
సాక్షి, విజయవాడ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విజయవాడలోని బిషప్ హాజరయ్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ బెండాజోల్ టాబ్లెట్లను అందజేశారు. ఈ టాబ్లెట్ ద్వారా నులి పురుగులను నివారించవచ్చని పేర్కొన్నారు. అపరిశుభ్ర వాతావరణం ఆరోగ్యానికి హానికరమని వెల్లడించారు. ఏడాది వయపు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు శరీరంలో నులిపురుగులు వస్తాయని, అందుకే పని చేసిన ప్రతీసారి చేతులను శుభ్రంగా కడుక్కుంటే నులిపురుగులు దరిచేరవని తెలిపారు.