న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రధాని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత పక్కాగా చెప్పగలుగుతున్నారంటే ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని అధిర్ అనుమానం వ్యక్తం చేశారు.
‘ఇప్పటివరకు ఈవీఎంల గోల్‌మాల్‌పై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రధాని అంత పక్కాగా చెప్పడం చూస్తుంటే ఈవీఎంలలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తోంది.
కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే బీజేపీకి 370 సీట్లు వచ్చాయని వాళ్లు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఒక వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. ఈ దేశంలో ఎన్నికలను కూడా ఒక తమాషాలా తయారు చేశారన్న భావన కలుగుతోంది’ అని అధిర్ అన్నారు.
#WATCH | On PM Modi's statement "370 to BJP, 400 to NDA", Congress MP AR Chowdhury says, "...Lagta hai ki EVM mein Modi ji ka koi haath chalega..." pic.twitter.com/0KK3AEEIiZ
— ANI (@ANI) February 6, 2024
ఇదీచదవండి.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి
Comments
Please login to add a commentAdd a comment