
సాక్షి, విజయవాడ: సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఫుడ్ కోర్ట్ వరకు సాగిన ర్యాలీలో వివిధ కళాశాలల ఎన్‌సీసీ క‍్యాడేట్‌లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆర్మ్డ్ ఫోర్స్ ఫండ్‌కు అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలని కోరారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన సైనికుల కుటుంబాలకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నుంచి ఈ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment