద్దతు తెలిపారు. మెకర్తీనే స్పీకర్‌గా ఎన్నుకోవాలని జోర్డాన్ సూచించినా.. వారు మాత్రం వినలేదు. మూడో రౌండ్లోనూ జోర్డాన్‌కు ఓటు వేశారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం 435 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్లకు 222, అధికార డెమొక్రాట్లకు 212 మంది ప్రతినిధులున్నారు. మెజార్టీలో స్వల్ప తేడా ఉండటంతో 20 ఓట్లు చాలా కీలకమయ్యాయి. సభలో మొన్నటివరకు డెమొక్రాట్లదే మెజార్టీ. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు అధిక సీట్లు గెలుచుకుని సభలో మెజర్డీ సాధించారు. చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..! -
US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
ఎస్.రాజమహేంద్రారెడ్డి అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్‌పై అధికార డెమొక్రాట్ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్‌కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం. నెత్తిన పాలు పోసిన ట్రంప్ ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్‌లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్‌లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్‌పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్‌పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్‌కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. అధికార పక్షాలకు ఎదురుగాలే...! అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ పార్టీ సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్‌లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది! మన మాదిరిగా కాదు... మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్ టర్మ్) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్‌తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా చరిత్రలోనే ప్రతినిధుల సభలో రెండు సార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యుడిని చేస్తూ డెమొక్రటిక్ సభ్యులు ప్రతినిధుల సభలో ‘తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టారు’అనే ప్రధాన ఆరోపణతో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. 10 మంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. అమెరికా చరిత్రలో ఇది నాలుగో అభిశంసన ప్రక్రియ. మద్దతుదారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ప్రసంగించారని, ఆ కారణంగానే ప్రజాస్వామ్య సౌధమైన క్యాపిటల్ భవనంపై దాడితో పాటు హింస చెలరేగిందని ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. ఆ దాడి కారణంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పార్లమెంటు నిర్ధారించే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ హింసలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో, ఈ అభిశంసన తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్‌లో కూడా ఆమోదం పొందితే.. ట్రంప్ ఇక జీవితకాలంలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేరు. అయితే, సెనెట్ సమావేశాలు ఇప్పటికే జనవరి 19 వరకు వాయిదా పడ్డాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ నేత జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, అధ్యక్షుడిగా గడువు ముగిసేవరకు వైట్‌హౌజ్‌లో కొనసాగే అవకాశం ట్రంప్‌కు లభించింది. బైడెన్ ప్రమాణ స్వీకారం లోపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగిసే అవకాశం లేదని సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ పేర్కొన్నారు. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 17 మంది రిపబ్లికన్ సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఎంపీలైన అమీ బెరా, ఆర్ఓ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. -
చిగురిస్తున్న భారతీయుల ‘గ్రీన్’ ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది. అమెరికాకు వెళ్లే విదేశీయుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండడం, గ్రీన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే. చైనాకు ఎదురు దెబ్బ తగిలేలా సవరణలు గత ఏడాది జూలై 10న ఎస్386 బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి. అమెరికాకు వచ్చిన చైనా విద్యార్థుల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసేవారే. అందుకే ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వివాదాల పరిష్కారానికి 3మార్గాలు
అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఏర్పడే వివాదాల పరిష్కారానికి అమెరికన్ పార్లమెంటరీ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా పరిష్కరించుకోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతిస్తుంది. ఈ మూడు మార్గాలపై సంక్షిప్తంగా... 2020 ఎన్నికల్లో డెమొక్రాట్లు అధికులు మెయిల్ ద్వారా ఓట్లు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రిపబ్లికన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల రోజు వరకూ ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదు. విస్కాన్సిన్లో ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అంశంపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో దాఖలైన వేర్వేరు కేసులన్నీ చివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తాయి. 2000లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలో డెమొక్రటిక్ అభ్యర్థి అల్‌గోర్‌పై గెలిచింది ఇలాంటి కోర్టు కేసు సాయంతోనే. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ట్రంప్ అమీ కోనీ బారెట్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. బారెట్ నియామకం కూడా 6– 3 ఆధిక్యంతో జరగడం ట్రంప్‌కు అనుకూలించే అంశమని నిపుణుల అంచనా. చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలన్నదే తమ అభిమతమని, అందుకే ఓటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా... అమెరికా రాజ్యాంగం ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 సాధించిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమావేశమై అధ్యక్షుడి కోసం ఓట్లు వేయనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు రెండూ జనవరి 6న సమావేశమై ఈ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఫలితాలను నిర్ధారించి ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌కు అందిస్తూంటారు. అయితే ఎన్నికలు పోటాపోటీగా జరిగిన రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీలు రెండు వేర్వేరు ఫలితాలను ఇస్తే ఏమవుతుందన్నది ఇటీవలి కాలంలో విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో గవర్నర్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. అసెంబ్లీలన్నీ రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎవరి మాటకు విలువ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పలువురు చెబుతున్నప్పటికీ, 2000, 1876లలో ఇదే రకమైన వివాదాలు ఏర్పడిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైతే సెనేట్ రిపబ్లికన్ల చేతుల్లో ఉండగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యత కొనసాగుతోంది. అయితే జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసే కొత్త కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు సభలు ఫలితాల విషయంలో అంగీకారానికి రాలేకపోతే ఏమవుతుందన్నది ఓ శేష ప్రశ్న. చట్ట ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గం ఆమోదించిన ఎలక్టర్ల మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అంశం న్యాయస్థానాల పరీక్షకు గురికాని నేపథ్యంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు నిలిచిపోతే అప్పుడు కూడా విజయానికి 270 ఓట్లు కావాలా? లేక లెక్కించిన ఓట్లలో ఆధిక్యత వస్తే సరిపోతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు. కంటింజెంట్ ఎన్నికలు... ఎలక్టోరల్ ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికీ తగిన మెజార్టీ రాకపోతే అది కాస్తా అమెరికన్ రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కంటింజెంట్ ఎన్నికలకు దారితీస్తుంది. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఈ కంటింజెంట్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని ప్రతి రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు లభిస్తుంది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో ఇరవై ఆరు రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. డెమోక్రాట్లకు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో ఇరువురికీ సమానమైన ప్రాభవం ఉంది. ఇంకో రాష్ట్రంలో ఏడుగురు డెమోక్రాట్లు, ఆరుగురు రిపబ్లికన్లు, ఒక లిబరటేరియన్ ఉన్నారు. ఎలక్టోరల్ ఓట్లు ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు 269 చొప్పున వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటింజెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏ వివాదమైనా జనవరి 20లోపు ముగియాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ రోజుతో అధ్యక్షుడి పదవీ కాలం ముగుస్తుంది. ఒకవేళ ఆ రోజుకు కూడా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోతే స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్పీకర్‌గా ఉన్నారు. -
అమెరికా ఎన్నికలు: మూడో సారి గెలిచిన రాజా కృష్ణమూర్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వివరాలు.. డెమొక్రాటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్‌పై విజయం సాధించారు. 71 శాతం ఓట్లతో గెలుపొందారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. (ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు ) మరో భారత సంతతి వ్యక్తి అమి బెరా కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదో సారి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. అలానే మరో ఇండియన్ అమెరికన్ ఆర్ఓ ఖన్నా కూడా కాలిఫోర్నియా నుంచి మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇండో అమెరికన్ ప్రమిలా జయపాల్ కూడా వాషింగ్టన్ నుంచి మూడోసారి గెలుపొందాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. -
విచారణ కమిటీ ముందుకు టెక్ దిగ్గజాలు
శాన్ఫ్రాన్సిస్కో : టెక్నాలజీ ప్రాబల్యంతో ఆన్లైన్ వేదికల ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతున్నదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా టెక్ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వారు నిర్మంచిన దిగ్గజ సంస్థలు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్ధించుకోనున్నారు. ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు విచారణకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు దిగ్గజ టెక్నాలజీ సంస్థల సీఈఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటారు. చదవండి : ఎఫ్బీ బ్యాన్: కోర్టును ఆశ్రయించిన అధికారి సభా కమిటీ విచారణ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఫేస్బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ అమెరికన్ కంపెనీగా ఫేస్బుక్ ఎదిగిన తీరు గర్వకారణమని అంటూ పోటీతత్వాన్ని ప్రేరేపించే అమెరికన్ చట్టాల ఆసరాతో తమ కంపెనీ ఎదిగిందని చెప్పుకొచ్చారు. హానికారక కంటెంట్, గోప్యత, ఎన్నికల సమగ్రత వంటి కీలక అంశాలపై కంపెనీలు ఇష్టానుసారం తీర్పులు ఇవ్వరాదన్నది తన అభిమతమని జుకర్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. ఇక ఇంటర్నెట్ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇంటర్నెట్ నిబంధనల మార్పును అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నొక్కిచెప్పనున్నారు. అమెరికా విజయ ప్రస్ధానంగా అమెజాన్‌ను ఆయన అభివర్ణిస్తూ అమెజాన్‌లోనూ నిబంధనల పరిశీలన అవసరమని తాను నమ్ముతానని విచారణకు ముందు బెజోస్ ఆన్లైన్లో వ్యాఖ్యానించారు. జెఫ్ బెజోస్ కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి సమాచార గోప్యత నుంచి డేటా దుర్వినియోగం వరకూ విచారణ సందర్బంగా జ్యుడిషియరీ కమిటీ సాంకేతిక దిగ్గజాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్‌ప్లేస్‌లో తమ అధికారాలను వీరు దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలోనూ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుత అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలను మార్చడంపైనా వారి అభిప్రాయాలు కోరనున్నారు. ఇక హింసను ప్రేరేపించే విద్వేష కంటెంట్‌ను కట్టడి చేయడంలో ఫేస్బుక్ విఫలమైందనే ఆరోపణల నడుమ ప్రతినిధుల కమిటీ ఎదుట టెక్ దిగ్గజాల విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
వారికి గుడ్‌న్యూస్: అమెరికా మరో భారీ ప్యాకేజీ!
వాషింగ్టన్: మహమ్మారి కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా.. తాజాగా 3 ట్రిలియన్ డాలర్లతో కూడిన భారీ ప్యాకేజీ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం సహా దేశ పౌరుల ఆరోగ్య అవసరాలు ప్రాధాన్యాంశాలుగా డెమొక్రాట్లు ఈ మేరకు బిల్లును ప్రతిపాదించారు. కాగా వివిధ రాష్ట్రాలు నిధులు సమకూర్చుకునేందుకు, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, నిరుద్యోగులు, అద్దెదార్లు, ఇళ్ల యజమానులు, బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ ప్యాకేజీ ద్వారా ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది. 3 ట్రిలియన్ డాలర్లలో 1 ట్రిలియన్ డాలర్లు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు... కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్ కుటుంబాలను ఆదుకోవడానికి నగదు పంపిణీ, చిన్న వ్యాపారస్తులకు బిల్లు ద్వారా లబ్ది చేకూర్చేలా బిల్లు రూపొందింది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) ఇక ప్రతినిధుల సభలో మెజారిటీ డెమొక్రాట్లదే కావడంతో 208-199 ఓటింగ్ తేడాతో బిల్లును నెగ్గించుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ రిపబ్లికన్‌తో పాటు 14 మంది డెమొక్రాట్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. ఇక ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా స్పీకర్ నాన్సీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మానవతా దృక్పథంతో ఇప్పుడు కూడా మనం సరైన రీతిలో స్పందించకపోతే.. బాధ్యతారాహిత్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అమెరికన్ల జీవితాల్లో.. అమెరికా రాష్ట్రాలు, ప్రాంతాల బడ్జెట్లో ఇదే పెద్ద పెట్టుబడి అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల అతలాకుతలమైన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచి, సమస్యలను అధిగమించేలా చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఈ బిల్లును సెనేట్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎద్దేవా చేసిన రిపబ్లికన్లు.. వైట్‌హౌజ్‌లో వీటో(తిరస్కారం)కు గురవుతుందంటూ బెదిరింపు ధోరణి అవలంబించడం ఇందుకు నిదర్శనం. ఇక కరోనా సహాయక చర్యల్లో భాగంగా నాలుగోదశ ప్రారంభమైందని ట్రంప్ వైట్‌హౌజ్‌లో విలేకరులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఆయన సంతకం చేశారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా మార్చిలో 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ, చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు 483 బిలియణ్ డాలర్ల ప్యాకేజీని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా పన్ను చెల్లింపుదారులను ఆదుకునేందుకు పేరోల్ టాక్సులను తగ్గించాలని ట్రంప్ గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. (కరోనా సంక్షోభం: 484 బిలియన్ డాలర్ల ప్యాకేజీ) -
కరోనా సంక్షోభం: అమెరికా భారీ ప్యాకేజీ
వాషింగ్టన్: మహమ్మారి కరోనా(కోవిడ్-19) సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు, కరోనా నివారణ చర్యలకు అగ్రరాజ్యం అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా 484 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ రూపొందించిన బిల్లును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గురువారం ఆమోదించింది. కరోనా కల్లోలం కారణంగా ఆర్థికంగా నష్టాలు చవిచూసిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని పేర్కొంది. డెమొక్రటిక్ పార్టీ సభ్యుల సారథ్యంలోని ప్రతినిధుల సభ నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. గురువారం సాయంత్రం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. (రెండు నెలల పాటు నో ఎంట్రీ) కాగా కోవిడ్-19 దాటికి అమెరికాలో దాదాపు 50 వేల మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమవుతోంది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన ట్రంప్ సర్కారు.. మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను సురక్షిత పద్ధతిలో దశల వారీగా తిరిగి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. గురువారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ 23 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. త్వరలోనే కోవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనబోతున్నాం’’అని పేర్కొన్నారు.