Imtiaz Ahmed
-
వైఎస్సార్సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వివరాల ప్రకారం.. ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్.. ఇంతియాజ్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. -
AP: ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ
సాక్షి, విజయవాడ: ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సెర్ప్ సీఈవోగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ముస్లింలకు ప్రభుత్వ వరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ముస్లింలకు అనేక వరాలు ఇవ్వడంతోపాటు వారిని విద్యావంతుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ముస్లిం నాయకులు కితాబిచ్చారు. ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా అనేక నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు ముస్లిం నాయకులు ఏపీ మైనార్టీ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ను శనివారం విజయవాడలో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో ముస్లింల విద్యకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదల తదితర విషయాలను ఇంతియాజ్ వారికి వివరించారు. కర్నూలులోని అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.51.40 కోట్లు మంజూరు చేశారన్నారు. దీంతోపాటు గుంటూరులో అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీ శాఖ ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారన్నారు. ఇప్పటికే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ఎంఏ అరబిక్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 మదర్సాలలో ఆధునిక విద్య (మోడ్రన్ ఎడ్యుకేషన్) బోధించేందుకు అవసరమైన టీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉర్దూ స్కూళ్లలో టీచర్ల నియామకాలకు నిధులు రూ.17 కోట్లు మంజూరు చేసిందని ఇంతియాజ్ వివరించారు. ‘గత ప్రభుత్వం ఎంతో వివక్ష చూపింది’ ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మైనార్టీ లపై తీవ్రమైన వివక్ష చూపిందని, కనీసం ముస్లింల సమస్యలు చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చివరకు మైనార్టీ శాఖను కూడా వారికి కాకుండా చేసారన్నారు. తమ సమస్యలపై ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ రూ.14.51 కోట్లు విడుదల చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందుకు చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి బీఎస్ అంజాద్ బాషా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్, మజ్లిసుల్ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి అబ్దుల్ బాసిత్, ముఫ్తి యూసుఫ్, ముఫ్తి హబీబ్ మౌలానా, డాక్టర్ ఇషాక్, మౌలానా ఫారూఖ్ సిద్దిఖ్, కృష్ణా జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రెహమాన్, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్ మతీన్, మహమ్మద్ ఖలీలుల్లా, షఫీ అహ్మద్ పాల్గొన్నారు. -
రికవరీ రేటు: 84 శాతంతో జిల్లా మొదటి స్థానం..
సాక్షి, కృష్ణా : రాష్టంలోనే బెస్ట్ కోవిడ్ సెంటర్‌గా పెదఅవుటుపల్లిలో ఉన్నజిల్లా కోవిడ్ సెంటర్‌ను ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు కోవిడ్ కేర్ సెంటర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. ఆయనతోపాటు రాష్ట్ర హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేఎస్ జవహర్ రెడ్డి, కమిషనర్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ శివ శంకర్, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. పెదఅవుటుపల్లి ,గూడవల్లిలోని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లతో పాటు స్టేట్ కోవిడ్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్.. కోవిడ్ బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. (ఏపీలో కొత్తగా 10,368 కరోనా కేసులు) అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెదఅవుటుపల్లిలో ఉన్న పిన్నమనేని కళాశాలను డిస్టిక్ కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడ 300 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, 2600 మంది ఈ సెంటర్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్‌తో పాటు పేషేంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. 16 సీసీ కెమెరాలతో ఇక్కడ శానిటేషన్ చర్యలు, మెడికల్ ఫెసిలీటీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్‌ను జిల్లాలో కట్టడి చేస్తున్నామన్నారు. రికవరీ రేటు రాష్ట్ర సగటు74 శాతం ఉంటే జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎక్కువ కరోనా పరీక్షలు సైతం చేస్తున్నామని వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్, శానిటైజర్లను ప్రజలు వినియోగించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యం అయ్యిందన్నారు. (అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి) -
‘మద్యం, డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు’
సాక్షి, విజయవాడ : మద్యం, డబ్బుల పంపిణీ లేకుండా చాలా పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అధికార యంత్రాంగం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి. 3 ఎన్నికలకు 30 వేల మంది కావాలి. 33 వేల మందిని మ్యాప్ చేసి పెట్టుకున్నాం. పీఓలు, ఆర్ఓలకు శిక్షణ ఇప్పటికే పూర్తయ్యింది. నామినేషన్ వేసేందుకు సహాయ డెస్కులు ఏర్పాటు చేశాం. 191 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి కావచ్చింది. బాలాజీ రావు, ఎన్నికల పరిశీలకులు, రామకృష్ణ, ఎన్నికల వ్యయం పరిశీలకులు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పరిశీలకులుగా నియమించింది. చాలా తక్కువ సమయం ఉంది, అందరూ సహకరించాలి. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాల’ని అన్నారు. -
బెజవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ
సాక్షి, విజయవాడ: సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఫుడ్ కోర్ట్ వరకు సాగిన ర్యాలీలో వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాడేట్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆర్మ్డ్ ఫోర్స్ ఫండ్‌కు అందరూ కాంట్రిబ్యూషన్ చేయాలని కోరారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన సైనికుల కుటుంబాలకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నుంచి ఈ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. -
అందరికీ అందుబాటులో ఇసుక
సాక్షి, విజయవాడ: వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ నెల 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు ఇసుక రీచ్ లతో పాటు స్టాక్ డిపోలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరులో మూడు స్టాక్ డిపోలతో పాటు మచిలీపట్నం, మైలవరం, నూజివీడులో కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆన్లైన్లో ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఇసుక రీచ్‌ల తో పాటు నాలుగు పట్టా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారం రోజులలో ఐదు ఇసుక రీచ్‌లు, ఐదు పట్టా భూములు అందుబాటులో కి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్ లు , స్టాక్ పాయింట్లు, స్టాక్ యార్డులు మొత్తం 15 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
'ఐఏఎస్ శంకరన్‌తో పనిచేయడం మా అదృష్టం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని లెనిన్ సెంటర్లో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి యస్. ఆర్.శంకరన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ. సుబ్రమణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్. వీ. సుబ్రమణ్యం మాట్లాడుతూ.. శంకరన్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం మాకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదగాలి అనుకునేవారు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శంకరన్ అధికారిగా పనిచేసే రోజుల్లో జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో పరిష్కరించాల్సిన సమస్యలను డైరీలో నమోదు చేసేవారని గుర్తుచేశారు. ఆయన రాసిన వ్యాసాలు నేటి యువత అందరూ చదవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పేద వర్గాలకు అండగా నిలబడిన శంకరన్ లాంటి వ్యక్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం అని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కొనియాడారు. 'టాక్ లెస్ డూ మోర్' అన్నదే శంకరన్ గారి నినాదం అని సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీ యస్.యస్. రావత్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర ,టోబాకో బోర్డు సెక్రెటరీ సునీత , చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ దమయంతి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా కలెక్టర్ కుమార్తె వివాహానికి సీఎం వైఎస్ జగన్
-
కలెక్టర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కుమార్తె వివాహానికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, వైఎస్సార్ సీపీ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. -
ఏపీలో 7వ ఆర్థిక గణాంక సర్వే ప్రారంభం
సాక్షి, కృష్ణా : ఏపీలో నేటి నుంచి 7వ ఆర్థిక గణాంక శాఖ సర్వే అధికారికంగా ప్రారంభమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నేటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ఆర్థిక గణాంక సర్వే జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామపంచాయతీలు, పట్టణ స్థాయిలో 1200 ఇన్విస్టిగేషన్ యూనిట్ల ద్వారా 15 వేల మందితో సర్వే జరుగుతుందని, రెండు స్థాయిల్లో పర్యవేక్షణ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గణాంక శాఖ సర్వేకు సంబంధించి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసామని తెలిపారు. ఈ సర్వేను రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ, జాతీయ శాంపిల్ సర్వే సంయుక్తంగా నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహించే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఇంతియాజ్ కోరారు. -
‘సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం’
సాక్షి, విజయవాడ : జాతీయ క్రీడా దినోత్సవం రోజున సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినదనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిట్ ఇండియా మూవ్మెంట్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ప్రోత్సకాలు అందించడం వల్ల రాష్ట్రంలో మెరికల్ లాంటి క్రీడాకారులు తయారవుతారన్నారు. అందరు ఫిట్‌గా ఉంటేనే విజయవాడ ఫిట్‌గా ఉంటుందని, అందరూ ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైయస్ఆర్ ప్రోత్సాహకాల కింద 12 మంది క్రీడాకారులకు 7లక్షల 45 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఈ వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు ఎంతగానో దోహద పడతాయని, జిల్లాలోని ముగ్గురు క్రీడాకారులకు ప్రోత్సకాలు అందజేసినట్లు వెల్లడించారు. వ్యాయామం జీవితంలో ఒక భాగం కావాలని, అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. -
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
సాక్షి, విజయవాడ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విజయవాడలోని బిషప్ హాజరయ్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ బెండాజోల్ టాబ్లెట్లను అందజేశారు. ఈ టాబ్లెట్ ద్వారా నులి పురుగులను నివారించవచ్చని పేర్కొన్నారు. అపరిశుభ్ర వాతావరణం ఆరోగ్యానికి హానికరమని వెల్లడించారు. ఏడాది వయపు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు శరీరంలో నులిపురుగులు వస్తాయని, అందుకే పని చేసిన ప్రతీసారి చేతులను శుభ్రంగా కడుక్కుంటే నులిపురుగులు దరిచేరవని తెలిపారు. -
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ఐదు రకాలు పాసులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వారి కోసం ఐదు రకాలు పాసులు జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలని సూచించారు. పాసులున్న వారు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపే అక్కడికి చేరుకోవాలన్నారు. సుమారు 30 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు చూసేందుకు వీలుగా పలు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని టీవీల్లోనూ ప్రమాణస్వీకారం ప్రసారాలు జరుగుతాయని వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ఐదు రకాలు పాసులు
-
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కన్నుమూత
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాత తరం క్రికెటర్ ఇంతియాజ్ అహ్మద్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఇంతియాజ్ అహ్మద్.. శనివారం లాహోర్‌లో తుదిశ్వాసం విడిచారు. యాభైవ దశకంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అహ్మద్.. పాకిస్తాన్ తరపున నాలుగు టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. 1952 నుంచి 1962 వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఇంతియాజ్.. 41 టెస్టుల్లో 2079 పరుగులు చేశాడు. అటు వికెట్ కీపర్ కూడా ఇంతియాజ్ బాధ్యతలు నిర్వర్తించాడు. తన కెరీర్ లో 77 క్యాచ్‌లు, 16 స్టంపింగ్స్ చేశాడు. 1955లో లాహోర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంతియాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 209. భారత్‌తో పాకిస్తాన్ విడిపోకముందు నార్తరన్ ఇండియా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 180 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇంతియాజ్ 10,391 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా, తన అంతర్జాతీయ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఇంతియాజ్ సెలక్టర్‌గా 13 ఏళ్లు సేవలందించాడు. 1976 నుంచి 1978 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా పని చేశాడు.