వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం నమోదు అయ్యింది. ఊహించని రీతిలో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మెక్‌కార్తి తన పదవిని కోల్పోయారు. ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానానికి motion to vacate.. సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు మద్దతు ప్రకటించడం గమనార్హం. తద్వారా అమెరికా 234 ఏళ్లలో తొలిసారిగా స్పీకర్ ఓటింగ్ ద్వారా తొలగింపు పరిణామం చోటు చేసుకున్నట్లయ్యింది.
అధికారిక డెమొక్రట్స్‌కు సహకరిస్తున్నారనే ప్రధాన ఆరోపణపై రిపబ్లికన్లు ఆయనపై మంటతో ఉన్నారు. ఈ క్రమంలోనే డెమొక్రట్స్ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 216 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 210 ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది రిపబ్లికన్ రెబెల్స్ ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో రిపబ్లికన్ల రెబల్ గ్రూప్ నేత మ్యాట్ గాయెట్జ్ కూడా ఉన్నారు.
డెమొక్రట్స్‌తో రెబల్స్
మెక్‌కార్తి వైఖరిపై రిపబ్లికన్లు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి మంజూరు చేయడంలోనూ ఆయన అలసత్వం ప్రదర్శించడంపై రగిలిపోయారు. అయితే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ట్రంప్‌పై న్యాయపరమైన చిక్కులు తదితరాలతో సంయమనం పాటించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించడానికి నిధులను పాస్ చేయడానికి డెమొక్రాట్‌లపై ఆయన ఆధారపడటాన్ని రిపబ్లికన్లలో కొందరు సహించలేకపోయారు. ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసే ప్రతీకారం తీర్చుకున్నారు.
ఈ రోజు ఎవరూ ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఓటింగ్‌కు తర్వాత సభ్యులు నినాదాలు చేశారు. రిపబ్లికన్ రెబల్ మ్యాట్ గాయెట్జ్.. ఈ తీర్మానాన్ని ముందుండి నడిపించడం గమనార్హం. తద్వారా మెక్‌కార్తితో సుదీర్ఘకాలం వైరం ఉన్న గాయెట్జ్.. అదను చూసి దెబ్బ కొట్టినట్లయ్యింది.
I will not seek to run again for Speaker of the House. I may have lost a vote today, but I fought for what I believe in—and I believe in America. It has been an honor to serve. https://t.co/4EMpOuwtzy
— Kevin McCarthy (@SpeakerMcCarthy) October 3, 2023
ఎన్నిక కూడా ఉత్కంఠే
2022 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి సెనేట్‌లో స్వల్ఫ ఆధిక్యం లభించింది. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ దక్కడంతో స్పీకర్ ఛాన్స్ దక్కింది. రిపబ్లికన్ పార్టీ తరపున కాలిఫోర్నియా 20th కాంగ్రెసియోనల్ డిస్ట్రిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. 58 ఏళ్ల ఈ మాజీ ఎంటర్‌ప్రెన్యూర్.. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. 15 రౌండ్ల ఓటింగ్.. అతికష్టం మీద ఐదు రోజుల సమయం పట్టింది. ఓట్లకు ఓట్లు తగ్గించుకుంటూ పోగా.. చివరకు ఆయన స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
►చివరిసారిగా.. 1910లో తిరుగుబాటు తర్వాత జోసెఫ్ జి కెనాన్‌ను తొలగించేందుకు మోషన్ ప్రవేశపెట్టారు. కానీ, అది విఫలమైంది.
►ఇక 2015లోనూ జాన్ బోహెనర్‌ను తొలగించేందుకు ప్రతినిధి మార్క్ మెడోస్ మోషన్ ప్రవేశపెట్టగా.. బోహెనర్ రాజీనామాతో అది జరగలేదు.
►స్పీకర్ పదవికాలం రెండేళ్లు. కానీ, ఈలోపే మెక్‌కార్తి పదవిని కోల్పోయారు. తద్వారా.. అమెరికాలో 147 ఏళ్లలో అతితక్కువ కాలం స్పీకర్‌గా పని చేసిన మూడో వ్యక్తిగా మెక్‌కార్తి నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment