
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వారి కోసం ఐదు రకాలు పాసులు జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలని సూచించారు. పాసులున్న వారు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపే అక్కడికి చేరుకోవాలన్నారు.
సుమారు 30 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు చూసేందుకు వీలుగా పలు చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని టీవీల్లోనూ ప్రమాణస్వీకారం ప్రసారాలు జరుగుతాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment