న్యూఢిల్లీ: సత్యమేవ జయతే అని చెప్పడానికి రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి విజ్ఞప్తి చేశారు. ఓం బిర్లాను ఆయన చాంబర్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు రాహుల్‌ను అనుమతించాలని శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ను అధిర్ రంజన్ కోరారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని రాజేంద్ర అగర్వాల్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment