Votes count
-
నవ్వులపాలైన ట్రంప్.. స్పీకర్ పదవికి పోటీ పడితే ఒకే ఒక్క ఓటు
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్ ఎన్నికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని మూడోరోజు సైతం అదృష్టం పలకరించలేదు. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "The honorable Donald J Trump of Florida has received one [vote]" *members start laughing* pic.twitter.com/B0q8nknZEP — Aaron Rupar (@atrupar) January 6, 2023 స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెక్‌కార్తీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెక్‌కార్తీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్ ఓటింగ్ నిర్వహించే క్రమంలో ట్రంప్ పేరును ఆయన నామినేట్ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెక్‌కార్తీని స్పీకర్ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు జో బైడెన్‌ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. New Trump Truth Social Post 😂 pic.twitter.com/ubgdTePnU9 — Benny Johnson (@bennyjohnson) January 5, 2023 ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
ఎవరి లెక్కలు వారివి..!
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాసనసభ బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి అనుయాయులు లెక్కలు కట్టడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఇలా లెక్కలు వేసుకున్నా కౌంటింగ్ దగ్గర పడడంతో వారిలో ఉత్కంఠ నెలకొని మళ్లీ లెక్కలు కట్టుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్సీ పీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, జనసేన అభ్యర్థిగా కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ అభ్యర్థిగా చల్లా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చౌదరి సతీష్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా అములోజు మహేష్, జనజాగృతి తరఫున రాగోలు నాగశివ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం అభ్యర్థి గుండ లక్ష్మీదేవి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నియోజకవర్గంలో 2,55,177 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,970 మంది ఓట్లు హక్కును వినియోగించుకోవడంతో 71.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లలో 1,28,170 మంది మహిళలు కాగా, వీరిలో 91,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పసుపు–కుంకుమ పథకం తనకు కలిసి వస్తుందని తెలుగుదేశం అభ్యర్థి భావిస్తున్నారు. అయితే మహిళలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రైతులు, మత్స్యకారులు, నిరుద్యోగులు జగన్ వెంట నడవడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయంపై ధీమాతో ఉన్నారు. నిన్నటి వరకు కాస్త స్తబ్ధతగా ఉన్న తెలుగుదేశం కేడర్ లగడపాటి సర్వేతో కాస్తంత ఉత్సాహంగా కనిపిస్తోంది. జాతీయ చానళ్లు, మెజారిటీ సర్వే సం్సథలు వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ప్రకటించడంతో కొందరు తెలుగుదేశం నాయకులు డీలా పడగా వైఎస్సార్సీపీ కేడర్‌లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు ఒకటో నంబర్ బూత్ నుంచి ప్రారంభం కానుండడంతో తొలిగా గార మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు తరువాత శ్రీకాకుళం రూరల్, చివరిగా శ్రీకాకుళం పట్టణ ఓట్ల లెక్కింపుతో పూర్తవుతుంది. ఉదయం 11 గంటలకే ఫలితాలు తెలిసే అవకాశం ఉన్నప్పటికీ వీవీ ప్యాట్ల లెక్కింపు ఉండడంతో అధికారికంగా విజయాన్ని ప్రకటించేందుకు సాయంత్రం అయ్యే అవకాశాలున్నాయి. అయితే తెలుగుదేశంలో మాత్రం భయాందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. -
కౌంటడౌన్‌కు వేళాయేరా ..!
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు జిల్లా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ జిల్లాలో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్ తమకు అనుకూలంగా లేకపోవడంతో కౌంటింగ్‌కు ముందే టీటీపీ అభ్యర్థులు డీలాపడ్డారు. జిల్లాలో ఒక్క సీటు కూడా తమకు వచ్చే పరిస్థితి లేదని తేలడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడు లయోలా హైస్కూల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో 24 గంటల గడువే ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ ముగిసింది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య 40 రోజులకు పైగా గడువు ఉండటంతో ఎన్నికల ఫలితాలపై ఇటు అభ్యర్థులు, అటు జిల్లా ప్రజలు తీవ్ర ఉత్కంఠ అనుభవించారు. రకరకాల సర్వేలు, అంచనాలతోసతమతమయ్యారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదంటూ ప్రకటనలు గుప్పించారు. పోలింగ్ ముందు నుంచి, అనంతరం గెలుపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమాగానే ఉన్నారు. వారిని ధీమాకు తగ్గట్టే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పలు జాతీయ సర్వే సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పాయి. ఓటమిని ముందే ఉహించిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో విచ్చల విడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ అంటూ రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేయడంతోపాటు, పింఛన్ల పెంపు పేరిట ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముగిశాక ఓటింగ్ సరళిని పరి శీలించిన టీడీపీ అభ్యర్థులు తమకు వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లు వేశారనే అంచనాకు వచ్చారు. ప్రధానంగా టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, టీడీపీ నేతల అవినీతి, దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, మట్టి, ఇసుక మాఫియా దారుణాలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును దెబ్బతీశాయనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర, ప్రత్యేక హోదాపై చేసిన పోరా టాలు, ఆయన ప్రకటించిన నవరత్నాల వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. లగడపాటి సర్వేపై అనుమానాలు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్ల డించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై అనుమానం ఉన్నట్లు టీడీపీ శ్రేణులే పేర్కొంటున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ అభ్యర్థులు డీలా పడ్డారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఓటమి తప్పదనే అంచనాకు వచ్చిన టీడీపీ నాయకులు ఈవీఎంలు, ఎన్నికల కమి షన్‌పై ఆరోపణలు చేస్తూ నానాయాగీ సృష్టిస్తున్నారు. లగడపాటితో పాటు, కొన్ని సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ శ్రేణులు నమ్మడంలేదు. కౌటింగ్‌కు ముందే తమ అభ్యర్థులు చేతులు ఎత్తేయకుండా టీడీపీ అధిష్టానమే కొన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉండేలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినా ఓటమి తప్పదనే భావన టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలడంతో ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యం ఆవహించింది. తుది దశకు చేరిన కౌంటింగ్ ఏర్పాట్లు గురువారం జరిగే కౌంటింగ్ సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడులయోలా హైస్కూల్లో ఏర్పాట్లు పూర్త య్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర కోన శశిధర్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బుధవారం మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం నుంచే కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రౌండ్లో సువిధ యాప్ ద్వారా ఫలితాలు వెల్లడిం చేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. సువిధ యాప్‌లో ఫలి తాలు నమోదుపై ఆర్వోలకు మంగళవారం అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రానికే కౌంటింగ్ ఏజెంట్లు గుంటూరు నగరానికి చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాలపై అభ్యర్థులతో పాటు, వారి గెలుపు, ఓటములపై పందెలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. -
48 గంటలే..
43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉండేది ఎవరో తేలనుంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన లెక్కింపు 23న జరగనుంది. అదే రోజు ఫలితం వెలువడనుండటంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఎగ్జిల్ పోల్స్ అన్నీ వైఎస్సార్ సీపీ వైపే మొగ్గుచూపగా... కౌంటింగ్ రోజుకోసం అభ్యర్థులు..పార్టీల అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సాక్షి, అనంతపురం అర్బన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈనెల 23న జరగనుంది. ఓట్ల లెక్కింపుపై 43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇందుకోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌కు 1,380 మంది సిబ్బందిని నియమించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున కౌంటింగ్ నిర్వహించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ (ఈటీపీబీ) ఓట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లను లెక్కిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు ఇలా... అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో నిర్వహిస్తారు. అలాగే హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జరుగుతుంది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీ (సర్వీస్ ఓట్లు) లెక్కిస్తారు. ఇక ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు చొప్పున రెండు పార్లమెంట్ నియోజవర్గాలకు 196 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పన 196 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక సూక్ష్మ పరిశీలకుడు చొప్పున. 392 టేబుళ్లకు 1,176 మంది నియమించారు. రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను ముందుగా సువిధ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీ, జేసీ–2, ఎన్నికల కమిషన్, మీడియా సెంటర్‌కు మెయిల్ ద్వారా వివరాలు పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీ లెక్కింపు పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి రెండు పార్లమెంట్ నియోజకర్గాలకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి లెక్కింపునకు దాదాపు 204 మంది సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో ఇతర విధులకు 1,200 మందిని నియమించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా చెక్క బాక్స్‌లు సిద్ధం చేశారు. ఈటీపీబీ లెక్కింపునకు కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేశారు. బరిలో 186 మంది అభ్యర్థులు అనంతపురం, హిందూపురం పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 186 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 14 మంది, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి భవితవ్యం 23న తేలనుంది. పోలైన ఓట్లు 26.54 లక్షలు జిల్లాలో మొత్తం 32,39,517 ఓట్లు ఉండగా 26,54,257 ఓట్లు పోలయ్యాయి. 82.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇందులో పురుషులు 6,70,501 మంది (82.93 శాతం), మహిళలు 6,49,589 మంది (81.52 శాతం), థర్డ్ జెండర్ 50 మంది (22.89 శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
కౌంటింగ్‌పై టీడీపీ కుట్రలు
-
కౌంటింగ్‌పై కుట్రలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా సహకరించాలని ఏ రాజకీయ పార్టీ అయినా తన ఏజెంట్లకు సూచిస్తుంది. అధికారం కోల్పోతున్నామనే నిస్పృహతో టీడీపీ మాత్రం కౌంటింగ్ సమయంలో గిల్లికజ్జాలకు సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి విషయంలోనూ ఘర్షణ వైఖరి అనుసరించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు నూరిపోస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రౌండ్ రౌండ్‌కూ రీ కౌంటింగ్‌కు ఒత్తిడి! గత నెల 11వతేదీన పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై రభస చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉద్రిక్తతలను సృష్టించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు శిక్షణ కూడా ఇప్పించడం గమనార్హం. కౌంటింగ్ సమయంలో ఉద్రిక్తతలను ఎలా రెచ్చగొట్టాలో ఉపదేశిస్తూ టీడీపీ ప్రత్యేకంగా 45 పేజీలతో ఓ పుస్తకాన్ని కూడా ముద్రించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కళ్లెదుట ఓటమి కనిపిస్తే తొండాట ఆడాలంటూ, కౌంటింగ్ హాల్లో వీరంగం సృష్టించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రత్యర్ధి మెజారిటీ తక్కువ ఉంటే ప్రతి రౌండ్‌కు రీ–కౌంటింగ్ కోసం ‘ఫైట్’ చేయాలంటూ, రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా ఒత్తిడి తేవాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫైట్ చేయడమనే పదం వినియోగించడం ద్వారా టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ఏం సంకేతాలు ఇస్తున్నారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఫలితం ప్రకటించకుండా అడ్డం పడండి.. వీవీ ప్యాట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కల్లో తేడా వస్తే రీ–కౌంటింగ్‌కు డిమాండ్ చేయాలని టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. రీ కౌంటింగ్ పట్టుబట్టి సాధించుకునేలా మానసికంగా సిద్ధం కావాలని పేర్కొంది. ఒకసారి రిటర్నింగ్ అధికారి ఫలితం ప్రకటిస్తే ఏమీ చేయలేమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితం ప్రకటించకుండా అడ్డుపడాలని, రీ కౌంటింగ్ కోసం ఎంతవరకైనా పోరాడాలంటూ టీడీపీ ఏజెంట్లను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లపైనా.. పోస్టల్ బ్యాలెట్లలో 13–ఏ, 13–బి, 13–సి సక్రమంగా ఉంటేనే లెక్కింపునకు అంగీకరించాలని, లేదంటే తిరస్కరించేలా ఒత్తిడి తేవాలని టీడీపీ ఏజెంట్లకు సూచించారు. పోలింగ్ రోజే కళ్ల ముందు ఓటమి సాక్షాత్కరించడంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఘర్షణలకు దారి తీసేలా వ్యవహరించడాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ఒకసారి, ఎవరికి ఓటు వేసింది వీవీ ప్యాట్‌లో కనిపించడం లేదంటూ మరోసారి గందరగోళం సృష్టించారని ఓ సీనియర్ అధికారి గుర్తు చేశారు. ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా తన కౌంటింగ్ ఏజెంట్లకు సహకరించేందుకు స్వతంత్ర అభ్యర్ధుల ఏజెంట్లతో పాటు తన ఎన్నికల పార్టనర్ పార్టీ అభ్యర్ధుల ఏజెంట్లను కూడా టీడీపీ ఇప్పటికే కొనుగోలు చేసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ వాదనలను సమర్థించేలా తర్ఫీదు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. వీవీ ప్యాట్ స్లిప్‌లను మాయం చేసి ఈవీఎంలకు, వీవీప్యాట్ లెక్కలకు పొంతన లేదంటూ వివాదాస్పదం చేసేందుకు కూడా వెనకాడరాదని టీడీపీ నిర్ణయించింది. ఇలా ఘర్షణలు రేకెత్తించేందుకు ఏ ఒక్క మార్గాన్నీ వదలకూడదనే ధోరణిలో టీడీపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రెచ్చగొట్టేలా వ్యవహరించినా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అభ్యర్ధులు, ఏజెంట్లు ఆ ఉచ్చులో చిక్కుకోకుండా సంయమనంతో ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే రిటర్నింగ్ అధికారులకే నివేదించాలని సూచిస్తున్నారు. -
కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నం
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. డీకేడబ్ల్యూలో ఆరు, ప్రియదర్శిని కళాశాలలో నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కోసం పది నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 1,200 మంది ఉద్యోగులను నియమించారు. 19 నుంచి శిక్షణ ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19, 20, 21 తేదీల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వనున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీన ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ వివరాలను సువిధాలో ఆప్‌లోడ్ చేసిన తర్వాతే ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. ఈతంతు పూర్తికాగానే విజయం సాధించిన అభ్యర్థిని ప్రకటించి ఆర్ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఆర్ఓలకు శిక్షణ సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్లిప్‌ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆర్ఓలకు శుక్రవారం విజయవాడలో శిక్షణ నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓలు హాజరయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలోకి బయటి వ్యక్తులు వెళ్లకుండా కర్రలతో బ్యారికేడ్లు కడుతున్నారు. పార్టీల ఏజెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ ఇటూ తిరగడానికి వీల్లేదు. వారికి అవసరమైన తాగునీరు తదితర ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. -
భారీ పోలింగ్ ఎవరికి లాభం ?
సాక్షి, ఆదిలాబాద్: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడంతో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో 73.88 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి ఏకంగా 83.10 శాతం పోలింగ్ జరిగి రికార్డు సృష్టించింది. గతంతో పోల్చితే 9.22 శాతం పోలింగ్ అధికంగా జరిగింది. అంత భారీగా పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. భారీ పోలింగ్ టీఆర్ఎస్కు అనుకూలిస్తుందా లేదా ప్రధాన ప్రత్యర్థి బీఎస్పీకి దోహద పడుతుందా, ఇతర అభ్యర్థులకు ఏమైనా లబ్ధి జరుగుతుందా అనేది రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోటెత్తడంతో అభ్యర్థుల గెలుపు ,ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఊహించని విధంగా ఓట్లు పోలవ్వడంతో ఓటరు నాడి ఏందనేది అంతుచిక్కడం లేదు. పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు చివరికి ఎవరి పక్షం నిలిచారనేది తెలుసుకోవడానికి కష్టతరంగా మారింది. బరిలో 13 మంది..పోటీ ఇద్దరి మధ్యే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈ సారి 13 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో పోటీమాత్రం ఇరువురు అభ్యర్థుల మధ్యనే హోరాహోరిగా సాగి నట్లు స్పష్టమైంది. ఇరువురు అభ్యర్థులు గెలుపే ప్రధాన లక్ష్యంగా చివరి వరకు తీవ్రంగా శ్రమించా రు. ఈ తీరుగా పోలింగ్ కూడా అంచనాలకు మిం చి జరగడంతో అభ్యర్థుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకపక్షమా....వ్యతిరేకమా ? భారీగా పోలింగ్ జరగడంతో విశ్లేషకులకు కూడా ఓటర్లు ఎటువైపు మొగ్గారో అర్ధంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బెల్లంపల్లితో పాటు తాండూర్ ,కాసిపేట ,నెన్నె ల, వేమనపల్లి ,కన్నెపల్లి , భీమిని ,బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని విధంగా పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలిం గ్ జరగడం వల్ల ఆ ఓట్లు అధికార పక్షమైన టీఆర్ఎస్కు అనుకూలిస్తుందా లేదా ప్రత్యర్థి పక్షమైన బీఎస్పీకి లబ్ధి చేకూరుస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇరువురు అభ్యర్థులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లు అధికంగా పోలయ్యాయి. పెరుగుతున్న పోలింగ్..తగ్గుతున్న ఓటర్లు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఐదేళ్లకోసారి పోలింగ్ శాతం పెరుగుతుండగా ,ఓటర్ల సంఖ్యక్రమంగా హెచ్చుతగ్గుదలలో ఉంటోంది. ఓ టర్ల సంఖ్య నిలకడగా ఉండటం లేదు. వేలసంఖ్యలో తేడా ఉంటోంది. తగ్గుతున్న ఓటర్లతో నియోజకవర్గం ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఈసారి కూడా పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపించగా , ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గుదలలో ఉంది. ఐదేళ్ల కోసారి ఓటర్లను పరిశీలిస్తే....... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి వేరుపడి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గాల పున:ర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. తొలిసారి నియోజకవర్గంగా ఏర్పడిన 20 09లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 1,39, 215గా ఉండగా, 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో అప్పటి ఓటర్ల సంఖ్య 1,56,935 గా నమోదైంది. ఆ తీరుగా తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఓ టర్ల సంఖ్యను పరిశీలిస్తే రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య వేలల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా 17,720 మంది ఓటర్లు పెరి గారు. 2018 ప్రస్తుత ఓటరు జాబితాలో 1,52 ,905 మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తుండగా,అంతకుముందు 2014 ఎన్నికల్లో న మోదైన ఓటర్లసంఖ్య 1,56,935 ఓట్లతో సరిపోల్చితే 4,030 మంది ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగగా ప్రతిసారి ఓటర్ల సంఖ్యలో మార్పు ఉంటోంది. -
సిరిసిల్ల: సర్వేలపై ఆసక్తి చూపుతున్న ప్రజానీకం
సాక్షి, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో అత్యధికంగా 80.39 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితమే మిగిలి ఉంది. ఈనెల 11న గెలుపు ఎవరిని వరించనుందో తేలనుంది. అప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో భద్రంగా ఉంటుంది. లెక్క తేలేదాక అభ్యర్థులు, నాయకులతోపాటు అందరిలో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. అందరి నోటా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంద?నే మాటలే వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా పోలింగ్ కేంద్రాల వారీగా తమ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని బూత్‌ల వారీగా ఏజెంట్లు, నాయకులతో సమాచారం తెలుసుకుంటూ తమకు లభించే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కూటమి అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల నుంచి లభించిన సానుభూతి తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ నాయకులు ఈసారి ఓట్లు శాతం పెరగనుందని, ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరామని భావిస్తున్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోకి అధికారులు భద్రంగా చేర్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ, డీఎస్పీల సమక్షంలో పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్‌రూముకు సీల్‌వేశారు. స్ట్రాంగ్‌రూం వద్ద మూడెంచల వ్యవస్థతో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మొదటి వరుసలో బీఎస్ఎఫ్ జవాన్లు, రెండోవరుసలో రాష్ట్రసాయుధ బలగాలు, మూడో అంచెలో సివిల్ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వీరితోపాటు 24 గంటలపాటు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. పెరిగిన పోలింగ్ శాతం.. జిల్లాలో ఈసారి అత్యధిక పోలింగ్‌శాతం నమోదైంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 7 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో 73.04 శాతం, సిరిసిల్లలో 73.24 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి వేములవాడలో 80.30 శాతం, సిరిసిల్లలో 80.48 శాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80.39 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ రద్దు నుంచి ఎన్నికల సంఘం, వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున ఓటు నమోదు గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు అధికారులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్‌శాతం పెరగడం ఎవరికి లాభం చేకూరుతుందనేది ఈనెల 11న తేలనుంది. లెక్కల్లో అభ్యర్థులు.. నియోజకవర్గంలోని భూత్‌ల వారీగా నమోదైన పోలింగ్ శాతంతో ఎక్కడ ఎవరికి ఓట్లు పడ్డాయన్న లెక్కల్లో నేతలు ఉన్నారు. భూత్‌లో ఉన్న ఓటర్లులో మనపార్టీ వారు ఎందరు? ఇతర పార్టీలోని ఓటర్లు ఎందరు? తటస్థ ఓటర్లు ఎవరు? అందులో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు? అనే లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ పార్టీకి కలిసి వచ్చింది? ఎక్కడ దెబ్బతిన్నదో? సమీక్ష చేయటంతోపాటు, పార్టీలో ఉంటూ పోలింగ్ ముందురోజు ప్రత్యర్థి పార్టీలకు కోవర్టుగా పనిచేసిన నాయకులను గుర్తించే పనిలో పడ్డారు. ఓటింగ్ సరళిని బట్టి భూత్‌ల వారీగా తమకు దక్కిన మద్దతును లెక్కగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన సర్వేలతో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనే అంశాలపై పోటీ చేసిన అ భ్యర్థులతోపాటు పార్టీల నాయకులు, జనం చ ర్చించుకుంటున్నారు. అందరి నోటా ఇదేమాట వినిపిస్తోంది. దీనిపైనే బెట్టింగులు, సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల చివరి ఘట్టమైన ఫలి తాలు వెలువడే ఈనెల 11వ తేదీపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మా నేతే గెలుస్తడు!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకంగా మారాయి. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అన్న చర్చ జోరందుకుంది. ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానుండగా.. ఆ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయనే దానిపై బెట్టింగ్‌లు కూడా ఊపందుకున్నాయి. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్ సర్వేలు గందరగోళం సృష్టిస్తుండగా.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్లతోపాటు జగిత్యాల, మంథనిలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్ల, రామగుండం, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్ ఫలితాలపైనా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. మిగతా 12 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలను ప్రజాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..? గెలుపు ఓటములపై ఎవరి ప్రభావం ఎంత..? అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. పోరు ప్రతిష్టాత్మకం.. గెలుపుపై ప్రశ్నార్థకం.. లెక్కలు, విశ్లేషణల్లో ప్రధాన పార్టీలు.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ జోరందుకుంది. విశ్లేషణలు, సర్వేలు అటూఇటుగా వస్తున్నా.. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ప్రశ్నార్థకంగా మారాయి. 13 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం నల్లేరుపైనడకగా భావించిన స్థానాల్లో కూడా అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొన్నట్లు నిఘావర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణలే ఇందుకు కారణంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు చెప్తుండగా.. బయట ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా అన్నిస్థానాల్లోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెబుతున్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి, ఇంటలిజెన్స్, ఎగ్జిట్‌పోల్ నివేదికలు ముందరేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు, విశ్లేషణలతో గెలుపోటముల అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బూత్‌కమిటీ సభ్యులుగా వ్యవహరించిన పార్టీ కార్యకర్తలతో సమీక్ష చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో గెలుపుపై జోరుగా సమీక్షలు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. జోరుగా సర్వేలు, విశ్లేషణలు.. అన్ని స్థానాల్లో బెట్టింగ్‌లు.. ఉమ్మడి కరీంనగర్‌లోని అన్నిస్థానాలపైనా సర్వేలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. మరో రెండురోజుల్లో ఫలితాలు వెలువడనుండగా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. హుజూరాబాద్, సిరిసిల్ల, మంథని, జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఇక్కడ అభ్యర్థులుగా ఉండటమే ఇందుకు కారణం. ఈటల రాజేందర్ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా.. హుజూరాబాద్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారన్న చర్చ రెండురోజులుగా జోరందుకుంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే. మహేందర్ రెడ్డి కూడా అదేస్థాయిలో పోటీ ఇచ్చారన్న ప్రచారం ఆ రెండు పార్టీల కేడర్, అభిమానుల్లో బెట్టింగ్‌లకు కారణమవుతోంది. కరీంనగర్ నుంచి మూడోసారి బరిలోకి టీఆర్ఎస్ నుంచి దిగిన గంగుల కమలాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. మంథని నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ పుట్ట మధుకర్, జగిత్యాలలో కాంగ్రెస్ దిగ్గజం టి.జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్‌కుమార్ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా సాగడంపై ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) ధర్మపురిలో గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మానకొండూరులో రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), ఆరెపెల్లి మోహన్ (కాంగ్రెస్), చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగ శోభ (బీజేపీ), వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్), కోరుట్లలో కె.విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్), జె.నర్సింగరావు (కాంగ్రెస్), పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి (టీఆర్ఎస్), సీహెచ్.విజయరమణారావు (కాంగ్రెస్), రామగుండంలో సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), కోరుకంటి చందర్ (ఫార్వర్డ్ బ్లాక్), రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పోటాపోటీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందన్న కోణంలో ఆయా పార్టీల అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారు. -
4 ఓట్లు గల్లంతు.. ఎన్నిక చెల్లదంటూ తీర్పు
నాగర్ కర్నూలు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తాడూరు మండల ఎంపీటీసీ విజయలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు సూచించారు. 2014లో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో న్యాయం కోసం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి రేణుక కోర్టును ఆశ్రయించారు. మొత్తం పోలైన ఓట్లు 2589 కాగా, కౌంటింగ్ అయిన ఓట్లు 2585. నాలుగు ఓట్లు గల్లంతయ్యాయి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మి పై కేవలం 2 ఓట్ల తేడాతో రేణుక ఓడిపోయారు. దీంతో రేణుక 2014లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. -
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా
* వచ్చేనెల 15న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు * రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 15న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. 19 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు, 5 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా అదేరోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ కార్యాలయంలో శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వి.ఎస్.సంపత్ ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ కాలం వచ్చే నెల 27వ తేదీకి, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ కాలం నవంబరు 8తో ముగియనుందన్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు బీడ్ (మహారాష్ట్ర), కాంధమాల్ (ఒడిశా) లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదల: 20-09-14 నామినేషన్ల స్వీకరణకు తుది గడవు: 27-09-14 నామినేషన్ల పరిశీలన: 29-09-14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ: 01-10-2014 పోలింగ్ తేదీ: 15-10-2014 ఓట్ల లెక్కింపు: 19-10-14 ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ: 22-10-14 హర్యానాలో ఓటర్ల సంఖ్య: 1,61,58,117 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 16,244 మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య: 8,25,91,826 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 90,403 -
ఓట్ల లెక్కింపులో జోక్యానికి ‘సుప్రీం’ నో...
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 16న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఓట్ల లెక్కిం పుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది లిలీ థామస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా గుజరాత్‌లోని వడోదరా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేసినందున ఓట్ల లెక్కింపుపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. కోర్టును ఆశ్రయించడంలో పిటిషనర్ చాలా జాప్యం చేశారని ధర్మాసనం పేర్కొంది.