(సూర్యరశ్మితో కరోనాకు చెక్) అదే విధంగా.. ‘‘సురక్షిత మార్గాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాం. ఇందుకు ప్రతీ అమెరికా పౌరుడు సహకరించాలి. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలి. విధిగా మాస్కులు ధరించాలి. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన దేశాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాగలం. హ్యోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలోని శాస్త్రవేత్తలు వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. శీతల, పొడి వాతావరణంలో వైరస్ ప్రభావం చూపగలదని వారి పరిశోధనల్లో తేలింది. అయితే పొడి ప్రదేశాల్లో దాని తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని తరిమికొట్టవచ్చు’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
181 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
వాషింగ్టన్ : కొత్తగా కొలువుదీరిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ‘హెడ్‌గేర్ ధరించడంపై 181 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని 116వ కాంగ్రెస్ సభ్యులు ఎత్తివేశారు. నాకు ఇంతటి సాదర స్వాగతం పలికిన నా సహచరులకు ధన్యవాదాలు. ఈవిధంగానే.. ముస్లిం కుటుంబాలను అమెరికా నుంచి విడదీసే నిషేధానికి కూడా ముగింపు పలికే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఇల్హాన్ ఒమర్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాగా నవంబరులో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభ(హౌజ్)కు ఎన్నికయ్యారు. ఇందులో 28 మంది తొలిసారిగా ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. వీరంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇక ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబా, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. Yesterday, Congress voted to lift a 181 year ban on headwear to make the #116thCongress more inclusive for all. I thank my colleagues for welcoming me, and I look forward to the day we lift the Muslim ban separating families all over the U.S. from their loved ones. — Ilhan Omar (@IlhanMN) January 4, 2019 -
ట్రంప్ దూకుడుకు కళ్లెం!
ప్రతినిధుల సభలో మెజారిటీ చేతులు మారడం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని భావిస్తున్నారు. వలసలు, ఆర్థికం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఏకపక్షంగా అమలుచేస్తున్న అధ్యక్షుడి విధానాల్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లకు తాజా ఫలితాలతో మంచి అవకాశం లభించనుంది. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్ని మూకుమ్మడిగా ఎదిరిస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇదివరకే ప్రకటించడం తెల్సిందే. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం పెరగడంతో ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడి దుందుడుకు, విపరీత వైఖరిని కట్టడి చేయడానికి డెమొక్రాట్ల ముందున్న కొన్ని మార్గాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ స్థాయీ సంఘాలపై డెమొక్రాట్లకు మరింత నియంత్రణ లభిస్తే ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన పలు కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. ట్రంప్‌పై అభిశంసన చేపట్టేందుకు చర్యలు తీసుకునే చాన్సుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. ట్రంప్ గతంలో వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తారు. ఈసారి కూడా ట్రంప్‌ను రిటర్న్స్ కోసం అడుగుతామని, ఆయన తిరస్కరిస్తే తమకున్న అధికార పరిధిలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. అక్రమ వలసల కట్టడికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేశారు. సంఖ్యాబలం పెరగడంతో డెమొక్రాట్లు గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెంచే చాన్సుంది. -
బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!
మినిస్క్: తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో స్ఫూర్తిదాయకంగా చెప్పేందుకు లుకషెంకో ప్రయత్నించి బోల్తాపడ్డారు. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)’ అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు.. అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతోపాటు ఆడ ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోవడం ఉన్నంతలో కాస్త మెరుగైన అంశం. ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దుచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ‘బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు’ లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్‌లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు లుకషెంకో ప్రస్తుతానికి అందుబాటులో లేరు.