న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 16న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఓట్ల లెక్కిం పుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది లిలీ థామస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా గుజరాత్‌లోని వడోదరా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేసినందున ఓట్ల లెక్కింపుపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. కోర్టును ఆశ్రయించడంలో పిటిషనర్ చాలా జాప్యం చేశారని ధర్మాసనం పేర్కొంది.