ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..! | Nepal Girl Has Worlds Most Beautiful Handwriting | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!

Published Wed, Feb 5 2025 2:02 PM | Last Updated on Wed, Feb 5 2025 3:18 PM

Nepal Girl Has Worlds Most Beautiful Handwriting

చేతివ్రాత అనేది కనుమరుగైపోతుంది. ఇప్పుడంతా ప్రింట్‌ఔట్‌లే..జస్ట్‌ టైప్‌ చేయడమే..రాసే పనేలేదు. అయినప్పటికీ కొందరూ తమ చేతివ్రాతను పదిలంగా ఉంచుకుంటున్నారు. అంతేగాదు చేతివ్రాత బట్టి మనిషి నేచర్‌ని కూడా చెబుతుంటారు మానసిక నిపుణులు. అందుకే పిల్లల్ని తరుచుగా చేతివ్రాత బాగుండేలా చూసుకోమని పదేపదే చెబుతుంటారు. అలాంటి గొప్ప నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి చేతివ్రాత ఎంత అందంగా ఉంటుందంటే..చూసినవాళ్లేవరైనా ఆ చేతివ్రాతకి ఫిదా అయిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. అత్యంత అసాధారణమైన చేతివ్రాత ఆమెది. అసలు రాసిందా, టైప్‌ చేసిందా అన్నది కనిపెట్టలేనంతగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..!.

మంచి చేతివ్రాత విద్యార్థి పురోగతికి ఎంతగానే సహాయపడుతుందని ఉపాధ్యాయులు చెబుతుంటారు. అందుకే విద్యార్థులను చేతివ్రాత బాగుండేలా చూసుకోమని చెబుతూ..సాధన చేయమంటారు. మనమంతా అలానే కష్టపడి చేతివ్రాత మెరుగ్గా ఉండేలా చేసుకున్నవాళ్లమే. కానీ చేతివ్రాత(Handwriting) ల్లో అత్యంత అందమైనవి..అందరికీ నచ్చేలా రాసే నైపుణ్యం ఉంటుందని విన్నారా..?. అలాంటి అసాధారణమైన ప్రతిభని సొంతం చేసుకుంది నేపాల్‌(Nepal)కి చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా(Prakriti Malla). 

ఆమె తన చేతివ్రాతతోనే వార్తల్లో నిలిచి సెలబ్రిటీగా మారిపోయింది. ఎందుకంటే చేతివ్రాత అందంగా ఉండటం వేరు, అందరూ మెచ్చుకునేంత అందంగా ఉండటం అనేది అసాధ్యం. చెప్పాలంటే ఈమె చేతివ్రాత చూస్తే..చేత్తో రాసిందా? లేక కంప్యూటర్‌లో టైప్‌ చేశారా..? అనేది చెప్పడం అసాధ్యం. అంతలా ఆకట్టుకుంటుందా ఆమె చేతివ్రాత. 

ఆమె హ్యాండ్‌ రైటింగ్‌ గణనీయమైన ప్రజాధరణ పొందింది. ప్రకృతి ఎనిమిదో తరగతిలో ఉండగా రాసిన అసైన్‌మెంట్‌ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి, ప్రజలు చేతితో రాయడం దాదాపుగా మానేశారు. ఒకప్పుడు చేతిరాతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అందమైన చేతివ్రాతను కలిగి ఉన్నారు. 

అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి చేతివ్రాత అందరిని కట్టిపడేస్తోంది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతివ్రాత నిపుణులు కూడా ప్రకృతి మల్లా చేతివ్రాతను చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆమె 51 యూనియన్‌ స్ఫూర్తి సందర్భంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(United Arab Emirates (UAE)) పౌరుల నాయకత్వానికి అభినందన లేఖ రాసింది. ఆ లేఖను ప్రకృతినే స్వయంగా రాయబార కార్యాలయానికి అందజేసింది. అందుకుగానే నేపాల్‌ సాయుధ దళాలు(Nepalese armed forces) ఆ అమ్మాయిని సత్కరించాయి కూడా.

(చదవండి: 'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement