Adhir Ranjan Chowdhury
-
అధిర్ రంజన్ చౌదరి రాజీనామా
కోల్‌కతా: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్ రంజన్ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్21) రాజీనామా చేశారు.పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. అధీర్ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదీర్ రాజీనామాతో మాల్దా-దక్షిణ్ నుంచి గెలుపొందిన ఇషాఖాన్ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్‌ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది. -
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేధాలు రోజురోజకీ తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాము(టీఎంసీ) ఇప్పటికీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయట నుంచి తమ మద్దతు ఉంటుందని వెల్లడించిన మరుసటి రోజే మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హంహల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో గురువారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఓటర్లను విభజించడానికి కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ (బెంగాల్లో) వారికి ఓటు వేయకండి. రాష్ట్రంలో పొత్తు లేదు. కేవలం కేంద్రంలో మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేస్తున్నాను. అలాగే కొనసాగుతాం. మేము ఇండియాలో భాగమే. దానికి మద్దతునిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి అపార్థం ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.తాజాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. టీఎంసీ ఇండియా కూటమిలో భాగం కాదని, ఆమె మాటలను నమ్మవద్దని తెలిపారు. టీఎంసీ కూటమి నుంచి వెళ్లిపోయిందని, మమతా బెనర్జీ ఎప్పుడైనా బీజేపీ వైపు వెళ్లవచ్చని ఆరోపించారు.‘ఆమె కూటమికి బయట నుంచి, లోపల నుంచి నాకు చేస్తుందో తెలియదు. మీరే ఆమెను అడగాలి. కానీ నాకు ఆమెపై నమ్మకం లేదు.ఆమె కూటమిని విడిచిపెట్టింది. త్వరలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఆశ్యర్యపోనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బెంగాల్ కాంగ్రెస్‌ను లెక్క చేయదని అన్నారు. కూటమి గురించి ఆమెకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏర్పాటు సమయంలోనే లేవనెత్తాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి అధీర్ రంజన్ చౌదరికి నిరసన సెగ
కోల్‌కతా: దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార జోరును పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి అధీర్ రంజన్ చౌదరి తన సొంత నియోజక వర్గంలో నిరసన సెగ తగిలింది. బహరంపూర్‌లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అధీర్ రంజన్ చౌదరి వాహనాన్ని నిలిపివేశారు. గోబ్యాక్ గోబ్యాక్ అంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన అధిర్ రంజన్ సదరు నిరసన కారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు తమ చెంపని చూపిస్తూ కొట్టమని హెచ్చరిస్తున్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అధీర్ రంజన్ తీరుపై పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బహరంపూర్‌లో మీ దౌర్జన్యం సరికాదు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మీలో స్పష్టంగా మీ చర్యల ద్వారా కనిపిస్తోంది. కానీ మా కార్యకర్తలను భయపెట్టడానికి కండబలం ఉపయోగించడం మీకు ఏమాత్రం సరైంది కాదని ట్వీట్లో తెలిపింది. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ఇది నన్ను ఆపడానికి చేసిన పన్నాగం తప్ప మరొకటి కాదు. దీని వెనుక అధికార పార్టీ టీఎంసీ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పని చేయకూడదని వారు కోరుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఓ ఎన్నికల్లో ఇలాగే వ్యవహరించారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా 1999 నుంచి బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుస విజయాన్ని సొంతం చేసుకుంటున్న అధీర్ రంజన్ చౌదరిపై అధికార పార్టీ టీఎంసీ తరుపున లోక్‌సభ అభ్యర్ధి ఇండియన్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దించింది. SHEER DISPLAY OF HOOLIGANISM BY ADHIR RANJAN CHOWDHURY Your thuggery in Baharampur won't go unnoticed. Your fear of losing elections is pretty evident from your actions. But using muscle power to intimidate our workers won't help you in anyway! SHAME! pic.twitter.com/eQFgFD0IRD — All India Trinamool Congress (@AITCofficial) April 13, 2024 -
అందుకే వరుణ్ గాంధీని బీజేపీ పక్కన పెట్టింది: అధిర్ రంజన్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ మొండిచెయ్యి చూపడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేదా ఇతర పార్టీలో చేరి బీజేపీ రెబల్‌గా రంగంలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వరుణ్ కుటుంబ మూలాలు ‘గాంధీ’తో ముడిపడి ఉండటం వల్లే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిందని విమర్శించారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే సంతోషిస్తామన్నారు. వరుణ్ ఉన్నతమైన నాయకుడని, బాగా చదువుకున్న నేతగా అభివర్ణించారు. పారదర్శకత కలిగిన వ్యక్తిగా తెలిపారు. వరుణ్‌కు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా వరుణ్ బీజేపీ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ -
Election Commissioner: నేడు కమిషనర్ల ఎంపిక.. మోదీతో కీలక భేటీ
సాక్షి, ఢిల్లీ: నేడు కేంద్ర ఎన్నికల సంఘంలో నూతన కమిషనర్ల ఎంపిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమావేశం కానున్నారు. అయితే, ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఈసీల నియామకం వేగంగా జరుగుతోంది. మరోవైపు.. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఇక, లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా?
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి బహరంపూర్ నియోజకవర్గం లోక్‌సభ నాయకుడు 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికి కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. చౌదరి లోక్‌సభలో ఐదుసార్లు గెలిచిన బహరంపూర్ నుంచి తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి చౌదరికే ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో అధికారికంగా పొత్తు ఉండదని నిర్దారించుకున్న నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల నిర్ణయంలో సరైన పొత్తు కుదరకపోవడంతోనే మమతా బెనర్జీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు 42 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించింది. -
‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రధాని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత పక్కాగా చెప్పగలుగుతున్నారంటే ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని అధిర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ఈవీఎంల గోల్‌మాల్‌పై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రధాని అంత పక్కాగా చెప్పడం చూస్తుంటే ఈవీఎంలలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తోంది. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే బీజేపీకి 370 సీట్లు వచ్చాయని వాళ్లు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఒక వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. ఈ దేశంలో ఎన్నికలను కూడా ఒక తమాషాలా తయారు చేశారన్న భావన కలుగుతోంది’ అని అధిర్ అన్నారు. #WATCH | On PM Modi's statement "370 to BJP, 400 to NDA", Congress MP AR Chowdhury says, "...Lagta hai ki EVM mein Modi ji ka koi haath chalega..." pic.twitter.com/0KK3AEEIiZ — ANI (@ANI) February 6, 2024 ఇదీచదవండి.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి -
మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు. "మేము భిక్ష అడగలేదు. మమతా బెనర్జీ స్వయంగా తనకు పొత్తు కావాలని చెప్పారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదు. మేము సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ సేవ చేయడంలో బిజీగా ఉన్నందున ఆమెతో పొత్తులు కోరుకోవడం లేదు.' అని అధీర్ రంజన్ చౌధరి అన్నారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీ పొత్తు గురించి అడినప్పుడు అధీర్ రంజన్ చౌధరి ఈ మేరకు స్పందించారు. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధీర్ రంజన్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీని గద్దె దింపే ధ్యేయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును టీఎంసీనే మొదట సూచించింది. అటు.. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి: 'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్‌సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్‌లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్‌కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్‌కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’. Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0 — ANI (@ANI) September 2, 2023 ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం 1. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి. 2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?. 3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి. 4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు. 5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు. 6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి. 7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు. ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పార్లమెంటరీ కమిటీ ముందు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తన రిపోర్టును స్పీకర్‌కు సమర్పించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంలో ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని దృతరాష్ట్రునితో పోల్చుతూ గందరగోళం సృష్టించారు. దీంతో ఆగష్టు 11న ఆయనపై సస్పెన్షన్‌తో స్పీకర్ వేటు వేశారు. పార్లమెంట్ కమిటీ ముందు తాజాగా హాజరైన అధీర్ రంజన్ చౌదరి.. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. పార్లమెంట్లో ఆ రోజు అన్నటువంటి మాటలకు పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు. ఆగష్టు 11న సస్పెన్షన్ అయిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చిన అధీర్ రంజన్ చౌదరి.. పార్లమెంట్లో ప్రజల తరుపున మాట్లాడేప్పుడు ఆవేదన ఉంటుందని, దాన్ని యాథావిధిగా బయటపెడతామని చెప్పారు. ఆ క్రమంలో మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాల్నీ కేంద్ర పాలితంగా మారుస్తారా?.. జమ్ము విభజనపై సుప్రీం -
Adhir Ranjan: ఉరి తీసి విచారణ చేస్తున్నట్లుంది!
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదురీ తన సస్పెన్షన్ వేటుపై ఏం చేయబోతున్నారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నారా?. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. వేటు విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నాపై వేటు అధికార పార్టీ తిరోగమనంగా చెప్పొచ్చు. నన్ను ఉరి తీసి.. ఆపై విచారణ జరిపినట్లు విచిత్రంగా ఉంది వాళ్ల తీరు. నాతోపాటు నలుగురు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం.. కొత్త దృగ్విషయం. నా పార్లమెంట్ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిందనే విషయం నాపై వేటు ద్వారా స్పష్టమవుతోందని అన్నారాయన. న్యాయస్థానాల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందంటే.. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా, సస్పెన్షన్ వేటుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అంశమూ పరిశీలనలో ఉంది అని అధిర్ రంజన్ చౌదురీ స్పష్టం చేశారు. ఇక ప్రధానిని అవమానించారనే అభియోగం మీదే ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘నీరవ్’ (నీరవ్ మోదీ అని బీజేపీ ఆరోపణ) ప్రస్తావన తాను సందర్భోచితంగానే తెచ్చానని, మణిపూర్ అంశంపై మోదీ నీరవ్(మౌనంగా) ఉన్నారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడనని, అంతేగానీ అవమానించే ఉద్దేశం తనకు లేదని అధిర్ రంజన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ బహరంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అయిన అధిర్ రంజన్ చౌదురీ.. గురువారం లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. పదే పదే సభకు అంతరాయం కలిగించడం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న వేళ ప్రసంగాలకు అవాంతరం కలిగించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. అంతేకాదు ప్రధాని మోదీని అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు నమోదు అయ్యింది. నీరవ్ మోదీ ప్రస్తావన తేవడంతో పాటు ప్రధాని మోదీని దృతరాష్ట్రుడితో పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (దృతరాష్ట్రుడు అంధుడు కాబట్టే.. ద్రౌపది పరాభవం పాలైంది. ఇవాళ ఇక్కడ రాజు కళ్లున్న కబోదిలా కూర్చున్నాడు. హస్తినాపురానికి, మణిపూర్‌కి పెద్దగా తేడా లేకుండా పోయింది అని అధిర్ రంజన్ చౌదురీ వ్యాఖ్యానించారు). అయితే బీజేపీ వెంటనే స్పందించింది. ప్రధానిపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అభ్యంతరకర వ్యాఖ్యల్ని రికార్డుల్లోంచి తొలగించడంతో పాటు అధిర్ రంజన్ చేత క్షమాపణలు చెప్పించాలని స్పీకర్‌ను బీజేపీ కోరింది. ఈలోపే ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేయగా.. మూజువాణి ఓటుతో అది పాస్ అయ్యింది. అధిర్ రంజన్ చౌదురీపై వేటు పడడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని మండిపడుతోంది. అధిర్‌పై వేటేసిన స్పీకర్ ఈ కేసును ప్రివిలేజెస్ కమిటీకి దర్యాప్తు కోసం పంపారు. అది తేలేదాకా ఆయన లోక్‌సభలో అడుగుపెట్టడానికి వీల్లేదు. #WATCH | Congress leader Adhir Ranjan Chowdhury on his suspension from Lok Sabha "This is a new phenomenon we have never before experienced in our career in Parliament...This is a deliberate design by the ruling party to throttle the voice of the opposition...This will undermine… pic.twitter.com/Um5kvbHH7p — ANI (@ANI) August 12, 2023 ఇదీ చదవండి: మణిపూర్‌లో సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి! -
Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: సత్యమేవ జయతే అని చెప్పడానికి రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి విజ్ఞప్తి చేశారు. ఓం బిర్లాను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు రాహుల్‌ను అనుమతించాలని శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ను అధిర్ రంజన్ కోరారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని రాజేంద్ర అగర్వాల్ బదులిచ్చారు. -
‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ విపక్ష కూటమి ఇండియాపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును తప్పుబట్టారాయన. ఢిల్లీ ఆర్డినెన్స్(సవరణ) బిల్లు-2023 రాజ్యాంగ బద్ధమే. కేంద్రానికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ప్రకారమే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ దీనిని వ్యతిరేకిస్తోంది. దానికి కూటమి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి. ఓట్లు, అధికారం కోసం కాదు. కూటమి కోసం కాదు.. ఢిల్లీ కోసం ఆలోచించండి. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాల్ని వ్యతిరేకించొద్దు అంటూ విపక్షాలకు చురకలటించారాయన. 2015లో సేవ చేయాలనే ధ్యాస లేని ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ నియంత్రణ కోసం వాళ్లు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకంటే బంగ్లాల కట్టడం లాంటి అవినీతిని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి.. అని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన. #WATCH | In the year 2015, a party came to power in Delhi whose only motive was to fight, not serve...The problem is not getting the right to do transfer postings, but getting control of the vigilance department to hide their corruption like building their bungalows: Union Home… pic.twitter.com/pelULwGMgH — ANI (@ANI) August 3, 2023 నెహ్రూను నేనేం పొగడలే! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గురువారం లోక్‌సభ సెషన్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత సమాజ వ్యవస్థాపకులైన జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, సీ రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్లు.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినవాళ్లే అని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తోంది నిజమేనా?. ఇది పగలా లేక రాత్రా?.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన(అమిత్ షా) నోట్లో లడ్డూ పెట్టాలని ఉంది. ఎందుకంటే అమిత్ షా నెహ్రూను, కాంగ్రెస్‌ను పొగిడారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే షా జోక్యం చేసుకని.. తానేం నెహ్రూని పొగడలేదని స్పష్టత ఇచ్చారు. ‘‘పండిట్ నెహ్రూను నేను పొగడలేదు. ఆయన ఏం చెప్పారో.. అదే ప్రస్తావించా. దానిని వాళ్లు పొగడ్తగా భావిస్తే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని బదులు ఇచ్చారు. దీంతో రంజన్ మరోసారి జోక్యం చేసుకుని షా వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాట్లాడారు. -
పిచ్చి మోదీ: అధీర్
కోల్‌కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది. మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్ ఓ నేరగాడంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్ అన్నారు. -
మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రాహుల్‌తో పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జోడో యాత్రపై ఇంతవరకు స్పందించలేదు. ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విపక్షాలన్నీ ఎకమవ్వాలని చూస్తుంటే.. మమత మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు. మోదీకి, దీదీకి మధ్య 'మో-మో' ఒప్పందం ఉందని, ప్రధానిని అప్సెట్ చేసేలా మమత ఏ పని చేయరని ఆరోపించారు. మోదీకి వత్తాసు.. శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినా మమత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అధిర్ రంజన్ అన్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌ను అంతమొందించాలని మోదీ అంటే.. దీదీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మమత బెనర్జీ కూడా ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే సత్తా దీదీకి ఉందని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో విపక్షాలను ఆమె ముందుండి నడిపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రధాని పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
చైనాపై కన్నెర్ర జేసేదెప్పుడు ?
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంపై ప్రధాని మోదీ వైఖరిని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా రంజన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంటే మోదీ సర్కార్ మాత్రం అదే దేశం నుంచి దిగుమతులను పెంచడంపై శ్రద్ధపెట్టింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి సర్వర్లను హ్యాక్ చేసింది చైనా హ్యాకర్లేనని ప్రముఖ జాతీయపత్రికలో గురువారం కథనం వెలువడిన నేపథ్యంలో ఈ అంశాలపై కేంద్రప్రభుత్వం లోక్‌సభలో శ్వేతపత్రం జారీచేయాల్సిందే. ఒక వైపు హ్యాక్ చేస్తూ, మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో చొరబడుతున్న చైనాపై ప్రధాని మోదీ ఎప్పుడు కఠిన చర్యలకు దిగుతారు? అని అధీర్ రంజన్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘ అమెరికాతో భారత వాణిజ్యం తగ్గిన ప్రతిసారీ చైనా లాభపడుతోంది. మోదీ సర్కార్ హయాంలో చైనా నుంచి దిగుమతులు మరింత పెరుగుతుంటే చైనా విషయంలో మోదీ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. దిగుమతులు పెంచేసి ఆ దేశానికి లబ్ధిచేకూరుస్తుంటే మరి చైనాపై మోదీ కన్నెర్రజేసేది ఎప్పుడు ? ’ అని అధీర్ రంజన్ ప్రశ్నించారు. -
బీజేపీ రావణుడిని పూజించాలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడిని కాదు, రావణుడిని పూజించండి అని అధికార భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాముడి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారని గుర్తుచేశారు. రావణాసురుడి పాలనలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు మన దేశంలో జనం అలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని తెలిపారు. అందుకే బీజేపీ నాయకులు రాముడి స్థానంలో రావణుడిని ఆరాధిస్తే మంచిదని అన్నారు. ‘రామా’ అనే ఒకే ఒక్క ఆయుధంతో ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తోందని అధిర్ రంజన్ ఆక్షేపించారు. -
బెంగాల్ మంత్రులకు కేంద్రమంత్రి చురకలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ పశ్చిమ బెంగాల్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లకు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరని తెలిపారు. బెంగాల్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పీఎం దక్ష్ పథకాన్ని అమలు చేయాలని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడుతారా? అని బెంగాల్ బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా పార్లమెంటులో మంగళవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ మంత్రుల ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా పట్టించుకోరని, వాళ్ల సిబ్బంది కూడా ఇతరులకు మంత్రుల ఫోన్ నంబర్ ఇవ్వాలంటేనే భయపడతారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేనప్పుడు పథకాల అమలు ఎలా సాధ్యమవుతుందన్నారు. బెంగాల్ బర్హంపోర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోకసభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ముర్షీదాబాద్ జిల్లా అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫోన్లు ఎత్తకపోవడం, ఇతరులు చెప్పేది పట్టించుకోకపోవడం టీఎంసీ నేతలకు అలవాటే అన్నారు. దీనికి స్పందిస్తూ ముర్షీదాబాద్ జిల్లాలోని వికలాంగులు, సీనియర్ సిటిజెన్లకు రూ.12 కోట్లు విలువచేసే ఉపకరణాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతిమా చేప్పారు. 16వేల మందికి వీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తమకు రాష్ట్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ లోక్‌సభలోని టీఎంసీ సభ్యులు నిరసనకు దిగారు. చదవండి: నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి -
రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. పదే పదే ద్రౌపది ముర్ము అని పిలిచారని, పేరుకు ముందు రాష్ట్రపతి అని గానీ, మేడం, శ్రీమతి అని గానీ సంభోదించలేదని విమర్శించారు. ఈమేరకు అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడినందుకు స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, గురువారమే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంభోదించారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడినందుకు అధిర్ రంజన్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు కూడా చేపట్టారు. చివరకు అధిర్ రంజన్ చౌదరి వెనక్కితగ్గారు. క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. చదవండి: మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి -
Rashtrapatni Row: సోనియా జీ చర్యలు తీస్కోండి
సాక్షి, ఢిల్లీ: కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కామెంట్లపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా.. అధిర్ రంజన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని తెలిపింది. అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘అధిర్ రంజన్‌వి దిగజారిన వ్యాఖ్యలే. ఆయన చేసినవి ముమ్మాటికీ సెక్సీయెస్ట్ కామెంట్లే. అవి ఆయన మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ చెప్తున్నారు. అధిర్ రంజన్.. రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనపై చర్యలు తీసుకోవాలి’ రేఖా శర్మ కోరుతున్నారు. -
‘సోనియా జీ’ మీరు కూడా మహిళే కదా: నిర్మలా సీతారామన్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. అనంతరం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అధినేత్రి విరుచుకుపడ్డారు. తనతో మాట్లాడవద్దని మండిపడ్డారు. మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ వాయిదా పడిన సమయంలో బీజేపీ నేత రమాదేవితో సోనియా మాట్లాడుతుండగా వారి సంభాషణలో స్మృతి ఇరానీ కల్పించుకున్నారు. ఆపై ఆగ్రహంతో ఊగిపోయిన సోనియా.. స్మృతి ఇరానీ వైపు తిరిగి తనతో మాట్లాడవద్దని అన్నట్టు సమాచారం. ఇక అదీర్ వ్యాఖ్యలపై అంతకుముందు స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. అంతకుముందు, ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో, లోక్‌సభకు సాయంత్రం 4 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు.. అధిర్ రంజన్ చౌదరి.. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని మండిపడ్డారు. సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. #WATCH | Some of our Lok Sabha MPs felt threatened when Sonia Gandhi came up to our senior leader Rama Devi to find out what was happening during which, one of our members approached there & she (Sonia Gandhi) said "You don't talk to me": Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/WxFnT2LTvk — ANI (@ANI) July 28, 2022 కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా గాంధీ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇందుకు సోనియా గాంధీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇది నోరు జారి అన్న మాట కాదు.. ఒక్కసారి కాదు.. పదే పదే రాష్ట్రపతి పదం వాడారని తెలిపారు. ఇక, ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్ రంజన్ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”. Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu — Ramanathan B (@ramanathan_b) July 28, 2022 ఇది కూడా చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ -
రాష్ట్రపతి ముర్ముపై అధిర్ రంజన్ అభ్యంతకర వ్యాఖ్యలు
-
Rashtrapatni Row: పార్లమెంట్లో బీజేపీ ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్‌సభలో బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్‌సభలో గళం వినిపించారు. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్ రంజన్ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్ రంజన్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్‌సభ 12 గం. దాకా వాయిదా పడింది. పార్లమెంట్ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్ రంజన్‌వి సెక్సీయెస్ట్ కామెంట్లు అని, ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు. It was a deliberate sexist insult. Sonia Gandhi should apologise to the President of India and the country: Finance Minister & BJP leader Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury's 'Rashtrapatni' remark pic.twitter.com/4CSGFzH2TE — ANI (@ANI) July 28, 2022 #WATCH | "He has already apologised," says Congress interim president Sonia Gandhi on party's Adhir Chowdhury's 'Rashtrapatni' remark against President Droupadi Murmu pic.twitter.com/YHeBkIPe9a — ANI (@ANI) July 28, 2022 In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”. Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu — Ramanathan B (@ramanathan_b) July 28, 2022 -
ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించడం సరికాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆయన ‘ఏఎన్ఐ’ మాట్లాడుతూ.. బీజేపీ ఏజెంట్‌గా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘పిచ్చివాళ్లపై స్పందించడం సరికాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీదీ దగ్గర ఉన్నారా? ప్రతిపక్షాల మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ షేర్ ఉంది. ఆమె వద్ద అంత ఓట్ షేర్ ఉందా? బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు, ఆ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఇలా మాట్లాడుతున్నార’ని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) కాంగ్రెస్ పార్టీ జీవం కోల్పోయిందని, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని మమత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అధిర్ స్పందించారు. ‘కాంగ్రెస్‌పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లాంటి నాయకులు వెలుగులోకి వచ్చివుండేవారు ఉండేవారు కాదు. ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలి. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గోవాలో పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడించారు. గోవాలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు, ఇది అందరికీ తెలుస’ని మండిపడ్డారు. (చదవండి: ప్రాంతీయ పార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమి) -
మేము లేకుండా బీజేపీని ఓడించలేరు
న్యూఢిల్లీ: తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ‘యూపీఏ ఎక్కడుంది’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ భాగస్వామం లేకపోతే ఆత్మలేని శరీరంలా యూపీఏ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. విపక్షాలు ఏకధాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమెందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి ప్రయోజనం కలిగేలా మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్ పవార్ పరువు తీయడానికి ఆమె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని కలలు కనడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. (చదవండి: యూపీఏ అన్నదే లేదు.. కాంగ్రెస్ పార్టీతో కలవలేం) కాంగ్రెస్ పార్టీ లేకుండానా? బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... ‘మా పోరాటం అధికార పార్టీ (బీజేపీ)పైనే. మాతో చేతులు కలపాలనుకునే వారు మాతో రావాలి, మాతో చేరకూడదనుకునే వారు స్వేచ్ఛగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన రాజకీయ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం లేకుండా ఉంటుందా?’ అని ప్రశ్నించారు. (చదవండి: మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?) బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపాలి: ఖర్గే కాంగ్రెస్ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని భాగస్వామి చేయడానికి ప్రయత్నించామని రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలు విడిపోయి తమలో తాము పోరాడుకోకుండా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని ఆయన కోరుకున్నారు. -
బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో కీలుబొమ్మని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏర్పాటు చేయదలిచే ఉమ్మడి పోరాట వేదికలో మమతకు స్థానం కల్పించకూడదన్నారు. మమత ఒక అవిశ్వసనీయ మిత్రురాలని, కాంగ్రెస్‌ను పణంగా పెట్టి జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘అన్నం పెట్టే చేతులను కరవడం ఆమెకు అలవాటు. ప్రతిపక్షాల ఐక్య వేదికకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమె బీజేపీ పంపిన ట్రోజన్‌హార్స్ (శత్రువును మాయ చేసేందుకు గ్రీకులు వాడిన సాధనం). బీజేపీపై యుద్ధంలో ఆమెను నమ్మకూడదు’’ అని అధిర్ విమర్శించారు. తన కుటుంబసభ్యులను, పార్టీ నేతలను సీబీఐ దాడుల నుంచి రక్షించుకునేందుకు మమత ప్రధాని చెప్పినట్లు నడుచుకుంటారని, ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ లక్ష్య సాధనకు పరోక్షంగా సహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతకు టీఎంసీ వెన్నుపోటుదారన్నారు. తొక్కేసి ఎదుగుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్‌ను పణంగా పెట్టి టీఎంసీ ఎదిగిందని, ఇప్పుడు జాతీయవ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు టీఎంసీలో చేరడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. దీంతో టీఎంసీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని మమత కలలు కంటున్నారని, వారికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉందని అధిర్ చెప్పారు. కాంగెస్ర్ ఉన్నంతకాలం ఆమెను ప్రతిపక్ష ఉమ్మడి నేత కానీయమని, ఇది తెలిసే ఆమె కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించారు. మోదీకి దీటైన నేత రాహుల్ కాదు, మమత అని టీఎంసీ మీడియాలో రావడంపై ఆయన స్పందించారు. వారివి పిచ్చివాళ్ల ఊహలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాహుల్ గాంధీ సమర్ధవంతమైన ప్రతిజోడి అని అధిర్ చెప్పారు. దేశంలో ఇంకా కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ల వాటా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి తప్ప మరే పార్టీకి ఇంత ఓట్ల వాటా లేదన్నారు. అందువల్ల ప్రతిపక్ష ఉమ్మడి నాయకత్వానికి కాంగ్రెస్ సహజ ఎంపికని అభివర్ణించారు. తమ పార్టీ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏర్పడడం కల్ల అని చెప్పారు. పంజాబ్‌లో సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా ‘జీ–23’ నాయకుడు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభాపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టబోరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ పనితీరుపై అంతృప్తి వ్యక్తం చేస్తూ గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 (గ్రూప్–23) నాయకుల్లో ఒకరిని ఈ పదవిలో నియమించే పరిస్థితి కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ పోటీలో శశి థరూర్, మనీష్ తివారీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గౌరవ్ గొగోయ్, రవనీత్ బిట్టూల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 నేతల్లో శశి థరూర్, మనీష్ తివారీ కూడా ఉన్నారు. ‘ఒక్కరికి ఒక పదవి’ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభాపక్ష నేత బాధ్యతల నుంచి తప్పించాలని యోచిస్తోంది. ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. -
పెట్రో రేట్లు పెంచి 4 లక్షల కోట్లు లాగేశారు
బహరాంపూర్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ ధరలను 69 సార్లు పెంచిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శనివారం చెప్పారు. ఈ పెంపుతో ప్రభుత్వం ఏకంగా రూ.4.91 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించిందని అన్నారు. పెట్రోల్ ధర రూ.100 దాటిందని, డీజిల్ సైతం సెంచరీకి చేరువలో ఉందని, ఇక గ్యాస్ సిలిండర్ ధర రూ.850కి ఎగబాకిందని ఆక్షేపించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో రూ.25 లక్షల కోట్లు రాబట్టుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను రద్దు చేసిందని, తద్వారా ధర లీటర్‌కు రూ.12 చొప్పున తగ్గిపోయిందని గుర్తుచేశారు. మిగతా అన్ని రాష్ట్రాలూ ఇదే తరహాలో ప్రజలకు ఉపశమనం కల్పించాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే వ్యాట్ ఎత్తివేయాలని విన్నవించారు. -
పేదల అకౌంట్లలో రూ. 6 వేలు జమ చేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా రూ. 6,000 అందించాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా పేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వారికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం సహాయం మాత్రమే కాదని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. అర్హులైన పేదలందరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయాలని ఆయన మోదీని కోరారు. లాక్డౌన్లో ఏ పనులూ లేకపోవడం వల్ల ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానంపై పోరు తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు అధిష్టానంపై పోరును తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుత్తున్నారు. పార్టీలో ప్రక్షాళనపేరుతో అధిష్టాన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జీ–23 నాయకులు కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించకుండా, అధిష్టానం పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేగాక రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ పదవీకాలం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్‌గాంధీ విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి, జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో అధిర్ రంజన్ చౌధరి వంటి వారు కీలకపాత్ర పోషించారని జీ–23 బృందం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐఎస్ఎఫ్తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి సైతం ఘాటుగానే జవాబిచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చదవండి: (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ) ఢిల్లీ పీసీసీలోనూ.. మరోవైపు అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ పీసీసీలోనూ అంతర్గత పోరు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు జీ –23లో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని సమాచారం. గతంలో 23 మంది.. పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గతేడాది సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం జీ–23 నేతలు చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని, అçసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకులతో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి సైతం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) -
ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్ షా
సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తనపై చేసిన ఆరోపణలపై అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లోని శాంతికేతన్ పర్యటన సందర్భంగా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చీలో కూర్చొని అమిత్ షా అగౌరవపరిచారంటూ కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. దీనిపై స్పందించిన అమిత్ షా..తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, సీనియర్ నేత అయ్యిండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలే రవీంద్రనాథ్ ఠాగూర్ని అవమానించారని, ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. (మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన) గతంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ.. ఠాగూర్ కుర్చీలో కూర్చున్నారని, రాజీవ్ గాంధీ అక్కడ టీ కూడా సేవించారని షా తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన అనంతరం ఠాగూర్‌ను ఎవరు అగౌరవపరిచారో చెప్పాలని సవాల్ విసిరారు. తాను సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడానికి కిటికీ వద్ద కూర్చున్నానని, గతంలో ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ గాంధీ కూడా అక్కడ కూర్చున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అమిత్ షా సభ ముందు ఉంచారు. మరోవైపు షాపై అధిర్ రంజన్ చౌదరి చేసిన ఆరోపణల్ని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ బిద్యూత్ చక్రవర్తి కూడా తోసిపుచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. (గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ కన్నీరు) -
ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటుదాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిటీష్ హయాం నుంచీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, సామాన్యుల సమస్యలు లేవనెత్తేందుకు ప్రశ్నోత్తరాలు కీలకమని కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. సభలో ఎన్నికైన సభ్యులు ప్రశ్నించడం ప్రాథమిక హక్కని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి మన దేశం త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. (ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్) చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయని, అసాధారణ పరిస్థితుల్లో జరిగే సమావేశాలకు సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. మధ్యలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కల్పించుకుని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్ష సభ్యులతోనూ ముందే చర్చించామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. (పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం). -
రియా అరెస్టు: అదొక మూర్ఖపు చర్య!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని బిహార్ నటుడి మృతిగా ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టుకునేందుకు ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ’పేరిట బీజేపీ బిహార్ విభాగం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇండియన్ యాక్టర్. కానీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ఆయనను బిహార్ నటుడిగా మార్చివేసింది’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. అదే విధంగా సుశాంత్ మృతి కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న తీరును అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. (చదవండి: బలవంతంగా ఒప్పించారు: రియా ) ఈ మేరకు.. ‘‘ పొలిటికల్ మాస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. సముద్రాన్ని మధించి మకరందానికి బదులు మాదక ద్రవ్యాలను కనుగొన్నాయి. అసలైన హంతకుడిని పట్టుకునేందుకు ఇప్పటికీ చీకట్లో వారి వెదుకులాట కొనసాగుతూనే ఉంది’’అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియా చక్రవర్తిని ఎన్డీపీఎస్ చట్టం(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెన్)కింద అరెస్టు చేయడాన్ని ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇక మరో ట్వీట్లో..‘‘రియా తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఆయన దేశానికి సేవ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయడాన్ని బిహారీకి న్యాయం చేసినట్లుగా చిత్రీకరించడం సరికాదు’’ అంటూ ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తూనే రియా బెంగాలీ అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా కొత్తగా ఎన్నికైన అధీర్ రంజన్ చౌదరి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. (చదవండి: ‘బిహార్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం’) అదే విధంగా సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ మండిపడ్డారు. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేమపేరిట తన కొడుకును మోసం చేసి, అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఎదుట రియా విచారణకు హాజరయ్యారు. అంతేగాక సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. Rhea's father is a former military officer, served the nation. Rhea is a Bengalee Brahmin lady, justice to actor sushant rajput should not be interpreted as a justice to Bihari.#SushantSinghRajputCase (4/n) — Adhir Chowdhury (@adhirrcinc) September 9, 2020 -
కంట్రోల్ రూమ్‌గా కాంగ్రెస్ నేత కార్యాలయం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి తన వంతు కృషి చేస్తున్నారు. ఢిల్లీలో తన కార్యాలయాన్ని కంట్రోల్ రూమ్‌గా మార్చి దేశవ్యాప్తంగా వలస కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని వలస కార్మికులతో చర్చించి వారి సమస్యలను తీరుస్తున్నారు. అధీర్ రంజన్ తన భార్య, సిబ్బందితో కలిసి తన కార్యాలయ్యాన్నే ఓ మినీ కంట్రోల్ రూమ్‌గా మార్చారు. వలస కార్మికుల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులు, అక్కడి పార్టీ కార్యకర్తలను సంప్రదించి వెంటనే సహాయం అందేలా చూస్తున్నారు. నిరాశ్రయులైన వలసకార్మికుల వివరాలను సేకరించి వారిని సంప్రదించడంలో అధీర్ సతీమణి, సిబ్బంది తోడ్పాటును అందిస్తున్నారు. తన నియోజక వర్గం బెహ్రాపూర్ నుంచే రోజుకు దాదాపు 500 వరకు సహాయాన్ని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అధీర్ రంజన్ తెలిపారు. ‘ఆశ్రయం, ఆహారం లేక వలసకార్మికులు రోధిస్తున్నారు. నా నియోజక వర్గంలో ఎక్కువగా పేద వారే ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వారి వివరాలు సేకరించి, వెంటనే సహాయం అందేలా చూస్తున్నాము’ అని అధీర్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, జిల్లా అధికారులను సహాయం కోసం సంప్రదిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఎంపీలు, మంత్రులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వలస కార్మికుల కోసం సంప్రదిస్తున్నానన్నారు. వారు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతున్నారని చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని, వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అధీర్ మండిపడ్డారు. లాక్డౌన్ ముగియగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలసకార్మికులు దేశంలో ఎక్కడున్నా స్వరాష్ట్రానికి తీసుకురావడంలో సహాయాన్ని అందించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు.(వలస కార్మికులను తరలించండి) -
‘కోవిడ్ ప్రొటెక్షన్ రైళ్ల’లో..
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వలస కార్మికులను వారి సొంతూళ్ల పంపించాలని లేదా తమ కార్మికులను తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కేంద్రాలకు వద్దకు వారిని తరలించాలని కోరారు. దిశానిర్దేశం లేని లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయారని.. తిండి, బట్టలు, ఉండటానికి లేక వారు అష్టకష్టాలు పడుతున్నారని లేఖలో అధిర్ పేర్కొన్నారు. వారికి సరైన వైద్యసహాయం కూడా అందడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు తరలించాలని కోరారు. ఇందుకోసం ‘కోవిడ్ ప్రొటెక్షన్ రైళ్ల’ను వినియోగించాలని సూచించారు. వలస కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడిగిస్తే వలస కార్మికులు పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (హైదరాబాద్ నుంచి విమానాలు..) -
'ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారు'
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారని దీనిపై పార్లమెంటులో వెంటనే చర్చించాలన్నారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. హోలీ పండగ తరువాత సభలో చర్చ జరుగుతుందని అన్నారు. కాగా అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతోందని, అంతలా ఎందుకు భయపడుతున్నారని అన్నారు. కాగా హోలీ గురించి మీరా మాట్లాడేది.. ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారని అధీర్ రంజన్ చౌదరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’ కాగా మంగళవారం సాయంత్రం అధీర్ రంజన్ చౌదరి కార్యాలయంపై దాడి జరిగింది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఢిల్లీలోని ఆయన ఇంటి పక్కనే ఉన్న కార్యాలయంలోకి చేరుకొని అక్కడి సిబ్బందిని దూషించారు. అనంతరం తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎంపీ చౌదరితో ఫోన్లో మాట్లాడాలని, అయన కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలంటూ ఆఫీసు సిబ్బందిని అడిగారు. దీనికి వారు నిరాకరించడంతో కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై అధీర్ రంజన్ చౌదరి ప్రైవేట్ కార్యదర్శి ప్రదీప్టో రాజ్‌పండిట్ ఫిర్యాదు చేయగా, దుండగులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. -
రంజన్ ఇంటిపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నివాసంపై మంగళవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రంజన్ నివాసంలోకి చొరబడి.. ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దుండగులు రంజన్ నివాసంలోని కొన్ని పత్రాలను ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో అధీర్ బయటకు వెళ్లగా.. ఆయన కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధీర్ వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’
ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్‌ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్) ట్రంప్‌ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 'ట్రంప్ భారత్‌కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్‌ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్‌ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్) -
అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్
సాక్షి, కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సీఏఏ, ఎన్నార్సీ అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గురువారమిక్కడ నార్త్ 24 పరగణా జిల్లా బషీర్‌హట్‌లో ర్యాలీలో పాల్గొన్న అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ...‘అవును, నేను పాకిస్తానీని. బీజేపీ ఏం చేసుకుంటుందో చేసుకోమనండి. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. ‘రంగా, బిర్లా’లు ఢిల్లీలో కూర్చుని ఏం చెప్పినా మేము ఆమోదించాలా? లేకుంటే మాపై దేశద్రోహులని ముద్ర వేస్తారా అని మండిపడ్డారు. భారతదేశం నరేంద్రే మోదీ, అమిత్ షా వ్యక్తిగత ఆస్తి కాదని విమర్శలు గుప్పించారు. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్పై మండిపడ్డారు. గవర్నర్‌కు పూర్తిగా మతిస్థిమితం తప్పిందని పదునైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం భారత్ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. చదవండి: సీఏఏపై వెనక్కి తగ్గం ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు కాంగ్రెస్‌కు షాకిచ్చిన విపక్షాలు..! జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు! ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే... సీఏఏపై కేరళ సంచలన నిర్ణయం సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది? -
‘మనది మేకిన్ ఇండియా కాదు’
-
‘మనది మేకిన్ ఇండియా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్ ఇండియా దిశగా కాకుండా రేపిన్ ఇండియా వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటన, ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలు దేశంలో కలకలం రేపాయని అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రజలు వేడుకగా జరుపుకున్నారని గుర్తు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగినా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారని, సీనియర్ రాజకీయ నేతలు సైతం పోలీసుల చర్యను సమర్ధించారని చెప్పారు. -
సీతామాతలను దహనం చేస్తున్నారు: అధిర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరో వైపు సీతామాతలను దహనం చేస్తున్నారని అధిర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా లోక్‌సభ గందరగోళ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో గురువారం అత్యాచార బాధితురాలిని దహనం చేసిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో రేప్‌లు జరుగుతున్నాయని, అక్కడి ప్రజల్లో అభద్రతా భావం నెలకొని ఉందని ఆయన అన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. చట్టం లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను 'ఉత్తమప్రదేశ్'గా మార్చాలని మాటలు వినిపిస్తున్న తరుణంలో అది అధర్మప్రదేశ్‌గా మారిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన ఘటనలు బాధాకరమని.. కానీ ఆ విషయాలను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మాత్రం సరికాదన్నారు. దీంతో కాంగ్రెస పార్టీ రెండు ఘటనలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది. -
'అలాంటి డీఎన్ఏ ఆ పార్టీలకే ఉంది'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి.. నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్లో తనను అనేక పేర్లతో పిలిచారని ఆమె పేర్కొన్నారు. తాను ఒక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టలేని ఆర్థికమంత్రిని అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, తన పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా వాళ్లు ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అవసరమైన మరిన్ని సలహాలు ఇవ్వాలని తాను వారికి చెప్పానన్నారు. ఏదైనా విని సమాధానం ఇచ్చే ప్రభుత్వం ఉంటే అది మోడీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నాయకులకు ఆమె చురకలంటించారు. ప్రశ్నలు అడిగి, సమాధానం చెప్పేలోగా పారిపోయే డీఎన్ఏ ఎవరికైనా ఉందంటే అది ఇతర పార్టీలకని, తమ పార్టీకి కాదని ఆమె అన్నారు. వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కూడా ఆమె స్పందిస్తూ.. విమర్శలను స్వీరించే మనస్తత్వం ఉంది కాబట్టే విమర్శను విన్నాము. దానిని పరిగణనలోకి తీసుకొని సమాధానం కూడా చెప్పాము. విమర్శను స్వీకరించే గుణమే లేకపోతే.. వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలిబుచ్చే అవకాశమే ఇచ్చేవాళ్లం కాదని ఆమె సమాధానమిచ్చారు. చదవండి: ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: బీజేపీ -
ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మరోసారి నోరుజారారు. లోక్‌సభలో సోమవారం అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ .. నిర్మల సీతారామన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ పన్నుల తగ్గింపు గురించి వివరణ ఇచ్చిన నేపథ్యంలో అధిర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరంటే నాకు గౌరవం ఉంది కానీ, నిర్మల సీతారామన్ అనడానికి బదులుగా నిర్బలా సీతారామన్ అనడం సరైనదా.. కాదా..? అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు మంత్రి పదవిలో ఉన్నారు. అయితే మీరు మీ మనసు విప్పి మాట్లాడుతున్నారా.. లేదా అనే సందేహం కలుగుతోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. గతంలో నరేంద్రమోదీ, అమిత్‌షా తాజాగా నిర్మలా సీతారామన్‌లపై చేసిన వ్యాఖ్యలకు అధిర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వలసదారులంటూ అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై అధిర్ రంజన్ చౌదరి సోమవారం మాట్లాడుతూ.. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం వలసదారులేనని, వారి ఇళ్లు గుజరాత్లో ఉన్నాయని, కానీ వారు ఢిల్లీలో ఉంటున్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
అధీర్ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. జమ్మూ కశ్మీర్ అంశం అంతర్గత వ్యవహారామా..? లేక ద్వైపాక్షిక అంశమా స్పష్టతివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇది అంతర్గత వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 1948 నుంచి కశ్మీర్ పరిణామాలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్లపై సంతకాలు చేసిన నేపథ్యంలో అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ అంతర్గత వ్యవహారమనే మీరు(బీజేపీ) చెబుతారా..? అన్నది మా పార్టీ తెలుసుకోవాలనుకుంటోంది’అని రంజన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నియమ, నిబంధనలను పక్కనపడేసి జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందని రంజన్ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ అంతర్గత వ్యవహారం కాదనేలా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఈ వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలంటూ హోంమంత్రి అమిత్ షా నిలదీశారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో భాగమేనని అమిత్ షా బదులిచ్చారు. కశ్మీర్ లోయలో ఐరాస జోక్యాన్ని కాంగ్రెస్ ఆశిస్తోందా అని నిలదీశారు. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సోనియా, రాహుల్ ఆగ్రహం.. కశ్మీర్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ అంతర్గత వ్యవహారామా..? కాదా..? అన్నది స్పష్టతివ్వాలని రంజన్ ప్రశ్నించిన సమయంలో సోనియా గాంధీ ఆయనకు కుడి వైపున కూర్చొని ఉన్నారు. ఈ వ్యాఖ్యలతో షాక్ తిన్న ఆమె.. ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపు చూశారు. రంజన్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ సైతం చేసేదేమీ లేక తల అడ్డంగా ఊపుతూ కూర్చున్నారు. ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా రంజన్ మరోసారి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఇది అందరికీ ప్రాథమికంగా వచ్చే ప్రశ్నే అని, తనను తప్పుగా అనుకోవద్దని తెలిపారు. అయితే ఈ సమయంలో సోనియా గాంధీ అసహనంగా కనిపించారు. -
ఆమె స్వభావమే అంతా
న్యూఢిల్లీ: బీజేపీపై ఐక్యంగా పోరాడడానికి ముందుకురావాలంటూ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, వామపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీని ఢీకొనేందుకు తమతో చేతులు కలుపాలన్న మమత ఆఫర్‌పై కాంగ్రెస్ పార్టీ ఒకింత విముఖత వ్యక్తం చేసింది. బెంగాల్లో బీజేపీ పుంజుకోవడానికి అధికార టీఎంసీయే కారణమని కాంగ్రెస్ నిందించింది. మమత వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మమతా బెనర్జీ మాట మీద నిలబడరని, ఆమె స్వభావమే అంతా అని ఆయన ఎద్దేవా చేశారు. ‘కొంతమంది మాట మీద నిలబడరు. ఒక మాట అని దాని నుంచి తప్పుకుంటారు. ఇదీ ఆమె స్వభావం. ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఈ విషయమై మా అధిష్టానంతో మాట్లాడాలి. అయినా, బెంగాల్లో బీజేపీ ఎదుగుతుందంటే అందుకు మమత వైఫల్యమే కారణం’ అని అన్నారు. -
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ బలపరిచారు. ఓం బిర్లాను స్పీకర్ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఓం బిర్లా ఆశీనులవుతున్న సమయంలో ‘భారత్ మాతాకీ జై’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మట్లాడుతూ.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక లోక్‌సభకు గర్వకారణమని అన్నారు. ఓం బిర్లా రాజస్థాన్‌లో బాగా పనిచేసిన విషయం చాలా మంది ఎంపీలకు తెలుసని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి పనిచేశానని వెల్లడించారు. మినీ ఇండియాగా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన నిర్విరామంగా సమాజసేవలో నిమగ్నమయ్యారని ప్రశంసించారు. -
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా అధీర్ చౌదరి
న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పక్షనేత ఎవరనేదానిపై జరుగుతున్న చర్చకు తెరపడింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపోందిన అధీర్ చౌదరి.. గతంలో పీసీసీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత ఎవరనేదానిపై త్రీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 16వ లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో.. తదుపరి ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ పక్షనేతగా వ్యవహరించడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీంతో ఇందుకోసం పలువరు పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్, మనీశ్ తివారీ, అధిర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే సభలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొవడం, ప్రజా సమస్యలపై గళమెత్తగల నేతను ఎన్నుకోవాలని పార్టీ భావించింది. ఈ మేరకు తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం అధీర్ చౌదరి వైపు మొగ్గు చూపింది. -
దీదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ వ్యతిరేక పక్షాలతో మంతనాలు జరుపుతున్న ఆమెపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదురి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఊసరవెల్లి, నియంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను మమతా బెనర్జీ కలసిన రెండు రోజులకే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రకమైన విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రంజన్ మాట్లాడుతూ.. మమతకు ప్రధాని కావాలనే కోరిక ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఆమె ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ట్రోజన్ హార్స్‌లా ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. మమతా బెంగాల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తూ.. మరో వైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతే కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని కావడానికి మమత నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అస్సాంలో పౌరసత్వం లభించని వారి విషయంలో మమతా ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. ఎన్నార్సీ జాబితాలో చోటు లభించని వారిపై ప్రేమ కనబరుస్తున్న మమతా బెంగాల్ సరిహద్దులో ఎందుకు బారికేడ్లు పెట్టారని ప్రశ్నించారు. దీనిపై మమత తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
'గంగూలీకి తప్ప.. నీకు సరిపోదు'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ ఆదిర్ రంజన్ చౌదురి రోడ్డుపై తన చొక్కా విప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. చొక్క విప్పడం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి మాత్రమే సరిపోతుందని, ఇతరులకు సరిపోదని అన్నారు. విషయమేంటంటే.. పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ తృణమాల్ కాంగ్రెస్ దౌర్జన్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో చౌదురి తన చొక్కా విప్పి, కాల్చండంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. కాగా కాంగ్రెస్ బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలావుండగా 2002లో లండన్ లార్డ్స్ స్టేడియంలో నాట్‌వెస్ట్ ట్రోఫీలో విజయానంతరం అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ చొక్కా విప్పి విజయసూచికగా గాల్లో తిప్పిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. మమత ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ చీఫ్ చర్యపై పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరును మమత విమర్శించారు. -
టికెట్ ఖరారైతే ఎస్ఎంఎస్
రైల్వే వెయింటింగ్ లిస్ట్ ప్రయాణికుల మొబైల్‌కు సందేశం న్యూఢిల్లీ: మీది వెయింటింగ్ లిస్టు రైలు టికెట్టా? అnrతే మీ ప్రయూణానికి ముందు గనుక మీ టికెట్లు కన్ఫర్మ్ (ఆర్ఏసీలోకి వచ్చినా) అయితే రైల్వే శాఖే మీ మొబైల్ ఫోన్‌నంబర్‌కు తాజా స్థితిని తెలియజేసే సంక్షిప్త సందేశం (ఎస్ఎమ్మెస్) పంపుతుంది. గత 10 రోజులుగా ఈ మేరకు ప్రయోగం కొనసాగుతోందని, సోమవారం నుంచి వెయింటింగ్ లిస్ట్ ప్రయాణికులందరినీ ఎస్ఎమ్మెస్ ద్వారా అప్రమత్తం చేయడం లాంఛనంగా ప్రారంభించినట్టు రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 10 లక్షల మంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ విధంగా అలర్ట్‌లు పొందుతారన్నారు. రైల్వే సాంకేతిక విభాగం ‘క్రిస్’ దీనిని అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ ఫోన్‌కు కోచ్, బెర్త్ నంబర్లు తెలియజేసే ఎస్ఎమ్మెస్ ప్రయూణానికి 3 గంటల ముందు వస్తుందని వివరించారు. రైల్వే బడ్జెట్ సందర్భంగా హామీ ఇచ్చిన ఈ సేవతో ప్రయూణికులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా రైల్వే వెబ్ సైట్‌పై భారం తగ్గుతుందని రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) డీపీ పాండే చెప్పారు. టికెట్ ఆర్ఏసీ పరిధిలోకి వచ్చినా లేదా కన్ఫర్మ్ అయిప్పుడే ఎస్ఎమ్మెస్ వస్తుందని వివరించారు. ఇలావుండగా స్లీపర్ క్లాస్ బోగీలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే సోమవారం బళ్లారిలో చెప్పారు. భద్రతా ప్రమాణాల మెరుగుదలపై సుప్రీంకోర్టు నోటీసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఇక్కడ ఓ రైల్వేలైను ప్రారంభోత్సం సందర్భంగా ఆయన తెలిపారు. -
రైలు రవాణా భారం!
న్యూఢిల్లీ: రైలు రవాణా మరింత భారం కానుంది. రవాణా చార్జీలను అక్టోబర్‌లో పెంచడానికి రైల్వే సన్నద్ధమవుతోంది. ఇంధన భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్ఏసీ)పై పునఃసమీక్షించి చార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఏసీ ఆధారంగానే గత ఏప్రిల్‌లో రవాణా చార్జీలను రైల్వే 5.7 శాతం పెంచింది. ప్రయాణికుల చార్జీలు మాత్రం ఈ దఫా పెరగవు. ప్రతి ఆరు నెలలకొకసారి ఇంధన ధరలను సమీక్షించి ఆ మేరకు చార్జీలు పెంచేందుకు వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించిన ఎఫ్ఏసీ ప్రకారం అక్టోబర్‌లో మరోసారి రవాణా చార్జీలు పెరుగుతాయని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ‘భారతీయ రైల్వే ఆధునీకరణ- సవాళ్లు, అవకాశాలు’ అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరుకు రవాణా చార్జీలు మాత్రమే పెరుగుతాయని, ఈసారి ప్రయాణికుల చార్జీలు ముట్టుకోబోమని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలతో పాటు ప్రస్తుతం స్థిరంగాలేని రూపాయి విలువనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్టీఏ) ఏర్పాటు ప్రక్రియను రైల్వే ప్రారంభించిందని, ఈ నెలలోనే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు. చైనాను ఆదర్శంగా తీసుకోవాలి: రైల్వే రంగంలో చైనా ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే భారత్, చైనాల మధ్య స్నేహసంబంధాలకు కృషి చేయాలని అన్నారు. పొరుగు దేశమైన చైనా రాజధాని బీజింగ్‌కు ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. కాగా, రైల్వే లోకో డ్రైవర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి ప్రస్తుతమున్న వసతులను మరింతగా పెంచాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. -
రైలు రవాణా భారం!
న్యూఢిల్లీ: రైలు రవాణా మరింత భారం కానుంది. రవాణా చార్జీలను అక్టోబర్‌లో పెంచడానికి రైల్వే సన్నద్ధమవుతోంది. ఇంధన భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్ఏసీ)పై పునఃసమీక్షించి చార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఏసీ ఆధారంగానే గత ఏప్రిల్‌లో రవాణా చార్జీలను రైల్వే 5.7 శాతం పెంచింది. ప్రయాణికుల చార్జీలు మాత్రం ఈ దఫా పెరగవు. ప్రతి ఆరు నెలలకొకసారి ఇంధన ధరలను సమీక్షించి ఆ మేరకు చార్జీలు పెంచేందుకు వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించిన ఎఫ్ఏసీ ప్రకారం అక్టోబర్‌లో మరోసారి రవాణా చార్జీలు పెరుగుతాయని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ‘భారతీయ రైల్వే ఆధునీకరణ- సవాళ్లు, అవకాశాలు’ అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరుకు రవాణా చార్జీలు మాత్రమే పెరుగుతాయని, ఈసారి ప్రయాణికుల చార్జీలు ముట్టుకోబోమని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలతో పాటు ప్రస్తుతం స్థిరంగాలేని రూపాయి విలువనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్టీఏ) ఏర్పాటు ప్రక్రియను రైల్వే ప్రారంభించిందని, ఈ నెలలోనే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు. చైనాను ఆదర్శంగా తీసుకోవాలి: రైల్వే రంగంలో చైనా ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే భారత్, చైనాల మధ్య స్నేహసంబంధాలకు కృషి చేయాలని అన్నారు. పొరుగు దేశమైన చైనా రాజధాని బీజింగ్‌కు ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. కాగా, రైల్వే లోకో డ్రైవర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి ప్రస్తుతమున్న వసతులను మరింతగా పెంచాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది.