సాక్షి, విజయవాడ : జాతీయ క్రీడా దినోత్సవం రోజున సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినదనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ప్రోత్సకాలు అందించడం వల్ల రాష్ట్రంలో మెరికల్ లాంటి క్రీడాకారులు తయారవుతారన్నారు. అందరు ఫిట్‌గా ఉంటేనే విజయవాడ ఫిట్‌గా ఉంటుందని, అందరూ ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు.
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైయస్ఆర్ ప్రోత్సాహకాల కింద 12 మంది క్రీడాకారులకు 7లక్షల 45 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఈ వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు ఎంతగానో దోహద పడతాయని, జిల్లాలోని ముగ్గురు క్రీడాకారులకు ప్రోత్సకాలు అందజేసినట్లు వెల్లడించారు. వ్యాయామం జీవితంలో ఒక భాగం కావాలని, అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment