reinstatement
-
కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్... ఎందుకంటే?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు కర్సివ్ రైటింగ్.. అదేనండి గొలుసుకట్టు రాత, కలిపిరాత అని చెబుతూంటారే అదన్నమాట తప్పనసరి! అసలు చేతిరాతనే పూర్తిగా మర్చిపోతున్న ఈ కాలంలో కలిపిరాత గోలేమిటని అనుకుంటున్నారా? ఈ రకమైన రాతతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. అందుకే 2010లో పూర్తిగా పక్కన బెట్టిన కలిపి రాతను ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేసింది కాలిఫోర్నియా. పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియా మాత్రమే కాదు...అమెరికాలోని దాదాపు 24కు పైగా రాష్ట్రాలలో దీన్ని తిరిగి అమలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ కర్సివ్ రైటింగ్ లేదా కలిపిరాతతో పిల్లలకు వచ్చే ప్రయోజనాలేమిటి? కర్సివ్ రైటింగ్‌ని ‘కర్సివ్ - జాయిన్ ఇటాలిక్స్’ అని కూడా పిలుస్తారు. దీనిపై అనేక న్యూరోసైన్స్ పరిశోధనలు జరిగాయి. ఫలితంగా కలిపి రాత అనేది మెదడుకు చాలా మంచిది అని తేలింది. కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్ట్ క్లాడియా అగ్యుర్రే ప్రకారం టైప్‌రైటింగ్‌తో పోల్చితే, అక్షరాలను కర్సివ్‌లో రాయడం వల్ల నేర్చుకోవడంలో, భాషాభివృద్ధిలోనూ ఉపయోపడటంతోపాటూ, నిర్దిష్ట నాడీ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్సే వోల్ట్జ్-పోరెంబా, చిన్నపిల్లలు కర్సివ్‌ను నేర్చుకోవడం, అనుకరించడం చాలా సులభం అని చెప్పారు. తద్వారా పిల్లల్లో స్వయంప్రతిపత్తి పెరుగుతుంది. అధునాతన, మెరుగైన విజువల్ స్కిల్స్‌ను అలవర్చుకోవడంతోపాటు తొందరగా నేర్చుకుంటారని కూడా ఆమె చెప్పారు. మాన్యువల్ చేతివ్రాత ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, పిల్లల అభివృద్ధికి ప్రింట్ కంటే కర్సివ్ ప్రత్యేకంగా మంచిదా? కాదా? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది తప్ప కర్సివ్ వల్ల ఎదుగుతున్న పిల్లల్లో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇండియానా యూనివర్శిటీలో సైకలాజికల్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ కరిన్ జేమ్స్ (ప్రింట్ ఓవర్ కర్సివ్) పరిశోధన చేశారు. నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో కలిసి చేపట్టిన ఈ రీసెర్చ్‌లో చేతితో రాయడం ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు మెదడులోని నెట్‌వర్క్‌ల యాక్టివ్ కావడం గమనించారు. అయితే కీబోర్డ్‌పై టైప్ చేసినపుడు మాత్రం ఇలా జరగలేదు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా చేతితో రాయడం వలన జ్ఞాపకశక్తి, ఓపిక, ఏకాగ్రతలు పెరుగుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. అమెరికా పిల్లలు వెనుకబడి ఉండబోతున్నారా? పెన్మాన్షిప్ అండ్ రీడింగ్ అచీవ్మెంట్ ఒక కచ్చితమైన కారణం కానప్పటికీ కొంతమంది విద్యావేత్తలు కర్సివ్‌ను వదిలివేయడం వల్ల విద్యా ఫలితాలలో అమెరికా వెనుకబడిందని భయపడుతున్నారు. ఇటాలియన్ పరిశోధకుల ఒక చిన్న అధ్యయనం ప్రకారం, ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కర్సివ్ బోధన వారి పఠనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పశ్చిమ ఐరోపాలో కర్సివ్ రైటింగ్ ఇప్పటికీ విస్తృతంగా నేర్పిస్తున్నారు. యూకే ప్రభుత్వ ఆఫ్‌స్టెడ్ పరిశోధన సమీక్ష ప్రకారం పిల్లలు కర్సివ్ రైటింగ్ కంటే ముందు విడిఅక్షరాలను నేర్చుకోవాలి. ఆ తరువాత డయోగ్నల్, హారజెంటల్ స్ట్రోక్‌లను నేర్చుకోవాలి అనేది జాతయ జాతీయ పాఠ్యప్రణాళికలో ఉండాలి. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ ఫ్రాన్స్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కెనడా కూడా కర్సివ్‌ను తొలగించడానికి ప్రయత్నించింది. గత ఏడాది అంటారియో విద్యా మంత్రిత్వ శాఖ కర్సివ్ చేతివ్రాత సూచన అవసరాన్ని పునరుద్ధరించడం గమనార్హం. అయితే ఎలాంటి పాఠాలను గురించి ఆసక్తిగా ఉంటారు? ఆ సూచనలను ఎలా అందించాలి? ఎంతకాలం పాఠాలు ఉండాలి? ఎంత తరచుగా అభ్యాసం చేయాలి? అనే దానిపై ఇక్కడి టీచర్లు ఇంకా కుతూహలంగానే ఉన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (PISA) 2022 గ్లోబల్ ర్యాంకింగ్స్‌తో పోల్చి చూస్తే, అమెరికా 9వ స్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ (STEM) లో సింగపూర్‌తో పోలిస్తే అమెరికన్ విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉన్నారు. -
Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: సత్యమేవ జయతే అని చెప్పడానికి రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి విజ్ఞప్తి చేశారు. ఓం బిర్లాను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు రాహుల్‌ను అనుమతించాలని శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ను అధిర్ రంజన్ కోరారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని రాజేంద్ర అగర్వాల్ బదులిచ్చారు. -
మస్క్ మామకు షాకిచ్చిన ట్రంప్.. ట్విట్టర్‌కు తిరిగిరావాలని లేదట..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఓ పోల్ కూడా నిర్వహించగా.. నెటిజన్లు మస్క్‌కే జైకొట్టారు. దీంతో ట్రంప్ ఖాతాను ట్విట్టర్ ఆదివారం పునరుద్ధరించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మస్క్‌కు షాక్ ఇచ్చారు. ఈ పోల్ ముగియడానికి కొన్ని గంటల ముందే తనకు ట్విట్టర్లోకి తిరిగి రావాలని లేదని శనివారం వెల్లడించారు. ట్విట్టర్ ఖాతాను మళ్లీ ఉపయోగించడానికి తనకు ఎలాంటి కారణం కన్పించడం లేదని పేర్కొన్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రుత్ సోషల్' చాలా అద్భుతంగా ఉందని, ట్విట్టర్ కంటే ఎక్కువ ఫీచర్స్ అందులో ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో బాట్, నకిలీ ఖాతాలు వంటి చాలా సమస్యలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రుత్ సోషల్‌లో అలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ట్రుత్ సోషల్ను ట్రంప్‌కు చెందిన ఐటీ కంపెనీనే అభివృద్ధి చేసింది. ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా? వద్దా? అని ఎలాన్ మస్క్ ట్విట్టర్లో పోల్ నిర్వహించగా.. 15 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఇందులో 51.8 శాతం మంది ట్రంప్ ఖాతాను తిరిగి తీసుకురావాలన్నారు. దీంతో ఆదివారం నుంచి ట్రంప్ ఖాతా రీ యాక్టివేట్ అయింది. హింసను ప్రేరేపించారనే కారణంతో 2021 జనవరి 8న ట్రంప్ ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఆ సమయంలో ఆయనకు 88 మిలియనట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ఖాతా నిషేధం కావడంతో ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం 29 మంది మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే మళ్లీ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. చదవండి: 140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్.. -
రిలయన్స్ రికార్డు లాభం
క్యూ1లో రూ. 5,957 కోట్లు ఒక త్రైమాసికంలో బిలియన్ డాలర్లు ఆర్జించిన తొలి ప్రైవేట్ కంపెనీ అధిక రిఫైనింగ్ మార్జిన్లు, షేల్ గ్యాస్ వ్యాపారం ఊతం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయి నికర లాభాలు ఆర్జించాం. ప్రాంతీయంగా అంతటా రిఫైనింగ్ మార్జిన్లు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దీన్ని సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ విభాగం పనితీరు వ్యాపార వైవిధ్యంలో రిలయన్స్‌కి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. మరెన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. పోటీ సంస్థల కన్నా ముందుండేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లతో పాటు కొత్త మార్కెట్లకూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించనున్నాం. - ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్ఐఎల్ పెట్టుబడి ప్రణాళికలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు, ఇప్పటికే క్యూ1లో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ తెలిపింది. అలాగే, ఇంధన రిటైల్ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించే దిశగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు, ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు లాభం ఆర్జించింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 13.7% వృద్ధితో రూ. 5,957 కోట్లు నమోదు చేసింది. తద్వారా ఒక త్రైమాసికంలో ఒక బిలియన్ డాలర్ల మేర ఆర్జించిన తొలి ప్రైవేట్ సంస్థగా నిల్చినట్లయిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభం రూ. 5,237 కోట్లు. షేరువారీగా చూస్తే లాభం రూ. 17.8 నుంచి రూ. 20.3కి చేరినట్లవుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు టర్నోవరు 7.2% వృద్ధితో రూ. 1,07,905 కోట్లకు చేరింది. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, పెట్రోకెమికల్ వ్యాపార ఆదాయం పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడం రికార్డు ఫలితాలకు తోడ్పడ్డాయని సంస్థ చైర్మన్ ముకేశ్ తెలిపారు. 8.4 డాలర్లుగా జీఆర్ఎం.. ముడిచమురును శుద్ధి చేసి ఇంధనంగా మార్చినందుకు గాను కంపెనీకి ప్రతి బ్యారెల్‌పై లభించే స్థూల రిఫైనింగ్ మార్జిను (జీఆర్ఎం) 8.4 డాలర్ల నుంచి 8.7 డాలర్లకు పెరిగింది. అయితే, జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 9.3 డాలర్ల నుంచి తగ్గింది. మరోవైపు, రిఫైనరీ వ్యాపారం ఆదాయాలు 7.2%, పెట్రోకెమికల్ విభాగం ఆదాయాలు 9.3% మేర ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం అత్యధికంగా 27.3% మేర ఎగిసింది. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడమే ఇందుకు కారణం. కాగా పెట్రోకెమికల్ వ్యాపారం నుంచి 25,398 కోట్లు. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం ఆదాయాలు రూ. 3,178 కోట్లు వచ్చాయి. మరిన్ని విశేషాలు.. * 7.2 శాతం వృద్ధితో రూ. 98,081 కోట్లకు రిఫైనరీ వ్యాపార ఆదాయం. * జామ్‌నగర్ రిఫైనరీలో 16.7 మిలియన్ టన్నుల మేర చమురు ప్రాసెసింగ్ జరిగింది. * కేజీ-డీ6 క్షేత్రంలో 1 శాతం క్షీణించి 0.53 మిలియన్ బ్యారెళ్లకు తగ్గిన చమురు ఉత్పత్తి, 15 శాతం క్షీణించి 42 బిలియన్ ఘనపు అడుగులకు క్షీణించిన గ్యాస్ ఉత్పత్తి. * పన్నులకు ముందు రూ. 81 కోట్ల మేర లాభాలు నమోదు చేసిన రిటైల్ వ్యాపారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్ల కార్యకలాపాలు. టర్నోవర్ 15శాతం వృద్ధితో రూ.3,999 కోట్లకు అప్. * కంపెనీ నగదు నిల్వలు రూ. 81,559 కోట్లు. * మార్చి 31 నాటితో పోలిస్తే రూ. 1,38,761 కోట్ల నుంచి జూన్ 30 నాటికి రూ. 1,35,769 కోట్లకు తగ్గిన రుణభారం. * దేశీయంగా చమురు, గ్యాస్ విభాగం నుంచి కంపెనీకి రూ. 1,557 కోట్లు మాత్రమే రాగా.. అమెరికా షేల్ గ్యాస్ ద్వారా అంతకన్నా ఎక్కువగా రూ. 1,617 కోట్లు వచ్చాయి.