Armed Forces
-
ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!
చేతివ్రాత అనేది కనుమరుగైపోతుంది. ఇప్పుడంతా ప్రింట్ఔట్లే..జస్ట్ టైప్ చేయడమే..రాసే పనేలేదు. అయినప్పటికీ కొందరూ తమ చేతివ్రాతను పదిలంగా ఉంచుకుంటున్నారు. అంతేగాదు చేతివ్రాత బట్టి మనిషి నేచర్‌ని కూడా చెబుతుంటారు మానసిక నిపుణులు. అందుకే పిల్లల్ని తరుచుగా చేతివ్రాత బాగుండేలా చూసుకోమని పదేపదే చెబుతుంటారు. అలాంటి గొప్ప నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి చేతివ్రాత ఎంత అందంగా ఉంటుందంటే..చూసినవాళ్లేవరైనా ఆ చేతివ్రాతకి ఫిదా అయిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. అత్యంత అసాధారణమైన చేతివ్రాత ఆమెది. అసలు రాసిందా, టైప్ చేసిందా అన్నది కనిపెట్టలేనంతగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..!.మంచి చేతివ్రాత విద్యార్థి పురోగతికి ఎంతగానే సహాయపడుతుందని ఉపాధ్యాయులు చెబుతుంటారు. అందుకే విద్యార్థులను చేతివ్రాత బాగుండేలా చూసుకోమని చెబుతూ..సాధన చేయమంటారు. మనమంతా అలానే కష్టపడి చేతివ్రాత మెరుగ్గా ఉండేలా చేసుకున్నవాళ్లమే. కానీ చేతివ్రాత(Handwriting) ల్లో అత్యంత అందమైనవి..అందరికీ నచ్చేలా రాసే నైపుణ్యం ఉంటుందని విన్నారా..?. అలాంటి అసాధారణమైన ప్రతిభని సొంతం చేసుకుంది నేపాల్(Nepal)కి చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా(Prakriti Malla). ఆమె తన చేతివ్రాతతోనే వార్తల్లో నిలిచి సెలబ్రిటీగా మారిపోయింది. ఎందుకంటే చేతివ్రాత అందంగా ఉండటం వేరు, అందరూ మెచ్చుకునేంత అందంగా ఉండటం అనేది అసాధ్యం. చెప్పాలంటే ఈమె చేతివ్రాత చూస్తే..చేత్తో రాసిందా? లేక కంప్యూటర్లో టైప్ చేశారా..? అనేది చెప్పడం అసాధ్యం. అంతలా ఆకట్టుకుంటుందా ఆమె చేతివ్రాత. ఆమె హ్యాండ్ రైటింగ్ గణనీయమైన ప్రజాధరణ పొందింది. ప్రకృతి ఎనిమిదో తరగతిలో ఉండగా రాసిన అసైన్మెంట్ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి, ప్రజలు చేతితో రాయడం దాదాపుగా మానేశారు. ఒకప్పుడు చేతిరాతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అందమైన చేతివ్రాతను కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి చేతివ్రాత అందరిని కట్టిపడేస్తోంది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతివ్రాత నిపుణులు కూడా ప్రకృతి మల్లా చేతివ్రాతను చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆమె 51 యూనియన్ స్ఫూర్తి సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates (UAE)) పౌరుల నాయకత్వానికి అభినందన లేఖ రాసింది. ఆ లేఖను ప్రకృతినే స్వయంగా రాయబార కార్యాలయానికి అందజేసింది. అందుకుగానే నేపాల్ సాయుధ దళాలు(Nepalese armed forces) ఆ అమ్మాయిని సత్కరించాయి కూడా.(చదవండి: 'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!) -
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్‌లోపు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్‌షా చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. -
ఈసారి 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అయితే ఈ 'కర్తవ్య పథ్'లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే కనిపించనుంది. అందులోనూ ముఖ్యంగా సాయుధ దళాలకు వైద్య సేవలందించే మహిళ డాక్టర్ల బృందం కవాతు చేయనుండటం విశేషం. అంతేగాదు దేశంలోని 'నారీ శక్తి' పరేడ్‌తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంచలనాత్మకంగా నిలిచిపోనున్నాయి. ఈ సారి రిపబ్లిక్‌డే వేడుకల్లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా తొలిసారిగా సాయుధ దళాల వైద్య సేవలకు సంబంధించి పూర్తి మహిళా బృందం కర్తవ్పథ్లో కవాతు చేయడం విశేషం. దీనికి మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహించనున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలు మహిళా బృందంతో చారిత్రత్మక కవాతును ప్రారంభించి సంచలనం సృషిస్తోంది. ఇక వైద్యురాలు ఖుల్లార్ మహిళల బృందానికి నాయకత్వం వహించి సాయుధ దళాల మహిళా డాక్టర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ కవాతు శౌర్యం, పరాక్రమంతో అడ్డంకులన్నింటిని బద్దలు కొట్టేలా 'నారీ శక్తి 'వేస్తున్న అసలైన అడుగు. ఈమేరకు సృష్టి ఖుల్లర్ మాట్లాడుతూ.. నేత్ర వైద్యురాలిగా, ఆపరేషన్ థియేటర్లో సర్జికల్ కత్తి పట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కర్తవ్య పథ్‌లో కత్తి పట్టుకోవడం తనకు ఓ ఛాలెంజింగ్‌గా అద్భుతంగా ఉందని సంతోషంగా చెప్పింది. అందుకు తాను భారత ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని అన్నారు. Met paratrooper & eye surgeon Major Srishti Khullar today. She will lead the all-women Armed Forces Medical Services marching contingent at the Republic Day parade. "From holding the surgical knife to carrying a sword at the parade, the new role is quite challenging & rewarding." pic.twitter.com/1gT5MTQIxZ — Rahul Singh (@rahulsinghx) January 23, 2024 చరిత్ర సృష్టించనున్న ఢిలీ మహిళా పోలీసులు.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 'కర్తవ్య పథ'లో పూర్తిగా మహిళా పోలీసులే ప్రదర్శన ఇవ్వనున్నారు. పరేడ్‌లో ఇలా పూర్తి మహిళా పోలీసులే పాల్గొనడం తొలిసారి. ఇక ఈ మహిళా బృందంలో నగర దళానికి చెందిన మహిళ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దీనికి ఐపీఎస్ అధికారిణి శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నారు. ఆమె నేతృత్వంలో దాదాపు 194 మంది మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు కవాతు చేయనున్నారు. మహిళా అధికారుల సారథ్యంలోనే త్రివిధ దళాల కవాతు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మహిళా అధికారుల సారథ్యంలో త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తుండటం విశేషం. ఇక భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ శరణ్య రావు తాను ఈ త్రివిధ దళాల ఆర్మీ కాంపోనెంట్కి సూపర్ న్యూమరీ అధికారిగా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం అని భావోద్వేగంగా మాట్లాడారు కెప్టెన్ శరణ్యరావు. ఈ ఏడాది నారీ శక్తి థీమ్‌కి తగ్గట్టుగా చాలామంది మహిళల నేతృత్వంలో త్రివిధ దళాల కవాతు జరగడం అనేది చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న అపూర్వ ఘట్టం అని కొనియాడారు. తొలిసారిగా ఓ ఆర్మీ దంపతుల కవాతు ఈ కర్తవ్య పథ్‌లో తొలిసారిగా ఒక జంట కలిసి కవాతు చేయనుండటం విశేషం. వివిధ రెజిమెంట్లలో భాగంగా తొలిసారి మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రత అనే జంట కలిసి కవాతు చేయనుంది. వారిద్దరూ గతేడాది జూన్‌లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఇక 'కర్తవ్య పథ్' అంటే..ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం.ఒకప్పుడూ ఇది ‘రాజ్ పథ్’ అనే పేరుతో ఉండేది. (చదవండి: ఢిల్లీ పరేడ్‌కు అసామాన్యులు) -
హైదరాబాద్‌లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్‌లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్‌బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
తెలంగాణ ఎన్నికలు.. సాయుధ బలగం ఎవరివైపో?
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్విస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక ఈ ఎన్నికలలో మెజారిటీ సర్వీస్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపిస్తారోనన్న చర్చ కూడా సాగుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో... రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్విస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్విస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్‌లోనే.. హైదరాబాద్‌లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. బహదూర్‌పుర, చార్మినార్, మలక్‌పేటలో ఒక్కో నియోజకవర్గాలలో కేవలం 9 మంది సర్విస్ ఓటర్లు ఉండగా.. సనత్‌నగర్, గోషామహల్ సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సర్విస్ ఓటర్లు ఎవరంటే.. భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, జీఆర్ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్విస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు ఎలా వేస్తారంటే.. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ఆఫీసర్ సర్విస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్విస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్ఛిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్అధికారికి పోస్టులో పంపించాలి. మహిళ సర్విస్ ఓటరైతే.. ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్విస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకునే కుటుంబ సభ్యుల అర్హత ప్రమాణాలలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. సాధారణంగా సర్విస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్విస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్విస్ ఓటరు గనక మహిళ అయితే మాత్రం భర్తకు ఈ నిబంధన వర్తించదు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
మణిపూర్‌లో సాయుధ చట్టం... మరో ఆర్నెల్లు
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను మరో ఆర్నెల్ల పాటు పొడిగించారు. ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎఫ్ఎస్పీఏను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లోని 19 పోలీస్ స్టేషన్లను మాత్రం దీని పరిధి నుంచి మినహాయించారు. అక్కడ చట్టాన్ని అమలు చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతి తప్పనిసరి. లేదంటే సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను అక్కడ నియోగించడానికి వీల్లేదు. దీనిపై భద్రతా దళాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నిషేధిత ఉగ్ర గ్రూపులు లోయలో తలదాచుకుని సవకు విసురుతున్నట్టు చెబుతున్నాయి. మణిపూర్ పోలీసు ఆయధాగారం నుంచి దోచుకెళ్లిన మొత్తం 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల మందుగుండు వాటి చేతిలో పడ్డాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తుపాకీ ‘గురి’ తప్పుతోంది!
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్ :ఇటీవల జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టికారామ్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్ బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. 13 ఏళ్లలో 1,532 మంది.. ♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని... ♦ జనగాం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత ఏప్రిల్ 6న తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ♦ 2016లో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2019లో హెడ్ కానిస్టేబుల్ డి.ప్రకాశ్ రెడ్డి తన పైఅధికారి సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. ♦ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్పీఎఫ్ కానిస్టే బుల్ రూపేషానంద్ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2020 నవంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ బ్యాంక్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ♦ 2017 జూన్‌లో సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రెడ్డి తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముంది? ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్‌్కఫోర్స్ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్–వ ర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది. శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక శిక్షణ అవసరం. మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం. – నారాయణ, రిటైర్డ్ ఎస్పీ కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముందంటే... ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం. పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ సైతం అవసరం ♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్ -
‘వ్యభిచారానికి పాల్పడితే సైనికాధికారులపై చర్యలు’
న్యూఢిల్లీ: నీతి తప్పిన సైనికులు ఉంటే సైన్యంలో క్రమశిక్షణ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పై అధికారులు వ్యభిచారానికి పాల్పడితే చర్యలు తీసుకొనే అధికారం సైనిక దళాలకు ఉందని తేల్చిచెప్పింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. వ్యభిచారం నేరం కాదంటూ చెబుతూ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ తప్పుడు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఈ తీర్పు అడ్డుకోలేదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్‌కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్ఎఫ్కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
రిక్రూటైన ఐదేళ్లకే రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కరోనాతో సైన్యంలో రెండేళ్లుగా నిలిచిన నియామకాలను మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు ఆర్మీలో నియామకాలను మూడు రకాలుగా చేస్తారని సమాచారం. 25 శాతం మంది మూడేళ్లు, 25 శాతం ఐదేళ్లు పనిచేసి రిటైరవుతారు. మిగతా 50 శాతం రిటైరయ్యేదాకా సేవలనందిస్తారు. చదవండి: (అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్ తమిళిసై) -
యువత జీవితాలతో క్రూర పరిహాసం
ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో తలమునకలై ఉంది. అత్యాధునిక ఆయుధాలు, అజేయమైన సైనిక బలంలో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన రష్యా ప్రస్తుతం బాలలు, యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1989లో ఏర్పాటైన ‘సైనికుల తల్లుల కమిటీ’ ఈ విషయాన్ని గురువారం బహిర్గతం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బాలలను, యువకులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తున్నారని, అక్కడ మారణాయుధాలు ఇచ్చి, సైనిక శిక్షణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారని ఈ కమిటీ ఒక ప్రకటనలో ఆరోపించింది. వారిలో చాలామందిని ఉక్రెయిన్‌లో యుద్ధభూమికి తరలించారని వెల్లడించింది. చదవండి: (ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?) కఠినమైన శిక్షణ తట్టుకోలేక పారిపోయేందుకు ప్రయత్నిస్తే చావబాదుతున్నారని, దారుణంగా హింసిస్తున్నారని పేర్కొంది. రష్యావ్యాప్తంగా ఎంతోమంది తల్లుల నుంచి తమకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయని కమిటీ తెలియజేసింది. బిడ్డల బాగోగులు తెలియక తల్లులు ఆందోళనకు గురవుతున్నారని, కనీసం బతికి ఉన్నారో లేదో కూడా వారికి తెలియడం లేదని కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆండ్రీ కురోచ్కిన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలకు దూరమైన తల్లుల రోదనలను ఆపలేకపోతున్నామని చెప్పారు. ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాం, కేవలం శిక్షణ మాత్రమే ఇస్తాం అంటూ మాయమాటలతో మభ్యపెడుతూ సరిహద్దులకు తరలించి, అక్కడి నుంచి నేరుగా రణరంగంలోకి దించుతున్నారని ఆరోపించారు. చదవండి: (కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్స్కీ ప్రస్థానం) కాంట్రాక్టు జవాన్లుగా మారేందుకు నిరాకరిస్తే ఉన్నతాధికారులు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఫోన్లు సైతం లాగేసుకుంటుండడంతో సదరు యువకుల పరిస్థితి ఏమిటి, ఎక్కడున్నారు అనేది తెలియడం లేదని పేర్కొన్నారు. యుద్ధరంగంలోకి సుశిక్షితులైన జవాన్లను పంపాలి గానీ ఏమాత్రం అవగాహన లేని బాలలను, యువతను పంపించి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదొక పెద్ద విపత్తు అని అభివర్ణించారు. బందీలుగా బాలలు: ఉక్రెయిన్ సైన్యం చేతిలో బందీలుగా ఉన్న కొందరు రష్యా సైనికుల్లో బాలలు, యువత కనిపించారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న వీరి దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలలు బందీలుగా మారిపోవడం గమనార్హం. రష్యా సైనికాధికారుల అకృత్యాలపై చీఫ్ మిలటరీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు ‘సైనికుల తల్లుల కమిటీ’ సన్నద్ధమవుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దని కమిటీ హితవు పలికింది. -
Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?
అగ్రరాజ్యం అమెరికా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా, దీటుగా ప్రతిదాడి ఉంటుందని నాటో స్పష్టం చేసినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్‌పై పంజా విసిరారు. సైనిక చర్యకు దిగారు. పాశ్చాత్యదేశాల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా.. పెడచెవిన పెడుతూ తాను అనుకున్నది చేసేసే మొండి ధైర్యం, పట్టుదల... రష్యా అధ్యక్షుడికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఆయన లెక్కలు, సమీకరణాలు ఎలా ఉన్నాయి. ఎవరి అండ ఉందనే భరోసాతో పుతిన్ ఈ సాహసానికి ఒడిగట్టారో చూద్దాం.. ‘రిస్క్’తో కూడిన నిర్ణయం తూర్పు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న సాధారణ పౌరులు, రష్యన్లను రక్షించడానికి సైనిక చర్య తప్పలేదని పుతిన్ దాడికి దిగేముందు పేర్కొన్నారు. ఎవరైనా ఈ యుద్ధంలో జోక్యం చేసుకంటే ఇదివరకెన్నడూ చూడనంతటి తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా, బ్రిటన్లు బ్యాంకుల లావాదేవీలపై నిషేధం విధించడం, రష్యా చమురు దిగ్గజాలుగా పేరొందిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం తదితర ఆర్థికపరమైన ఆంక్షలకు దిగాయి. ఆర్థిక నిల్వలు వేగంగా ఆవిరి నాలుగైదు నెలలుగా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉండటం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూసింది. రాజధాని కీవ్‌లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ పోయాయి. కొద్ది వారాల వ్యవధిలో వందలాది మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లాయి. ఆర్థిక వ్యవస్థను అష్టదిగ్బంధన చేయడం ఉక్రెయిన్ను దారికి తేవాలనేది క్రెమ్లిన్ ఎత్తుగడ. దీన్నే ఉక్రెయిన్ ‘హైబ్రిడ్ యుద్ధ తంత్రం’గా అభివర్ణించింది. చెదలు పట్టినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుంచి తినేయడమే పుతిన్ లక్ష్యమని విమర్శించింది. చదవండి: (Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?) పుతిన్ ముఖ్యంగా మూడు అంశాలను బలంగా నమ్ముకున్నారు. అవి.. 1. శరవేగంగా పతనమవుతున్న ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి. 2. రష్యా వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తి. 3. చైనా అండగా నిలవడం. ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఉక్రెయిన్ మీదుగా వెళుతున్న చమురు నౌకలను (ఎగుమతులను) నిలిపివేయడం, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ఆపేయడంతో ట్రాన్సిట్ చార్జీలుగా వసూలయ్యే వందలాది బిలియన్ల డాలర్లు రాలేదు. ఫలితంగా గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉక్రెయిన్ కరెన్సీ విలువపడిపోయింది. ఒకవైపు యుద్ధానికి కాలుదువ్వుతూనే.. మరోవైపు ఉక్రెయిన్ ఆర్థికరంగాన్ని పిండివేసే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్ గ్యాస్ సరఫరా కూడా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఉక్రెయిన్‌కు అండగా నిలబడి ప్రత్యక్ష యుద్ధాన్ని అమెరికా లేదా నాటో దేశాలు కోరుకోవనే గట్టి నమ్మకంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) సమృద్ధిగా విదేశీ మారకద్రవ్య నిలువలు సాధారణంగా ఆర్థిక ఆంక్షలు పెడితే.. ఆయా దేశాల్లోకి వచ్చే డాలర్లు, ఇతర విదేశీ మారకద్రవ్యం నిలిచిపోతుంది. రిజర్వు నిధుల్లోనుంచి వాడి తాత్కాలికంగా నెట్టుకొచ్చినా.. దీర్ఘకాలంగా ఆంక్షల చట్రంలో ఉంటే దిగుమతులకు డబ్బులు చెల్లించలేక అవస్థపడాల్సి వస్తుంది. రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు గత ఏడాది డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో 6.3 లక్షల మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాబట్టి ఆర్థికంగా దిగ్బంధించినా రష్యాకు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. మరోవైపు రష్యా– చైనాల మధ్య ఇటీవలి కాలంలో మరింత సన్నిహితమవుతున్నాయి. ప్రపంచ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, యూఎస్, యూకేల మధ్య ఇటీవల ఆకస్ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ప్రాంతీయంగా బలాలను సరిచేయాలనే ఉద్దేశంతో చైనా.. రష్యాకు దగ్గరవుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఐఎస్ అధినేత హతం
అత్మే (సిరియా): అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి సిరియాలో జరిపిన మెరుపుదాడిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమయ్యాడు. రెబెల్స్ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్ ప్రావిన్సులో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఐఎస్ సాయుధులకు, వారికి రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. చివరికి ఇంటిని సైన్యం చుట్టుముట్టడంతో ఖురేషీ బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా చనిపోయినట్టు యూఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలతో పాటు కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. మృతదేహాలు తునాతునకలయ్యాయని, బాంబు దాడుల్లో ఇల్లు నేలమట్టమైందని చెబుతున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి తమ సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్టు యూఎస్ అధ్యక్షుడు బైడెన్ గురువారం ప్రకటించారు. అచ్చం బగ్దాదీ మాదిరిగానే... 2019 అక్టోబర్‌లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ కూడా ఇదే ఇద్లిబ్ ప్రాంతంలో యూ ఎస్ దళాలు చుట్టుముట్టడంతో ఇలాగే బాం బు పేల్చు కుని చనిపోయాడు. తర్వాత అక్టోబర్ 31న ఖురేషీ ఐఎస్ చీఫ్ అయ్యాడు. అప్పటినుంచీ వీలైనంత వరకూ జనాల్లోకి రాకుండాలో ప్రొఫైల్‌లో ఉండేవాడు. మళ్లీ కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్న ఐఎస్‌కు అతని మరణం పెద్ద దెబ్బేనంటున్నారు. పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపిం ది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi — the leader of ISIS. https://t.co/lsYQHE9lR9 — President Biden (@POTUS) February 3, 2022 -
తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..
కశ్మీర్: బీఎస్ఎఫ్ జవాన్ల బృందం బిహు పండుగను పురష్కరించుకుని ఓ జానపద పాటకు నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో జవాన్లు డ్యాన్స్ చేస్తున్న తీరు వారి అచంచలమైన స్ఫూర్తిని, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చెక్కుచెదరని విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరిలో.. అస్సాం, ఈశాన్య భారతదేశంలో జరుపుకునే పంట పండుగ అయిన బిహును పురష్కరించుకుని సైనికదళాలు నృత్యం చేయడం మన గమనించవచ్చు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్లో చిత్రీకరించిన ఈ వీడియోలో.. ఆర్మీ జవాన్లు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉత్సాహంగా నృత్యం చేయడం చూడవచ్చు. చదవండి: (తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా) 'పర్వతాలు, మంచు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, 24 గంటలపాటు తీవ్ర ఒత్తిడి, ఎల్ఓసీ, ఇళ్లకు దూరంగా ఉండటం ఇవి ఏవీ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయలేదు.. పండుగ జరుపుకోవడాన్ని అడ్డుకోలేదు' అంటూ క్యాప్షన్ ఇస్తూ 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' వీడియో పోస్ట్ చేసింది. Mountains and mountains of snow, blinding blizzards, freezing temperatures, stress of 24 hours vigil #LoC , away from homes; this all didn’t deter BSF troops to dance few steps & celebrate #Bihu at FDL in #Keran Sector #ForwardArea .@PMOIndia @HMOIndia @BSF_India pic.twitter.com/65c1viqskU — BSF Kashmir (@BSF_Kashmir) January 16, 2022 -
పాక్ యుద్ధంలో అమరుడైన సైనికుడికి కేటాయించిన భూమి కోసం దశాబ్ధాలుగా పోరాటం!
తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి ఇవ్వాల్సిన భూమికి సైతం రాజధాని పేరుతో మొండిచెయ్యి చూపింది. పాకిస్తాన్‌తో యుద్ధంతో వీరమరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం అతడి మాతృమూర్తి, దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఆమె అనారోగ్యానికి గురైంది. తాను తనువు చాలించేలోగానైనా న్యాయం జరగాలని 92 ఏళ్ల ఆ వీరమాత వేడుతోంది. ఆ తల్లి పేరు తోట వెంకాయమ్మ. భర్త 35 ఏళ్ల క్రితమే కాలం చేశాడు. స్థానిక గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ యుక్తవయసులోనే సైన్యంలో చేరాడు. చేరిన కొద్దికాలానికే 1965లో వచ్చిన ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో అమరుడయ్యాడు. అతని తాగ్యానికి నివాళిగా 1966లో ప్రభుత్వం అప్పట్లో గుంటూరు జిల్లా పరిధిలోని చినగంజాంలో 2.5 ఎకరాల వర్షాధారమైన భూమిని (సర్వే నెం.701/1) కేటాయించింది. వీరనాగప్రసాద్ అవివాహితుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. పేరుకైతే భూమిని ఇచ్చారుగానీ, అధికారుల అర్థంకాని నిర్ణయాలు, అంతులేని అలసత్వంతో ఆ భూమి ఇప్పటికీ తనకు దక్కనేలేదు. అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల చుట్టూ.. 1965లో ఇచ్చిన భూమిని మరో మూడేళ్లకు ప్రభుత్వ అవసరాల కోసమంటూ మరొకరికి కేటాయించారు. అక్కడే సర్వే నంబరు 704/2లో అంతే విస్తీర్ణంలో భూమిని వెంకాయమ్మకు ఇచ్చారు. 1982లో దానినీ స్వాధీనం చేసుకుంది. 396/4, 396/5 సర్వే నంబర్లలోని 2.85 ఎకరాల చెరువు భూమిని ఇచ్చారు. ఒండ్రు మట్టితో గల ఆ భూమి సుభిక్షమైందని నమ్మబలికారు. అదైనా తీసుకుందామని వెళ్లిన వెంకాయమ్మ కుటుంబసభ్యులను పంచాయతీవారు అడ్డుకున్నారు. చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని నిరోధించారు. పైగా న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తమ ప్రమేయం లేని వ్యవహారంలో వెంకాయమ్మ కోర్టు వాయిదాలకు తిరగాల్సి వచ్చింది. కోర్టులో పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది. ‘ప్రకాశం’కు చేరిన పొలం వ్యవహారం.. ఈలోగా జిల్లాల విభజన జరగటంతో చినగంజాం ప్రకాశం జిల్లాలోకి వెళ్లింది. జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరుకు వెంకాయమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్ స్పందించారు. వెంకాయమ్మ కుటుంబం తెనాలిలోనే ఉంటున్నందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఆ లేఖ 2016 ఫిబ్రవరి 15న తగుచర్యల నిమిత్తం జిల్లా కలెక్టరేట్ నుంచి తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది. అనువైన భూమి కోసం అప్పటి ఆర్డీవో జి.నరసింహులు డివిజనులోని తహసీల్దార్లను నివేదిక కోరారు. నివేదికతో సహా అప్పటి ప్రభుత్వానికి పంపారు. రాజధాని పేరుతో మొండిచెయ్యి.. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించటం, వివిధ పరిపాలన విభాగాలను స్థాపించటం వంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గుంటూరు జిల్లా ప్రభుత్వ ఖాళీస్థలం చాలా అవసరమైనందున దరఖాస్తుదారు అభ్యర్థన ఆచరణీయం కాదు’ అంటూ తిరస్కరించింది. దీనితో మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తికి అనారోగ్యం ప్రాప్తించింది. తన గోడునంతా వివరిస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తును పంపారు. న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా! -
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్‌లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్‌తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్‌గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం
సాక్షి, అమరావతి: శత్రుమూకల నుంచి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు సాయుధ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2021 నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గతంలో వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సైనికుల ఇళ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఇప్పటివరకు 140 మందికి 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసినట్టు చెప్పారు. ఆర్థిక సాయం అందజేత దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన అమర జవాను హవల్దార్ గుర్రాల చంద్రశేఖర్ సతీమణి మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాల కృష్ణసురపతి భార్య దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్ పాండ్రంకి చంద్రరావు సతీమణి సుధారాణి, కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు పొలుకనటి శివగంగాధర్ భార్య రాధిక, గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు ఎం.జస్వంత్ కుమార్‌రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని హోం మంత్రి అందజేశారు. 164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్ బొడ్డేపల్లి రామకృష్ణారావును సత్కరించారు. గత ఏడాది పతాక దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున విరాళాలను సేకరించిన తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్యప్రసాద్ (రిటైర్డ్), కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీఎస్ ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు వీవీ రాజారావు పాల్గొన్నారు. -
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం
సాక్షి, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి సీఎం జగన్‌కి జ్ఞాపిక అందజేశారు. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్) ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.వెంకట రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ వరం... స్పాట్లో రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ -
యుద్ధ క్షేత్రాల్లో ఆర్మీకి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు తుదిరూపునిచ్చారు. -
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ), అర్మ్డ్ పోర్సెస్ ట్రిబ్యునల్ (ఏఎఫ్‌టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఈనెల 6న కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నరహరి దేశ్‌ముఖ్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రామతిలగం, పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజి్రస్టార్ జనరల్ హర్నామ్ సింగ్ ఠాకూర్, పి.మోహన్‌రాజ్, రోహిత్ కపూర్, జస్టిస్ దీప్ చంద్ర జోషి ఎన్సీఎల్టీలో జ్యుడీíÙయల్ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు. ఐటీఏటీ: జ్యుడీíÙయల్ సభ్యులుగా అన్‌రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్ సంజయ్ శర్మ, అడ్వొకేట్ ఎస్.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.గోయెల్, జస్టిస్ అనుభవ్ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్ టీఆర్ సెంథిల్‌కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్బీఐ లా ఆఫీసర్ మన్మోహన్ దాస్‌లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు.. ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఏఎఫ్‌టీ: ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీíÙయల్ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్ బాలకృష్ణ నారాయణ, జస్టిస్ శశికాంత్ గుప్తా, జస్టిస్ రాజీవ్ నారాయణ్ రైనా, జస్టిస్ కె.హరిలాల్, జస్టిస్ ధరమ్‌చంద్ర చౌదరి, జస్టిస్ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్‌టీ నాలుగు బెంచ్‌లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ రజని -
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
-
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం మధ్యాహ్నానికి 93 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సైనికులు యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. ‘‘మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా 400 మంది అమాయకులు బలయ్యారు. సిగ్గుతో తలదించుకోవాలి ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం విమర్శించింది. మరోవైపు మిలటరీ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హాలింగ్ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు. -
మహిళల భద్రతకు సాయుధ దళాలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం ‘మిషన్ శక్తి’ పేరుతో కొత్తగా మూడు మహిళా సాయుధ దళాలను ఏర్పాటు చేయబోతోంది. ఆ దళాలకు 1857 నాటి తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామ మహిళా యోధుల పేర్లు పెట్టినట్లు ప్రకటించింది. ఆ ముగ్గురు వీరాంగనల శౌర్యసాహసాల విశేషాలు క్లుప్తంగా.. ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్, లక్నో, గోరఖ్‌పూర్‌లలో కొత్తగా మూడు మహిళా దళాలు ఏర్పాటవబోతున్నాయి. ‘ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టేబ్యూలరీ’ ఉమెన్ బెటాలియన్లు అవి. ‘పి.ఎ.సి.’లు. ప్రాదేశిక సాయుధ మహిళా రక్షణ దళాలు. మొన్న మార్చి 20 న లక్నోలో జరిగిన రాణి అవంతీబాయి లోధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలు, బాలికల భద్రతకు, రక్షణకు ఈ మహిళా పి.ఎ.సి.లు పనిచేస్తాయి. ఒక్కోదళానికి ఒక్కో పేరుగా.. రాణి అవంతీబాయి లోధీ, ఉదాదేవి, ఝల్కారీబాయి పేర్లను పెట్టారు. ఈ ముగ్గురూ తొలి స్వాతంత్య్ర సంగ్రామంలోని వీరాంగనలు. 1857–1858 మధ్య బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి అమరులైనవారు. నాడు పరదేశీయుల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహిళా యోధుల పేర్లను నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల్ని అఘాయిత్యాల నుంచి, అత్యాచారాల నుంచి, అకృత్యాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన మహిళా దళాలకు పెట్టడం.. ‘చరిత్రను మరవొద్దు, మనవాళ్లు ఎలాంటి అఘాయిత్యాలకు గురయ్యారో, మహిళలపై మనం అలాంటి హేయమైన పనులకు పాల్పడొద్దు’ అని చెప్పడమే. రాణీ అవంతీబాయి, ఉదాదేవి, ఝల్కారీబాయి.. బ్రిటిష్‌వాళ్ల గుండెలు గుభేల్మనిపించిన మహిళలు. ఖడ్గాన్ని ఎత్తిపట్టి గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చి సమరశంఖం వంటి ఒక గర్జన చేస్తే.. అదీ మహిళలు చేస్తే.. బ్రిటిష్ అధికారులు వెనకడుగు వేస్తారా? అయితే స్వాతంత్య్రం కోసం వీరు కనబరిచిన నిబద్ధత, నిబ్బరం తెల్లవాళ్లని తెల్లబోయేలా చేసింది! నిబ్బరం సరే, ప్రతి స్వాతంత్య్ర సమరశీలికీ ఉండేదే. నిబద్ధత ఏమిటి? ఏమిటంటే.. ఆనాడు బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన అనేకమంది స్వదేశీ రాజ్యపాలకులకు లేనిది! అవును. అందరం కలిసి పోరాడదాం అనుకున్నాక కూడా మనవాళ్లు కొందరు జారిపోయారు. కొందరు రహస్యంగా బ్రిటిష్‌వాళ్లతో కలిసిపోయారు. ఆ సమయంలో మహిళా యోధులు గట్టిగా నిలబడ్డారు. ఒత్తిళ్లకు, బెదరింపులకు లొంగిపోకుండా ఖడ్గాన్ని ఝళిపించారు. తుపాకీ ఎక్కుపెట్టారు. తమ చివరి శ్వాస వరకు భరతమాత దాస్య శృంఖలాలను తెగ్గొట్టేందుకు పోరాడుతూనే ఉన్నారు. వారి స్ఫూర్తితో, వారి పేర్లతో ఇప్పుడు ఏర్పాటైన మూడు పి.ఎ.సి.లకు కలిపి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ అని పేరు పెట్టింది. అంటే.. త్రిదళమహాశక్తి అని. ఆ ముగ్గురు మహిళలు అవంతి, ఉదా, ఝల్కరి గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవడం.. మనసును శక్తితో, ధైర్యంతో, ధీమాతో నింపుకోవడం అవుతుంది. అవంతీబాయి లోధీ లోధీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని వ్యవసాయ కుటుంబాల వాళ్లు. వాళ్లింటి అమ్మాయి అవంతి. తర్వాత ఆమె రామ్‌ఘర్ రాణి అయింది. ఇప్పుడా రామ్‌ఘర్ మధ్యప్రదేశ్‌లోని డిండోరి. సంస్థానాధీశులు ఎందరు మెత్తబడినా రాణీ అవంతీబాయి మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. వారితో పోరాడుతూనే 1858 మార్చి 20 న అమరనారి అయ్యారు. 1857 మే 10 నుంచి 1858 నవంబరు 1 వరకు ఏడాదిన్నరపాటు సాగిన మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంలో రాణి అవంతి నాలుగువేల మంది సైన్యంతో శత్రువులతో తలపడ్డారు. మంద్లా దగ్గరి ఖేరి గ్రామంలో ఆమె, ఆమె సైన్యం బ్రిటిష్ సేనల్ని పరుగులెత్తించారు. అవమానభారంతో అప్పటికి వెళ్లిపోయిన పరాజిత మూకలు తిరిగి రామ్‌ఘర్ మీద ప్రతీకార దాడులు జరిపాయి. రామ్‌ఘర్‌కు నిప్పుపెట్టాయి. రాణి అవంతిక గెరిల్లా యుద్ధ వ్యూహంతో వారిని ఎదుర్కొన్నారు. బలం క్షీణించిన క్షణంలో శత్రువుకు సజీవంగా చిక్కరాదని తన సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ప్రాణత్యాగం చేసుకున్నారు. ఉదాదేవి ఉదాదేవి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర దళిత యోధురాలు. ఆమెతో కలిసి బ్రిటిష్ వాళ్లపై నాడు పోరాడిన దళిత మహిళలంతా చరిత్రలో ‘దళిత వీరాంగన’లుగా గుర్తింపు, గౌరవం పొందారు. బ్రిటిష్ వాళ్లపై భారత ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను గమనించిన ఉదా దేవి ముందుగా తనే బేగమ్ హజ్రత్ మహల్ (అవథ్) ను కలిసి యుద్ధానికి ‘నేను సైతం’ అని నినదించారు. బేగమ్ హజ్రత్ ఉప్పొంగిపోయారు. అప్పటికప్పుడు మహిళలతో ఒక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసి ఉదాదేవికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆమె చేతికి తుపాకీ అందించారు. బ్రిటిష్ వాళ్లు అవ«ద్‌ను ఆక్రమించినప్పుడు ముందు వరుసలో ఉండి వారిని నిలువరించింది ఉదాదేవి మహిళా దళమే! 1857 నవంబరులో సికందర్‌బాగ్‌లో జరిగిన ముఖాముఖి పోరులో తన దళాలకు సూచనలు ఇచ్చాక, ఉదాదేవి ఒక రావి చెట్టు ఎక్కి అక్కడి నుంచి బ్రటిష్ సైనికులపై కాల్పులు జరుపుతూ వారు ముందుకు రాకుండా చేయగలిగారు. ఆకులు కొమ్మల మాటు నుంచి తూటాలు కురిపిస్తున్న వారెవరో కనిపెట్టలేక బ్రటిష్ అధికారి ఒకరు చెట్టుపైకి కాల్పులు జరపమని తన సైనికులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మూకుమ్మడి తూటాలకు ఉదాదేవి నేలకు ఒరిగారు. అప్పటికే ఆమె తుపాకీ పన్నెండు మందికిపైగా బ్రిటిష్ సైనికుల్ని హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లో నేటికీ ఏటా నవంబర్ 16 న ఉదాదేవి స్మారక కార్యక్రమాలు గౌరవ శ్రద్ధలతో జరుగుతుంటాయి. ఝల్కారీబాయి ఝల్కారీ బాయి.. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సిపాయి. ప్రథమ భారత సంగ్రామంలో వీరనారిగా చిరస్మరణీయురాలైన దళిత యోధురాలు. యుద్ధ వ్యూహాలు పన్నగల యువతి. ఆ నేర్పు కారణంగానే క్రమేణా ఆమె లక్ష్మీబాయి ఆంతరంగిక సలహాదారులలో ఒకరు అయ్యారు. బ్రిటిష్ సేనలు ఝాన్సీని చుట్టుముట్టినప్పుడు లక్ష్మీబాయిని తప్పించడానికి ఆమెలా వేషం మార్చుకుని శత్రుమూకలపైకి లంఘించారు. ఆ ధైర్యసాహసాలే ఝల్కారీ బాయిని బుందేల్‌ఖండ్ ఆధునిక జానపద కథలో నాయికను చేశాయి. బ్రిటిష్‌వారితో పోరాడుతూనే 1858 ఏప్రిల్ 4న ఆమె అమరనారి అయ్యారు. ఝల్కారీ సాహసకృత్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బాల్యంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుని ఉన్న ఝల్కారీ ఓ రోజు పశువులను మేపుతున్నప్పుడు ఆమెపై ఒక పులి దాడి చేయబోయింది. అప్పుడు ఝల్కారీ తన చేతిలోని కర్రతోనే లాఘవంగా పులిపై లంఘించి పులిని హతమార్చిందని ఇప్పటికీ ఆమె పుట్టిన భోజ్లా గ్రామంలో (ఝాన్సీ) కథలు కథలుగా చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం అవంతీబాయి లోధీ జ్ఞాపకార్థం విడుదల చేసినట్లే ఝల్కారీ స్మారక చిహ్నంగా కూడా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. -
ఊహించని పరిణామం: వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దు దేశం చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిహద్దులో గుంటనక్కలా వేచి చూస్తున్న చైనా చివరకు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ అయ్యింది. భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందేమో అనే దాక పరిస్థితి వచ్చింది. చివరకు అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికీ ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. -
సైనికులపై విరుచుకుపడ్డ తాలిబన్లు: 16 మంది మృతి
కాబూల్: సైనికులపై తాలిబన్లు మూకుమ్మడి దాడి చేశారు. కనిపించిన వారిని కాల్చి పడేశారు. దీంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖాన్ అబాద్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలపై ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్లు తపాయి అక్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగపడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో కాల్పులు జరపడంతో దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు దాడికి పాల్పడ్డ వారిని కనిపెట్టే పనిలో పడ్డాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. తాలిబన్ల ఆచూకీ కోసం బలగాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. రెండు రోజుల కిందట తాలిబన్లపై భద్రతా బలగాలు దాడి చేసి 15 మందిని ఎన్కౌంటర్ చేయగా దానికి ప్రతిచర్యగా తాలిబన్లు ఈ దాడికి తెగపడ్డారు. దీంతో 16మందిని బలి తీసుకున్నారు. -
సాగు చట్టాలపై ఆందోళన తొలగించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో భారత సాయుధ దళాలు సదా సిద్ధంగా ఉంటాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేందుకు సరైన సమన్వయంతో సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా విస్తరణ వాద ప్రయత్నాన్ని భారతీయ జవాన్లు సాహసోపేతంగా తిప్పికొట్టిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. నేటి 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన రైతులకు దేశవాసులంతా సెల్యూట్ చేస్తారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా సంస్కరణ మార్గం తొలి దశలో అపార్థాల పాలవుతుందని, అయితే, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో నెలకొన్న, రాజ్యాంగ విలువల్లో భాగమైన సౌభ్రాతృత్వ భావన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా ఆయన అభివర్ణించారు. అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా భారత్ నిరాశను దరి చేరనీకుండా, ఆత్మ విశ్వాసంతో సుదృఢంగా నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కూడా ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం కరోనా టీకాను తీసుకోవాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు.టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ పెరేడ్ చాలా ప్రత్యేకం! భారత్ డెబ్భైరెండో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో దర్శనమిస్తుండగా, కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో మిస్సవుతున్నాయి. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ట్రూప్స్, తొలి మహిళా ఫైటర్ పైలెట్, కొత్తగా ఏర్పడ్డ లడఖ్ శకటం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ ప్రదర్శన తొలిమారు రిపబ్లిక్‌డే పెరేడ్లో దర్శనం ఇవ్వనున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవ పెరేడ్లో చీఫ్ గెస్ట్ లేకపోవడం ఇదే తొలిసారి. అలాగే మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా ఈ దఫా లేవు. -
త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్(ఇమ్‌సాస్)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. క్షిపణుల కంటే సెల్ ఫోన్లే శక్తివంతం మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. -
పరాక్రమంతో తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్‌నాథ్ సింగ్ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు. కవ్వింపులకు బదులిస్తాం:రావత్ కోల్‌కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టిబెట్‌లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు. -
సాయుధ దళాల కుటుంబాలకు గవర్నర్ సత్కారం
సాక్షి, రాజ్‌భవన్ : దేవ సరిహద్దులో రక్షణలో అసువులు బాస్తున్న సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం అత్యావశ్యకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్ ప్రత్యేకంగా సన్మానించారు. మాతృభూమి రక్షణలో సైనికులు చూపిన ధైర్య సాహసాలు, త్యాగాలను పతాక దినోత్సవ వేడుకలు గుర్తుచేస్తాయని గవర్నర్ ప్రస్తుతించారు. జెండా దినోత్సవ నిధికి దేశ ప్రజలంతా తమ వంతు సహకారం అందించటం, సైనికుల కుటుంబాల పట్ల మన సంఘీభావాన్ని తెలియచేయటమేనని గవర్నర్ బిశ్వ భూషణ్ అన్నారు. (హోంగార్డులు నిస్వార్థ సేవకులు) దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, సువిశాల భారతావని రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరో వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారన్నారు. పతాక దినోత్సవ నిధికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సహకారం అందించడానికి అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి విరాళాలు సేకరించటంలో ప్రథమ స్థానం దక్కించుకున్న కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి.రాచయ్య, ద్వితీయ స్ధానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాసైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాద రావు, జిల్లా సంయిక్త పాలనాధికారి తేజ్ భరత్, తృతీయ స్దానం దక్కించుకున్న తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ విభాగం నుండి జె.మల్లికార్జున రావులను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. 2019 సంవత్సరానిగాను సాయుధ దళాల పతాక నిధి సేకరణలో పతాకాల విక్రయం, హుండీల ద్వారా గరిష్ట వసూళ్లను సాధించడానికి వీరు ప్రత్యేకంగా కృషి చేసారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య, వీరనారి రోహిణికి గవర్నర్ ఈ సందర్భంగా నగదు పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో అంతరంగిక శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ కుమార్, రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు సంచాలకులు యమ్ డి హసన్ రెజా, సహాయ సంచాలకులు వివి రాజా రావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (అది ఎయిర్‌ఫోర్స్ మిస్సైల్ శకలం) -
ఎస్పీజీ: మరో కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ)లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి దాకా పలువురు ప్రముఖ వ్యక్తులకు భద్రత కల్పించిన ఈ విభాగం.. ప్రధాన మంత్రికి మాత్రమే భద్రత కల్పించేలా కేంద్రం కీలక మార్పులు చేపట్టడంతో తాజాగా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డెప్యుటేషన్ పూర్తయిన సుమారు 200 మంది సిబ్బందిని మాతృ విభాగాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. (ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన) కాగా కమాండో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది 4 వేల మంది వరకు ఎస్పీజీలో ఉన్నారు. వీరిని విడతల వారీగా 50 నుంచి 60 శాతం మేర వెనక్కి పంపించి, అంతర్గత రక్షణ విధుల్లో వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ భద్రతకు కేటాయించిన సిబ్బంది మాత్రమే ఎస్పీజీలో ఉంటారని అన్నారు. ఎస్పీజీ ఏర్పాటయ్యాక ఇలా కుదింపు చేపట్టడం ఇదే ప్రథమం. 1985లో ఏర్పాటైన ఎస్పీజీ కోసం వివిధ పారామిలటరీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు. -
కరోనా నియంత్రణకు రంగంలోకి కమాండోలు
తిరువనంతపురం: కరోనా కేసుల నియంత్రణకు కేరళ ప్రభుత్వం కమాండోలను రంగంలోకి దించింది. వివరాల్లోకెళ్తే.. తిరువనంతపురంలోని పూంతారా గ్రామంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికితోడు ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తుండటంతో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజున పూంతారా గ్రామ సరిహద్దులను మూసివేస్తూ.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలను నియంత్రించడానికి 25 మంది స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ కమాండోలను మొహరించారు. కాగా.. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటినుంచి కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతోనే తాజాగా కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేరళలో ఇప్పటిదాకా 6,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 2,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,559 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం -
పుల్వామాలో తప్పిన పెను ముప్పు
-
కరోనాపై ‘కంటికి కనిపించని యుద్ధం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో త్రివిధ దళాలను, వ్యూహాత్మక సంపత్తిని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న భద్రతా బలగాలు.. మరో వైపు సరిహద్దుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని దేశం చేస్తున్న ‘అతిపెద్ద అదృశ్య యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. ‘కోవిడ్–19పై సాగిస్తున్న పోరు అతిపెద్ద అదృశ్య యుద్ధం. మానవత్వంపై జరుగుతున్న యుద్ధం. దేశ ఆర్థిక భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే యుద్ధం’అని ఆయన అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడులు యథాతథం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైన్యం దాడులు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ చొరబాటుదారులు సరిహద్దులు దాటి దేశంలోకి రాకముందే వారిని సైన్యం అడ్డుకుంటుందని తెలిపారు. కోవిడ్–19 నుంచి కాపాడుకునే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య శాఖ, వైద్య సంస్థల సూచనలను త్రివిధ దళాలు పాటిస్తున్నాయన్నారు. నేవీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు, కరోనా ప్రభావం సైనిక బలగాలపై పడుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
'రాజకీయాలకు దూరంగా ఉంటాం'
న్యూఢిల్లీ: ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు కలిసి ఒకే జట్టుగా పనిచేస్తాయని దేశ తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణే, వాయుసేన అధిపతి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: 'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్' ఈ సందర్భంగా ఆర్మీ, వాయుసేన, నౌకాదళంలో రాజకీయాల జోక్యంపై బిపిన్ రావత్ స్పందిస్తూ.. రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని పేర్కొన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వారి సూచనల ప్రకారం పనిచేస్తామని ఆయన తెలిపారు. ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు మధ్య మరింత సమన్వయం కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. కాగా గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య -
సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి
పుణె: సాయుధ బలగాల సంక్షేమానికి ప్రజలు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం పుణేలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్లో విడుదల చేశారు. ‘ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా అత్యుత్తమ ధైర్య సాహసాలు చూపుతున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు నా సెల్యూట్. మన బలగాల సంక్షేమానికి మీరు కూడా సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ డైరెక్టర్ జనరళ్లు, ఇన్స్పెక్టర్ జనరళ్ల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జరిగిన ఈ సదస్సుకు హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి: గవర్నర్
లక్డీకాపూల్: దేశానికి సైనికులు చేసే సేవలు వెలకట్టలేనివని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించేందుకు నిధిని ఏర్పా టుచేయడం అభినందనీయమన్నారు. శని వారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.52 లక్షలు విరాళాలను సేకరించిన హైద రాబాద్ ప్రాంతీయ సైనిక్ సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్ నోరి సేవలను గవర్నర్ కొనియాడారు. ఈ సందర్భంగా నోరికి రాష్ట్ర స్థాయిలో రోలింగ్ ట్రోఫీని ప్రదానం చేశారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ మాట్లాడారు. గవర్నర్ తమిళిసైతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ శనివారం గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక అంతకుముందు తనను కలిసిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్‌డే ఫండ్‌కు కొంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేశారు. మోడ్రన్‌గా తీర్చిదిద్దుతాం... సుల్తాన్‌బజార్: ఉస్మానియా ఆస్పత్రిని మోడ్రన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అల్యూమినీ అసోసియే షన్ ఆధ్వర్యంలో శనివారం కోఠిలోని ఓఎంసీ ఆడిటోరియంలో గ్లోబల్మీట్– 2019 నిర్వహించారు. దీనికి హాజరైన గవర్నర్.. ప్రొఫెసర్ ధర్మరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్కిషన్ని సత్కరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ కార్యదర్శి డాక్టర్ కృష్ణమూర్తి, అధ్యక్షులు ఆర్ఎస్ తపాడియా, ట్రస్ట్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రేపు యాదాద్రికి గవర్నర్ 10, 11 తేదీల్లో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన ఖరారైంది. అదే రోజు స్వామి దర్శనం అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజున అక్కడే బస చేసి, 10వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం లక్ష్మీ పంప్‌హౌస్, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీలను సందర్శిస్తారు. 11వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న గవర్నర్, మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం నందిమేడారంలోని ప్యాకేజీ–6 పనులను తమిళిసై పరిశీలించనున్నారు. -
బెజవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ
సాక్షి, విజయవాడ: సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఫుడ్ కోర్ట్ వరకు సాగిన ర్యాలీలో వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాడేట్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆర్మ్డ్ ఫోర్స్ ఫండ్‌కు అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలని కోరారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన సైనికుల కుటుంబాలకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నుంచి ఈ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. -
'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'
సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్‌కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు. కెన్నత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు. కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు. భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. -
నివురుగప్పిన నిప్పులా కశ్మీర్
శ్రీనగర్‌లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సీఆర్పీఎఫ్ బలగాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్–జమ్మూ మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 6–7 గంటల్లో దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సీఆర్పీఎఫ్ పోస్ట్(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు. ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిసిన కొందరు కశ్మీరీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరిచారు. తమ జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదనీ, విశ్వాసంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల్లో భయాందోళన.. ఆర్టికల్ 370తో తమ జీవితాలు మారిపోతాయనే వాదనను స్థానిక కశ్మీరీలు తిరస్కరిస్తున్నారు. ‘సగటు కశ్మీరీ కుటుంబం ఉన్నంతలో హుందాగా బతికేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్ సాగు, కళాత్మక పనులు, చేతివృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యముంది. దీంతో సొంతంగా నిలదొక్కుకోవాలన్న తపన వీరిలో చాలా అధికం. అయితే కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు కశ్మీర్లో స్థిరపడ్డా, లేదంటే కేంద్రం నిర్ణయంతో ఉగ్రవాదం తిరిగి పుంజుకున్నా తాము ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఏళ్లుగా తాముపడిన కష్టాలకు ఇక ఓ ముగింపు దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో తెలుగు వారు కశ్మీర్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో పలువురు తెలుగువాళ్లు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలవారిని కశ్మీరీలు గౌరవిస్తారనీ, ఆతిథ్యం విషయంలో ఎవరైనా వారి తర్వాతేనని తెలుగువాళ్లు చెప్పారు. మరోవైపు వచ్చే సోమవారం బక్రీద్, అనంతరం ఆగస్టు 15 వస్తుండటంతో అప్పటివరకూ ఆంక్షలు కొనసాగే అవకాశముందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. -(జమ్మూకశ్మీర్ నుంచి సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిలుద్దిన్) -
షోపియాన్‌లో ఎదురుకాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులకు, భారత సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా బోనాబజార్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం షోపియాన్ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. #Shopian #encounter update: 02 #terrorists killed. #Arms & #ammunition recovered. #Identities & affiliations being ascertained. @JmuKmrPolice @Sandeep_IPS_JKP pic.twitter.com/nWM0CUoM1f — Kashmir Zone Police (@KashmirPolice) July 27, 2019 -
‘సాయుధ’ వ్యాఖ్యలపై చర్యలు: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో సాయుధబలగాలను వాడుకోవడంపై కేంద్రం ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన ఫిర్యాదులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత సైన్యాన్ని ‘మోదీజీ సైన్యం’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, యూపీ సీఎం యోగిలను భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించామని వెల్లడించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఇటీవల పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ‘మోదీజీ వాయుసేన’ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకుంటున్న ఈసీ మరికొన్ని విషయాల్లో అలసత్వం వహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ..‘రాజకీయ నేతల ఒక్కో ప్రసంగం ఒక్కో సందర్భాన్ని ఉద్దేశించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనర్థం మేం ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని కాదు’ అని అన్నారు. ‘బాలాకోట్ వీరుల’కు ఓటు వేయాలంటూ మొదటిసారి ఓటర్లకు మోదీ పిలుపునిచ్చినట్లు అందిన ఫిర్యాదును పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది. -
శవాలను గుర్తించకుండా కెమికల్స్ ప్రయోగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చిన తరువాత వారి శవాలను గుర్తించడానికి వీల్లేకుండా కెమికల్స్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాది అయినా.. ఇంకెవరైనా.. మనిషిగా పుట్టిన ప్రతీ వ్యక్తికి చావు తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని గుర్తుచేశారు. సాయుధ దళాలు ఎన్కౌంటర్స్ తర్వాత మృతదేహాలపై కెమికల్స్ ప్రయోగించి.. శవాలను గుర్తుపట్టకుండా చేయడం అమానవీయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని శాంగస్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బుధవారం మీడియాతో మాట్లాడారు. నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. వార్తల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ముఫ్తీ హయాంలోనే కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఎక్కువగా జరిగిందన్నారు. సైన్యం కెమికల్స్ ఉపయోగించిందా? లేదా? అన్నది ఆమెకే తెలియాలని అన్నారు. ముఫ్తీ కామెంట్స్‌ను ఎలక్షన్ జిమ్మిక్‌గా వర్ణించారు. కాగా, కశ్మీర్‌లోని సాయుధ దళాలు కెమికల్ ప్రయోగిస్తున్నాయన్న ఆరోపణలు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. సైన్యం మాత్రం ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. జెనీవా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులపై సాయుధ దళాలు కెమికల్స్ ఉపయోగించడం నిషిద్ధం. -
ఆ పార్టీ మ్యానిఫెస్టోతో దేశ భద్రతకు ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నిర్వీర్యం చేస్తే.. దేశ భద్రతా వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశముందని ఆమె బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఏఎఫ్ఎస్పీఏను సమీక్షిస్తామని, జమ్మూకశ్మీర్లోన్ని అన్ని వర్గాల వారీతో బేషరతుగా చర్చలు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించిన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మ్యానిఫెస్టో సాయుధ బలగాలను బలహీనపరిచేలా ఉందని, భదత్రా బలగాలకు ఉన్న రక్షణ పొరను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. ‘ఏఎఫ్ఎస్పీఏను నిర్వీర్యం చేసి.. భద్రతా దళాలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ల అధికారాలు తగ్గించాలని ఆ పార్టీ భావిస్తోంది. దేశద్రోహం చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతోంది’ అని ఆమె అన్నారు. అయితే, నిర్మలా సీతారామన్ విమర్శలను కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించిన కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం తోసిపుచ్చారు. ఐదేళ్లు అధికారుంలో ఉన్న బీజేపీ రెండు కీలకమైన విషయాల (ఏఎఫ్ఎస్పీఏ, జమ్మూకశ్మీర్)పై ఉదాసీన వైఖరితో భారత్‌కు ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా మారుస్తోందని విమర్శించారు. -
భారీ విరాళం.. బీసీసీఐ ‘సెల్యూట్’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైనిక సంక్షేమ నిధికి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నెల 23న జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఈ భారీ మొత్తాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారిని మ్యాచ్‌కు అతిథిగా పిలిచి ఈ విరాళాన్ని అందించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్ల(గతేడాది అయిన ఖర్చు)తో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. చెన్నై వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ, కోహ్లి సమక్షంలో భద్రతా దళాల అధికారులకు చెక్‌ను అందించనున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా.. రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌తో బరిలో దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం
-
ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశం అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు కీలక విషయాలపై మీడియాతో సమావేశం నిర్వహించారు. 'భారత సైనిక స్థావరాలపై పాక్ బాంబులు వేసింది. వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్ విమానాలు చొరబడడాన్ని గమనించాము. వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. మా దాడిలో పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాము. ఈ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలింది. ఈ ఆపరేషన్‌లో భారత్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21ను కోల్పోయాము. రెండు పాక్ విమానాలను భారత్ కూల్చింది. పాకిస్తాన్ అనేక అబద్ధాలు ఆడింది. ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారని తప్పుడు సమాచారం చెప్పి, ఆ తర్వాత మాట మార్చింది. ఎఫ్-16 విమానాలు వాడలేదంటూ పాక్ కట్టుకథలు చెప్పింది. అయితే ఎఫ్-16 విమానాలు వాడిందనడాకి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ కుట్రలు ఫలించలేదు' అని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆర్జీకే కపూర్ తెలిపారు. ఈ సందర్భంగా పాక్ ఉపయోగించిన విమాన శకలాలను ఆర్మీ మీడియాకు చూపించింది. 'ఎల్ఓసీ వెంబడి చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాం. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. పాక్ చర్యలు తిప్పి కొట్టేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. పధాతిదళాలు నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నాయి' అని ఆర్మీ ఛీఫ్ మేజర్ జనరల్ సురేందర్ సింగ్ మహల్ చెప్పారు. 'ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారతీయ నావికా దళం సర్వసన్నద్ధంగా ఉంది. సముద్రం, భూమి నుంచి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేశ రక్షణకు నేవీ ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా సిద్ధం' అని నేవీ ఛీఫ్ రేర్ అడ్మిరల్ దల్బీర్ సింగ్ గుజరాల్ అన్నారు. 'అభినందన్ రేపు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాము. జెనీవా ఒప్పందం ప్రకారమే అతన్ని తిరిగి పంపుతున్నారని భావిస్తున్నాము. త్రివిధ దళాలు ఒక్కటై దేశ భద్రతను కాపాడుతాయి. కేవలం ఉగ్ర శిబిరాలపై దాడి చేయడానికి మాత్రమే ఆపరేషన్ చేపట్టాము. కానీ పాక్ మాత్రం భారతీయ మిలిటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించింది. దేశ రక్షణకు, ఈ ప్రాంత పరిరక్షణకు ఆర్మీ కట్టుబడి ఉంది. పాక్ ఏ రకంగా చొరబడటానికి ప్రయత్నించినా గట్టి బుద్ధి చెప్తాము. మా యుద్దం ఉగ్రవాదులతో కొనసాగుతుంది' అని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి. -
త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్...
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ హద్దుమీరి భారత గగనతలంలోకి యుద్ధ విమానాలతో చొచ్చుకురావడంతో త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి చర్యల కోసం పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో బుధవారం వరుస సమావేశాలతో ప్రధాని బిజీబిజీగా గడిపిన క్రమంలో భద్రతా దళాలు పూర్తిస్వేచ్ఛతో చర్యలు చేపట్టాలని సూచించారు. బాలకోట్ స్థావరంపై ఐఏఎఫ్ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. మిగ్-21 ఫైటర్ జెట్‌ను పాకిస్తాన్ నేలకూల్చిన విషయాన్ని, భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించడంపై కూడా చర్చించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో పాటు ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆయనను కలుసుకున్న త్రివిద దళాధిపతులు సరిహద్దుల్లో పరిస్థితిని వివరించారు. గడిచిన 24 గంటల్లో త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమవడం అది రెండవసారి కావడం గమనార్హం. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ నుంచి కవ్వింపు చర్యలు మొదలైన సంగతి తెలిసిందే. -
సర్జికల్ స్ట్రయిక్స్ సంబరాలు : యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రయిక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మాటువేసిన తీవ్ర వాదులను మట్టుబెడుతూ.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి.భారత సైన్యం జరిపిన ఈ దాడులతో పాక్ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒళ్లు గగుర్పుటించే వీడియోలు కూడా బయటకి వచ్చాయి. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన తర్వాత భారత సైన్యాన్ని వెల్లువెత్తిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. మరో వారం రోజులకు భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్‌కు రెండేళ్ల పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్ 29వ తేదీని సర్జికల్ స్ట్రయిక్స్ దినోత్సవంగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు, ప్రత్యేక కవాతులు, సాయుధ దళాలకు తమ మద్దతు తెలుపుతూ డిజిటల్ లేదా చేతిరాత గ్రీటింగ్ కార్డులను పంపడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్సీసీ యూనిట్లు కూడా సెప్టెంబర్ 29న ప్రత్యేక పరేడ్లను నిర్వహించనున్నాయి. ఎన్సీసీ కమాండర్లు కూడా సరిహద్దు రక్షణ గురించి ప్రసంగించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రత్యేక మల్టీమీడియా ఎగ్జిబిషన్లో నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించే అవకాశం ఉందని, వీటిని విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించాలని ఉపకులపతులకు గురువారం రాసిన లేఖలో యూజీసీ వెల్లడించింది. -
కేరళకు మరిన్ని సహాయక బృందాలు
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 5 మెడికల్ టీంలు, 2 కాలమ్‌లు(ప్రతీ కాలమ్‌లో 50 నుంచి 60 మంది సిబ్బంది ఉంటారు), 2 అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు, 2 చేతక్ హెలికాఫ్టర్లు సహాయంగా పంపించారు. ఇండియన్ నేవీ నుంచి 10 రెస్క్యూ టీంలు, 10 మోటారు బోటులు, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్, మరొక సీకింగ్ హెలికాఫ్టర్లు పంపారు. ఇండిన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు పంపారు.ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 6 మోటారు బోట్లు, 4 సాధారణ బోట్లు, 21 హైర్డ్ బోట్లులు పంపించారు. అలాగే ఐసీజీఎస్ విజిత్ నౌక ద్వారా 40 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. నౌక ముంబై నుంచి కొచ్చికి ఇదివరకే బయలుదేరింది. -
దేశ రక్షణకు జవాన్ల కొరత..!
సాక్షి, న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సైనికులు కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు బుధవారం లోక్‌సభలో రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మూడు విభాగాల్లో( రక్షణ, నావీ, ఎయిర్‌ఫోర్స్) కలిపి 9096 మంది అధికారుల కొరత ఉన్నట్లు రక్షణ శాఖ సహాయక మంత్రి సుభాష్ భోమ్రే లోక్‌సభలో తెలిపారు. సభలో ఓ ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రక్షణశాఖలో 7298 మంది సైనికుల కొరత ఉన్నట్లు వెల్లడించారు. నావీలో 1606, ఎయిర్‌ఫోర్స్‌లో 192 మంది అధికారుల కొరత ఉన్నట్లు మంత్రి తెలిపారు. రక్షణశాఖలో అధికారికంగా ఉండాల్సిన సంఖ్య 49933కి గాను, 42635 మంది ఉన్నారు. నావీలో 11352 అధికారులకు 9746 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 12392కి గాను 12584 మంది ఉన్నట్లు తెలిపారు. జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో ఇటు చైనా, అటు పాకిస్తాన్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో త్రివిధ దళాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. రక్షణశాఖలో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడటంపై ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖను బలోపేతం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. -
38 మంది మృతి..50 మంది అదృశ్యం
టోక్యో: కుండపోత వర్షాల కారణంగా దక్షిణ జపాన్‌లో 38 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 50 మంది జాడ తెలియకుండా పోయింది. హ్యోగో, ఒకయామా, గిఫు ఫుకౌకా, నాగసాకి, సాగా, హిరోషిమా, టాట్టోరీ తదితర ప్రాంతాల్లో జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) హైఅలర్ట్ ప్రకటించింది. సహాయక చర్యల్లో భాగంగా 650 మంది భద్రతా సిబ్బందిని ముంపు ప్రాంతాలకు పంపించింది. సుమారు 40 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశముందని జేఎంఏ హెచ్చరించింది. జపనీయుల ద్వీపసమూహం గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా జలమయమైంది. ఆదివారం వరకు వర్షపాతం నమోదవుతుందని జేఎంఏ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం గంటకు 8 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుందని హెచ్చరించింది. -
తీవ్రవాద సంస్థలోకి కశ్మీరీ యువత
శ్రీనగర్ : కశ్మీరీ యువతను ఆకర్షించడమే లక్ష్యంగా తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో మన్వన్ వనీ అనే పీహెచ్డీ విద్యార్థి ఈ సంస్థలో చేరాడు. తాజాగా కుప్వారాకు చెందిన బిలాల్ అహ్మద్ షా అనే 27 ఏళ్ల యువకుడు హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు ప్రకటించాడు. చేతిలో తుపాకీ పట్టుకుని తీవ్రవాద సంస్థ యూనిఫామ్ ధరించిన బిలాల్ ఫోటో షాబాజ్ అనే మారు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరిగి రావాలంటూ అభ్యర్థన.. మార్చి 2న లడఖ్ వెళ్తున్నట్లుగా సోదరునితో చెప్పిన బిలాల్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఆనాటి నుంచి అతని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ తుపాకీ పట్టుకున్న నా సోదరుని ఫోటో చూస్తే ఆందోళన కలుగుతోంది. మా మాట విని ఇంటికి తిరిగి రా. చిన్ననాడే నాన్నను మనకు దూరం చేసిన అదే మార్గంలోకి వెళ్లి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ’ బిలాల్ సోదరి షకీనా అక్తర్ పలు న్యూస్ ఏజెన్సీల ద్వారా అభ్యర్థిస్తోంది. కాగా బిలాల్ తండ్రి షంషుద్దీన్‌కు కూడా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండేవి. 1992లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో అతను మృతి చెందాడు. మూడేళ్లలో 280 మంది.. గతంలోనూ ఉత్తర కశ్మీర్ నుంచి ఎంతో మంది యువకులు హిజ్బుల్‌లో చేరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత మూడేళ్ల కాలంలో 280 మంది యువకులు మిలిటెంట్ గ్రూపులో చేరారు. అందులో 126 మంది గతేడాది వివిధ ర్యాంకులు కూడా పొందారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన బుర్హన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం ఆ సంస్థలో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
అంతులేని కథ - అత్యాచారాల వ్యథ
‘‘మయన్మార్‌లోని రాఖైన్ ప్రాంతంలో రొహింగ్యా ముస్లింలు నివసించే కనీసం 200 గ్రామాలను సైనికదళాలు తగలబెట్టాయి. వందలాది మంది పౌరుల ప్రాణాలు తీశారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పారిపోయే శరణార్థులను గాయపరచి, చంపే లక్ష్యంతో సరిహద్దులో ఆర్మీ మందుపాతరలు పెట్టింది. స్త్రీలపై అత్యాచారాలు సహా అన్ని రకాల హింసాత్మక పద్ధతులు ప్రయోగించారు, ’’ అంటూ ఈ నెల ఆరున అమెరికా ప్రతినిధులసభ మయన్మార్ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే, రొహింగ్యా జాతి నిర్మూలనకు ఈ వర్గం స్త్రీలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని తాజాగా వార్తలందుతున్నాయి. పురుషులు పారిపోగా నిస్సహాయ స్థితిలో ఉన్న రొహింగ్యా మహిళలను వారి ఇళ్లలోనే బంధించి బలాత్కారాలు చేయడం సైనికులకు అలవాటుగా మారింది. యూనిఫాంలో ఉన్న ఆర్మీ సైనికులు కొందరు స్త్రీలపై వారి భర్తల ముందే అత్యాచారం చేసినట్టు అనేక మంది మహిళలు పాశ్చాత్య మీడియా ప్రతినిధులకు వెల్లడిస్తున్నారు. పెళ్లికాని యువతులు, వివాహితలనే తేడా లేకుండా ఒక వ్యూహం ప్రకారం రేప్ చేసి వారిలో భయోత్పాతం సృష్టిస్తున్నారని కూడా తమ పేరు చెప్పడానికి భయపడిన యువతులు వివరిస్తున్నారు. ఇంత పాశవికంగా అత్యాచారాలకు గురయ్యాక ప్రాణాలు దక్కించుకుని బంగ్లాదేశ్‌లోని కాక్స్ బాజార్ చేరుకున్న రొహింగ్యా మహిళలు సైనికుల రాక్షస కృత్యాలను కథలు కథలుగా చెబుతున్నారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని రాఖైన్ నుంచి బెంగాలీ ముస్లిం తెగకు చెందిన రొహింగ్యాలందరినీ తుడిచిపెట్టడానికి రేప్‌ను బలమైన ఆయుధంగా ఆర్మీ వాడుకుంటోందని మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన 37 పేజీల నివేదికలో పేర్కొంది. ఆర్మీ ఆయుధం ‘రేప్’ ‘‘రొహింగ్యాలను సమూలంగా నిర్మూలించడానికి లేదా తరిమికొట్టడానికి వారి ఆడపడుచులపై సైన్యం ప్రయోగిస్తున్న దుర్మార్గమైన ఆయుధం రేప్. బర్మా సైన్యం రాక్షస చేష్టలతో లెక్కకు అందనంత మంది మహిళలు కోలుకోలేని స్థాయిలో మానసికంగా, శారీరకంగా గాయపడ్డారు,’’ అని ‘ఆలాఫ్ మై బాడీ వాజ్ పెయిన్-సెక్సువల్ వయలెన్స్ అగెనెస్ట్ రొహింగ్యా విమిన్ అండ్ గాల్స్ ఇన్ బర్మా’ (నా శరీరమంతా బాధే-బర్మాలో రొహింగ్యా మహిళలు, యువతులపై లైంగిక హింస) అనే పేరుతో హ్యూమన్‌రైట్స్ వాచ్ ప్రచురించిన నివేదిక రచయిత స్కయ్ వీలర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి సైనిక దళాలు కొనసాగిస్తున్న దాష్టీకాలు, అత్యాచారాల ఫలితంగా ఇప్పటికి ఆరున్నర లక్షల మంది రొహింగ్యాలు మయన్మార్ వదిలి బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా చేరుకున్నారు. ఇలా వచ్చిన 52 మంది మహిళలు, ఆడపిల్లలను హ్యూమన్ రైట్స్ వాచ్ కలిసి మాట్లాడింది. వారిలో 29 మంది బలాత్కారానికి గురయ్యాక ప్రాణాలతో బయటపడినవారు. ఇంకా 18 ఏళ్లు నిండని యువతులు వారిలో ఉన్నారు. సైనికుల చేతుల్లో అత్యాచారాలకు గురైన ఆడవాళ్లందరూ 19 గ్రామాలకు చెందినవారే. ఈ ప్రాంతంలో రొహింగ్యాలు కాని స్థానిక బర్మా జాతికి చెందిన పురుషులు తరచు ఆర్మీతో చేతులు కలిపి రొహింగ్యాలను ఇక్కడి నుంచి ఖాళీచేయించే పనిలో భాగంగా అన్ని రకాల అరాచకాలకూ పాల్పడ్డారు. అప్పటికే భయకంపితులైన రొహింగ్యా స్త్రీలపై సైనికులతోపాటు స్థానికులూ అత్యాచారాలు జరిపారు. హాథీపారా గ్రామానికి చెందిన హాలా సడక్ అనే 15 ఏళ్ల బాలిక తనను పది మంది సైనికులు ఎంత క్రూరంగా బలాత్కరించిందీ వివరించింది. సామూహిక అత్యాచారం చేశాక ఇలాంటి ఆడపిల్లలను మళ్లీ వాళ్ల ఇళ్ల దగ్గర వదలిపోవడం ఆర్మీకి అలవాటుగా మారింది. బాస్నియా తరహాలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు పాతికేళ్ల క్రితం(1992-93) పూర్వపు యుగోస్లావియా విచ్ఛిన్నమయ్యాక దానిలో అంతర్భాగమైన బాస్నియాలోని ముస్లిం మహిలపై ఐరోపా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యాచారాలు జరిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడినవారంతా సెర్బియన్లే. జాతుల పోరాటంలో చివరికి మహిళలు ఎక్కువ మంది బలయ్యారు. మూకుమ్మడి బలాత్కారాలకు కారకుడైన బాస్నియా సెర్బియా నేత రదోవా కరాజిచ్ను విచారించిన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ కఠినశిక్ష విధించింది. ఇప్పుడు బర్మాలో జాతి ‘ప్రక్షాళన’ కార్యకలాపాల మాటున రొహింగ్యా స్త్రీలపై అత్యాచారాలు జరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకటించగా, ఈ కథనాల్లో నిజం లేదని మయన్మార్ ఆర్మీ ఖండించింది. రొహింగ్యాలపై, మహిళలపై ఇదే స్థాయిలో అత్యాచారాలు కొనసాగితే ఆంక్షలు విధిస్తామని కూడా అనే ఐరోపా దేశాలతోపాటు అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తోంది. ----(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సాయుధ పోరాటంలో సమిధలవుతున్న చిన్నారులు
ఐక్యరాజ్యసమితి: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మావోయిస్టులు, వేర్పాటువాద సంస్థలు చిన్నారుల్ని చేర్చుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సాయుధ పోరాటంలో చిన్నారులు’ పేరిట ఐరాస రూపొందించిన వార్షిక నివేదికను గుటెరస్ విడుదల చేశారు. భద్రతా బల గాలు, సాయుధ గ్రూప్‌ల మధ్య హింసకు చిన్నారులు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఒక్క జమ్మూ కశ్మీర్‌లోనే దాదాపు 30 స్కూళ్లను వేర్పాటువాదులు ధ్వంసం చేసి, తగులబెట్టారని గుటెరస్ తెలిపారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సాయుధ శిక్షణను పాఠ్యాంశంగా చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోలు, వేర్పాటు వాదులు తల్లిదండ్రులను బెదిరించి వారి పిల్లల్ని చేర్చుకుంటున్నారని వెల్లడించారు. -
డోక్లామ్: ఆర్మీకి అర్జెంటుగా 20వేల కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆర్మీ ఆధునీకరణ, రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం అత్యవసరంగా రూ. 20వేలకోట్లను అదనంగా కేటాయించాలని రక్షణమంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సిక్కిం-భూటాన్, టిబేట్ ట్రైజంక్షన్‌లోని డోక్లామ్ కొండప్రాంతంలో భారత-చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ నుంచి ఈ ప్రతిపాదన అందడం గమనార్హం. 2017-18 బడ్జెట్లో రక్షణశాఖకు అధిక ప్రాధాన్యమిచ్చి.. రూ. 2.74 లక్షల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులకు తోడు అదనంగా రూ. 20వేల కోట్ల అర్జెంటుగా కేటాయించాలంటూ రక్షణశాఖ.. కేంద్ర ఆర్థికశాఖను కోరింది. ఈ మేరకు రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా నేతృత్వంలోని అధికారుల బృందం ఆర్థికశాఖ అధికారులతో భేటీ అయింది. రక్షణశాఖ విన్నపాన్ని సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామని ఆర్థికశాఖ తెలిపింది. రోజువారీ నిర్వహణ, జీతభత్యాల కోసం బడ్జెట్లో రూ. 1,72,774 కోట్లు కేటాయించగా, కొత్త ఆయుధాలు, ఆర్మీ ఆధునీకరణ కోసం రూ. 86,488 కోట్లను కేటాయించింది. అయితే, ఆయుధాల దిగుమతిపై సరికొత్త కస్టమ్స్ సుంకం విధించడంతో రక్షణశాఖ బడ్జెట్‌కు భారీ కన్నం పడింది. -
రక్షణ రంగానికి రూ.27లక్షలకోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లకు గాను భారత రక్షణ రంగం, ప్రభుత్వాన్ని భారీ మొత్తంలో నిధులు కోరింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును ఎదుర్కొవడానికి, అవసరమైన ఆయుధాల ఆధునీకరణ, కొనుగోలుకు ఏకీకృత రక్షణపథకం కింద 2017-2022 నాటికి రూ. 26.84 లక్షల కోట్ల రూపాయల (416 బిలియన్ డాలర్లు) కేటాయింపును కోరింది. ఇందులో భాగంగా డీఆర్డీవోతో సహా వివిధ రంగాలకు చెందిన అధిపతులు జులై 10-11 న జరిగిన యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో 13 వ పంచవర్ష ప్రణాళిక సంఘానికి నివేదిక సమర్పించారు. ప్రణాళిక సంఘం ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం. సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ సమీపంలో భారత్, చైనా బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నియంత్రణ రేఖల వెంట పాక్ జరుపుతున్న రోజువారి కాల్పులకు చెక్ పెట్టాలనే ఉద్ధేశంతో రక్షణాత్మకమైన ఖర్చులు కోసం ఈ అంచనాలు రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భద్రతా దళాల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యత ఉంటుందని సైనిక దళాలకు హామీ ఇచ్చారు. 2017-18 రక్షణ బడ్జెట్లో, రూ. 1,72,774 కోట్ల రెవెన్యూ వ్యయం ఉండగా అందులో, రూ. 86,488 కోట్లు కొత్త ఆయుధ వ్యవస్థలకు, ఆధునీకరణకు ఖర్చుచేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, రూ. 2.74 లక్షల కోట్లతో వేసిన రక్షణ బడ్జెట్, దేశ జీడీపీలో కేవలం 1.56 శాతం మాత్రమేనని, ఇది 1962లో చైనాతో జరిగిన యుద్ధ ఖర్చు కంటే అతి తక్కువ అని అన్నారు . భద్రతా బలగాలు రక్షణ బడ్జెట్ వారి కార్యాచరణ అవసరాల కోసం 2% వరకు పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 13 వ రక్షణ ప్రణాళిక ప్రకారం, భద్రతా బలగాల కోసం రూ.12,88,654 కోట్ల వ్యయం అంచనా వేయగా, రూ .13,95,271 కోట్లు ఖర్చుచేసింది. సాయుధ దళాల పరిస్థితి పూర్తిగా మెరుగుపరచడంతో పాటు ప్రతి సంవత్సరం పూర్తి స్థాయిలో నిధులు, పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత పదిహేనేళ్లగా భద్రత బలగాలు దీర్ఘకాలిక ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ ప్రణాళికలు వేస్తున్నా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి ఆమోదం లభించడం లేదు. -
వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని
ఢిల్లీ: దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. జేఎస్యూలో జాతీయవాద వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో సైన్యం సేవలను గుర్తు చేయడం గమనార్హం. సాయుధ బలగాల మూలంగానే మనం భావప్రకటన స్వేచ్చపై చర్చించుకునే స్థితిలో ఉన్నామని ధోని ట్విట్టర్ ద్వారా సైన్యం సేవలను గుర్తు చేశాడు. స్వప్రయోజనాల కంటే ముందుగా దేశం కోసం పాటుపడేలా ప్రేరణ, శిక్షణ పొందిన ప్రత్యేక బలగాలు, కమెండో యూనిట్లలో పనిచేసే సైనికులు కూడా మన లాగా సాధారణ పౌరులేనని ధోని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. As v have this debate on freedom of speech our forces r making sure v stay in position to keep debating. — Mahendra Singh Dhoni (@msdhoni) February 21, 2016 Spl forces and commando unit's r normal ppl like u and me who r highly motivated and trained to put the interest of the nation before self — Mahendra Singh Dhoni (@msdhoni) February 21, 2016 -
డిసెంబర్ 7న ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే
హైదరాబాద్: భారత జాతి కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లను స్మరించుకోవడానికి డిసెంబర్ 7న ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను నిర్వహించనున్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వారి కుటుంబాలకు, అంగవైకల్యం పొందిన జవాన్లకు, మాజీ సైనికులకు చేయూత నివ్వడం కోసం ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌ను ఏర్పాటు చేశామని, దాతలు సహాయం చేయవలసిందిగా తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్ కుమార్ కోరారు. ఆర్మీ ఫ్లాగ్ డేను హైదరాబాద్‌లో ఈనెల 7న ఉదయం11.30కు, సోమాజీ గూడలోని సైనిక్ ఆరమ్ఘర్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు హాజరు కానున్నారు. -
నడివీధిలో జవాన్ల అరాచకపర్వం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భద్రత దళాలు కర్కశంగా ప్రవర్తించాయి. నడివీధిలో యువకుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వీడియో రూపంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మణిపూర్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్ల సందర్భంగా ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. నిర్మానుషంగా ఉన్న ఓ వీధిలో భద్రత దళాలు పెట్రోలింగ్‌కు వెళ్లాయి. ఆ వీధిలో ఇద్దరు యువకులు భద్రత సిబ్బందికి కనిపించారు. అంతే జవాన్లు మానవత్వం మరచి అమానుషంగా ప్రవర్తించారు. రైఫిళ్లతో వాళ్లని కొడుతూ.. గాల్లోకి కాల్పులు జరుపుతూ భయకంపితులను చేశారు. -
‘వన్ పెన్షన్’ వచ్చేసింది
-
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుకు గ్రీన్ సిగ్నల్
► 2014 జూలై 1 నుంచి ఓఆర్ఓపీ అమలు ► నాలుగు విడతల్లో ఆరేసి నెలల్లో బకాయిల చెల్లిపు ► రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ప్రకటన న్యూఢిల్లీ: మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేస్తామని, దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇస్తామని తెలిపారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఐదేళ్లకోసారి పింఛనును సవరిస్తుంటామని పారిక్కర్ చెప్పారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుందని రక్షణ మంత్రి తెలిపారు. మన భద్రతాదళాలు అపార ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నాయని, వీళ్లు శాంతి భద్రతలతో పాటు విపత్తులు వచ్చినప్పుడు కూడా తమ సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పారిక్కర్ ప్రశంసించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా పెండింగులో ఉందని, దీనిపై ఇంతకు ముందు ప్రభుత్వాలు చాలావరకు నిర్లక్ష్యం వహించాయని చెప్పారు. యూపీఏ సర్కారు గతంలో ఒకసారి 500 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా, అది సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచించలేదని విమర్శించారు. దీన్ని అమలుచేయడానికి పాలనా పరమైన, సాంకేతిక, ఆర్థిక సమస్యలున్నాయని 2009లో పార్లమెంటులో చెప్పారన్నారు. అందుకే ఈ ప్రభుత్వం కూడా ఓఆర్ఓపీ అమలుకు కొంత సమయం తీసుకుందని, అయినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పలు సందర్భాల్లో ఓఆర్ఓపీని అమలు చేస్తామనే చెప్పారన్నారు. దీని అమలుకు నిపుణులు, మాజీ సైనికులతో చర్చించామని... అయితే వీఆర్ఎస్ తీసుకున్నవాళ్ల విషయంలోనే కొంత సమస్య వచ్చిందని పారిక్కర్ తెలిపారు. ఒకే ర్యాంకులో ఒకే సర్వీసు పూర్తిచేసిన వాళ్లకు ఎప్పుడు రిటైరయ్యారన్నదాంతో సంబంధం లేకుండా ఒకే తరహాలో ఇక మీదట పింఛను వస్తుందన్నారు. -
టాటా మోటార్స్‌కు రూ.900 కోట్ల ఆర్మీఆర్డర్
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల నుంచి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీకి 1,200 హై-మొబిలిటీ మల్టీ యాక్సిల్ ట్రక్కులను సరఫరా చేయాల్సి ఉంది. ఈ ట్రక్కులను మందుగుండు సామాగ్రి సరఫరా, ఇతర పరికరాలను ఒకచోటు నుంచి మరొక చోటుకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. హై-మొబిలిటీ వాహనాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ వెర్నాన్ నొరొన్హ తెలిపారు. -
త్రిపుర చూపిన బాట!
స్వాతంత్య్రానంతరం మన దేశంలో తీసుకొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా పేరుబడిన సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల)చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడంద్వారా త్రిపుర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తరచు జరిగే సాయుధ తిరుగుబాట్లతో అట్టుడికే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసమంటూ 1958లో ఈ చట్టాన్ని తీసుకురాగా, త్రిపురలో 1997 ఫిబ్రవరినుంచి దాన్ని అమలుచేయడం ప్రారంభించారు. ఈ చట్టం మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని, మన నేతల రెండు నాల్కల ధోరణిని బట్టబ యలు చేస్తుంది. నిజానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది స్వతంత్ర భారత పాలకులే అయినా దీని బీజాలు 1942లో సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణిచేయ డానికి బ్రిటిష్ వలస పాలకులు జారీచేసిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈ చట్టం దుర్వినియోగంపైనా, సాధారణ పౌర జీవనంలో అది కలిగిస్తున్న కల్లోలంపైనా దశాబ్దాలుగా ఆరోపణలు వస్తున్నాయి. సాయుధ దళాల చట్టం అమ లవుతున్న ప్రాంతంలో శాంతిభద్రతలను చూసే సైన్యానికి మాత్రమే కాదు...ఆ పనిలో నిమగ్నమై ఉండే సాధారణ పోలీసులకు సైతం ఈ చట్టంకింద రక్షణ ఉం టుంది. ఇది కల్పించే అధికారాలు సాధారణమైనవి కాదు. శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా కల్లోలిత ప్రాంతంలోని ఏ ఇల్లునైనా వారంటు లేకుండా సోదా చేయవచ్చు. అనుమానం వచ్చిన ఎవరినైనా అరెస్టుచేయొచ్చు. ప్రమాదకరమైన వ్యక్తి అని భావించిన పక్షంలో కాల్చిచంపొచ్చు. వారి చర్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా న్యాయస్థానాల్లో కేసు పెట్టడం కూడా సాధ్యంకాదు. ఈ చట్టం ఇస్తున్న రక్షణను అడ్డుపెట్టుకుని సాయుధ దళాల సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని...అమాయక యువకులను కాల్చిచంపుతున్నా రని, మాయం చేస్తున్నారని, అత్యాచారాలకు ఒడిగడుతున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చాన్నాళ్లనుంచి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అవి న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడు తున్నాయి. మణిపూర్‌కు చెందిన మహిళా నేత ఇరోం షర్మిల పదిహేనేళ్లనుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదే చట్టాన్ని 1990నుంచీ జమ్మూ-కశ్మీర్లో కూడా అమలుచేస్తున్నారు. ఆచరణలో ఈ చట్టం అమలువల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో తెలియాలంటే జమ్మూ-కశ్మీర్లో 2000 సంవత్సరంలో జరిగిన చిట్టిసింగ్‌పురా ఎన్కౌంటర్ ఉదం తాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అయిదుగురు యువకులు మరణించిన ఆ కేసులో నేరారోపణలను ఎదుర్కొన్న జవాన్లపై ఏ కోర్టులో విచారించాలన్న అంశం తేలడా నికే పుష్కరకాలం పట్టింది. చివరకు సైనిక కోర్టులో విచారణ జరుపుతారో, సాధారణ కోర్టుల్లో విచారణకు అంగీకరిస్తారో చెప్పాలంటూ 2012లో సుప్రీంకోర్టు ప్రశ్నించాక సైనిక కోర్టులో విచారణకు సైన్యం ఒప్పుకుంది. మణిపూర్‌లో జరిగిన ఆరు ఎన్కౌంటర్లపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు దానిపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ఆధ్వర్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక కమిషన్‌ను నియమించింది. ఆ ఉదంతాలన్నిటా మరణించింది సాధారణ పౌరులే నని కమిషన్ తేల్చిచెప్పింది. అంతేకాదు...సాయుధ దళాలు సృష్టిస్తున్న భయోత్పా తంవల్ల సాధారణ పౌర జీవనానికి భంగం కలుగుతున్నదని తేల్చిచెప్పింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనంచేసి సిఫార్సులు చేయడానికి 2005లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ సైతం సాయుధ దళాల చట్టాన్ని తక్షణం రద్దుచేయాలని సిఫార్సు చేసింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చట్టం అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబంధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ- కశ్మీర్‌లోనైనా ఈ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెబుతూ వస్తున్నది. అందువల్లే దీన్ని రద్దు చేస్తామని, అది కుదరకపోతే సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ ప్రభుత్వం కూడా చివరకు చేతులెత్తేసింది. ఆ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన చిదంబరం కోరినా చట్టం ఉపసంహరణ సాధ్యం కాలేదు. త్రిపుర తీసుకున్న తాజా నిర్ణయం వెనక అక్కడి ప్రభుత్వం పదేళ్లుగా చేస్తున్న కృషి ఉంది. మిలిటెంట్ చర్యలను అరికట్టడానికి ఆ ప్రభుత్వం బహుముఖ చర్యలు తీసుకుంది. మిలిటెంట్ల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచడంతోపాటు రబ్బరు చెట్ల సాగుద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి ప్రయత్నించింది. పర్యవసానంగా 2009 తర్వాత అక్కడ మిలిటెన్సీకి సంబంధించి పెద్ద సంఘటనేదీ జరగలేదు. ఆరేళ్ల అనుభవం తర్వాత తమకు ఈ చట్టం అవసరం లేదని త్రిపుర ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. హింసకు పాల్పడుతున్న గ్రూపులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ పేరిట సైన్యమైనా, మరొక విభాగమైనా పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడకూడదు. సామాన్య పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించకూడదు. సాయుధ దళాల చట్టంవల్ల జరుగుతున్నది ఇదే. త్రిపుర అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తే, ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తే అణచివేత చట్టాల అవసరం ఉండదు. కానీ, మన దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఏ సమస్యకైనా అణచివేతే పరిష్కారంగా భావిస్తున్నాయి. ఈ ధోరణిని విడనాడవలసిన అవసరం ఉంది. త్రిపుర నిర్ణయంతో సహజంగానే ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా, జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. సాయుధ దళాల చట్టం విషయంలో ఆ ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి. -
ఇరోం షర్మిల మళ్లీ అరెస్టు
ఇంఫాల్: సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్టు చేశారు. ఆమెపై ఆత్మాహత్యాయత్నం అభియోగాలను తిరస్కరించిన కోర్టు, షర్మిలను గురువారం విడుదల చేసింది. ఆమె విడుదలైన తర్వాత మళ్లీ నిరశనకు దిగారు. దాంతో మళ్లీ అదే అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు. అదే అభియోగంపై అరెస్టు చేసినప్పటికీ, ఇది వేరే కేసు అని తెలిపారు. -
చూస్తూ ఊరుకోవద్దు.. దీటుగా స్పందించండి
'ఎలాంటి బ్లాక్‌మెయిల్‌కు లొంగద్దు. మీరు తగిన విధంగా స్పందించండి. వాళ్లు కాలుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోనక్కర్లేదు. దీటుగా ముందుకెళ్లండి' అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైన్యానికి చెప్పారు. జాతీయభద్రతా సలహాదారు నేతృత్వంలో తగిన సలహాలు తీసుకుని, ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. ఒకవైపు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో తల మునకలుగా ఉన్న మోదీ.. పాకిస్థాన్ కాల్పుల విషయాన్ని సరిగా పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ విమర్శలకు ఆయన ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. అటు ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తూనే ఇటు భద్రతా దళాలకు కూడా తనవైపు నుంచి ఇవ్వాల్సిన సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ ఆయన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలకు వెళ్తూనే ఉన్నారు. మరోవైపు గత వారం రోజులుగా పాకిస్థాన్ కాల్పులు మరీ ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ తమ పక్కనే బాంబుల వర్షం కురుస్తోందని, ఎప్పుడు ఎటు నుంచి ఏ తూటాలు దూసుకొస్తాయో, బాంబులొచ్చి నెత్తిమీద పడతాయో చెప్పలేకపోతున్నామని కాశ్మీరీలు వాపోతున్నారు. 2003లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో పౌరులు మరణించడం ఇదే తొలిసారి. చివరకు గురువారం ఉదయం కూడా పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. దాంతో ఐదుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. 60 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ దళాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేవరకు పాక్‌తో చర్చల ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. -
కశ్మీర్లో నిషిద్ధ రాత్రి
మలుపు ప్రచురణ; వెల: రూ.150 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ ‘ప్రయాణం ముగియలేదు. అది ఎప్పటికీ ముగియదు. 1990 నుంచి పగళ్ళు భయంతో రాత్రిళ్లు కర్ఫ్యూతో కొనసాగుతున్నాయి. ఆ వాతావరణంలో అప్పుడు 14 ఏళ్ల వయసు ఉన్న నేను మత్తెక్కించే స్వాతంత్రోద్యమ నినాదాలతో సరిహద్దు మంచులో ప్రమాదకరమైన ప్రస్థానాలు వింటూ ఉత్తేజితుడనై ఉండేవాణ్ణి’ అని మొదలవుతుంది ఈ పుస్తకం. 1987లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన అల్లకల్లోలం కాశ్మీరీలలో నిద్రపోతున్న స్వతంత్రేచ్ఛని తట్టి లేపడమే కాకుండా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదం విలయతాండవం చేసింది. 1990లో జగ్మోహన్ అనే కరడుగట్టిన ముస్లిం వ్యతిరేకిని గవర్నరుగా పంపి సాయుధ దళాలకు నియంత్రణ లేని స్వేచ్ఛనిచ్చి భారత ప్రభుత్వం కాశ్మీర్ సమాజాన్ని అతలాకుతలం చేసింది. ‘పాశవికత, ధైర్యం, ప్రేమ, ద్వేషం చివరకు ఇంకా నమ్మకంతో ఉన్న కథలు విన్నాను. జ్ఞాపకం పెట్టుకున్నాను’ అంటాడు బషారత్ పీర్. కాశ్మీరీ పత్రికా విలేకరి అయిన ఈ రచయిత కాశ్మీరీల వ్యదార్థ బతుకు చిత్రాన్ని మన ముందు ఉంచిన చారిత్రక నివేదిక ‘కర్ఫ్యూడ్ నైట్’ తెలుగులో యార్లగడ్డ నిర్మల తెలుగు అనువాదంతో ‘కశ్మీర్లో నిషిద్ధ రాత్రి’గా వెలువడింది. ఒకటి అరా తప్ప ఏ సమాచార మాధ్యమమూ మన ముందు ఉంచని కాశ్మీరీల కన్నీటి కథలు ఇవి. రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలకి సంవత్సరాలు సైనిక దురాగతాలు, తీవ్రవాదుల నిర్బంధాల మధ్య కాశ్మీరీ సమాజం చిక్కుంది. ఉదయం మందు పాతరల పేలుళ్లు, ైసైనిక తనిఖీలు, గుర్తింపు కార్డులు లేనివాళ్లని బతికున్న మనుషులుగానే గుర్తించని బలగాలు, సాయంత్రం ఆరు దాటగానే బయటకు అడుగు పెట్టలేని దుస్థితి... ఇదీ కాశ్మీర్ పరిస్థితి. తియాన్మెన్ స్క్వేర్ అణచివేతను మించిన గాక్‌డాల్ వంతెన మీద హత్యాకాండ, గ్వాంటినమో బేని తలదన్నే ‘పాపా-ఇ’ కాన్సన్ట్రేషన్ క్యాంప్... ఇవన్నీ కాశ్మీరు బుక్మార్కులు. ఒకటా రెండా ఎన్నెన్ని కథలు. మీసాలు కూడా సరిగా రాని తమ పిల్లలు తీవ్రవాదాన్ని తలకెత్తుకున్నప్పుడు అటు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇంట్లో పెద్దలు పడే తపన, తీవ్రవాదంలో చేరినవాళ్ల ఆచూకీ కోసం ఇంట్లో వాళ్లందరినీ చావచితక కొట్టే సైనికులు, ఊళ్లో మందు పాతరలు పెట్టొద్దని కాళ్లావేళ్లా పడినా వినని ఉగ్రవాదులు, ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో భాగంగా ఊళ్లని ఊళ్లే తగలబెట్టే సైనికులు, ఉగ్రవాదుల మధ్య చిచ్చు పెట్టడానికి సాయుధ బలగాలు సృష్టించిన సంస్థలు, సైనిక బంకర్లుగా మారిన దేవాలయాలు, పాఠశాలలు- వీటి మధ్యే కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా బతికింది. ఇక అదృశ్యం అయినవాళ్లకు, గుర్తు తెలియని మృతదేహాలకు లెక్కే లేదు. ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ని భూతాల స్వర్గంగా మార్చేశాయి. ‘నేనూ కాశ్మీర్ ఇద్దరమూ మారిపోయాం. కాశ్మీర్ అలసిపోయింది. నేను పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు వీధుల్లో ఘర్షణ లేకపోవచ్చు. కాని అది ఆత్మల్లో నుంచి వెళ్లదు’ అంటాడు బషారత్ పీర్. గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్న కాశ్మీర్ మళ్లీ ఏ ‘క్షిపణి- 370’ని ఎదుర్కోబోతోందో అనే ఆలోచన కలిగినప్పుడు భయం వేస్తుంది. ఏ వాదనల పక్షమూ వహించకుండా యదార్థాలని మన ముందుంచిన బషారత్ పీర్ కాశ్మీర్ నేపధ్యంలో విశాల్ భరద్వాజ్ తీస్తున్న ‘హైదర్’ సినిమాకి కో రైటర్‌గా పని చేస్తూ మరే నిజాలు బయటకు తెస్తాడో చూడాలి. - కృష్ణమోహన్‌బాబు 9848023384 -
పాక్ కవ్వింపులకు జవాబిచ్చే సత్తా ఉంది
సాయుధ దళాలపై రక్షణ మంత్రి భరోసా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన జైట్లీ శ్రీనగర్: అధీన రేఖపై పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు సమాధానమిచ్చే సత్తా భారత సైనిక దళాలకు ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ మంత్రిగా తొలిసారి ఆయన శనివారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిక్రమ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్ఓసీపై రక్షణ చర్యలు, రాష్ట్ర శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైన్యాధికారులతో జైట్లీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఎల్ఓసీపై ఇటీవల పాక్ జరిపిన కాల్పుల వివరాల్ని రక్షణ మంత్రికి ఆర్మీ అధికారులు వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ శుక్రవారం భారత సైనిక కేంద్రాలపై కాల్పులు జరపడం తెలిసిందే. ముందుగా ‘చీనార్ కార్ప్స్’ ప్రధాన కార్యాలయాన్ని రక్షణ మంత్రి సందర్శించారు. కాశ్మీర్ లోయలో శాంతిభద్రతల పరిస్థితిని, ఎల్ఓసీపై ఏర్పాటు చేసిన తీవ్రవాద చొరబాట్లను అడ్డుకునే ప్రత్యేక వ్యవస్థ వివరాలను, రాష్ట్రంలో చేపట్టిన తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల వివరాలను జైట్లీకి అక్కడి ఉన్నతాధికారులు వివరించారు. అనంతరం శ్రీనగర్‌లో జైట్లీని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కలిశారు. భేటీ అనంతరం ‘అరుణ్ జైట్లీతో సమావేశం సంతృప్తికరంగా సాగింది. -
మాజీ సైనికులకు వరం
* ఇకపై ర్యాంకులవారీగా సమాన పెన్షన్ * చిరకాల డిమాండ్‌కు కేంద్రం అంగీకారం * 30 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి న్యూఢిల్లీ: ఒక ర్యాంకుకు ఒకే రకమైన పెన్షన్ ఉండాలన్న సాయుధ బలగాల దీర్ఘకాలిక డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. సోమవారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం ఈ మేరకు ప్రకటన చేశారు. దీని అమలు కోసం 2014-15లో రూ.500 కోట్లను రక్షణ బడ్జెట్ ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. దాదాపుగా 30 లక్షల మంది మాజీ సైనికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసున్న మాజీ సైనికులకు వారెప్పుడు రిటైరయ్యారన్న దానితో నిమిత్తం లేకుండా ఇకపై సమాన పెన్షన్ లభించనుంది. 2006కు ముందు రిటైరైన సైనికోద్యోగులకు ఆ తర్వాత రిటైరైన వారితో పోలిస్తే ప్రస్తుతం తక్కువ పెన్షన్ లభిస్తోంది. అది వారికంటే తక్కువ ర్యాంకుతో రిటైరైన వారికిస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువగా ఉంది! ఈ తేడాలను సరిచేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం 2014-15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు పెదవి విరుస్తున్నారు. పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కనీసం రూ.2,500 కోట్లు కావాల్సి ఉంటే రూ.500 కోట్లు ఏ మూలకు చాలతాయని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ నిర్ణయాన్ని 2006 నుంచి వర్తించేలా అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాహుల్ వల్లే: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు ఘనతను సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపు మాదిరిగానే రాహుల్‌గాంధీకే కట్టబెట్టేలా కాంగ్రెస్ ముందే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఆయన నోట ముందుగానే ఈ డిమాండ్‌ను విన్పించింది. ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ విధానం వీలైనంత త్వరగా అమలయ్యేలా కృషి చేస్తానని ఫిబ్రవరి 14న మాజీ సైనికోద్యోగులకు రాహుల్ హామీ ఇచ్చారు. తర్వాత మూడు రోజులకే చిదంబరం నోట ఆ మేరకు విధాన ప్రకటన వెలువడింది! ఆ వెంటనే సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయంపై హర్షం వెలిబుచ్చడంతో పాటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇదో చరిత్రాత్మక నిర్ణయం. దేశం కోసం పోరాడేందుకు నిత్యం సన్నద్ధంగా ఉండే బలగాలకు అన్నిరకాలుగా మద్దతుగా నిలవడం మన కర్తవ్యం’’ అన్నారు. రాహుల్ చొరవ వల్లే ఈ నిర్ణయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా స్తోత్రపాఠాలు వల్లెవేశారు. గృహావసరాల సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 9 నుంచి 12కు పెంచాల్సిందేనని ఏఐసీసీ సదస్సు వేదికగా గత నెలలో రాహుల్ డిమాండ్ చేయడం, ఆ మేరకు పెంచేస్తున్నామంటూ అదే వేదిక నుంచి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ నాటకీయ ఫక్కీలో ప్రకటన చేయడం తెలిసిందే. భారత సైన్యంలో ప్రస్తుతం 14 లక్షల మంది సైనికులున్నారు. రిటైరైన సైనికుల సంఖ్య 24 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో వీరిది బలమైన ఓటు బ్యాంకు కావడం లోక్‌సభ ఎన్నికల్లో ఆయా చోట్ల తనకు కలిసొస్తుందన్నది కాంగ్రెస్ అంచనా. ‘రక్షణ’పై శీతకన్నే న్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు 10 శాతం పెరిగాయి. గతేడాది రూ.2.03 లక్షల కోట్లున్న కేటాయింపులను తాజాగా రూ.2.24 లక్షల కోట్లకు చిదంబరం పెంచారు. అయితే బలగాల ఆధునికీకరణలో భాగంగా తెర తీసిన పలు ఆయుధ సేకరణ ఒప్పందాలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఈ మొత్తం ఏ మేరకు చాలుతుందన్నది సందేహమే. పైగా ఆధునికీకరణ కోసం అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలన్న రక్షణ శాఖ విజ్ఞప్తిని గతేడాదిలాగే ఈసారీ చిదంబరం తోసిపుచ్చారు. ఏడాది కాలంగా తెర పైకి వచ్చిన పలు రక్షణ కుంభకోణాల నేపథ్యం లో ఈ రంగాన్ని దేశీ బాట పట్టించాలని, అందులో భాగంగా సాయుధ సంపత్తి దిగుమతిని వీలైనంతగా తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు. అయినా పలు దేశాలతో పలు ఆయుధ కొనుగోలు ఒప్పందాలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని: - 126 బహుళార్థ సాధక యుద్ధ విమానాలు - 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు - 15 చింకూ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు - 126 రాఫెల్ యుద్ధ విమానాలు - రష్యాతో ఐదో తరం యుద్ధ విమాన ఒప్పందం తుది దశ చర్చల్లో ఉంది. దీనిపై వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించాలని సంకల్పించారు! లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లే దేశంలో అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌కు ఈ బడ్జెట్లో నామమాత్రంగా కేవలం రూ. 2 కోట్లనే కేటాయించింది. లోక్‌పాల్ బిల్లుకు ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సంస్థాగత ఖర్చులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ప్రణాళికేతర పద్దుల కింద రూ.20.35 కోట్లను కేటాయించింది. -
‘ముప్పు’తిప్పల భారతం
బైలైన్: మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. శాంతి సాధనకు బలం తప్పనిసరి. పాక్‌కు నేడు మనకంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అని 1962 వరకు మనం భావించాం. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సురక్షితమైన మార్గానికి హామీని కల్పిం చడం కోసం బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు పలు వ్యూహాత్మక, ఆర్థిక నజరానాలు సమర్పించుకున్నారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌నే ఖంగు తినిపించిన ఒబామా ఈ నజరానాలపై భారత్ ఎలా స్పందిస్తుందోనని నిద్రను కరువు చేసుకోవాల్సిన అవసరమేముంటుంది గనుక. ఒబామా సెప్టెంబర్‌లో మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు విందు ఇచ్చి చక్కటి చిరునవ్వుతో సాగనంపారు. అక్టోబర్‌లో నవాజ్ షరీఫ్‌కు ఆయన అందించిన వంటకాల జాబితా భారత ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడేది కాదు. పాక్ అణు పాటవాన్ని, భారత అణు పాటవాన్ని ఒకే గాటన కట్టి ఆయన దక్షిణ ఆసియా సుస్థిరతను చాటారు. అంతా సజావుగా సాగితే ఇది అమెరికా, పాక్‌ల మధ్య అణు ఒప్పందానికి కూడా దారితీయవచ్చు. పాక్‌ను మన్మోహన్ ‘ఉగ్రవాద భూకంప కేంద్రం’గా పేర్కొన్నారు. అయితే అదేమీ ఒబామా చెవికెక్కలేదు. సరికదా భారత్ ఇంకా ఎదగాలని, కాశ్మీర్ సమస్యపై చర్చలు జరపాలని నవాజ్‌తో కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశారు. కాకతాళీయంగా అదేసమయానికి నాకు ‘ఇండియా ఎట్ రిస్క్: మిస్టేక్స్, మిస్కన్సెప్షన్స్ అండ్ మిస్ఎడ్వెంచర్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీ’ అనే జస్వంత్‌సింగ్ కొత్త పుస్తకం అందింది. లోతైన అవగాహనతోనూ, విశ్వసనీయంగానూ జస్వంత్ ఆ పుస్తకాన్ని రచించారు. అదే వారంలో నవాజ్ వాషింగ్టన్లో ఉండగా, జస్వంత్ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నారు. రష్యా రాజధాని మాస్కో నుంచి ఆయన అక్కడికి వెళ్లారు. జస్వంత్‌సింగ్ ఉన్నత సైనికాధికారే కాదు పెద్ద మనిషి. ఆయన ట్రిగ్గర్‌పై వేలు వేశారూ అంటే ఎప్పుడోగానీ గురి తప్పదు. భారత్ వ్యూహాత్మక సంస్కృతిని పెంపొందింపజేయలేదు. కాబట్టే మన దేశ భద్రత ముప్పును ఎదుర్కొంటోంది. ఒక సమగ్ర భావజాలంగా అభివృద్ధి చెందకుండానే నిలిచిపోయిన కొన్ని సమున్నతైనైతిక భావాలపై ఆధారపడి జవహర్లాల్ నెహ్రూ ఒక మూసలాంటి విధానాన్ని తయారు చేశారు. వాస్తవికత తన సదుద్దేశాలకు వ్యతిరేకంగా నిలిచినప్పుడలా ఆయన వాస్తవికతను తిరస్కరించారు. దేశ విభజన శాంతిని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసించారు. కాబట్టే పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించారు. స్వతంత్రం తదుపరి కొన్ని వారాల్లోనే కాశ్మీర్ కోసం పాక్ నిష్కారణంగా యుద్ధం ప్రారంభించింది. దీంతో ఆయన విధానాలు మతి మాలినవిగా మారాయి. శాంతి మంచిది అని ఆయన భావించారు కాబట్టే భారత సైన్యాన్ని దాని యుద్ధ లక్ష్యాలను పరిపూర్తి చేయకుండా నివారించారు. పాక్‌కు కాశ్మీర్ గేట్ అయిన ముజఫరాబాద్ వరకు మన సేనలు కదం తొక్కకుండా వారించారు. అందుకు బదులు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరారు. నాటి కాల్పుల విరమణ ఫలితంగా నేటికీ మన దేశం నెత్తురోడుతూనే ఉంది. చైనా కథ స్వల్పంగా భిన్నమైనదేగానీ అంతటి నషాన్ని కలుగజేసింది. చైనా తన మార్గాన్ని అనుసరించి అలీనోద్యమంలో భాగస్వామి అవుతుందని, శాంతి ప్రవక్తగా తన హోదాను ధృవీకరిస్తుందని నెహ్రూ ఆశించారు. కాబట్టే టిబెట్‌ను వ దిలి పెట్టేశారు. మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా 1950లో టిబె ట్ను దురాక్రమించింది. ఆ సమయంలో నెహ్రూ ‘జన చైనా రిపబ్లిక్‌తో సంబంధాలకు భారత్ చాలా విలువనిస్తుంది’ అంటూ బీజింగ్‌లోని భారత రాయబారి కేఎమ్ ఫణిక్కర్కు సలహా ఇచ్చారు. ఆ సూచను ఫణిక్కర్ గ్రహించారు. నెహ్రూ అతి తరచుగా చైనా ముందు మోకరిల్లుతున్నారని ఢిల్లీలోని మన విదేశాంగ శాఖ సైతం భావించింది. ఆచరణ ప్రాధాన్యమైన వాస్తవిక దృష్టిగల సర్దార్ పటేల్ భవిష్యత్తును స్పష్టంగా గ్రహించగలిగారు. టిబెట్‌పై నెహ్రూ వైఖరిపట్ల తన అసమ్మతిని తెలుపుతూ ఆయన ఒక సుదీర్ఘ లేఖను రాసారు. చైనా ప్రభుత్వం పంపిన ఒక టెలిగ్రాం ‘పూర్తి అమర్యాదకరంగా ఉంది. చైనా సైన్యం టిబెట్‌లో ప్రవేశించడం పట్ల మన నిరసనను లెక్కలేనట్టుగా అది తోసిపుచ్చిన తీరే కాదు, విదేశీ శక్తుల ప్రభావాలే మన వైఖరిని నిర్ణయించాయనే నిరాధారమైన ఆరోపణతో అది తన చర్యను సమర్థించుకోవడం కూడా అమర్యాదకరమైనదే. చైనా మాట్లాడుతున్న భాష ఒక మిత్ర దేశం మాట్లాడుతున్నట్టు గాక శత్రువుగా మారగల దేశం మాట్లాడుతున్నట్టుంది’ అని ఆయన ఆ లేఖలో అన్నారు. 1962 నాటి హిమాలయ యుద్ధ పరాజయం తదుపరి నెహ్రూలోని భవిష్యత్తును దర్శించగల ద్రష్ట వెయ్యిసార్లు మరణించారు. అమెరికా పెట్టిన షరతులన్నిటికీ తలొగ్గి ఆయుధాల కోసం ఆయన దాన్ని అర్థించ వలసి వచ్చింది. పాక్ సరిహద్దుల్లోని భారత బలగాలను బాగా తగ్గించి, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలనేది ఆనాడు అమెరికా విధించిన షరతుల్లో ఒకటి. ఆ విషయం ఒబామాకు కూడా బాగానే తెలుసు. మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. కానీ శాంతి సాధనకు బలం కలిగి ఉండటం తప్పనిసరి. మిగులు సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమనే బ్రిటన్ విధానాన్ని స్వతంత్ర భారతం విడిచిపెట్టేసింది. కాగా పాక్, చైనాలు మిగులు సైనిక సామర్థ్యం విలువను గుర్తించాయి. పాక్‌కు నేడు మన కంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. అలాగే అవి ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలు కూడా ఎక్కువ. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అంటూ 1962 వరకు భారత్ సైన్యం ప్రాధాన్యాన్ని దాదాపు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. గత ఆరు దశాబ్దాలుగా భారత్, పాక్, చైనా, రష్యా, అమెరికాల మధ్య వ్యూహాత్మక అనుసంధానాలు నిలకడగా నిలిచినవీ కావు, సరళ రేఖలుగా సాగుతున్నవీ కావు. ఏ దేశం బలహీనమైన లింకు అనేదే అన్ని కాలాల్లోనూ పెద్ద ప్రశ్నగా ఉంటోందనేది స్పష్టమే. వ్యూహాత్మకమైన కథనం అంటే నీతి కథ కాదు. ద్వంద్వవాదం అంటే వంచన కాదు ప్రతి దేశమూ ప్రతి అనుబంధపు బలాన్నీ ఎప్పటికప్పుడు తిరిగి కొలవాలని చూస్తూనే ఉంటుంది. ఆధునిక భారతదేశం ఒక విలక్షణమైన జన్యువును పెంచి పోషించుకుంటూ వచ్చింది. అది ఏదో ఒక సమున్నత ఆశయాన్ని సాధించాలనే తపనతో మన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేస్తోంది. మన్మోహన్ ఒక దశాబ్దమంతా పాక్‌తో శాంతి కోసం పాకులాడారు. అయితే బలహీనంగా వణికే కాళ్లతో మనం ఎవరితోనూ కరచాలనం చేయలేం. వాస్తవ ప్రపంచం ఉదాసీనంగా భుజాలెగరేసి ఇతరత్రా తన ఏర్పాట్లేవో తాను చేసుకుంటుంది. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి ఆంటోనీ ఈ నెల చివర్లో త్రివిధ దళాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ కేరన్ సెక్టార్లో ఆర్మీ 15 రోజులపాటు సాగించిన ఆపరేషన్‌పై ఎన్నో సందేహాలు నెలకొన్నందున ఈ అంశం ప్రధానంగా సమీక్షకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటును తాము భగ్నం చేశామని ఆర్మీ 15 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్‌లో ఒక్క ఉగ్రవాది కూడా దొరకకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశంలో కేరన్ అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా పాల్గొనవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 నుంచి ఆర్మీ కమాండర్ల నాలుగు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేరన్ ఆపరేషన్‌కు సంబంధించి ఎన్నో అంశాలు చర్చించి.. అలాంటివి భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు. -
మాది ధర్మయుద్ధం
బయ్యారం అడవుల నుంచి ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి: ‘‘మాది ప్రజాపంథా. ధర్మయుద్ధం. నిరుపేదలకు భూమి దక్కేలా చూడడమే మా లక్ష్యం. ఇందుకోసం శ్రమిస్తాం. ఎంతకైనా తెగిస్తాం. అందుకే ఆయుధాన్ని చేపట్టాం. దోపిడీ, పీడన లేని సమాజమే మా లక్ష్యం’’ అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 11 సాయుధ దళాల కమాండర్ సాగర్ స్పష్టంచేశారు. డిప్యూటీ కమాండర్లు గోపీ, సూర్యం, అశోక్‌లతో కలిసి ఆయన బయ్యారం అడవుల్లో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల కోసం చేత పట్టిన ఆయుధాన్ని దింపబోమని, ప్రజా విముక్తి పోరులో భాగమే తమ తుపాకీ అని సాగర్ స్పష్టం చేశారు. ‘సుదీర్ఘ సైద్ధాంతిక విభేదాలతో ఇమడలేక మితవాదులతో విడిపోయాం. పాటూరి ఆదినారాయణ స్వామి ఎలియాస్ చంద్రన్న కార్యదర్శిగా ఎన్నుకున్నాం. ప్రజాస్వామిక ఆకాంక్షల్ని నెరవేర్చడమే ప్రస్తుత గమ్యం’ అని చెప్పారు. రాయల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని రాష్ట్ర కమిటీపై మండిపడ్డారు. బోస్, డీవీ కృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య (వీవీ) ఓ పథకం ప్రకారం పార్టీని కబ్జా చేసే ప్రయత్నించారు. సాయుధ దళాలను నిర్వీర్యం చేశారు. మితవాదులుగా మారి సీపీఐ, సీపీఎంలతో మిలాఖత్కు తాపత్రయపడ్డారని విమర్శించారు. వీళ్లు ముగ్గురూ సమైక్యవాదులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకూడదన్నదే వీరి వాదన. సాయుధ దళాల కొనసాగింపు వీరికి ఏ మాత్రం ఇష్టం లేదు. గిరిజన వ్యతిరేకమైన పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నారు. గిరిజన భూ హక్కుకు సంబంధించిన 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చివరకు చంద్రన్నపై అవినీతి, ఆర్థిక ఆరోపణలు చేయడంతో ఇక లాభం లేదనుకుని తెగతెంపులు చేసుకున్నాం’ అని వివరించారు. ‘మాది నిజమైన పార్టీ...చండ్రపుల్లారెడ్డి, పైలా వాసుదేవరావుల స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. ఈ త్రికూటమి చిట్‌ఫండ్ వ్యాపారాలకు, చేస్తున్న పంచాయితీలకు వంతపాడుతున్న మధు, పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్‌లను ప్రజల ఎదుట దోషిగా నిలబెడతాం’ అని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రభావం పెరుగుతుందన్నది భ్రమ’ అని సాగర్ చెప్పారు.