వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్ ఎన్నికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని మూడోరోజు సైతం అదృష్టం పలకరించలేదు. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
"The honorable Donald J Trump of Florida has received one [vote]"
— Aaron Rupar (@atrupar) January 6, 2023
*members start laughing* pic.twitter.com/B0q8nknZEP
స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెక్‌కార్తీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెక్‌కార్తీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్ ఓటింగ్ నిర్వహించే క్రమంలో ట్రంప్ పేరును ఆయన నామినేట్ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెక్‌కార్తీని స్పీకర్ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు.
ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు జో బైడెన్‌ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
New Trump Truth Social Post 😂 pic.twitter.com/ubgdTePnU9
— Benny Johnson (@bennyjohnson) January 5, 2023
ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు!
Comments
Please login to add a commentAdd a comment