కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్‌... ఎందుకంటే? | California reinstated first through sixth graders in public schools learn to write in cursive | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్‌... ఎందుకంటే?

Published Tue, Jan 23 2024 5:27 PM | Last Updated on Wed, Jan 24 2024 1:22 PM

California reinstated first through sixth graders in public schools learn to write in cursive - Sakshi

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు కర్సివ్‌ రైటింగ్‌..  అదేనండి గొలుసుకట్టు రాత, కలిపిరాత అని చెబుతూంటారే అదన్నమాట తప్పనసరి! అసలు చేతిరాతనే పూర్తిగా మర్చిపోతున్న ఈ కాలంలో కలిపిరాత గోలేమిటని అనుకుంటున్నారా? ఈ రకమైన రాతతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. అందుకే 2010లో​ పూర్తిగా పక్కన బెట్టిన కలిపి రాతను ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేసింది కాలిఫోర్నియా.  పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియా మాత్రమే కాదు...అమెరికాలోని దాదాపు 24కు పైగా రాష్ట్రాలలో దీన్ని తిరిగి అమలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ కర్సివ్‌ రైటింగ్‌ లేదా కలిపిరాతతో పిల్లలకు వచ్చే ప్రయోజనాలేమిటి? 

కర్సివ్‌ రైటింగ్‌ని ‘కర్సివ్ - జాయిన్ ఇటాలిక్స్’ అని కూడా పిలుస్తారు. దీనిపై అనేక న్యూరోసైన్స్‌ పరిశోధనలు జరిగాయి. ఫలితంగా కలిపి రాత అనేది మెదడుకు చాలా మంచిది అని తేలింది. కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్ట్ క్లాడియా అగ్యుర్రే ప్రకారం టైప్‌రైటింగ్‌తో పోల్చితే, అక్షరాలను కర్సివ్‌లో రాయడం వల్ల నేర్చుకోవడంలో, భాషాభివృద్ధిలోనూ ఉపయోపడటంతోపాటూ, నిర్దిష్ట నాడీ మార్గాలను యాక్టివేట్‌ చేస్తుంది. 

పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్సే వోల్ట్జ్-పోరెంబా, చిన్నపిల్లలు కర్సివ్‌ను నేర్చుకోవడం, అనుకరించడం చాలా సులభం అని చెప్పారు. తద్వారా పిల్లల్లో స్వయంప్రతిపత్తి పెరుగుతుంది. అధునాతన, మెరుగైన విజువల్‌ స్కిల్స్‌ను అలవర్చుకోవడంతోపాటు తొందరగా నేర్చుకుంటారని  కూడా ఆమె చెప్పారు. 

 మాన్యువల్ చేతివ్రాత ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, పిల్లల అభివృద్ధికి ప్రింట్ కంటే కర్సివ్ ప్రత్యేకంగా మంచిదా? కాదా? అనే దానిపై  భిన్నమైన అభిప్రాయాలున్నాయి.  ఆధునిక   ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది తప్ప  కర్సివ్‌ వల్ల ఎదుగుతున్న పిల్లల్లో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇండియానా యూనివర్శిటీలో సైకలాజికల్  అండ్‌  బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ కరిన్ జేమ్స్ (ప్రింట్ ఓవర్ కర్సివ్‌) పరిశోధన చేశారు. నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో కలిసి చేపట్టిన ఈ రీసెర్చ్‌లో చేతితో రాయడం ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు మెదడులోని నెట్‌వర్క్‌ల యాక్టివ్‌ కావడం గమనించారు. అయితే కీబోర్డ్‌పై టైప్‌ చేసినపుడు మాత్రం ఇలా జరగలేదు.

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా  చేతితో రాయడం వలన జ్ఞాపకశక్తి, ఓపిక, ఏకాగ్రతలు పెరుగుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్  వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు   కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. 

అమెరికా పిల్లలు వెనుకబడి ఉండబోతున్నారా?
పెన్‌మాన్‌షిప్ అండ్‌  రీడింగ్ అచీవ్‌మెంట్ ఒక కచ్చితమైన కారణం కానప్పటికీ కొంతమంది విద్యావేత్తలు కర్సివ్‌ను వదిలివేయడం వల్ల విద్యా ఫలితాలలో అమెరికా వెనుకబడిందని భయపడుతున్నారు. ఇటాలియన్ పరిశోధకుల ఒక చిన్న అధ్యయనం ప్రకారం, ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కర్సివ్ బోధన వారి పఠనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

పశ్చిమ ఐరోపాలో కర్సివ్ రైటింగ్ ఇప్పటికీ విస్తృతంగా నేర్పిస్తున్నారు. యూకే ప్రభుత్వ ఆఫ్‌స్టెడ్ పరిశోధన సమీక్ష ప్రకారం పిల్లలు  కర్సివ్‌ రైటింగ్‌ కంటే ముందు  విడిఅక్షరాలను నేర్చుకోవాలి.   ఆ తరువాత డయోగ్నల్‌, హారజెంటల్‌  స్ట్రోక్‌లను  నేర్చుకోవాలి అనేది జాతయ జాతీయ పాఠ్యప్రణాళికలో ఉండాలి.  స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్  ఫ్రాన్స్  ఇదే సంప్రదాయాన్ని  పాటిస్తున్నాయి. కెనడా కూడా కర్సివ్‌ను తొలగించడానికి ప్రయత్నించింది. గత ఏడాది అంటారియో విద్యా మంత్రిత్వ శాఖ కర్సివ్ చేతివ్రాత సూచన అవసరాన్ని పునరుద్ధరించడం గమనార్హం. అయితే ఎలాంటి పాఠాలను గురించి ఆసక్తిగా ఉంటారు? ఆ సూచనలను ఎలా అందించాలి?  ఎంతకాలం పాఠాలు ఉండాలి?  ఎంత తరచుగా అభ్యాసం చేయాలి? అనే దానిపై ఇక్కడి టీచర్లు ఇంకా కుతూహలంగానే  ఉన్నారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ (PISA) 2022 గ్లోబల్ ర్యాంకింగ్స్‌తో పోల్చి చూస్తే, అమెరికా 9వ స్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్‌ మ్యాథ్స్‌ (STEM) లో   సింగపూర్‌తో పోలిస్తే అమెరికన్ విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement