hand writing
-
కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్... ఎందుకంటే?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు కర్సివ్ రైటింగ్.. అదేనండి గొలుసుకట్టు రాత, కలిపిరాత అని చెబుతూంటారే అదన్నమాట తప్పనసరి! అసలు చేతిరాతనే పూర్తిగా మర్చిపోతున్న ఈ కాలంలో కలిపిరాత గోలేమిటని అనుకుంటున్నారా? ఈ రకమైన రాతతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. అందుకే 2010లో పూర్తిగా పక్కన బెట్టిన కలిపి రాతను ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేసింది కాలిఫోర్నియా. పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియా మాత్రమే కాదు...అమెరికాలోని దాదాపు 24కు పైగా రాష్ట్రాలలో దీన్ని తిరిగి అమలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ కర్సివ్ రైటింగ్ లేదా కలిపిరాతతో పిల్లలకు వచ్చే ప్రయోజనాలేమిటి? కర్సివ్ రైటింగ్‌ని ‘కర్సివ్ - జాయిన్ ఇటాలిక్స్’ అని కూడా పిలుస్తారు. దీనిపై అనేక న్యూరోసైన్స్ పరిశోధనలు జరిగాయి. ఫలితంగా కలిపి రాత అనేది మెదడుకు చాలా మంచిది అని తేలింది. కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్ట్ క్లాడియా అగ్యుర్రే ప్రకారం టైప్‌రైటింగ్‌తో పోల్చితే, అక్షరాలను కర్సివ్‌లో రాయడం వల్ల నేర్చుకోవడంలో, భాషాభివృద్ధిలోనూ ఉపయోపడటంతోపాటూ, నిర్దిష్ట నాడీ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్సే వోల్ట్జ్-పోరెంబా, చిన్నపిల్లలు కర్సివ్‌ను నేర్చుకోవడం, అనుకరించడం చాలా సులభం అని చెప్పారు. తద్వారా పిల్లల్లో స్వయంప్రతిపత్తి పెరుగుతుంది. అధునాతన, మెరుగైన విజువల్ స్కిల్స్‌ను అలవర్చుకోవడంతోపాటు తొందరగా నేర్చుకుంటారని కూడా ఆమె చెప్పారు. మాన్యువల్ చేతివ్రాత ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, పిల్లల అభివృద్ధికి ప్రింట్ కంటే కర్సివ్ ప్రత్యేకంగా మంచిదా? కాదా? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది తప్ప కర్సివ్ వల్ల ఎదుగుతున్న పిల్లల్లో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇండియానా యూనివర్శిటీలో సైకలాజికల్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ కరిన్ జేమ్స్ (ప్రింట్ ఓవర్ కర్సివ్) పరిశోధన చేశారు. నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో కలిసి చేపట్టిన ఈ రీసెర్చ్‌లో చేతితో రాయడం ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు మెదడులోని నెట్‌వర్క్‌ల యాక్టివ్ కావడం గమనించారు. అయితే కీబోర్డ్‌పై టైప్ చేసినపుడు మాత్రం ఇలా జరగలేదు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా చేతితో రాయడం వలన జ్ఞాపకశక్తి, ఓపిక, ఏకాగ్రతలు పెరుగుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. అమెరికా పిల్లలు వెనుకబడి ఉండబోతున్నారా? పెన్మాన్షిప్ అండ్ రీడింగ్ అచీవ్మెంట్ ఒక కచ్చితమైన కారణం కానప్పటికీ కొంతమంది విద్యావేత్తలు కర్సివ్‌ను వదిలివేయడం వల్ల విద్యా ఫలితాలలో అమెరికా వెనుకబడిందని భయపడుతున్నారు. ఇటాలియన్ పరిశోధకుల ఒక చిన్న అధ్యయనం ప్రకారం, ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కర్సివ్ బోధన వారి పఠనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పశ్చిమ ఐరోపాలో కర్సివ్ రైటింగ్ ఇప్పటికీ విస్తృతంగా నేర్పిస్తున్నారు. యూకే ప్రభుత్వ ఆఫ్‌స్టెడ్ పరిశోధన సమీక్ష ప్రకారం పిల్లలు కర్సివ్ రైటింగ్ కంటే ముందు విడిఅక్షరాలను నేర్చుకోవాలి. ఆ తరువాత డయోగ్నల్, హారజెంటల్ స్ట్రోక్‌లను నేర్చుకోవాలి అనేది జాతయ జాతీయ పాఠ్యప్రణాళికలో ఉండాలి. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ ఫ్రాన్స్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కెనడా కూడా కర్సివ్‌ను తొలగించడానికి ప్రయత్నించింది. గత ఏడాది అంటారియో విద్యా మంత్రిత్వ శాఖ కర్సివ్ చేతివ్రాత సూచన అవసరాన్ని పునరుద్ధరించడం గమనార్హం. అయితే ఎలాంటి పాఠాలను గురించి ఆసక్తిగా ఉంటారు? ఆ సూచనలను ఎలా అందించాలి? ఎంతకాలం పాఠాలు ఉండాలి? ఎంత తరచుగా అభ్యాసం చేయాలి? అనే దానిపై ఇక్కడి టీచర్లు ఇంకా కుతూహలంగానే ఉన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (PISA) 2022 గ్లోబల్ ర్యాంకింగ్స్‌తో పోల్చి చూస్తే, అమెరికా 9వ స్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ (STEM) లో సింగపూర్‌తో పోలిస్తే అమెరికన్ విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉన్నారు. -
బుల్లెట్ జర్నల్‌కు నువ్వొస్తవా.. నువ్వొస్తవా! ఇంతకీ ఏమిటిది?
BuJo Culture: మొన్నటి ‘హ్యాండ్ రైటింగ్ డే’ సందర్భంగా చేతిరాత గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చాలామంది వాపోయారు. ‘మా రోజుల్లో’ అంటూ గతంలోకి కూడా వెళ్లిపోయారు. ‘ఈ తరానికి కీబోర్డ్‌ల టిక్టక్లు తప్ప, అందమైన చేతిరాతతో అట్టే సంబంధం లేదా?’ అని అడిగితే ‘లేదు’ అని చెప్పడానికి సోషల్ మీడియా ట్రెండ్ ‘బుల్లెట్ జర్నల్’ అడ్డొస్తుంది. బిజో కల్చర్‌లో భాగంగా యూత్ పెన్, కాగితానికి దగ్గరైంది. ఆర్ట్ థెరపీగా పేరున్న ‘బుల్లెట్ జర్నల్’లోని మజాను రుచి చూస్తోంది... బుల్లెట్ జర్నల్ లేదా బుజో అనేది షెడ్యూలింగ్, రిమైండర్స్, టు–డూ లిస్ట్... మొదలైన వాటికి ఉపకరించే పర్సనల్ ఆర్గనైజేషన్ మెథడ్. రోజు, వారం, నెల, సంవత్సరం... ఇలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకప్పుడు పెన్ లేదా పెన్సిల్ మాత్రమే ఉపయోగించి రాసేవారు. ఆ తరువాత క్రియేటివిటీలో భాగంగా రూలర్, కలర్ పెన్స్, స్టిక్కర్స్, స్టెన్సిల్స్, వాషి టేప్... మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు. ఇండెక్స్ (విషయసూచిక), ర్యాపిడ్ ల్యాగింగ్ (సింబల్స్ ఉపయోగించడం), లాగ్స్ (టు–డూ లిస్ట్), కలెక్షన్స్ (కంటెంట్ ఇన్ఫర్మేషన్), మైగ్రేషన్(న్యూ లిస్ట్) అనే కీలకమైన టూల్స్ దీనిలో ఉంటాయి. షెడ్యూలింగ్, టు–డూ లిస్ట్‌కు మాత్రమే పరిమితమై ఉంటే బుల్లెట్ జర్నల్‌కు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఇదేమీ డైరీ కాదు ఒకవిధంగా చెప్పాలంటే మన మనసులోని భావాలు, బాధలు, సంతోషాలు, సంక్షోభాలను అక్షరాల రూపం లో కాగితంపై పెట్టడం. అలా అని ఇదేమీ డైరీ కాదు. పొడవాటి వాక్యాలేవీ ఉండవు. ఉదాహరణకు మై గోల్స్. డైరీలో అయితే పెద్ద పెద్ద వాక్యాలు రాసుకుంటారు. అయితే బుల్లెట్ జర్నల్ పేజీలో మాత్రం ‘మై గోల్స్’ అని పెద్ద అక్షరాలతో కలర్ పెన్సిల్స్ లేదా స్కెచ్‌లతో రాస్తారు. ‘మార్నింగ్ రొటీన్ ఫర్ ఎవ్రీ డే’ అని పెద్ద అక్షరాలతో డిజైన్ చేసి బాక్స్‌లు, వృత్తాలలో దీనికి సంబంధించిన పాయింట్స్ రాస్తారు. కొందరు బొమ్మలు గీస్తారు. ఉదయాన్నే లేవాలి అనేదానికి సింబల్‌గా అలారమ్ బొమ్మ గీస్తారు. బొమ్మలు గీయలేని వారు స్టిక్కర్స్ అంటిస్తారు. ‘ఇలా మాత్రమే’ అనే రూల్ లేదు. ఒక్కొక్కరి సృజనాత్మకత ప్రకారం అది కొత్త రూపాల్లో కనిపిస్తుంది. ‘మీడియం ఫర్ మెడిటేషన్’గా కూడా పేరు తెచ్చుకుంది బుల్లెట్ జర్నల్. మనసు బాగోలేకపోతే, మానసిక ప్రశాంతత కోసం దీన్ని ఆశ్రయిస్తుంటారు. రైడర్ కరోల్ అలా కొందరి విషయంలో ఇది ట్రబుల్ షూటర్. ఒక సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాలు ఆలోచించే క్రమంలో బుల్లెట్ జర్నల్ను వాడుకొని వృత్తాలు, బాక్స్‌లు, బొమ్మల రూపంలో ఐడియాలు రాసుకోవడం. న్యూయార్క్‌కు చెందిన రైడర్ కరోల్ డెవలప్ చేసిన మెథడ్ ఇది. కరోల్‌కు ఏకాగ్రత లోపానికి సంబంధించిన సమస్యలు ఉండేవి. దీంతో చదువు దెబ్బతినేది. ఈ నేపథ్యంలో ‘బుల్లెట్ జర్నల్’ మెథడ్‌కు రూపకల్పన చేసి మంచి ఫలితాలు సాధించాడు కరోల్. తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అనూహ్యమైన స్పందన లభించింది. ఆ తరువాత క్లిక్స్టారర్ (గ్లోబల్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్) ఫండింగ్‌తో ‘బుల్లెట్ జర్నల్’కు సంబంధించిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టాడు కరోల్. ‘ది బుల్లెట్ మెథడ్’ పేరుతో పుస్తకం రాస్తే మంచి ఆదరణ పొందింది. ‘మొదట్లో గందరగోళంగా అనిపించేది. ఆ తరువాత మాత్రం దీనికి బాగా అలవాటు పడిపోయాను. బుజో కల్చర్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆదరణ పొందిందో తెలిసి వచ్చింది’ అంటుంది దిల్లీకి చెందిన అంజలి. లాక్డౌన్ టైమ్‌లో మన యూత్‌కు బాగా దగ్గరైన యాక్టివిటీ ఇది. ‘చదువు, హాబీ, వ్యాయామం, భవిషత్ లక్ష్యం... ఇలా స్టూడెంట్ జీవితంలో రకరకాల విభాగాలు ఉంటాయి. అయితే రోజువారీ హడావిడిలో కొన్ని నిర్లక్ష్యానికి గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైన సమన్వయానికి బుజో కల్చర్ ఉపయోగపడుతుంది’ అంటుంది పుణెకు చెందిన 22 సంవత్సరాల ప్రియరాగ. ‘ఆర్గనైజేషన్, టైమ్ మేనేజ్మెంట్కు మాత్రమే కాదు మూడ్, ఫీలింగ్స్, ఎనర్జీ లెవెల్స్ మానిటర్‌లా కూడా ఉపయోగపడుతుంది’ అంటుంది ప్రియరాగ స్నేహితురాలు హనీ. గతాన్ని ట్రాక్ చేసి, వర్తమానాన్ని ఆర్గనైజ్ చేసి, భవిష్యత్‌ను ప్లాన్ చేసే మెథడ్‌గా పేరున్న ‘బుల్లెట్ జర్నలింగ్’ కోసం రకరకాల డిజిటల్ యాప్స్ కూడా వచ్చాయి. బుజో కల్చర్‌కు ఆన్లైన్ కమ్యూనిటీ డిఫరెంట్ స్టైల్స్‌ను జత చేసినప్పటికీ ‘పెన్ను, పేపర్ వాడితే ఆ మజాయే వేరబ్బా’ అనే వాళ్లే ఎక్కువ! చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. CWS: డ్రైవర్ బబ్లూ.. అమెరికా డాక్టర్ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు? -
రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్ పాటిస్తే చాలు!
బాలానగర్/హైదరాబాద్: అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. అక్షరాలను ముత్యాల్లాగా రాసేవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష ఏదైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత ఓ ఆయుధం అని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. విద్యార్థులకు రాతతో పాటు పరీక్ష రాసే విధానంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. పాటించాల్సిన మెలకువలు... చదవండి👉🏻 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన ► ప్రశ్నకు జవాబు రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. విద్యార్థులు రాసే సమాధానాలు ఉపాధ్యాయుడికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. ► జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్ల వరకు మించి రాయకూడదు. ► మెదటి లైను రాసే సమయంలో మార్జిన్ చేస్తూ సమాంతరంగా రాయకపోతే మిగతా లైన్లు క్రమపద్ధతిలో రావు. ► వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఒక అక్షరం ఒక వరుసలో వచ్చి మిగిలిన అక్షరాలు మరో వరుసలో రాయకూడదు. అలా రాస్తే పరీక్ష పత్రాన్ని దిద్దేవారికి పూర్తి పదం త్వరగా అర్ధం కాకపోవచ్చు. ► అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్ధం చేసుకోలేక మార్కులు వేయకపొవచ్చు. ► సైన్స్ (సామాన్య శాస్త్రం)లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ► కొన్ని పాఠశాల్లో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. అటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల కాగితాలపై సాధన చేయాలి. ► జవాబు పత్రం పైభాగంలో అంగుళం స్థలం వదలాలి. ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. కుడివైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి. ► గణితంకు సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి. ► వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. జవాబులు రాయడం మెదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకు సమాంతరంగా రాయాలి. అక్షరాలు పైకి లేదా కిందికి రాయకూడదు. ఒక వరుస ఎలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలానే రావడంతో పాటు జవాబు పత్రం కూడా చూడ ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. పదం పదం మధ్యలో తగిన ఖాళీ ఉండాలి. చదవండి👉 మనీషా సాబూ ఉన్నత పదవి ఉపాధ్యాయుడి సూచనతో చదువు, చేతి రాతపై దృష్టి సారించా.. అక్షరాలు నీటిగా రాస్తే మీ చేతిరాత మార్కులను తెచ్చిపెడుతుందని మా ఉపాధ్యాయులు శ్రీశైలం అంటూండే వారు. ఆయన మాటలు నమ్మిన నేను పదో తరగతిలో కాస్లు ప్రారంభం నుంచే చేతిరాత మీద దృష్టి సారించా. ప్రతి రోజు హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఒక్కో పేపర్ చొప్పున రాస్తుండే వాడిని. ఇప్పుడు నా చేతి రాత నాకే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది వరకు నాకే అర్థమయ్యేది కాదు. నా రాతను చూసి మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచిగా చదవడంతో పాటు నా చేతి రాతతో మంచి మార్కులు సాధిస్తా. – రవిశంకర్, విద్యార్థి, బాలానగర్ చేతి రాతతోనే ఎన్నో అంశాలు గుర్తుండిపోతాయి ఎవరైనా ఏదైనా అంశాన్ని పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే చాలు గుర్తుండిపోతుంది. అందుకే నేను ప్రతి రోజూ చేతి రాతను ప్రాక్టీస్ చేస్తున్నా. ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి. అంతే కాకుండా వేగంగా రాయడం అలవాటైంది. మా ఉపాధ్యాయులు నా కృషికి తగ్గ విధంగా గతంలో కంటే ఇప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు. నా చేతి రాత బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. – గౌతమి, బాలానగర్ చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే.. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు అందమైన చేతి రాత కూడా ముఖ్యమే. అందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు పాటించాలి. చేతి రాతే భవిష్యత్‌లో ప్రభావం చూపుతుంది. మంచి మార్కులు రావటానికి దోహదపడుతుంది. అందుకే నేను నా విద్యార్థులకు ముందుగా చదువుకంటే మీరు పరీక్షల్లో రాసే జవాబులు అర్థమయినప్పుడే ఉపాధ్యాయులకు మన మీద మంచి భావం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చేతి రాతను మంచిగా నేర్చుకొనేందుకు చేయూత అందిస్తున్నా. – ఎం.శ్రీశైలం, చేతి రాత నిపుణులు, బాలానగర్ -
ముసలోడు మామూలోడు కాదు.. ఆ చీటీలో ఏం రాశాడంటే..
2021, మార్చి 18 ఇంగ్లాండ్, హ్యాస్టింగ్స్లోని సేయింట్ లియోనార్డ్స్కు చెందిన 67 ఏళ్ల అలన్ స్టాటరీ ఈస్ట్బోర్న్లోని ఓ బ్యాంకులోకి ప్రవేశించాడు. నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతడి చేతిలో ఓ చీటీ పెట్టాడు. రెండు ప్యాంట్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఆ చీటీని చదవటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు క్యాషియర్. అందులో ఏముందో అర్థంకాక దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు. ఆ క్యాషియర్ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు స్లాటరీ. కొద్దిసేపటి తర్వాత ఆ చీటి బిల్డింగ్ సిబ్బంది ఒకరి దగ్గరకు చేరింది. దాన్ని చదివిన ఆ సిబ్బంది ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా స్లాటరీ కోసం అన్వేషణ ప్రారంభించారు. 2021, మార్చి 26 స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచీకి వెళ్లాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మునుపటి లాగే ఓ చీటీ అతడి చేతిలో పెట్టాడు. అది చదివిన క్యాషియర్ భయపడిపోయాడు. వెంటనే 2,400 స్టెర్లింగ్ పౌండ్లు(దాదాపు రెండున్నర లక్షలు) అతడి చేతిలో పెట్టాడు. ముసలాయన డబ్బుతో బ్యాంకు బయటకు వచ్చాడు. కొన్ని గంటల తర్వాత నాట్వెస్ట్లోని మరో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కూడా ఓ చీటీని క్యాషియర్ చేతిలో పెట్టాడు. చీటీని చదివిన సదరు క్యాషియర్ స్లాటరీపై సీరియస్ అవ్వటంతో చేసేదేమీ లేక అక్కడినుంచి బయటకు వచ్చేశాడు. ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన స్లాటరీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. స్టాటరీని అతడి ఇంటివద్ద అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆ చీటిలో ఏముందంటే.. ‘‘ నా దగ్గర ఉన్న దాన్ని(పిస్టల్‌ను ఉద్దేశిస్తూ) మీ సీసీ కెమెరాలు బంధించక మానవు. మిగిలిన కస్టమర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించు. మర్యాదగా నేనడిగిన డబ్బు(10s.. 20s) ఇవ్వు’’ అని రాసి ఉంది. -
చేతిరాతను బట్టి వారి సైకాలజీ..
కోల్‌సిటీ(రామగుండం): ‘అక్షరం మీద పట్టు.. జీవితానికి తొలిమెట్టు. చేతిరాతను బట్టి వారి సైకాలజీ తెలుసుకోవచ్చు’ అంటున్నారు గ్రాఫాలజిస్టులు. చిన్నప్పటి నుంచే పిల్లలు ముత్యాల్లాంటి అక్షరాలు రాయాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. లాక్డౌన్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతిరాత మార్చడానికి ప్రత్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది జనవరి 23న ‘నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే’ జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. అందుబాటులో హ్యాండ్ రైటింగ్ బుక్స్.. ముత్యాల్లాంటి అక్షరాలు రాయడానికి మార్కెట్లో బోలెడు బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు హ్యాండ్ రైటింగ్‌లో నైపుణ్యం పొందేందుకు ఈ బుక్స్ దోహదపడుతున్నాయి. హ్యాండ్ రైటింగ్ మారడానికి హోంవర్స్ చేయాల్సిందే. చేతిరాతే గీటురాయి.. విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి, తోటివారిలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి చేతిరాతే గీటురాయి. మార్కులపై చేతిరాత ప్రభావం ఉంటుందని ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైందని నిపుణులు చెప్తున్నారు. ముత్యాలాంటి చేతిరాతను పేపర్ దిద్దేవాళ్లకు సులువుగా అర్థం అవుతుంది. దీంతో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చేతిరాత మార్పు కోసం ప్రత్యేకంగా సమ్మర్ కోచింగ్‌లు వెలుస్తుండటం విశేషం. 11 రోజుల్లో ముత్యాల్లాంటి అక్షరాలు చేతిరాత(గ్రాఫాలజీ)పై నేడు ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఐదేళ్ల నుంచి 55 ఏళ్ల వయసు వారు కూడా చేతిరాత నేర్చుకోవచ్చు. ప్రతీ ఏడాది వేసవి సెలవుల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే 11 రోజుల్లో నేర్చుకోవచ్చు. అక్షర్ హ్యాండ్ రైటింగ్ మోటివేషన్ అకాడమీ అనే సంస్థను స్థాపించి పదేళ్లుగా చేతిరాతపై శిక్షణ ఇస్తున్నాను. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రల్లో కూడా చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న. – ఎండీ.మెరాజ్ అహ్మద్, చేతిరాత నిపుణులు–గోదావరిఖని -
చేతిరాత.. భవిష్యత్‌కు బాట
ముత్యాల్లాంటి అక్షరాలు... మూల్యాంకనం చేసేవారిని ఆకర్షిస్తాయి. అధిక మార్కులు వేసేలా ప్రేరేపిస్తాయి. ప్రతీ విద్యార్థి చేతిరాతను మార్చుకోవాలి... భవిష్యత్‌ను బాగుచేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. అందంగా.. అర్థమయ్యేలా.. సరైన జవాబులు రాస్తే పదో తరగతిలో పదికిపది పాయింట్లు సాధన సులభమని చెబుతున్నారు. చేతిరాతతో జీవితాన్ని మార్చుకోవాలని బోధిస్తున్నారు. విజయనగరం, గరుగుబిల్లి: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా చదువుపైనే. చేతిరాతపై దృష్టిపెట్టేవారు కొంతమంది మాత్రమే. పరీక్షలలో సమాధానాలు ఉన్నది ఉన్నట్లు రాసినా.... దస్తూరితో ఎంత బాగా రాశామన్నదే ముఖ్యం. ఏమి రాసామన్నది పేపర్ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడుకి అర్ధమైతే ఎక్కువ మార్కులు వేసేందుకు అవకాశం ఉంటుందన్నది విద్యావేత్తల భావన. దస్తూరికి ప్రాధ్యానం.. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దస్తూరీపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉదయం, సాయంత్రం సమయాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు నేర్చుకున్న అంశాలను రెండున్నర గంటలలో కాగితంపై స్పష్టంగా... ఎలాంటి కొట్టివేతలు చేయకుండా ముత్యాలాంటి అక్షరాలతో 150 నిమిషాలలో 50 మార్కులకు జవాబులు రాసేలా తీర్చిదిద్దుతున్నారు. సాధనతో ఫలితం... ఇప్పటివరకు సరిగా రాయకపోయినా ఒక్కసారిగా రాత మార్చుకోవాలంటే నిత్యం సాధన చేయాల్సిందే. తొమ్మిదో తరగతి వరకు దస్తూరి ఎలావున్నా పదో తరగతి ప్రారంభం నుంచి దృష్టిసారిస్తే మంచి ఫలితం ఉంటుంది. నిత్యం నాలుగైదు పేజీలు రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ, సబ్జెక్టులపై ఇదే విధానం అమలు చేయాలి. సబ్జెక్టులు చదువుతూ రాయడం వల్ల జవాబులు బాగా గుర్తుండడంతో పాటు అక్షరాలు అందంగా రాయడం అలవాటు అవుతుంది. ఇవి పాటించాలి... ♦ సమాధాన పత్రంలో రాసే జవాబులు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు పూర్తిస్థాయి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి. ♦ సామాన్య, భౌతిక శాస్త్రాలలో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును ఒత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక భాగం పాడవుతుంది. ♦ పేజీలలో వాక్యాలు పై నుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుసలో ఉండాలి. ♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లు మించి రాయకూడదు. ♦ రోజు కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చు. ♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే, రాసే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు గుండ్రంగా ఉంటాయి. ♦ జవాబు రాసేటప్పుడు అట్టపైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకు కూర్చుని రాయడం మంచిది. ♦ అక్షరాలు, పదాలు వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉంచాలి. అందమైన చేతిరాతతో అధిక మార్కులు ముత్యాల్యాంటి అక్షరాలతో మార్కులకు ఢోకా ఉండదు. చేతిరాత మెరుగు పరిచేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేందుకు మూల్యాంకనదారులు ఇబ్బందులు పడేలా దస్తూరీ ఉంటే మార్కులు పడవు. తక్కువ రాసినా తప్పులు లేకుండా అందంగా రాయడంవల్ల ఆకట్టుకొని మార్కులు సాధించవచ్చు. – ఎస్.చంద్రశేఖరరావు,హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, నాగూరు చేతిరాతకు ప్రాధాన్యమివ్వాలి శాస్త్ర సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థులకు అదనపు మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అన్నీ పాఠశాలలో ఈ విధానం ద్వారానే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం.– ఎన్.నాగభూషణరావు,ఎంఈఓ, గరుగుబిల్లి -
రాత.. మార్చేను నీ భవిత
సాక్షి, కడప : చక్కటి అక్షరాలు రాతను అందంగా మారుస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. వీటికి తోడు మంచి మార్కులు సాధించి పెడతాయి. గతంలో కేవలం కాపీ రైటింగ్పైనే ఆధారపడి రాతను మెరుగు పరుచుకునేవారు. కానీ నేడు చేతిరాతకు ప్రత్యేక తరగతులు వచ్చాయి. చాలామంది తల్లిదండ్రులు వీటిపైన ఆసక్తి చూపుతున్నారు. వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల్లో జరిగే చేతిరాత తరగతులకు తమ చిన్నారులను పంపుతున్నారు కూడా. ప్రస్తుతం ఇది మరింత విస్తరించి ప్రయివేట్ పాఠశాలలు సైతం చేతిరాతకు వారానికి ఒక తరగతి నిర్వహిస్తున్నారు. నిపుణులు సైతం ప్రత్యేక తరగతులే కాక నిరంతరం చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాలని చెబుతున్నారు.అప్పుడే ఉత్తమ మార్కులు సాధిస్తారని పేర్కొంటున్నారు. – బద్వేలు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరి సాధ్యమే. చదువుతో పాటు చక్కని దస్తూరి చాలా ముఖ్యం. దస్తూరి సరిగా లేకుంటే మార్కులు కూడా తగ్గుతుంటాయి. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని జవాబు పత్రంలో అందంగా రాయడం మరొక ఎత్తు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు దస్తూరిని చక్కదిద్దుకోవడం చాలా అవసరం. ఏడాదంతా కష్టపడి చదివిన అంశాన్ని మూడు గంటల పరీక్ష నిర్ధేశిస్తుంది. ఎంత బాగా చదివామన్నది కాదు ఎంత బాగా రాశామా అన్న దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో విషయ పరిజ్ఞానంతో పాటు దస్తూరి కూడా కీలకమే. రాయడం అనేది కేవలం చదువులో భాగం మాత్రమే కాదు. కర్సివ్ అక్షరాలు రాసే సమయంలో చేతి వేళ్ల కదలికల మీద పట్టు పెరుగుతుంది. దీంతో పని మీద దృష్టి సారిస్తారు. అక్షరాలు రాసే సమయంలో మెదడులోని అనేక భాగాలు చురుగ్గా మారతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇదే విషయం స్టాన్ఫోర్డు యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. రాత మెరుగు ఇలా.. విద్యార్థులు పరీక్షా సమయంలో సమాధానాలు, కలిపిరాతగా, విడివిడిగా ఎలా రాయాలనే అనుమానం వాక్యాలను అనుసంధానం చేయలేకపోతారు. అక్షరాలను కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దవిగా రాస్తే రాత అందంగా ఉండదు. తెల్ల పేపరుపై రాసే సమయంలో ఒక లైన్ పూర్తయిన తరువాత రెండో లైన్‌ను మొదటిదానికి సమాంతరంగానే రాయాలి. అన్ని లైన్ల మధ్య దూరం ఒకేలా ఉండాలి. అక్షరాల మధ్య కొంత ఖాళీ స్థలం వదిలిపెడుతుంటారు. ఇలా రాస్తే అక్షరాలు, పదాలకు మధ్య తేడా కనిపించదు. అంకెలను వాడటంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ‘2’అంకెను ఆంగ్ల ఆక్షరం ‘జెడ్’మాదిరిగా, ‘5’అంకెను ‘ఎస్’మాదిరి రాస్తే మార్కులు కూడా తగ్గుతాయి. అంగ్ల అక్షరాల్లో ఐ, జే, పీలను ఇతర అక్షరాలతో కలిపే సమయంలో జాగ్రత్తగా కలపాలి. తెలుగులో ణ, మ, య అక్షరాలను సరిగా రాయాలి. చేతిరాతలో రకాలు కాలిగ్రఫీ : స్టోక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటాలిక్ ఆక్షరాలను ఈ రకంలో రాస్తారు. రాయడం ఆలస్యం అవుతుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. లూసిడా : సింపుల్‌గా త్వరగా రాయవచ్చు. పిల్లలు సమయం వృథా కాకుండా రాయవచ్చు. ప్రింట్ తరహాలో అందంగా ఉంటుంది. కర్షివ్ : కలిపిరాతను కర్షివ్ రైటింగ్ అంటారు. ఒక అక్షరం పక్క అక్షరానికి కలిపి రాయడం. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో వినియోగిస్తుంటారు. నార్మల్ : సంప్రదాయ రాత. ఇందులో ఎత్తు, లావు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాయడం. వీటిని కొంతమేర స్టోక్స్ జత చేస్తే అందంగా కనిపించేలా చూడవచ్చు. పిల్లలకు ఎక్కువగా ఇదే నేరి్పస్తుంటారు. -
రెండు చేతులతో ఒకేసారి..
శ్రీనగర్‌కాలనీ: విద్యార్థులకు రెండు చేతులతో రాయగలిగే స్కిల్ నేర్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసం, మెదడు పనితీరు మరింత మెరుగవుతుందని క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ రామలింగం తెలిపారు. మంగళవారం వెంకటగిరిలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు రెండు చేతులతో రాసే విధానం(డ్యూయల్ హ్యాండ్ రైటింగ్) ట్రైనింగ్ నిర్వహించారు. విద్యార్థులు రెండు చేతులతో చేతిరాతను రాసి తమ మెదడుకు పని చెప్పారు. ఈ విధానం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి చదువుతో పాటు అన్ని పనుల్లో యాక్టివ్‌గా ఉంటారని రామలింగం తెలిపారు. విద్యార్థులకు మా స్కూల్స్ బ్రాంచ్‌లలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలను విసృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
చేతుల్లేని చిన్నారి.. చేతిరాతలో ఛాంపియన్!
మేరీల్యాండ్ : చేతులు సక్రమంగా ఉన్నా.. అందమైన చేతి రాతను సొంతం చేసుకోవడమనేది గగనమే. అలాంటిది ఆ చిన్నారికి పుట్టుక నుంచి చేతులు లేవు. కానీ, చేతి రాతలో మాత్రం ఆమెది అందేవేసిన ‘చేయి’. సారా హినెస్లే అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల అమెరికాలో జరిగిన జాతీయ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం చేతి రాతే కాదు.. ఈ చిన్నారి అందమైన పెయింటింగులు, చిత్రలేఖనాలు, శిల్పాలను కూడా తయారు చేయగలదు. ఇటీవల ఆమె ఇంగ్లీషులో కర్సీవ్ రైటింగ్ కూడా నేర్చుకుంది. సారా ఫ్రెడెరిక్‌లో సెయింట్ జాన్స్ రీజనల్ క్యాథలిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. చేతులు లేకపోవడం వల్ల రెండు చేతుల మణికట్టుతో పెన్సిల్ పట్టుకుని రాస్తోంది. సారా కుటుంబం 2015లో చైనా నుంచి అమెరికాకు వలస వచ్చారు. దీంతో ఆమెకు మొదట్లో ఇంగ్లీషు వచ్చేది కాదు. అయితే సారా పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా చేతి రాతలో కూడా ప్రావీణ్యం సాధించడం విశేషం. ఈ పోటీలో విజయం సాధించినందుకు సారాకు రూ.35 వేలు నగదు బహుమతి లభించనుంది. –సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
ముచ్చటైన మార్కులకు..ముత్యాల అక్షరాలు
సాక్షి, అచ్చంపేట/పిడుగురాళ్లటౌన్: ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ప్రతిది కీబోర్డుల పైనే ఆధారపడుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒకప్పుడు టెస్ట్‌బుక్ మొత్తం తిరగేసి ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని తరచూ వాటిని మననం చేసుకునేవారు. దానివల్ల చేతి రాత పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. కాని ఇప్పుడు కావలసిన ప్రశ్నను సూటికా గుగుల్ సర్చ్ చేసి, ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం తెలుసుకోవడం, దానిని సేవ్ చేసుకుని అవసరమైనపుడు ఉనియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల చేతికి పని తగ్గిపోతుంది. స్పష్టం రాయగలిగేవారు కూడా అప్పుడప్పుడు మాత్రమే రాయడం వల్ల స్పష్టతను కోల్పోతున్నారు. ఈ ప్రభావం పబ్లిక్ పరీక్షలో విద్యార్థులపై పడి బాగా చదివినా ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. బాగా చదివాం, చదివిన ప్రశ్నలే వచ్చాయి, బాగానే రాశాం, కాని మార్కులు రాలేదని తెగ బాధపడిపోతారు. కారణం తెలుసుకునేందుకు రీవాల్యూషన్ పెట్టుకుని, చేతి రాత సక్రమంగా లేకపోవడం, మనం రాసినవి మనకే అర్థంకాకపోవడం వల్లనేనని అప్పుడు తెలుసుకుంటాం. మార్కులు ఎందకు తక్కువ వచ్చాయో.. అప్పుడు చింతించిన ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ముందుగా కష్టపడి చదవడం ఎంతముఖ్యమో.. చదివిన విషయాన్ని స్పష్టంగా రాయడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చేతి రాత మార్చుకోవాలన్నా, అక్షరాలు గుండ్రంగా, సష్టంగా ఉండాలన్నా సాధన చేయాలి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో రాత బాగుండాలంటే అచ్చు అక్షరాలను సవ్వదిశలో కూర్చుని అనుసరించి రాయడం అలవరుచుకోవాలి. ఎలాబడితే అలా కూర్చోవడం, పడుకుని రాయడం వల్ల చేతి రాత ఎంత మాత్రం మారదు. చదివిన ప్రతి ప్రశ్నను రాయడం చేర్చుకోవాలి. అలా చేయడం వల్ల రాత సక్రమంగా, స్పష్టంగా రావడమే కాకుండా చదివిన సమాధానాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశాలుంటాయి. ఏ భాషనైనా రాసేటపుడు పదానికి పదానికి మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. అన్ని పదాలు కలిపి రాయడం వల్ల సమాధానాలు దిద్దేవారికి అర్థమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా చూచుకోవాలి, వత్తులు, పల్లులు, కొమ్ములు, దీర్ఘాలు ఎక్కడ ఎలా రాయాలో ఖచ్చితంగా పాటించాలి. ఇంగ్లిషు కలిపి రాత రాసే టప్పుడు కూడా ఖచ్చితత్వం పాటించాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకువెళ్లాలి. అలా చేయడం వల్ల మనకు ప్యాడ్‌పై రాసే అలవాటను ముందు నుంచే అలవరచుకునే వెసులుబాటు ఉంటుంది. అదికాక ఎగ్జామ్ హాలులో ఉండే డస్క్లపై రాయడం ఇబ్బందికరంగా ఉండవచ్చు. రాత రాసేటపుడు కూర్చునే భంగిమ, పెన్ను పట్టుకునే విధానం, పేపర్‌పై రాసే విధానం ఎప్పుడు ఒకే విధంగా ఉండేలా చూచుకోవడం మంచిది. ‘పది’లో పట్టుకు ప్రణాళిక అవసరం గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే చాలామంది పిల్లల్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే ముందు నుంచే ప్రణాళిక అవసరం. అలా చేస్తే అమ్మో పాసవుతామో లేదో అన్న భయం వారిలో పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ పిల్లలకు డీ–గ్రేడ్ వచ్చిందంటే వారిని తామున్నామంటూ ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అలా చాలా పాఠశాలల్లో పిల్లల్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నారు. ఆ వివరాలను గుడివాడ డీవైఈవో ఎం.కమలకుమారి వెల్లడించారు. టెన్త్‌లో ఉత్తీర్ణతకు నియమాలిలా.. విద్యా సంవత్సరంలో విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూసుకోవటం. ఉపాధ్యాయులు తమ అనుభవంతో తయారు చేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఇవ్వాలి. వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయాలి. స్టడీ అవర్స్ ప్రారంభించాలి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ఉండాలి. మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం కోసం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలి. మానసిక ప్రశాంతత కోసం ఫస్ట్ ఫిరియడ్లోనే యోగ తరగతుల నిర్వహించాలి. విద్యార్థుల ఉత్తీర్ణతపై తల్లిదండ్రులతో ప్రతినెలా జరిగే సమావేశంలో చర్చలు జరపాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి కనబరిచే విధంగా శిక్షణ ఇవ్వాలి. కంప్యూటర్లో బేస్డ్ నాలెడ్జ్ నుంచే తర్ఫీదు ఇవ్వాలి. పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం క్వార్టర్లీ, ఆఫర్లీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, జవాబులపై ముఖ్యమైన వాటిని విద్యార్థులకు తెలియజేయాలి. సబ్జెక్ట్ కార్నర్ పేరుతో ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్‌లో అంశాలను క్లాసులోని పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ముందు నుంచే డీ గ్రేడ్ విద్యార్థునులను గుర్తించాలి. వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదివించాలి. హాజరు శాతం కూడా 90 ఉండాలి. శెలవు పెట్టాలంటే విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో చెప్పకపోతే అనుమతి ఇవ్వకూడదు. - డీవైఈవో కమలకుమారి అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి కొంత మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కాకుండా అలానే ఉండే మరో ప్రశ్నకు సమాధానాలు రాస్తూ ఉంటారు. అదే ప్రశ్న రాస్తున్నామా లేదా అనే ఆందోళనతో రాస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అక్షరాలు సక్రమంగా రాయలేరు. రాసిన సమాధానంలో స్పష్టత ఉండదు. అక్షర దోషాలు కూడా ఎక్కువగా దొర్లుతాయి. ఫలితంగా ఆశించిన మార్కులను కోల్పోవలసి వస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ముందునుంచే చేతి రాతపై దృష్టిపెట్టాలి. – టి.బాలశౌర్రెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లచెరువు చేతి రాత కీలకం విద్యార్థులు చదవడంతో పాటు బాగా రాయడం కూడా ముందునుంచే సాధన చేయాలి.మనం రాసే అక్షరాలు స్పష్టంగా, గుడ్రంగా అందంగా ఉంటే మన సమాధానం పత్రం దిద్దే ఉపాధ్యాయుడు మరికొన్ని మార్కులను అదనంగా రాసే అవకాశంం ఉంటుంది. పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలంటే చేతి రాత కీలకం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. – వి.రాజశేఖర్, ఎంఈవో, అచ్చంపేట మండలం నిబంధనలు పాటిస్తే మేలు జవాబులు రాసే విధానంలో దిద్దుబాట్లు లేకుండా జాగ్రత్తపడాలి. వ్యాసరూప ప్రశ్నలకు పాయింట్లవారిగా సమాధానాలు రాస్తూ మధ్యలో ఉపశీర్షికలు ఇవ్వాలి. పదాల మధ్య స్పేస్, కామా, పుల్‌స్టాప్ ఇవ్వటం మూలంగా వాక్యాలు అందంగా కనిపిస్తాయి. బిగ్ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు కొట్టి వేతలు ఉండకూడదు. ప్రశ్నలపై సందేహాలుంటే ఇన్విజిలేటర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి. –బి.మల్లికార్జునశర్మ, ఎంఈవో, పిడుగురాళ్ల -
చక్కని దస్తూరీ.. విజయానికి రహదారి..
తూర్పుగోదావరి, ఐ.పోలవరం (ముమ్మిడివరం): పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా పరీక్షల కోసం చదువుకోవడం పైనే. అయితే పాఠాలను బట్టీ పట్టడానికి పడే కష్టంలో కొంతైనా చేతి రాతను మెరుగు పరుచుకోవడం కోసం పడే వారు చాలా కొద్ది మంది మాత్రమే. పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయడం ఎంత ముఖ్యమో.. ఆ రాసేది చూడముచ్చటగా రాయడమూ అంతే ముఖ్యం. అంటే పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణతకు దస్తూరీ కూడా కీలకమే. గజిబిజిగా ఉండే దస్తూరీతో రాసిన సమాధానం ఎంత సమగ్రమైనదైనా..పేపరును మూ ల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం చేసుకోవ డం కొంత ప్రయాస అవుతుంది. విద్యార్థి రాసింది వారికి ఎంత తక్కువ వ్యవధిలో అర్థమయితే అంత ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ముందు నుంచే సాధన చేయాలి.. ఏడాది పాటు చదివిన పాఠ్యాంశాలను రెండున్నర గంటలలో ఆన్సర్ షీట్‌పై పెట్టాలి. ఎంత బాగా చదివిన విద్యార్థులకైనా పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. కొందరు మొదటి ప్రశ్నకు సమాధానం చక్కగా రాసి తరువాత అందంగా రాయలేకపోతుంటారు. దీనిని అధిగమించాలంటే ముందుగానే దస్తూరీపై సాధన చేస్తే పరీక్షలలో ఇబ్బందులు ఉండవన్నది నిపుణుల సూచన. ఆణిముత్యాల్లాంటి అక్షరాల కోసం కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని మండల విద్యాశాఖాధికారి నక్కా వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఆయన పనిచేసిన టి.కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాలు అందంగా రాయడానికి ముందు నుంచి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇవి పాటించాలి.. ♦ సమాధానపత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు ఒకటికి రెండు మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి. ♦ సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక కనిపిస్తుంది. ♦ పేజీలో వాక్యాలు పైనుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుస క్రమంలో ఉండాలి. ♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లను మించి రాయకూడదు. ♦ రోజూ కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయొచ్చు. ♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. ♦ జవాబు రాసేటప్పుడు ప్యాడ్ పైకి వాలి, పోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయడం మంచిది. ♦ అక్షరాలు పదాలు, వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉండాలి. అదనపు మార్కులు సొంతం అదనపు మార్కులకు చేతి రాత చాలా ముఖ్యం. చేతి రాతను బట్టి విద్యార్థి సామర్థాన్ని అంచనా వేయవచ్చు. పాఠశాల సముదాయ సమావేశాల్లో ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల చేతి రాత బాగుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. – నక్కా వెంకటేశ్వరావు, ఎంఈఓ,ఐ.పోలవరం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే శాస్త్ర, సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థినీ విద్యార్థులకు అదనంగా మార్కులు పొందే అవకాశం ఉంది. మా పాఠశాలలో ఈ విధంగా తర్పీదు ఇస్తున్నాం.– ఎన్.సుబ్రహ్మణ్యం, జెడ్పీ పాఠశాల, మురమళ్ల -
మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసేందుకు శిక్షణ
ఇండోర్: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు సాధారణంగా వారికి తప్ప ఎవరికీ అర్థం కావు. సామాన్య ప్రజలకైతే మరీ కష్టం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీ ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా రాసేందుకు వారికి ఒక సబ్జెక్టు నిపుణునితో చేతిరాతలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అర్థం కాని ప్రిస్క్రిప్షన్ల ద్వారా జూనియర్ డాక్టర్లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ (ఎమ్జీఎమ్) డిగ్రీ, పీజీ వైద్య విద్యార్థులకు ఈమేరకు శిక్షణ ఇవ్వనుంది. ఆదివారం ఎమ్జీఎమ్ డీన్ జ్యోతి బిందాల్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్లు రాయడంలో వారి చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జూనియర్ డాక్టర్లకు ఒక సబ్జెక్టు నిపుణునితో శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా వారు రాసే ప్రిస్క్రిప్షన్లను సులభంగా అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ వీసీ రవిశంకర్ శర్మ మాట్లాడుతూ ‘కొందరు డాక్టర్లు కేవలం 30 సెకన్లలోనే ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ రాయడానికి కనీసం మూడు నిమిషాలైనా తీసుకోవాలి. రోగుల లక్షణాలు, వ్యాధి, మందుల గురించి స్పష్టంగా రాయాలని డాక్టర్లకు సూచించాన’ని ఆయన తెలిపారు. ‘అందరి డాక్టర్ల చేతిరాత అందంగా ఉండకపోవచ్చు. కానీ ప్రిస్క్రిప్షన్లు కనీసం చదవడానికి వీలుండేలా రాయాలి’ అని అన్నారు. అర్థం కాకుండా రాయడం వల్ల రోగులు మందులు కొనుగోలు చేసేటపుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని సంఘటనల్లో డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక మెడికల్ ఇన్సూరెన్స్ పొందడంలో రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాగా, అస్పష్టమైన ప్రిస్క్రిప్షన్ల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాక్టర్లకు కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది. మందుల పేర్లను పెద్ద అక్షరాలతోనే స్పష్టంగా రాయాలని పేర్కొంది. -
తల రాత మార్చే చేతి రాత
దుబ్బాక : అందమైన చేతి రాత విద్యార్థుల క్రమశిక్షణకు గీటురాయిగా నిలుస్తుందని, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని గాయత్రీ విద్యాలయం విద్యార్థులకు చేతిరాతపై అవగాహన కల్పించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో చేతి రాత ప్రాధాన్యం.. సులువుగా నేర్చుకునే మెలకువలను నేర్పారు. గజిబిజి రాత బాగుపడేలా విద్యార్థులకు దిశా నిర్ధేశం చేశారు. తరగతి గదిలో డల్‌గా ఉండే విద్యార్థులకు చేతిరాతపై అభిరుచిని చూపిస్తే తనకు తానే ఉత్తమ విద్యార్థిగా మారడం ఖాయమన్నారు. అందమైన చేతిరాతతో విద్యార్థుల తల రాత మారడమే కాకుండా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. చేతిరాత బాగున్న విద్యార్థుల్లో ఓపిక, సహనం పెరుగుతాయని, విద్యార్థినులు మెహందీ, ముగ్గుల డిజైన్లు వేయడంలో నిష్ణాతులవుతారని పేర్కొన్నారు. అక్షరాలను దిద్దించే ప్రయత్నం చేయకపోవడంతో రాత మొక్కుబడిగా మారుతోందన్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులను అక్షర శిల్పులుగా తీర్చిదిద్దే సాధనానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఇంత సులువుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీలో రాయవచ్చా అని విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
11 మంది మరణం: అతడే సూత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చేధించారు ఢిల్లీ పోలీసులు. మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్‌లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు తెలిపారు. ఎవరీ లలితభాటియా... నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45). తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కూడా ఇతనే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు ‘కనిపించినప్పటి నుంచి’. కనిపించడం ఏంటంటే లలిత్ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు భాటియా. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. మోక్షం పొందాలనే కోరికతో... మంత్ర, తంత్రాలపై ఉన్న మూఢనమ్మకంతోనే ఇలా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. మొదటి నుంచి అందరిలోనూ రేకెత్తిన అనుమానాలకు పేపర్లలో ఉన్నచేతి రాతలను గుర్తించడం ద్వారా సమాధానం దొరికిందని పోలీసులు చెప్పారు. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలే కుటుంబ సభ్యులందరిని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలు... 11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చాయి. ఉరితీత వల్ల వారి మరణాలు సంభవించినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని నివేదికలు పేర్కొన్నాయి. మృతుల నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. ఇంతమంది మృతదేహాలను రాజస్థాన్‌లోని స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం కష్టం కనుక ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని వారు నిర్ణయించారు. -
మీ రాతలో మీరు
చేతిరాత కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. కావాలంటే మీరు సెల్ఫ్‌చెక్ చేసుకోండి. మీ చేతిరాత బట్టి మీరేమిటో స్వయంగా తెలుసు కోండి. ఇది సరదాగానే కానీ నిజాయితీగా సమా ధానాలు ఇవ్వడం కూడా ముఖ్యమే. ముందుగా మీ స్వదస్తూరీతో రాసిన దానిని ఎదురుగా ఉంచు కోవడం మరువకండి. 1. మీ చేతిరాత ఇలా ఉంటుంది ఎ) వాలుగా.. బి) నిటారుగా.. సి) ఎడమవైపు వొంపుగా.. 2. మీ రాతలో అక్షరాలు.. ఎ) గొలుసుకట్టు బి) పదాలు విడిగా.. సి) పొడి అక్షరాలు 3. వాక్యాలు ఎంత దగ్గరగా ఉంటాయి ఎ) దూరంగా.. బి) పొందికగా.. సి) మరీ దగ్గరగా.. 4. మీరు రాసినప్పుడు వాక్యాలు పేజీలో ఏ దిశగా ఉంటాయి? ఎ) కింద నుంచి పై భాగానికి.. బి) తిన్నగా గీత గీసినట్టు.. సి) ఏటవాలుగా.. 5. మొత్తంగా మీ దస్తూరీని చూస్తే ఎలా కనిపిస్తుంది? ఎ) అందంగా.. పొందికగా.. బి) స్పష్టంగా.. పొడిపొడిగా సి) భారంగా.. సంక్లిష్టంగా.. మీరిచ్చే సమాధానాలు బట్టి మీ చేతిరాతను ఇలా విశ్లేషించుకోవచ్చు. 1. అక్షరాలు ఎడమవైపు వాలుగా ఉంటే మీరు బిడియస్తులు. తిన్నగా ఉంటే ఎదుటివారిని ఆకట్టుకునే తత్త్వం ఉన్నవారు. అక్షరాలు కుడి వైపు వాలుగా ఉంటే గట్టి స్వభావం, సొంత నిర్ణయాల మీద ఆధారపడేవారు. 2. గొలుసుకట్టు రాత అయితే మీరు మంచి మాటకారి. విడి పదాలుగా రాస్తే మీరు బిడియస్తులు. పొడి అక్షరాలయితే మీరు తెలివిగా, స్పష్టంగా వ్యవహరించే స్వభాగం గలవారు. 3. వాక్యాల మధ్య దూరం ఎక్కువయితే మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. పొందికగా రాసేవారయితే డబ్బు దుబారా చేసేవారు, ఎక్కువ మాట్లాడేవారు. బాగా దగ్గరగా రాస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్గా వ్యవహరిస్తారు. 4. వాక్యాలు కింది నుంచి పైకి వెళ్తుంటే మీరు చాలా ఎనర్జిటిక్‌గా, ఆశావాదిగా, స్పష్టమైన అవగాహన ఉన్నవారిగా భావించవచ్చు. వాక్యాలు తిన్నగా రాస్తే మీరు ఒత్తిడికి లోనవుతుండవచ్చు. కింది వైపు వాలుగా ఉంటే మీరు దృఢచిత్తం గలవారిగా, ఒంటరితనాన్ని ఇష్టపడే వారిగా పరిగణించవచ్చు. 5. మీ దస్తూరీ పొందికగా ఉంటే మీరు సున్నిత స్వభావులని, మొహమాటస్తులని, ఆధ్యాత్మిక భావనలు గలవారిగా భావించ వచ్చు. స్పష్టంగా రాసేవారయితే పట్టుదల, దృఢచిత్తం గలవారవుతారు. రాత భారీగా కనిపిస్తుంటే, మీరు ఎనర్జిటిక్‌గా, చలాకీగా, ఏ పరిస్థితులకయినా ఇమిడిపోయే తత్త్వం గలవారిగా పరిగ ణించవచ్చు. -
ఏ హ్యాండయినా ఓకే..!
సాక్షి : ప్రపంచ వ్యాప్తంగా రెండు చేతులతో రాయగలిగే వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ ఒక్క శాతంలో చాలామంది మనదేశంలోని ఓగ్రామంలో ఉన్నారంటే నమ్మగలమా? మధ్యప్రదేశ్ సింగ్రాలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోవీపీ శర్మ అనే వ్యక్తి 1999లో వీణా వందిని పాఠశాలను ప్రారంభించాడు. ప్రస్తుతం స్కూలులో సుమారు 300 మంది విద్యార్థులు రెండు చేతులతో రాయగలుగుతున్నారంట! ‘ఒక మేగజైన్లో భారతతొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రెండు చేతులతో రాయగలరని చదివాను. ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని నేనూ అలా రాయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత విద్యార్థులకు రెండు చేతులతో రాయడం శిక్షణ ఇచ్చాను. మూడో తరగతికి వచ్చేసరికల్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు రెండు చేతులతో రాయగలిగేవారు. ఏడు, ఎనిమిదో తరగతులకు వచ్చేసరికి ఎలాంటి తడబాటు లేకుండా వేగంగా రాస్తున్నారు. దీంతోపాటు మా స్కూలువిద్యార్థులకు ఉర్దూతో పాటు పలు భాషలు తెలుసు’అని శర్మ చెప్పుకొచ్చారు. ప్రతి 45 నిమిషాల క్లాసులో 15 నిమిషాలపాటు రెండు చేతులతో రాయడంపై ప్రాక్టీస్ చేయిస్తామని చెప్పారు. వివిధ భాషలు తెలిసిన వారిలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుందని శర్మ విపరీతంగా నమ్ముతారు. అందుకే రెండు చేతులతో రాసే సమయంలో వివిధ భాషల్లో రాయమని విద్యార్థులకు సూచిస్తారు. దీనిద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. కానీ రెండు చేతులతో రాయడం ఎంతో హానికరమని ఇటీవలకొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
చేతిరాత పాస్‌పోర్టులిక చెల్లవు
మర్రిపాలెం (విశాఖపట్నం) : చేతి రాతతో కూడిన పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నాన్ మెషీన్ రీడబుల్ పాస్‌పోర్ట్(ఎంఆర్పీ) కలిగినవారంతా మళ్లీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నేషల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) నిబంధనల ప్రకారం చేతిరాత పాస్‌పోర్ట్‌లను నిషేధించారు. ఈ నిబంధన 2015 నవంబర్ 24 నుంచి అమలులో ఉంది. మన దేశంలో దాదాపు 2.5 ల క్షల మంది చేతిరాత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టులో చేతిరాత, ఫొటోగ్రాఫ్ మాన్యువల్‌గా అతికించి ఉన్నవారు నాన్ మెషిన్ రీడబుల్ కేటగిరిలోకి వస్తారని విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. చేతిరాత పాస్‌పోర్ట్‌తో రాకపోకలు చేస్తే అడ్డంకులు తప్పవని హెచ్చరించారు. దేశంలోని, ఇతర దేశాలలోని వారంతా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. చేతి రాత పాస్పోర్ట్లున్నవారు వాటిని తమ కార్యాలయంలో సమర్పించి మెషిన్ రీడబుల్ పాస్‌పోర్ట్‌లు పొందాలని సూచించారు. www.passportindia.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని తెలిపారు. 1800-258-1800 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
తలరాత మార్చేది చేతిరాతే
చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ జగదేవ్‌పూర్: చేతిరాత విద్యార్థుల తలరాత మారుస్తుందని చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ అన్నారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు చేతిరాతపై గురువారం అవగాహన కల్పించారు. సిద్దిపేటకు చెందిన ఫయాజ్ ఆహ్మద్ విద్యార్థులకు 210 చేతిరాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎజాజ్ ఆహ్మద్ విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చేతిరాతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చేతిరాత బాగుంటే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగడం ఖాయమన్నారు. చదువు ఎంత ముఖ్యమో, రాత కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య, ఎస్ఎంసీ చైర్మన్ తుమ్మ కృష్ణ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు వెంకటయ్య, భిక్షపతి, శ్రీశైలం, ఉపాధ్యాయులు కుమార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
ఇక స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయొచ్చు
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయగలిగే కొత్త టెక్నాలజీని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ సంస్థ కొత్తగా రూపొందించిన ‘హ్యండ్ రైటింగ్ ఇనుపుట్’ యాప్‌తో మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ స్క్రీన్‌పై రాసి మీ కలానికున్న పదునేంటో చూపించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 82భాషలను అనుమతించే ఈ యాప్ మీరు స్క్రీన్‌పై రాయగానే ఆ టెక్ట్స్‌ని స్టాండర్డ్ డిజిటల్ టెక్ట్స్‌గా మారుస్తుంది. దీని ద్వారా చేతి వేళ్లతో కూడా రాసే అవకాశం ఉంది. అక్షరాలతోపాటు ఏదైనా డిజిటల్ ఐకాన్‌ను కూడా టెక్ట్స్‌కు జత చేయవచ్చు. స్క్రీన్‌పై రాసే అవకాశం ఉన్న యాప్‌లలో ఇది కొత్తదేం కాదు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో విండోస్ జర్నల్ అనే యాప్ కూడా హ్యాండ్‌రైటింగ్‌కు ఉద్దేశించిందే. అయితే గూగుల్ వెర్షన్లో క్లౌడ్ సాంకేతికతను కూడా కలిగి ఉండడం విశేషం. వినియోగదారులు స్క్రీన్‌పై రాయగానే అది డిజిటల్ టెక్ట్స్ రూపంలోకి మారడమే కాకుండా, క్లౌడ్ ఫీచర్ ద్వారా వెబ్‌లోకి అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఆపై వెర్షన్లలో మాత్రమే పనిచేసే ఈ యాప్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది. -
చేతిరాతకు పదును పెడదాం
అక్షరాలకు లక్షల రూపాలు. చక్కని చేతిరాత మార్కుల సాధనకే కాదు.. వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు గీటురాయి. అందంగా రాసేవారి మనసు కూడా అందంగా.. సౌమ్యంగా.. ఉంటుందట. ఏ విషయంలోనైనా స్పష్టత కలిగి ఉంటారట. దూకుడు స్వభావం కాకుండా.. శాంతంగా ఆలోచిస్తారట. ఇలా ఎన్నో సుగుణాలు మంచి చేతిరాత నేర్చుకోవడం ద్వారా అలవరచుకోవచ్చని.. ఆ రంగంలోని నిపుణులు, మానసిక విశ్లేషకుల మాట. సాక్షి, విశాఖపట్నం: మన రాత బాగుంటే ఫలితం అదే వస్తుంది. నిజమే కదూ! కాలపరీక్షకు నిలబడి తగిన ఫలితం పొందాలంటే మన చేతి రాత బాగుండాలి. మంచి హ్యాండ్ రైటింగ్ విద్యార్థుల విజయానికి ఎంతో ఉపకరిస్తుంది. ఎంత బాగా చదివితే మాత్రం.. చేతిరాత బాగోలేకపోతే స్టేట్ ర్యాంకు రావాల్సినవారు దాన్ని కోల్పోతారు. కచ్చితంగా పాసవుతామనుకునేవారు కాస్త.. అది మిస్సవుతారు. అలా జగరకుండా ఉండాలంటే.. పరీక్షల సమయానికి ముందునుంచే.. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో చేతిరాతపై దృష్టిపెడితే పరీక్షలు ఎప్పుడొచ్చినా బెంగ ఉండదు. ఈ కొద్ది కాలంలో.. చేతిరాతలో విలువైన.. సులువైన మెలకువలు నేర్చుకుంటే ఫలితంపై ఇక బెంగ అవసరం లేదు. అక్షరాలకు లక్షల రూపాలు అవును.. ఒకే అక్షరాన్ని లక్షలాది రూపాల్లో రాయొచ్చు. అయితే విద్యార్థులకు అవసరమైన రైటింగ్ స్టైల్ కేవలం రెండు రకాలు. ఒకటి కర్సివ్ రైటింగ్.. రెండోది ప్లెయిన్ లేదా ప్రింట్ స్క్రిప్ట్. కర్సివ్ రైటింగ్ యూనివర్సల్ రైటింగ్. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా చేతిరాతకు ప్రాధాన్యం ఎందుకంటే.. అది క్రమశిక్షణకు గీటురాయి లాంటిది. అక్షర స్వరూపమే కాదు.. రాసే తీరులో ఓ రిథమ్ ఉంటుంది. ఎక్కడ గాడి తప్పినా రాత బాగోదు. రాతను బట్టే విద్యార్థి శ్రద్ధాశక్తులను అంచనా వేయొచ్చు. చేతిరాత ఎందుకు బాగోదంటే... చాలామంది విద్యార్థులు బాగా చదువుతారే తప్ప రాతపై దృష్టి పెట్టరు. యూనిట్ టెస్ట్ మొదలు ఫైనల్ పరీక్షల వరకు ఆ పాఠశాల/కళాశాలలో జరిగే పరీక్షల్లో చేతిరాత బాగోపోయినా టీచర్లకు భావం/అర్థం తెలిస్తే చాలు.. మార్కులు వేసేస్తారు. దీం తో అలాంటి విద్యార్థులు చేతి రాతపై పెద్దగా దృష్టి పెట్టరు. చేతిరాత బాగోలేదని మార్కెట్లో దొరికే కాపీ పుస్తకాలు రాస్తారు. కానీ.. గురుముఖఃతా అభ్యాసన ఉండదు కనుక.. పుస్తకంలో రాత ఒకలా ఉంటే.. రాసేతీరు మరోలా ఉంటుంది. నూటికి 30 శాతానికి మించి కాపీ పుస్తకాల ద్వారా రాత మెరుగు పడినవారు అరుదు. పెన్ని గట్టిగా.. దగ్గరగా పట్టుకోవడం. ఒత్తిపెట్టి రాయడం. రాసేటప్పుడు బాగా వంగిపోవడం (పుస్తకానికి దగ్గరగా ముఖం పెట్టడం). చెప్పుకుంటే... ఇవి చాలా చిన్న లోపాలు. వీటి నుంచి బయటపడడానికి వయసు, తరగతిని బట్టి 21 నుంచి 41 గంటల అభ్యాసన (ప్రాక్టీస్) ఉంటే చాలు. ఎవరైనా మంచి చేతిరాత నిపుణుడిని సంప్రదించి ఈ లోపాలను ఇట్టే సరిదిద్దుకోవచ్చు. అదే సమయంలో మంచి మెలకువలు నేర్చుకోవాలి. శిక్షణకు వెళ్లే అవకాశం లేనివారు కింది సూచనల్ని పాటి స్తే కొంతవరకు చేతిరాతను మెరుగుపరచుకోవచ్చు. పెన్ని గట్టిగా పట్టుకోవడం, పుస్తకానికి దగ్గరగా ముఖం ఆనించి రాయడం.. కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. అలానే ఇంగ్లిష్ విషయానికొస్తే.. కర్సివ్ రైటింగ్‌లో ప్రతి అక్షరం 80 శాతం ఉండాలి. అదీ రైట్ స్లాంటింగ్ (కుడివైపు అక్షరాలు వంగి) ఉండాలి. జోన్స కచ్చితంగా పాటించాలి. ప్రాథమికంగా ఈ అక్షరాల స్వరూపం తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి. అదీ రోజుకు రెండు లేదా మూడు గంటలు. ఎవరైనా నేర్చుకోవచ్చు చేతిరాతైనా.. లేదా ఏ విద్య అయినా ముఖ్యంగా విద్యార్థి శ్రద్ధ, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాంటి శ్రద్ధ ఉన్న పిల్లలు మావద్ద కేవలం వారంలో చేతిరాత మెరుగుపరచుకోవచ్చు. సహజంగా ఏడేళ్ల వయసు దాటినవారు.. అంటే సెకెండ్ స్టాండర్డ .. ఆపై తరగతుల నుంచి విద్యార్థులు.. వారి వయసును బట్టి నిర్ణీత సమయంలో చక్కని చేతిరాత నేర్చుకోవచ్చు. 14 ఏళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా 21 రోజుల సాధన అవసరం. టెన్త, ఇంటర్, డిగ్రీ విద్యార్థులైతే వారి శ్రద్ధాశక్తులను బట్టి కేవలం నాలుగు గంటల్లో రైటింగ్‌పై చక్కని అవగాహన ఏర్పరచుకోవచ్చు. అదే 14 ఏళ్లలోపు పిల్లల్లో అంత శ్రద్ధ కానరాకపోవచ్చు. వారికి నెలరోజుల వరకు శిక్షణ అవసరం. టీచర్లు, సివిల్స్ వంటివాటికి ప్రిపేర్ అయ్యేవారు కేవలం ఒక క్లాస్‌తో మెలకువలకు నేర్చుకోగలరు. తర్వాత ఇంటి వద్ద సాధన చేసుకోవచ్చు. - రాజీ, సిరి హ్యాండ్రైటింగ్ నిర్వాహకురాలు, విశాఖ -
‘రాత’బాగుంటే .. గెలుపు వెన్నంటే..
మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలోనూ పది కాలాలపాటు చెరగని ముద్ర వేయాలంటే అందమైన చేతి రాతతోనే సాధ్యం. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే బుజ్జాయి నుంచి కోటి ఆశలతో కళాశాలలకు వెళ్లే యువత వరకు అందరూ అందమైన దస్తూరి కోసం ఆరాటపడుతుంటారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ విద్యా రంగంలో చేతి రాత ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అక్షరాలను ముత్యాల్లా రాసేవారికి ఉజ్వల భవిత ఉంటుందంటున్నారు చేతిరాత నిపుణులు. ముఖ్యంగా ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించే క్రమంలో చేతిరాత ఓ సాధనంగా ఉపయోగపడుతుందంటున్నారు. మంచి చేతిరాతతో కనీసం 20 మార్కులు అదనంగా సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.. ⇒ అందమైన దస్తూరితో ఎన్నో లాభాలు ⇒ ఎస్ఎస్సీ, ఇంటర్ స్థాయిల్లో చేతిరాతకు ప్రాధాన్యం ⇒ మార్కులు పెరిగే అవకాశం ⇒ సాధనతో సాధ్యమేనంటున్న నిపుణులు చేరాత చేజారి పోతోంది. కలాన్ని కుదురుగా పట్టుకొని ముత్యాల్లాంటి అక్షరాలను జాలువార్చాల్సిన చేతి వేళ్లు ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డుపై నాట్యమాడుతున్నాయి. చిన్నప్పటిలా అందంగా రాయలేకపోతున్నామని మధనపడుతున్నవారెందరో. కొందరు పెద్దలైతే పిల్లలు దస్తూరిగా రాస్తున్నారో లేదో పట్టించుకోవడమే మానేశారు. సాంకేతిక రంగం ఎంత విస్తరించినప్పటికీ ఇప్పటికీ అన్ని రంగాల్లో చేతి రాతే కీలకం. అందమైన చేతి రాత ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే. సాధనమున సమకూరు.. ⇒ రాసేటప్పుడూ కూర్చొనే భంగిమ, కలాన్ని పట్టుకొనే విధానం, కాగితానికి, కలానికి మధ్య దూరం వంటి అంశాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ⇒ బాల్ పాయింట్ పెన్ను కన్నా సిరాకలమే రాయడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో కొంతమేర చేతిరాత మెరుగవుతుంది. ⇒ సున్నా, అరసున్నా, నిలువు గీతలను కూడా బాగా సాధన చేయాలి. ⇒ ఆంగ్లం, తెలుగు భాషల్లో మెరుగైన రాత కోసం అపసవ్య దిశలో, హిందీ భాషకు సవ్యదిశలో రాయడం సాధన చేయాలి. ⇒ మెలకువలను అవపోసనపట్టి నిర్విరామంగా 21 రోజులపాటు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన చేతి రాత సొంతమ వుతుందని చేతిరాత నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి.. ⇒ జవాబుల్ని సూటిగా చెప్పాలి. ⇒ సమాధానాలు టీచరుకు తెలుసని గుర్తించాలి. మనంరాసే తీరు పరీక్ష పేపరు దిద్దేవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. ⇒ వ్యాకరణ తప్పులేకుండా చూసుకోవాలి. ⇒ కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25 నుంచి 30 లైన్లు రాస్తారు. ఇది చూసే వారిని ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్కో పేజీలో 16-18 లైన్లకు మించకూడదు. ⇒ ఒక పాయింట్ దగ్గర మొదలైన రాత ఆలైను చివరికి వెళ్లే సరికి పైకో, కిందికో పోతుంది. దాంతో ఆ పేజీల్లో అన్నిలైన్లు అలానే పోతాయి. మొదటి లైను రాసే సమయంలోనే మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయాలి. దాంతో మిగిలిన లైన్లు కూడా అలాగే సమాంతరంగా వస్తాయి. ⇒ గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి.. మరో సగాన్ని కిందిలైనులో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. ⇒ చాలామంది విద్యార్థులు ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టీ మరీ రాస్తుంటారు. కలాన్ని వేళ్లతో బిగ పట్టుకుంటారు. దీంతో పేజీ రెండోవైపు ఆ అక్షరాలు కనిపిస్తూ గందరగోళపరుస్తాయి. కొద్దిసేపు రాయగానే వేళ్లు నొప్పిపెడతాయి. ⇒ చాలామంది విద్యార్థులు అంకెలను సరిగా రాయరు. ఉదాహరణకు...‘2’ అంకెను ఇంగ్లిష్ ‘జెడ్’ తరహాలో ‘5’ను ‘ఎస్’లో ⇒ ‘0’ను ‘6’తరహాలో రాస్తుంటారు. దీంతో రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి. ⇒ సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాల్ని గుర్తించడంలో ఒక క్రమ పద్ధతి పాటించాలి. ⇒ పరీక్షలో కొంతసేపు రైటింగ్, అలంకరణకు సమయం తీసుకోవాలి. ⇒ పరీక్ష పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే వాటిని పెన్సిల్ లేదా పెన్నుతో బాగా రుద్దుతారు. దీంతో పేపరంతా నల్లగా మారుతుంది. అక్షరాల్ని ఇలా రాయండి ⇒ పేజీకి పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ను విడిచి పెట్టాలి. పేజీకి కుడివైపు కూడా అర అంగుళం ఖాళీ విడిచిపెట్టి రాయాలి. టీచర్లు పేజీలను దారంతో కట్టినా..రబ్బర్‌బ్యాండ్‌తో చుట్టినా జవాబులు స్పష్టంగా కన్పిస్తాయి. ⇒ కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెల్లకాగితంపై తర్ఫీదు పొందాలి. ⇒ పరీక్షల్ని నలుపు, బ్లూపెన్ తప్ప వేరే పెన్నుల్ని వాడరాదు. బాల్ పాయింట్ పెన్నులు అనుకూలమైనవి. రెండు పెన్నులు ఉంటే ఒకే కంపెనీవై ఉంటే మంచిది. ⇒ జవాబుల్లో ఏవైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. ⇒ విద్యార్థులకు పాఠశాలలు అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాల్ని చేతితో రాయించాలి. ⇒ జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాల్ని ఒకవైపు సరళ రేఖల్ని గీసి భాగాలు పేర్లు రాస్తే మేలు. లేదా వాటికి నంబర్లను ఇచ్చి ఒక వైపు రాయాలి. ⇒ పరీక్ష పత్రంలో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాల్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధన చేయాలి.. సాధనమున పనులు సమకూరు అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరిని రాబట్టడం సాధ్యమే. ముందుగా అక్షరాలు గుండ్రంగా రాయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత పదాలు, వాఖ్యాల కూర్పుపై దృష్టి పెట్టాలి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు చక్కటి చేతిరాత ఎక్కువ మార్కుల సాధనకు ఉపయోగ పడుతుంది. - సుభాన్ రెడ్డి, హెచ్ఎం, దిర్సంపల్లి తండా ప్రాథమిక పాఠశాల -
నాది చెత్తరాత: మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి మనసు విప్పి మాట్లాడారు. ఆయన తన బాల్యంలోని కొన్ని విషయాలు నిరభ్యంతరంగా బయటపెట్టారు. తాను ఓ సాధారణ విద్యార్థినని, తన రాయడం కూడా సరిగా వచ్చేదని చెప్పారు. ఆదివారం పలు పాఠశాల విద్యార్థులతో మన్‌కీ బాత్ అనే రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చాలా సరదాగా కనిపించారు. బోర్డు ఎగ్జామ్స్‌కు సిద్ధమవుతున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపే యత్నం చేశారు. "నా చేతి రాత సరిగా ఉండేది కాదు. నా చిన్నతనంలో నేనొక సాధారణ విద్యార్థిని. నేనేం రాశానో అర్థం చేసుకోలేకే బహుషా మా టీచర్లు నన్ను పాస్ చేశారనుకుంటాను' అని అన్నారు.