swearing in ceremony
-
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
Watch Live: జిల్లాల అధ్యక్షునిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
హైకోర్టులో ఇవాళ ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్‌హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది. #WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9— ANI (@ANI) September 21, 2024 -
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 12న ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నగరం నుంచి గన్నవరం వైపు వెళ్లు వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లించామన్నారు. ఆ వివరాలు ఇవి.. విజయవాడ నగరంలో సాధారణ వాహనాలు.. 👉 విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు–పామర్రు–హనుమాన్ జంక్షన్–ఏలూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ వెలుపల ట్రాన్స్‌పోర్టు వాహనాలు.. 👉 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వచ్చు వాహనాలు.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అటు నుంచే వాహనాలు కూడా అదే మార్గం గుండా రావాలి. 👉 విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లు వాహనాలు.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా వెళ్లాలి. 👉 చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వచ్చే వాహనాలు.. ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. 👉 చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ నుంచి వెళ్లాలి. 👉 హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు.. నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుంచి వెళ్లాలి ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఇలా.. 👉 విజయవాడ ఏలూరు వైపు వెళ్లు బస్సులు.. పీఎన్బీఎస్ నుంచి ఓల్డ్ పీసీఆర్ జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలి. 👉 విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాల తప్ప ఏ ఇతరవాహనాలు గన్నవరం వైపు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమిస్తారు. ట్రాఫిక్ మళ్లింపులను గమనించి నగర ప్రజలంతా సహకరించాలని సీపీ రామకృష్ణ కోరారు. -
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
ఎన్టీఆర్, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని మోదీ రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక.. తిరిగి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. రేపు ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో..ఆ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొననున్నారు. ఒడిషాలో దాదాపు పాతికేళ్లకు అధికారం చేతులు మారగా.. బీజేపీ ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వీఐపీల రాక.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేటి నుంచే ప్రముఖులు నగరానికి రానున్నారు. ఏర్పాట్లు పూర్తిచంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణం రూపొందించారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండగా, 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. వీవీఐపీ లు,వీఐపీ లతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల్ని ఆ గ్యాలరీలకు ఇంఛార్జిలుగా నియమించారు. దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతప్రధాని మోదీ సహా ఇతర వీవీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సుమారు 7 వేల మందిని నియమించింది రాష్ట్ర పోలీస్ శాఖ. అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ చెన్నై - కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించనున్నారు.ఇదీ చదవండి: Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే -
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా 7 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అంటూ మోదీ ప్రమాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఓత్ ఆఫ్ ఆఫీస్‌తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటు..గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, పియూష్‌గోయెల్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. Amit Shah sworn in as Union minister in Prime Minister Modi's 3.0 CabinetRead @ANI Story | https://t.co/XtFeIoOQz1#AmitShah #Unionminister pic.twitter.com/kba9Jk43u0— ANI Digital (@ani_digital) June 9, 202472 మందితో మోదీ3.0 మంత్రి వర్గం.. 30 మందికి కేబినెట్ హోదామోదీ 3.0 ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం 72 మంత్రులున్నారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులుకాగా అయిదుగురు సహాయం(ఇండిపెండెంట్), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో సామాజిక వర్గాల వారిగా చూస్తే 20 మంది ఓబీసీలకు, కాగా, ఎస్సీలకు10,ఎస్టీలకు 6 మైనార్టీలకు 5 బెర్తులు కేటాయించారు. 30 మంది కేబినెట్ మంత్రులు వీళ్లే... 1.రాజ్‌నాథ్ సింగ్2.అమిత్ షా3.నితిన్ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్ సింగ్ చౌహాన్ 6.నిర్మలా సీతారామన్ 7.జై శంకర్ 8.మనోహర్‌లాల్ ఖట్టర్ 9.హెచ్డీ కుమార్ స్వామీ10.పియూష్ గోయల్11.ధర్మేంద్ర ప్రదాన్12.జితిన్ రామ్ మాంజీ13.రాజీవ్ రంజన్ సింగ్14.శర్వానంద్ సోనోవాల్15.వీరేంద్రకుమార్16.కింజరపు రామ్మోహన్ నాయుడు17.ప్రహ్లాద్ జోషి18.జువల్ ఓరం19.గిరిరాజ్ సింగ్20.అశ్వినీ వైష్ణవ్21.జ్యోతిరాధిత్య సింధియా22.భూపేందర్ యాదవ్23.గజేంద్ర సింగ్ షెకావత్24.అన్నపూర్ణాదేవి25.కిరణ్ రిజిజు26.హర్దీప్ సింగ్‌పూరి27.మన్సుఖ్ మాండవీయ28.జి.కిషన్ రెడ్డి29.చిరాగ్ పాశ్వాన్ 30.సీఆర్ పాటిల్తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు.. యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్ ,బెంగాల్ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. -
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
సీఎం ప్రకటన.. నేడే ప్రమాణ స్వీకారం !?
-
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు
-
సిద్దూ, డీకేఎస్ అండ్ కో ప్రమాణం రేపే
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్‌లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్ట్‌కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. -
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
-
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్, సీఎం..చిరునవ్వులు, ముచ్చట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 8 నెలల విరామం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించు కుంది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా..? లేదా అన్న అంశం చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చకు తెరదించుతూ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్లుప్తంగా సంభాషించారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమిళిసైతో సీఎం భేటీ కాలేదు. గవర్నర్ తన అధికార పరిధిని అతిక్రమించి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలా పాలకు అడ్డాగా మార్చారని రాష్ట్ర మంత్రులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, మహిళ అని చిన్నచూపు చూస్తోందని గవర్నర్ తమిళిసై విమర్శించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై ఆమోదిం చకుండా పక్కన పెట్టడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేయడం, గవర్నర్ జిల్లా పర్యటనల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడం, గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
Telangana: సీఎం వెళ్తారా.. వెళ్లరా?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు మధ్య విభేదాల నేపథ్యంలో తాజాగా జరుగనున్న ఓ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తమిళిసై ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణస్వీకారం చేయించేది గవర్నరే. ఇది రాజ్‌భవన్‌లో జరగడం సంప్రదాయం. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు హాజరుకావాలి. మరి గవర్నర్‌తో విభేదాలతో కొంతకాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తలపెట్టిన టీ–హబ్ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నిజానికి ఈ భవనాన్ని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ దానిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో.. వ్యూహాత్మకంగానే కార్యక్రమాన్ని మార్చినట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకుముందు రెండుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలతో విభేదాలు తలెత్తి.. ఒకదశలో పరస్పర విమర్శల వరకు వెళ్లింది. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయాలన్న ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టిననాటి నుంచి రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు పొసగడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు పది నెలలుగా సీఎం రాజ్‌భవన్ గడప తొక్కలేదు కూడా. గవర్నర్ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు నేరుగానే ఆరోపణలు చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ నియామక విషయంలోనూ గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదలను పక్కనపెట్టి.. పూర్తిస్థాయి చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించడం కూడా దూరాన్ని పెంచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దిన వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, సీఎం సహా మంత్రులు, సీఎస్, డీజీపీ కూడా హాజరుకాకపోవడంతో గవర్నర్, సీఎం మధ్య అంతరం మరింత పెరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదన్న సాంకేతిక కారణం చూపుతూ గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. దీనిపై మనస్తాపం చెందిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం గవర్నర్‌కు మర్యాద ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆమెకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలకలేదు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర హోంశాఖకు పంపారు. తాజాగా రాజ్‌భవన్‌లో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడంపైనా టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వెళతారా, లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. టీ–హబ్ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు! రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లే అంశంపై చర్చ నేపథ్యంలో మంత్రి కె.తారకరామారావు చేసిన ట్వీట్ కూడా ఆసక్తి రేపింది. ‘‘కొత్త టీ–హబ్ భవనాన్ని జూన్ 28న ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నాను. హైదరాబాద్ నగర నూతన ఆవిష్కరణల ఎకో సిస్టమ్‌కు దీని ద్వారా గొప్ప ఊతం లభించనుంది.’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్‌భవన్ కార్యక్రమం జరిగే సమయంలోనే టీ–హబ్ ప్రారంభోత్సవం ఉండటం గమనార్హం. -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణం (ఫొటో గ్యాలరీ)
-
అన్నకోసం ప్రాణాలైనా అర్పిస్తా..
-
AP: ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని నూతన మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం జగన్ అప్పజెప్పిన పనిని బాధ్యతగా చేస్తానని తెలిపారు. చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే.. అదృష్టంగా భావిస్తున్నాం: రాజేంద్రనాథ్ సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని మంతి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మూడేళ్లు సమర్ధవంతంగా పాలన కొనసాగిందన్నారు. అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పిస్తూనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం కావాలనే బురద జల్లేందుకు యత్నిస్తోందన్నారు. మంచి పేరు తెచ్చుకుంటా: అంబటి రాంబాబు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైఎస్.జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటానని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వైఎస్. జగన్ టీమ్ లీడర్.. తామంతా మెంబర్స్. మంచి చేసినా చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఏనాడు మంత్రులకు విలువ ఇవ్వలేదన్నారు. టీడీపీ చేయలేని అద్భుత కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటానని అంబటి రాంబాబు అన్నారు. ఎప్పటికీ మర్చిపోను: ఆర్కే రోజా సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని ఆర్కే రోజా అన్నారు. జగనన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేబినెట్లో మహిళ మంత్రిగా ఉండటం తన అదృష్టం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తానన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందులో పాల్గొన్నారు. చదవండి: AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే.. మంత్రులుగా అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ, చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పి.రాజన్న దొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, విడదల రజినీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉషాశ్రీ చరణ్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాకాని గోవర్థన్ రెడ్డి అనే నేను..
-
జోగి రమేష్ అనే నేను..
-
గుమ్మనూరు జయరాం అనే నేను..
-
గుడివాడ అమర్ నాథ్ అనే నేను..
-
ధర్మాన ప్రసాద్ రావు అనే నేను..
-
దాడిశెట్టి రాజా అనే నేను..
-
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనే నేను..
-
బూడి ముత్యాలనాయుడు అనే నేను..
-
బుగ్గన రాజేంద్రనాథ్ అనే నేను..
-
బొత్స సత్యనారాయణ అనే నేను..
-
ఆదిమూలపు సురేష్ అనే నేను..
-
అంజాద్ బాషా అనే నేను..
-
అంబటి రాంబాబు అనే నేను..
-
Live Blog: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం
-
పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు. -
హోలీ కంటే ముందే యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
-
హైకోర్టు నూతన సీజేగా నేడు జస్టిస్ మిశ్రా ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం/విశాఖ లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్.. జస్టిస్ పీకే మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, తదితరులు పాల్గొననున్నారు. కాగా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ డి.రమేష్, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ బట్టు దేవానంద్, పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ భానుమతి, హైకోర్టు ప్రొటోకాల్ రిజిస్ట్రార్ మురళీధర్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాయపూర్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ సోమవారం ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ... తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్పూర్లోని సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఎల్‌ఎల్‌బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ విషయాల్లో ప్రాక్టీస్ చేశారు. 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
భారీ మార్పులతో జంబో కేబినెట్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీమ్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అనూహ్య మార్పులు, భారీ చేర్పులతో జంబో కేబినెట్‌ను తీర్చిదిద్దారు. కఠిన నిర్ణయాలతో సీనియర్ మంత్రులకు సైతం షాకిచ్చారు. వివిధ కారణాలతో ఏకంగా 12 మందికి ఉద్వాసన పలికారు. పలువురు జూనియర్లకు సీనియర్లుగా ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, సంస్థాగత అవసరాలు ప్రాతిపదికగా భారీ కసరత్తు అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. పదవి కోల్పోయిన మంత్రుల్లో సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు. మొత్తం 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మంత్రివర్గంలో మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు చోటు కల్పించారు. కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు ఆస్కారమిచ్చిన వైద్య, విద్యా శాఖల మంత్రులు డాక్టర్ హర్షవర్థ్దన్, రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ సహా మొత్తం 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే ఆమోదించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేదన్న విమర్శలతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతోందన్న సంకేతాల నేపధ్యం ఈ భారీ ఉద్వాసనకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేసిన పలు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 43 మంది ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన నేతల్లో ఎం.వెంకయ్యనాయుడు తరువాత కిషన్‌రెడ్డి రెండో తెలుగు వ్యక్తి కావడం విశేషం. కాగా కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కొత్తగా పలువురు మహిళల చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది. తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి నిష్క్రమిస్తున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, జావదేకర్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం విశేషం. భాగస్వామ్య పక్షాలకు పదవులు అలాగే భాగస్వామ్య పక్షాలను కేబినెట్లో భాగం చేయడం ద్వారా ప్రాంతీయంగా, సామాజికంగా వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అప్నాదళ్ పార్టీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామచంద్రప్రసాద్ సింగ్, లోక్‌జనశక్తి లోక్‌సభాపక్ష నేత పశుపతి కుమార్ పారస్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి దక్కింది. యూపీకి పెద్దపీట వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట దక్కింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సహాయ మంత్రుల్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి ప్రాతినిథ్యం లభించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మ, పం కజ్ చౌదరి, డాక్టర్ సత్యపాల్ సింగ్ భగేల్, భానూప్రతాప్ సింగ్ వర్మ, కౌశల్ కిశోర్, బి.ఎల్.వర్మ, అజయ్ కుమార్ మిశ్రాలతో పాటు అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు యూపీ నుంచి ప్రాతినిధ్యం దక్కింది. యూపీలో సోషల్ ఇంజనీరింగ్ యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. వారణాసికి పొరుగున ఉన్న మీర్జాపూర్ నుంచి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) అధ్యక్షురాలిగా ఉన్న అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భానూ ప్రతాప్ సింగ్ వర్మ కూడా షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా ఉన్నారు. పదోన్నతి వీరికే.. స్వతంత్ర హోదాలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు, విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్న హర్దీప్సింగ్ పూరి, షిప్పింగ్ శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ ఎల్.మాండవీయలకు కేబినెట్ ర్యాంకు లభించింది. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్‌సింగ్ ఠాకూర్‌కు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్షోత్తమ్ రుపాలాకు కేబినెట్ హోదా దక్కింది. క్రియాశీల నేతలకు పదవులు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మనూ మంత్రిపదవి వరించింది. గుజరాత్‌కు పెరిగిన ప్రాతినిథ్యం.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో గుజరాత్ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు, ముగ్గురికి సహాయ మంత్రి పదవులు దక్కడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ స్వరాష్ట్రం గుజరాతే. హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కేబినెట్ ర్యాంకులు దక్కిన మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే స్వతంత్ర మంత్రిగా, పర్షోత్తం రుపాలా సహాయ మంత్రిగా ఉన్నారు. బిహార్‌కు చెందిన ముగ్గురికి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరికీ కేబినెట్ ర్యాంకులు దక్కడం విశేషం. ఇక కర్ణాటకకు నాలుగు పదవులు దక్కాయి. పనితీరు కోణంలో.. కోవిడ్ నేపథ్యంలో కొందరు మంత్రుల పనితీరు సవ్యంగా లేకపోవడం, విమర్శలకు ఆస్కారం ఇవ్వడం వంటి కారణాల నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని పూర్తిస్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు భారీ కసరత్తు చేశారు. నెల రోజులుగా పలు దఫాలుగా పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన సేకరించి మంత్రివర్గానికి కొత్త రూపు తెచ్చారు. పనితీరు మెరుగ్గా ఉండేందుకు యువతకు పెద్దపీట వేశారు. సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు, వృత్తి నిపుణులను కేబినెట్లో భాగం చేశారు. రాజకీయ కోణంలో.. సామాజిక సమీకరణాలపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు అవగతమవుతోంది. మొత్తం మంత్రిమండలిలో ఓబీసీ వర్గాలకు చెందిన వారు 27 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 12 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 8 మంది, మైనార్టీలు ఐదుగురు, 11 మంది మహిళలు ఉన్నారు. కేబినెట్ ర్యాంకుతో ఐదుగురు ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఎస్సీల్లో చమర్, ఖాతిక్, పాసీ, కోరి, మాదిగ, మహర్, అరుంధతియార్, మేఘ్వాల్, రాజ్బొన్షి, మథువా–నామశూద్ర, దంగర్ తదితర ఉపకులాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించారు. ఇక ఎస్టీల్లో గోండులు, సంతాల్, మిజి, తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా అవకాశం దక్కినవారిలో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికైన వాళ్లే ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు కొత్తగా ఏడు మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా పిన్నవయస్కుడు నిశిత్ హోంశాఖ సహాయ మంత్రిగా నిశిత్ ప్రామానిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా మంత్రి వర్గ విస్తరణలో పిన్న వయస్కుడైన నిశిత్‌కు యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. గత కేబినెట్లో సహాయ మంత్రులుగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు సమాచార ప్రసార శాఖతోపాటు క్రీడలు యువజన వ్యవహారాలు అప్పగించగా మాన్సుఖ్‌లాల్ మాండవీయకు ఆరోగ్యశాఖ అప్పగించారు. తాజా విస్తరణలో చొటు దక్కించుకున్న అశ్విని వైష్ణవ్‌కు కీలక రైల్వే శాఖతోపాటు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలు అప్పగించారు. శంతను ఠాకూర్‌కు ఓడరేవులు, జలరవాణా సహాయమంత్రిగా మహిళల్లో అనుప్రియ పటేల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖసహాయ మంత్రిగా, భారతిప్రవీణ్ పవార్‌కు ఆరోగ్యశాఖసహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ తదితరులు -
సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రమణ ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జీలు, కేంద్రమంత్రులు, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్ట్ 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక తెలుగు వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశాక చీఫ్ జస్టిస్ రమణ నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేశారు. 2014లో సుప్రీంకోర్టుకు... సీజేఐ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27 న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2013 మార్చి 10వ తేదీ నుంచి 2013 మే 20 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం 2013 సెప్టెంబర్ 2వ తేదీన జస్టిస్ రమణకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2014 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020 జనవరి 10వ తేదీన కశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
యడ్డీ ముచ్చటగా మూడోసారి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు అంటూ గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టైంది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్లో చోటుకల్పించారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో గవర్నర్ వజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కట్టి (హక్కేరి), ఎస్.అంగర (సల్లియా), మురుగేష్ నిరానీ (బిల్గీ), అరవింద్ లింబావలీ (మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ముఖ్యమంత్రి యడియూపరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, నాటకీయ పరిణామాల మధ్య 2019 జులైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ యడియూరప్పకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేల తిరుబాటుతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ కుప్పకూలడంతో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. అయితే, యడ్డీ నాయకత్వంపై సొంతపార్టీలోనే అసంతృప్తులు, తిరుగుబాటుదారులు ఎక్కువ కావడంతో ప్రభుత్వానికి సమస్యలు తప్పలేదు. ఇప్పటికే 2019 ఆగస్టులో ఓసారి, 2020 ఫిబ్రవరిలో మరోసారి కేబినెట్‌ను విస్తరించారు. అయినప్పటికీ బీజేపీ సర్కారులో లుకలుకలు తగ్గలేదు. ఈసారి యడ్డీ సీటుకు ఎసరు ఖాయమనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈనేపథ్యంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చిన సీఎం యడియూరప్ప ముచ్చటగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. -
కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!
-
‘ఏయ్.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’
సాక్షి, హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడు కదా. ఎలాగైనా తాను ఎమ్మెల్యేను కావాలని నామినేషన్ వేయడానికి వెళ్తుంటే హీరో అల్లు అర్జున్ అడ్డుపడి చితక్కొట్టేస్తాడు. నామినేషన్ వేయలేకపోయినా ఆ తరవాత ఎలాగోలా మంత్రి అయిపోతాడు. ‘మద్దాలి శివారెడ్డి అనే నేను..’ అంటూ పదవీ ప్రమాణ స్వీకారం చేసి పొలిటికల్ పవర్‌ను ఎంజాయ్ చేయాలనే కోరికను తీర్చుకుంటాడు. అది సినిమా. అయితే, నిజ జీవితంలో అలాగే రాజకీయాల్లో గెలిస్తే ఆ అనందం ఎలా ఉంటుంది? ఉహించుకుంటేనే ఏదో థ్రిల్లింగ్‌గా ఉంది కదా! అలాంటి థ్రిల్లింగ్‌ను పొందాడు రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి అలియాస్ రవికిషన్. భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 3లక్షల మెజారిటితో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అయితే ఆయన చేసిన ప్రమాణ స్వీకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేసుగుర్రం సినిమాలో మంత్రిగా ప్రమాణం చేసిన మాటలను, లోక్‌సభలో ప్రమాణం చేసిన మాటలను పక్కపక్కన చేర్చిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘లోక్‌సభలో మద్దాలి శివారెడ్డి’ ‘ ఏయ్ నిజంగానే ఎంపీ అయ్యా’ అని రాసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘హేయ్ విలన్.. హీరో అయ్యాడు’, ‘సినిమాలో విలన్ అయినా..నిజజీవితంలో హీరోలా ప్రజలకు సేవ చేయాలి’,‘మద్దాలి శివారెడ్డి.. అనుకున్నది సాధించావ్ పో’ అంటూ రవికిషన్‌పై తెలుగు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
కేటాయించిన పనిని బధ్యతయుతంగా నిర్వహిస్తా : విశ్వరూప్
-
వైఎస్ జగన్ నాయకత్వంలో అభివృద్ధి సాధిస్తాం
-
సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాను: సుచరిత
-
ప్రజల గుండె చప్పుడు వినగలిగిన నాయకుడు వైఎస్ జగన్
-
ముస్లీం సమాజమంతా వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం
-
వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కడం సంతోషం
-
శక్తివంచన లేకుండా పనిచేస్తా: మంత్రి అనిల్
-
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచక ఏర్పాట్లు
-
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
-
మోదీ 2.0
-
మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం
-
సీఎం..సీఎం
ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించి చరిత్రసృష్టించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారంసొంత జిల్లాకు వచ్చారు. ఫలితాలు వెలువడ్డాకనిశ్చయ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం తొలిసారికావడంతో జనం ఆయన్ను చూసేందుకు పోటీపడ్డారు. పార్టీ నాయకులు..కార్యకర్తలు..ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన పర్యటన సాగిన ప్రతి ప్రాంతం సీఎం..సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. ప్రియతమ నేత ముఖ్యమంత్రి కానున్నారనే ఆనందం అందరిలోవెల్లివిరిసింది. వైఎస్ జగన్ అందరికీ అభివాదం చేస్తూ‘విజయ హాసం’తో ముందుకు సాగిపోయారు. కడపదర్గాలో..సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలనంతరం ఇడుపులపాయలోని తండ్రి సమాధివద్ద నివాళులర్పించారు. సాక్షి కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్‌కు పూలమాల వేసిన ఆయన అనంతరం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందురోజు ఇడుపులపాయకు వచ్చి తండ్రి సమాధి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌బాష, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి తదితర నేతలు వైఎస్సార్ ఘాట్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్సార్ అమర్‌రహే అంటూ చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అంతకుముందు ఇడుపులపాయలో హెలికాఫ్టర్ దిగి వస్తున్న వైఎస్ జగన్‌ను చూడగానే సీఎం ..సీఎం అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఘాట్ వద్ద కూడా ఆయన ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం తొలుత ఉదయం కడప ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో కలిసి ఆయన కడపకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. వారితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాష, రఘురామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, వెంకట సుబ్బయ్య, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, సురేష్‌బాబు,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ఆయన ముచ్చటించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంవీ రమణారెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, శివరామకృష్ణారావు, మాజీమంత్రి ఖలీల్‌బాష, జెడ్పీ చైర్మన్గూడూరు రవి, మాజీ ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, వెంకట శివారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కాల్టెక్స్ హఫీజుల్లా, అల్లె ప్రభావతి తదితరులు మాట్లాడారు. కడప వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులను వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే అంజద్‌బాషా పరిచయం చేశారు ఉన్నతాధికారులతో కాసేపు ఎయిర్‌పోర్టు గ్యాలరీలో కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు కలిశారు. జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆయనకు పరిచయం చేశారు. ఆప్యాయంగా వారిని శాఖలు అడిగి తెలుసుకున్నారు. మీ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు వివరించారు. ఎయిర్‌పోర్టు వద్ద వేదపండితులు ఆశీర్వదించారు. బ్రహ్మకుమారీలు వైఎస్ జగన్‌ను కలిపి జ్ఞాపికను అందజేశారు. పర్యటన ప్రాంతాల్లో ఎస్పీ అభిషేక్ మహంతి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించారు. కడప దర్గాలో.. ఎయిర్‌పోర్టు నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి 11.55 గంటలకు కడప పెద్ద దర్గా చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నగర మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండీ షఫీ శాలువా కప్పి టోపీ ధరింపజేశారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ దర్గా సంప్రదాయాన్ని పాటిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి తలపాగా చుట్టారు. అనంతరం జగన్ హజరత్ పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకుని చాదర్,పూల చాదర్లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించి ఫాతెహా చేశారు. దర్గా పీఠాధిపతి వైఎస్ జగన్‌కు గురువుల విశిష్టతను తెలియజేసి, జ్ఞాపికతో సత్కరించారు. పీఠాధిపతితో నిశ్చయ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.బాలక్రిష్ణారెడ్డి(సాక్షి), సూర్యనారాయణరావు(సీపీసీ), రామాంజనేయరెడ్డి(జేసీఎన్), ఆర్ఎస్ రెడ్డి, వెంకటరెడ్డి, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకొని పెద్ద ఎత్తున ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయక నిరీక్షించారు. జగన్‌ను చూడగానే యువత పెద్దపెట్టున సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. కడప నుంచి పులివెందులకు హెలికాప్టర్‡లో వెళ్లారు. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిశ్చయ ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం 1.15గంటలకు పులివెందుల చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో హెలికాప్టరు దిగగానే ఆయనకు మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, ఆర్డీఓ నాగన్న, తహసీల్దార్ మునాఫ్లతోపాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. మహిళా కౌన్సిలర్లు శాలువా కప్పి సన్మానించారు. తర్వాత రోడ్డు మార్గాన వైఎస్ జగన్ సీఎస్ఐ చర్చికి 1.40గంటలకు చేరుకున్నారు. అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పులివెందుల డివిజన్ పరిధిలోని చర్చి ఫాదర్లు స్వాగతం పలికి ఆహ్వానించారు. రాయలసీమ సీఎస్ఐ చర్చి బిషప్ బీడీ ప్రసాదరావు, పులివెందుల చర్చి ఫాదర్ బెన్హర్బాబు, ఆర్సీఎం ఫాదర్ జయరాజ్, రిటైర్డు బిషప్ ఫెడ్రిక్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సీఎస్ఐ చర్చి బిషప్ బీడీ ప్రసాదరావు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలు, ప్రజల అండదండలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అతి చిన్నవయస్సులోనే అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. మంచి ఉద్ధేశంతో ప్రజలు ఆయనను ఎన్నుకున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తారన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని వైఎస్ కుటుంబ సభ్యులు, ఫాదర్లు శాలువా కప్పి సత్కరించారు. మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ చర్చి నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు హెలిప్యాడ్ వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. చర్చి వరకు కాన్వాయ్‌తోపాటు పరుగులు తీశారు. వైఎస్ జగన్ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. -
కదనం.. కర్నూలు నుంచే
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఏటా వర్షాలు..పచ్చని పంట భూములు..రైతు మోములో చెరగని చిరునవ్వు.. భయం లేని యువత భవిత.. ఇవన్నీ రాజన్న రాజ్యం సొంతం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నల్లకాల్వ వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు అలుముకున్నాయి. మహానేత మరణం అందరినీ కలిచివేసింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానులు ప్రాణాలొదిలారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 38 మంది గుండెపోటుతో మరణించారంటే రాజన్న పట్ల ప్రజల్లో అభిమానం ఎంతగా గూడు కట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా.. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, రాజన్న మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలకు అండగా నిలవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా తండ్రి మరణించిన ప్రాంతంలోనే 2009 సెప్టెంబరు 25న ఆత్మకూరు నియోజకవర్గం నల్లకాల్వలో బహిరంగ సభ నిర్వహించారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను పరామర్శించడం తన కనీస బాధ్యత అని, ఓదార్పు యాత్ర చేపట్టి బాధితులకు బాసటగా నిలుస్తానని ప్రకటించారు. తద్వారా జగన్ తొలి అడుగు జిల్లాలోనే పడింది. ఈ ఒక్క అడుగు కోట్లాది మంది ప్రజలను ఏకం చేసింది. ఓదార్పు యాత్ర జిల్లాలో ఓదార్పు యాత్ర 2011 జూలై 18న ప్రారంభమైంది. 207 గ్రామాల మీదుగా 1,339 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. మొత్తం 37 కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వారివారి ప్రధాన వీధులు, కూడళ్లలో 152 వైఎస్సార్ కాంస్య విగ్రహాలను జగన్‌తో ఆవిష్కరింపజేసి.. ప్రేమానురాగాలను చాటుకున్నారు. కర్నూలులో జలదీక్ష కృష్ణా, తుంగభద్ర నదులపై ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రజలు, రైతులు ఆందోళనకు గురయ్యారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని భావించారు. దీనిపై స్పందించాల్సిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి మిన్నకుండి పోయారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య కావడంతో వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలోకి తుంగభద్ర, కృష్ణా నదులు తొలి అడుగులు వేసే కర్నూలు జిల్లాలోనే జలదీక్ష చేపట్టాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా 2016 మే 16న కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద జలదీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగిన దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. హోదా కోసం ‘యువభేరి’ ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికీకరణ జరిగి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, తద్వారా యువత సంక్షేమం సాధ్యపడుతుందనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘యువభేరి’ ద్వారా సమరభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువభేరి సభల్లో భాగంగా 2016 అక్టోబరు 25న కర్నూలు శివారులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు హాజరైతే పీడీ కేసులు పెడతామన్న అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను ఏ మాత్రమూ లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు, మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు వేలాదిగా తరలివచ్చారు. హోదా ఉద్యమంలో మేము సైతం అంటూ కదంతొక్కారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు ప్రతి సందర్భంలోనూ బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో 11 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీని గెలిపించి మద్దతుగా నిలిచారు. అయితే, ఆ తర్వాత అధికారపార్టీ ప్రలోభాలకు లొంగిపోయి కొద్ది మంది పార్టీ ఫిరాయించినప్పటికీ జిల్లా ప్రజలు మాత్రం ‘నేతలు వెళ్లినా..మేమంతా నీ వెంటే జగనన్నా..’ అంటూ స్పష్టం చేశారు. జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు 18 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. 7 నియోజకవర్గాల్లోని 14 మండలాలు, 66 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో 100, 200, 300 కిలోమీటర్ల మైలురాళ్లను ఇక్కడే చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది జనంతో మమేకమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి..వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవడంతో పాటు గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ముందడుగు వేస్తామని ప్రకటించారు. రైతులకు బీమాతో పాటు గిట్టుబాటు ధరకు హామీనిచ్చారు. క్లీన్‌స్వీప్ ఈ ఎన్నికల్లో జిల్లా మొత్తం జగన్ వెంటే నడిచింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షానికి తావులేకుండా చేశారు. కోట్ల–కేఈ వంటి ఉద్దండులతో పాటు భూమా, బుడ్డా, గౌరు, టీజీ కుటుంబాలకు రాజకీయ మనుగడ లేకుండా తీర్పు చెప్పారు. -
ఒక్కడిగా వచ్చి.. జనాభిమానం గెలిచి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఒంటరిగానే వచ్చాడు. ఒంటరిగానే పోరాడాడు. ఒంటరిగానే గెలిచాడు. నిక్కచ్చిగా, నిష్కర్షగా అడుగులు వేశాడు. యువ నాయకుడు జన నాయకుడయ్యారు. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు. ఆయనే వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. 2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్ తన పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి ఓదార్పుయాత్ర చేశారు. తనను నమ్మిన వారి కోసం కాంగ్రెస్ పార్టీని త్రుణప్రాయంగా వదిలేశారు. ఆపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొన్నారు. ఎన్నో ఒడుదొడుకుల మధ్య జరిగిన 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పార్టీ ఓటమి చవిచూసినా వెరవలేదు. ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభాలు పెట్టి లాక్కున్నా వెనక్కి తగ్గలేదు. రకరకాల దుష్ప్రచారాలు చేసినా కుంగిపోలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా అంతే ఓర్పుగా, అంతే నేర్పుగా నెగ్గుకొచ్చారు. ధీరోదాత్తుడిగా ముందుకు సాగారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం, రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. మొత్తానికి వైఎస్ కొడుకు నుంచి ఏపీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో లక్ష్యం దిశగానే సాగారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. సాధించాలనే తపన, తగిన కార్యాచరణ తోడైతే తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పడానికి వైఎస్ జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం. ఆయనొక ఆదర్శం. యువతకు స్ఫూర్తి. పోరాడితే లక్ష్యం తప్పక సిద్ధిస్తుందని నిరూపించిన వ్యక్తి ఆయన. ఆటుపోట్లు ఎదుర్కొని, కష్టాలను అధిగమించి, ప్రతికూల పరిస్థితులను దాటి ఎలా విజయం సాధించవచ్చనే విషయాన్ని జగన్ రుజువు చేశారు. ఇప్పుడందరికీ రోల్ మోడల్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేతగా చరిత్రకెక్కారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మన జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన వేసిన అడుగులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. జగ్గంపేటలో పార్టీ ప్రకటన ఓదార్పుయాత్ర నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను విడిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా పెట్టబోయే పార్టీ పేరును మన జిల్లాలోనే 2011 మార్చి 11న ప్రకటించారు. జ్యోతుల నెహ్రూ, పెండెం దొరబాబు, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు పార్టీలో చేరిన సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ పేరుతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇక్కడే జెండా రంగులు కూడా తెలియజేశారు. పార్టీ పెట్టాల్సిన అవశ్యకతను జగ్గంపేట నుంచి రాష్ట్ర ప్రజలకు వివరించారు. కష్టాల్లో... ♦ 2014 జూన్ 6న నగరంలో గ్యాస్‌పైపు పేలిన ఘటనలో చనిపోయిన 22 మంది కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారు. ♦ 2015 జూలై 14న పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోగా, 52 మందికి గాయాలయ్యాయి. వీరి కుటుంబాలను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. ♦ 2015 అక్టోబర్ 25న తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని తెలుసుకుని హుటాహుటిన వచ్చారు. వారి కుటుంబాలను పరామర్శించారు. ♦ రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని చింతూరు మండలం మామిళ్లగూడెం, వీఆర్ పురం మండలం అన్నవరంలో కాళ్లవాపు వ్యాధితో చనిపోయిన 16 మంది కుటుంబీకులను 2015 డిసెంబర్ 8న వైఎస్ జగన్ పరామర్శించారు. ♦ 2016 ఆగస్టు 12న ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధ చేశారని దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వచ్చారు. ♦ 2017 జూలై ఒకటిన రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని చాపరాయిలో విషజ్వరాలతో 16 మంది వరకు చనిపోయారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించిన వైఎస్ జగన్ జ్వరాలతో బాధపడుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జూన్ 30న కాకినాడ వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రంపచోడవరం వెళ్లి రాత్రి బస చేసి తెల్లవారు జామున ప్రమాదకరమైన ప్రయాణం చేసి చాపరాయికి వెళ్లి బాధితులను పరామర్శించారు. జిల్లాలోనే 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జగన్ 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 412 కిలోమీటర్లు నడిచిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జూన్ 12న పశ్చిమగోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి నుంచి కాటన్ బ్యారేజీ, కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర పొడవునా జిల్లాలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలివీ.. ♦ జూన్13న 188వ రోజు పాదయాత్ర రాజమహేంద్రవరంలో మొదలై కాటన్ బ్యారేజ్ మీదుగా బొబ్బర్లంక వద్ద కోనసీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి పేరవరం వరకూ వైఎస్సార్ సీపీ పతాకంలోని మువ్వన్నెల్లా మూడు పాయలుగా సాగింది. బాటపై జనవాహిని నడువ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి...రేపటి సౌభాగ్యానికి భరోసా లాంటి చిరునవ్వుతో నడుస్తుండగా, కుడివైపునున్న సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో ఆయన హామీ ఇచ్చిన నవరత్న పథకాలను చాటే కటౌట్లతో నావలు మెల్ల మెల్లగా అనుసరించాయి. ఇక కాలువకు ఆవలి గట్టునా పోటెత్తిన ప్రజలు మూడో పాయగా ముందుకు సాగారు. ♦ జూన్14న ఆత్రేయపురం వద్ద రోడ్డు పక్కన పూతరేకులు తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. పూతరేకుల తయారీకి ఉపయోగిస్తున్న కుండ వద్ద కూర్చొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే తయారు చేసిన పూత రేకును రుచి చూశారు. అక్కడే మరికొంతమంది యువతులు జగన్‌కు పూతరేకు తినిపించారు. ♦ జూన్ 17వ తేదీన వెదిరేశ్వరంలో ఆటో డ్రైవర్లు ఇచ్చిన చొక్కాను ధరించారు. కాసేపు ఆటో నడిపారు. ♦ జూన్ 26న బిందువు బిందువు కలిసి మహా సింధువైనట్టు అఖాతం అడుగుల నుంచి చిన్నగా బయలుదేరిన అలలు ఉత్సాహాన్నిచ్చే మహా కెరటమై ఎగిసిపడినట్టు.. వైనతేయ గోదావరికి ఆ ఒడ్డున మొదలైన ప్రజాకెరటం. అంతలోనే జనగోదారిగా మారి.. తర్వాత జన ఉప్పెనలా రూపుదాల్చి .. కోనసీమ కేంద్రం అమలాపురాన్ని ముంచెత్తి 200వ రోజు పాదయాత్ర పూర్తి చేసుకుంది. ♦ జూన్ 21న రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం జంక్షన్ వద్దకు చేరుకోగానే 2400 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. ఆ ఊరికి సమీపంలో కొబ్బరి మొక్కను నాటారు. ♦ జూలై 8న 208వ రోజు పాదయాత్ర జరిగిన పసలపూడి వద్ద 2500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. అదే రోజున వైఎస్సార్ జయంతి కావడంతో అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. ♦ జూలై 17వ తేదీన కొవ్వాడ రైల్వే ట్రాక్ వద్ద భారీగా ఏర్పాటు చేసిన కటౌట్ వద్ద కాకినాడ నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికి, ఆకాశమంత అభిమానం చూపించారు. ♦ జూలై 28న పాదయాత్ర సాగిన 100వ నియోజకవర్గంగా జగ్గంపేటలో అడుగు పెట్టారు. అక్కడే కేక్ కట్ చేశారు. 2600 కిలోమీటర్ల మైలు రాయిని జగ్గంపేటలో అధిగమించారు. ఇక్కడ మొక్క నాటారు. ♦ జూన్ 29న కిర్లంపూడి మండలం వీరవరంలో బెల్లం తయారీని పరిశీలించారు. అక్కడ బెల్లం రుచి చూశారు. ♦ ఆగస్టు 1న గొల్లప్రోలులో సాగిన పాదయాత్రలో ప్రజలు దారి పొడవునా పూలబాట పరిచారు. ♦ ఆగస్టు 7న చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారితో మమేకమయ్యారు. పలు హామీలు ఇచ్చారు. ఇదే రోజున శంఖవరంలో నాయీ బ్రాహ్మణులు కోరడంతో డోలు వాయించారు. ♦ ఆగస్టు 9న పారుపాక జంక్షన్ వద్ద రోడ్డుపై చీరలు పరిచి స్వాగతం పలికారు. ఇక్కడ గిరిజనులు ఇచ్చిన విల్లును ఎక్కుపెట్టారు. ♦ ఆగస్టు 11న తునిలో 2700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మొక్కనాటి నీరు పోశారు. ఇదే రోజున తుని పాదయాత్రలోరోజా పూలతో అభిమానులు ముంచెత్తారు.చెప్పాలంటే కురిపించిన పూల వర్షంలోజగన్ తడిసి ముద్దయ్యారు. కాకినాడలోనే ఎన్నికల సమరశంఖం మార్పుకు తూర్పు సంకేతమనే సెంటిమెంట్‌ను జగన్కొనసాగించారు. కాకినాడలో నిర్వహించే సమర శంఖారావం రోజునే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఇక్కడి నుంచి సమరశంఖం పూరించారు. ఎన్నికల ఢంకా మోగించారు. ఎన్నికల ప్రచారం కూడా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట నుంచి ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం, ముమ్మిడివరం, మండపేట, పెద్దాపురం, రాజానగరం, కాకినాడ రూరల్‌లో ఎన్నికల ప్రచార సభలునిర్వహించారు. -
వైఎస్ జగన్ తొలి సంతకం అవ్వాతాతల కోసం..
-
జన'విజేత'
రాజన్న మరణం తట్టుకోలేక గుండె పగిలిన కుటుంబాలను ఓదార్చేందుకుఢిల్లీ పెద్దలను ధిక్కరించినా.. రైతు రుణమాఫీ మోసాలపై దీక్షబూనినా.. తుందుర్రు ఆక్వా ఉద్యమానికి నేనున్నానంటూ బాసటగా నిలిచినా..గరగపర్రు దళితులకు అండగా గర్జించినా.. దగాపడ్డ బీసీలకు వెన్నుదన్నుగా నిలిచినా.. జనం కోసం ఎందాకైనా దూసుకుపోవడంలో ఆయనకు ఆయనే సాటి. పోరుబాటలో ఆయన తీరు ప్రత్యేకం. జిల్లాపై ఆయన చూపిన ఔదార్యం అసమానం. నవరత్నాలే ఆయుధంగా జనపథం పట్టిన ప్రజా సంకల్పయాత్ర ఓ సువర్ణాధ్యాయం. ఇది జిల్లా వాసులకు ఓ భరోసా.. మొత్తం ఆంధ్ర ఇక కులాసా. ఐదేళ్ల రక్కసి పాలనను పారదోలి నవ్యాంధ్ర సారథిగా పట్టాభిషిక్తుడవుతున్న వేళ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగక చేసిన పోరాట గమనం స్మరణీయం సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: పోరాటాల పురిటిగడ్డ పశ్చిమాన పోరాట యోధుడిగా ఆయన ఉదయించారు. కుట్రలు, కుతంత్రాలు, కుటిల రాజకీయాలు, వేధింపులు, దాడులు చేస్తూ తోడేళ్ళలా అంతా ఒక్కటై దండెత్తి వచ్చినా.. భయపడలేదు. నదురూబెదురు లేక ముందుకు సాగారు. పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ.. చీకటి బతుకుల్లో వెలుగులు విరజిమ్మే మండే సూరీడులా.. ప్రజా సమస్యలపై ఉక్కుపిడికిలి బిగించారు. ఉద్యమబాట పట్టారు. ఎండా.. వానా.. ధుమ్మూధూళి, రక్కసి మూకల కర్కశ దాడులను లెక్కచేయక గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని.. దేవుడిపై అచెంచల విశ్వాసంతో ప్రజలపై ఆపార నమ్మకంతో ముందడుగేశారు. చివరికి చీకటితెరలు చీల్చుకొచ్చిన వెలుగుల దివిటీలా ఘన విజయం సాధించి ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అదిగో అక్కడ అమరావతిలో ప్రజల సాక్షిగా ‘జగన్ అనే నేనూ..అంటూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనే ‘‘యెడుగూరి సందింటి జగన్ మోహన్‌రెడ్డి ’’ ఓదార్పు యాత్రకు ఏలూరులోనే నాందీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో రాష్ట్రంలో వందలాది గుండెలు పగిలాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకొచ్చారు. గుండెలు పగిలిన ప్రతి కుటుంబాన్నీ స్వయంగా కలుస్తానని నల్లకాల్వ సాక్షిగా ప్రకటించారు. ఏప్రిల్ 2010లో రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్రకు ఏలూరు నుంచే వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. జిల్లాలో 44 కుటుంబా లను ఓదార్చి వారికి తోడ్పాటును అందించారు. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. ఈ యాత్రను కాంగ్రెస్ అధిష్ఠానం, విపక్షాలు ఎంత అడ్డుకున్నా.. వైఎస్ జగన్ వెనుకడుగు వేయలేదు. మొక్కవోని ధైర్యంతో ముందడుగేశారు. ప్రజల పక్షాన పోరుబావుటా ఎగురేశారు. పోలవరానికి హరిత యాత్ర పోలవరం సాధనకోసం వైఎస్ జగన్ హరిత యాత్ర చేపట్టారు. 2011లో రావులపాలెం నుంచి పోలవరం వరకూ కాలినడకన యత్ర చేశారు. నాలుగురోజుల పాటు 80కిలోమీటర్ల దూరం మేర ఈ యాత్ర సాగింది. అనంతరం 2012లో వైఎస్ జగన్ బస్సుయాత్ర చేపట్టారు. విద్యుత్ పోరాటానికి వేదిక మొగల్తూరు విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమించారు. 2004 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ విద్యుత్ చార్జీలను పెంచలేదు. కానీ ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచటంతో వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రస్తుత నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో 2012 జూన్ 10న మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద వైఎస్ జగన్ ఒకరోజు నిరశన దీక్ష చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతోపాటు వైఎస్ జగన్ తీరంలో పర్యటించి స్వయంగా ఉప్పుమడుల్లోకి దిగి ఉప్పు రైతుల దీనస్థితిని తెలుసుకున్నారు. వారి సమస్యలపై గళమెత్తారు. తణుకులో రెండు రోజుల రైతు దీక్ష ఆ తర్వాత 2014 ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారానికి దూరమైన వైఎస్సార్సీపీ టీడీపీ సర్కారు నయవంచన పాలనపై సమరశంఖం పూరించింది. చంద్రబాబు పాలనలో దగాపడ్డ రైతుల పక్షాన ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గళమెత్తారు. తణుకు పట్టణంలో 2015 జనవరి 31న రెండురోజులపాటు రైతు దీక్ష చేపట్టారు. స్వాతంత్య్రోద్యమం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన తణుకు నుంచే జన నేత జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాలకు శ్రీకారం చుట్టారు. తణుకులో జాతీయరహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో రెండురోజులు దీక్ష చేశారు. దేవరపల్లిలో పొగాకు రైతు కోసం.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పోరుబాట పట్టిన పొగాకు రైతులకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. వారిపక్షాన సమరభేరి మోగించారు. పొగాకు రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు 2015 జూలై 4న దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించారు. వారి కష్టాలు విని నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. వేలాదిమంది రైతుల గుండెల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పోరాటం చేశారు. పొగాకు ధర రూ.175 నుంచి రూ.130కు పడిపోయిందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతన్నలకు అండగా ఉంటామంటూ వారికి భరోసా కల్పించారు. 2016లోనూ జంగారెడ్డిగూడెంలోని పొగాకు కేంద్రాలను సందర్శించి రైతులకు బాసటగా నిలిచారు. ఏలూరులో హోదాపై యువభేరి రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యువత, విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు యువభేరీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆ«ధ్వర్యంలో 2016 సెప్టెంబర్ 22న ఏలూరులోని శ్రీకన్వెన్షన్ హాలులో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు, నేతలు, విద్యార్థి సంఘాలతో యువభేరీ నిర్వహించారు. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు హాజరై తమ ప్రత్యేక హోదా సాధనకు మీతో కలిసి పోరాటం చేస్తామంటూ జగన్‌కు చెప్పారు. గరగపర్రు దళితులకు అండగా పాలకోడేరు మండలం గరగపర్రులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య త్రీవస్థాయిలో వివాదం నెలకొంది. దళితులను ఇతర వర్గాలు వెలివేశాయని, సామాజికంగానూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, గొడవలు జరుగుతున్నాయనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో 2017 జూన్ 30న గరగపర్రులో పర్యటించి దళితులను పరామర్శించారు. రెండు వర్గాలతో మాట్లాడి అక్కడి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేశారు. వైషమ్యాలను వదిలి రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండాలని కోరారు. జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చారు. రాజులా పాలిస్తే.. ప్రజలు మళ్లీ ఆదరించడానికి కూడా రెడీగా ఉంటారని వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చాటింది. ఇదే బాటలో రాజన్న రాజ్యం అందించేందుకు ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి రాజశేఖరరెడ్డి కన్నా జనక్షేమం కోసం రెండు అడుగులు ముందుకు వేయడం ఖాయమని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఏలూరులో బీసీ మహాగర్జన సభ ఏలూరు శివారు వట్లూరు ప్రాంతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ గర్జనతోపాటు, ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించారు. ఏలూరులో బీసీ గర్జన మహాసభ సూపర్ సక్సెస్ అయ్యింది. సుమారు మూడు లక్షలమంది బీసీలు, పార్టీ శ్రేణులు సభకు హాజ రయ్యారని అంచనా. మండుటెండలోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని వినేందుకు జనం ఓపిగ్గా వేచి ఉన్నారు. ఉక్కపోతను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేతకు జేజేలు పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. దీనిపై బీసీల్లో హర్షం వ్యక్తమైంది. దివంగత మహానేత వైఎస్సార్ పేదల సంక్షేమానికి ఒక అడుగు ముందుకు వేస్తే..తాను రెండు అడుగులు వేస్తానని చెప్పే వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీల పట్ల బీసీ వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయనేది ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
ఆ అమ్మ కల.. నెరవేరిన వేళ
పశ్చిమగోదావరి, భీమడోలు: వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆతల్లి ఆకాంక్షించింది. అయితే విధి వక్రించి ఎన్నికల రోజే మృతి చెందింది. దాంతో ఆకుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ మాతృమూర్తి కోరిక నెరవేర్చేందుకు అంత బాధలోనూ ఆకుమార్తెలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భీమడోలు పంచాయతీ శివారు సూర్యారావుపేటకు చెందిన భీమడోలు మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరరావు, లక్ష్మీదుర్గ నాగ అమరావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సింధూర, సాయిరమ్య. రామకుర్తి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు దివంగత సీఎం వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. ఇదిలా ఉంటే టీడీపీ ఎన్నికల వేళ చేసిన కుట్రల్లో భాగంగా నాగేశ్వరరావు ఓటును తొలగించారు. ఇటీవల రామకుర్తి నాగేశ్వరరావు భార్య అమరావతి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్యుల సూచనల మేరకు వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత నెల 9న విజయవాడకు తీసుకుని వెళ్లారు. 10వ తేదీ రాత్రి వైద్యులు పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకుని వెళ్లాలని సూచించారు. సరిగ్గా ఎన్నికల రోజు అమరావతి కన్నుమూశారు. దాంతో ఆకుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయినా మనోనిబ్బరంతో తల్లి కోరిక నెరవేర్చాలన్న సంకల్పంతో అంత బాధలోనూ ఈనెల 11న భీమడోలులో కుమార్తెలు సింధూర, సాయిరమ్య వైసీపీకి ఓటు వేశారు. ఈనెల 23న వైఎస్ జగన్‌కు అనుకూలంగా వచ్చిన ఫలితాలతో ఆ ఇద్దరు కుమార్తెలు ఎంతో సంబరపడ్డారు. తమ తల్లి కోరిక నెరవేరిందని, ఆమె ఉంటే ఎంతో ఆనందించేదని గుర్తు చేసుకున్నారు. తాను బీటెక్ చదువుకునేందుకు వైఎస్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎంతో దోహదపడిందని పెద్ద కుమార్తె సింధూర తెలిపింది. సీఎంగా జగనన్న తమ లాంటి ఎన్నో పేద కుటుంబాల చదువుకు భరోసా ఇచ్చే ఈ పథకాన్ని మరింత బలోపితం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె సాయి రమ్య మాట్లాడుతూ తాను ఎంబీఏ చదువుతున్నట్టు తెలిపింది. రామకుర్తి నాగేశ్వరరావు సాక్షితో మాట్లాడుతూ వైఎస్ జగనన్న సీఎం అవుతున్నాడన్న వార్త తెలిస్తే తన భార్య ఎంతో సంతోషపడేదని చెప్పారు. ఆమె అనారోగ్యంతో కన్నుమూయడం తమ కుటుంబాన్ని ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దది..
-
విజయ సంకల్పం
శ్రీకాకుళం, కంచిలి/ఇచ్ఛాపురం రూరల్ :వైఎస్సార్ కుటుంబానికి.. రాష్ట్రంలో శివారు నియోజకవర్గమైన ఇచ్ఛాపురానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఆ కుటుంబం ప్రజాహితమైన ఏ కార్యక్రమానికి సమర శంఖారావం పూరించాలన్నా ఇచ్ఛాపురమే వేదికవుతోంది. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి నుంచి కుమార్తె షర్మిలమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు వీరందరి పాదయాత్రల ముగింపు ఘట్టం ఇచ్ఛాపురంలోనే జరిగింది. ఇక్కడ పాదయాత్రలు ముగించిన తర్వాత నుంచే ఆ దశ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఈ ముగ్గురి పాదయాత్ర విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రజాసంకల్పయాత్ర పల్లె సీమలు, పట్టణాలు, నగరాల మీదుగా సాగిన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రకు సాక్షిగా నిలిచింది ‘విజయ స్థూపం’(పైలాన్). వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఎన్నో అవాంతరాలను అధిగమించి 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. ప్రజా సంకల్పయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద ఆయన ప్రారంభించిన ‘విజయ స్థూపం’ నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి చిహ్నంగా నిలుస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా విజయ స్థూపం... ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందర శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయ పరిసరాల్లో ‘విజయ స్థూపం’ (పైలాన్) నిర్మించారు. తూర్పు వైపు 16వ నంబర్ జాతీయ రహదారి, పడమర వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉండటంతో అటు వాహనాల్లో ప్రయాణించే వారికి, ఇటు రైలులో ప్రయాణించే వారి దృష్టిని ఈ కట్టడం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. రాత్రి సమయంలో మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో పైలాన్ ప్రత్యేకంగా దర్శనమిస్తోంది. చిరస్మరణీయంగా చిహ్నాలు... సుమారు అర ఎకరా స్థలంలో 98 అడుగుల ఎత్తులో నిర్మించిన విజయ స్తూపం ప్రత్యేక ఆకర్షణగా, చిరస్మరణీయ చిహ్నాలతో కమనీయంగా రూపుదిద్దుకుంది. నాలుగు వైపులా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలతో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలు పాలరాతిపై లామినేషన్ చేసి అలంకరించారు. పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను పైలాన్ చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు అమర్చారు. 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లు.. విజయ స్తూపం చుట్టూ చిన్నపాటి లాన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లాన్ నుంచి పైలాన్ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందుకు గానూ ఒక్కో జిల్లాకు ఒక్కో మెట్టు చిహ్నంగా ఏర్పాటు చేశారు. పైభాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు. అగ్ర భాగంలో పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఫ్యాన్ గుర్తు అమర్చారు. ప్రస్తుతం ఈ విజయస్తూపం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, అమ్మవారిని దర్శించుకునే భక్తులతో నిత్యం కిటకిటలాడుతోంది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ వాణిజ్యవిభాగం కన్వీనర్ తాడి ఆదిరెడ్డి పర్యవేక్షణలో విద్యుత్ కాంతులతో విజయ స్తూపం దర్శనీయ స్థలంగా మారింది. విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికి పుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయానికి చిహ్నంగా ‘విజయ స్తూపం’ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనడంలో అతిశయోక్తిలేదు. ప్రజా ప్రస్థానం... రాజకీయ నాయకులకే కాదు ప్రజలకు సేవ చేసేందుకు తపన ఉండాలనుకునే వారికి, ప్రజల కష్ట నష్టాలను కళ్లారా చూడటానికి ఏం చేయాలో తెలియక మీమాంసలో ఉన్న వారికి 2003లో ‘ప్రజా ప్రస్థానం’ పేరిట వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తోంది. 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. సుమారు 64 రోజుల పాటు 1470 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేశారు. పాదయాత్ర మధ్యలో అనారోగ్యానికి గురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు. వైఎస్సార్ పాదయాత్ర ముగింపు రోజు ఇచ్ఛాపురం సురంగి రాజా వారి మైదానంలో పార్టీ అగ్రనాయకులతో నిర్వహించిన బహిరంగ సభలో సమర శంఖారావాన్ని పూరించారు. ఆ రోజు సిక్కోలు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు వైఎస్సార్‌కు నీరాజనాలు పట్టారు. ముగింపు రోజునే ప్రజాప్రస్థాన పైలాన్‌ను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2004 ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయన ముఖ్యమత్రి హోదాలో 2004 మార్చి 5న నగర బాట కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురంలో పర్యటించి టూరిజం పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్మించిన ప్రజాప్రస్థాన విజయ వాటికగా నామకరణం చేశారు. అనంతరం టూరిజం పార్కును వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 అక్టోబర్ 26న ప్రారంభించారు. టూరిజం పార్కు వద్ద ఉన్న పైలాన్ ఇప్పటికీ పార్టీలకతీతంగా స్ఫూర్తిని రగిలిస్తునే ఉంది. మరో ప్రజా ప్రస్థానం.. మహానేత తనయ వైఎస్ షర్మిలమ్మ పాదయాత్రను 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో ప్రారంభించి 2013 ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో ముగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నదుకు, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట పాదయాత్రను చేపట్టారు. ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభకు తల్లి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు. ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోశారు. 116 నియోజకవర్గాలు, 14 జిల్లాల్లో 230 రోజుల పాటు 3112 కిలో మీటర్లు షర్మిలమ్మ నిర్వహించిన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురం ప్రజా ప్రస్థానం ఎదురుగా ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట నిర్మించిన స్థూపం మరో మైలు రాయిగా మిగిలిపోయింది. -
ఆపద్బాంధవుడు!
నేనున్నానంటూ అండగా నిలిచినందుకు.. మేమున్నామంటూ అంతేస్థాయిలో కృతజ్ఞత చూపించారు వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు. మెరుగైన పరిహారం, ప్యాకేజీ కోసం పోరాటం చేపట్టి అప్పటి టీడీపీ సర్కారు మెడలు వంచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాతపట్నం ప్రజానీకం ఓట్ల రూపంలో తమ అభిమానాన్ని తెలియజేశారు. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టి కృతజ్ఞతను చాటిచెప్పారు. శ్రీకాకుళం, హిరమండలం: వంశధార ఫేజ్–2 రిజర్వాయర్.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెరపైకి వచ్చిన బహుళార్థక సాధక ప్రాజెక్ట్. వంశధార మిగులు జలాలను ఒడిసి పట్టి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. 2005లో రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఒడిశాతో వివాదాలు చుట్టుముట్టినా కార్యదీక్షతో రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా సర్వం పోగొట్టుకున్న 18 గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయాలని..వారి త్యాగాలకు విలువ కట్టలేమని..వీలైనంత వరకూ వారికి అన్నివిధాలా చేయూతనివ్వాలని పరితపించే వారు. మెరుగైన ప్యాకేజీ, పరిహారంతో పాటు వారి జీవనోపాధికి భంగం కలుగకుండా చూడాలని ప్రయత్నించారు. ఇంతలోపే 2009లో ఆయన హఠాన్మరణం చెందారు. అక్కడి నుంచి నిర్వాసితుల కష్టాలు తీర్చేవారే కరువయ్యారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తిచేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పాతపట్నం నుంచి బరిలో దిగిన కలమట వెంకటరమణమూర్తిని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని వెంకటరమణమూర్తి వమ్ము చేస్తూ వ్యక్తిగత స్వార్థంతో టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు. నిర్వాసితుల గొంతుకైన జగనన్న.. నిర్వాసితుల దయనీయ పరిస్థితిని అటు ప్రభుత్వం వినలేదు కదా..పోలీస్ కేసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో నిర్వాసితుల గొంతుకయ్యారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు 2017 మే 19న హిరమండలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. అసలు నిర్వాసితుల సమస్యలేమిటి? వారు అడుగుతున్న కోర్కెలు ఏమిటి? పరిహారం ఎంతకావాలి? అన్న విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిర్వాసితుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. నిర్వాసితులపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కార్ మెడలు వంచి న్యాయం చేస్తానని ప్రకటించారు. 2013 భూ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల త్యాగాలకు ఎందుకు విలువ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో మెరుగైన ప్యాకేజీలు అందుతున్నా ఇక్కడే ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు బాధలు లేకుండా చేస్తానని అప్పట్లో ప్రకటించారు. దీంతో జగనన్న తమకు అండగా నిలిచారన్న నమ్మకం నిర్వాసితుల్లో వ్యక్తమైంది. అటు తరువాత ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు పరిహారం, ప్యాకేజీల కోసం విడుదల చేసినట్టు ప్రకటించినా నిజమైన నిర్వాసితులకు సాంత్వన చేకూర్చలేదు. ప్యాకేజీ పంపిణీలో భారీ అవినీతి చోటుచేసుకుంది. యూత్ ప్యాకేజీ విషయంలో బినామీలదే రాజ్యమైంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి నుంచి కింది స్థాయి వరకూ అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ నిర్వాసితుల్లో గూడుకట్టుకున్నాయి. అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని పెల్లుబికేలా చేశాయి. 2018 జనవరిలో సంక్రాంతి సమయంలో పోలీసులతో గ్రామాలను ఖాళీ చేయించారు. పండగ తర్వాత వెళ్తామని బతిమలాడిన పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వచ్చారు. నియోజకవర్గంలోని మెళియాపుట్టి సభలో నిర్వాసితుల సమస్యలను ఏకరవు పెట్టారు. వారి దయనీయ పరిస్థితిని..ప్రభుత్వం చూపిన దమననీతిని ఎండగట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించడంతో పాటు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. వారి త్యాగాలు గుర్తించుకొని వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. వీటిన్నింటిని గుర్తించిన నిర్వాసితులు వైఎస్సార్సీపీకి తాజా ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని అందించారు. పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో తమకు అన్నివిధాలా భరోసా ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కానుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు అన్నివిధాలా చేయూతనివ్వాని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ వంశధార నిర్వాసితులకు మొదటి నుంచీ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఎన్నోరకాల ఇబ్బందులకు గురిచేసింది. అయినా ప్రతిఘటిస్తూ వచ్చాం. చివరకు గ్రామాలను సైతం బలవంతంగా ఖాళీ చేయించారు. జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించిన తర్వాత టీడీపీ సర్కార్ పరిహారం, ప్యాకేజీ మంజూరు చేసింది. అందులో కూడా అవినీతికి పాల్పడింది. అందుకే నిర్వాసితులు వైఎస్సార్సీపీని గెలిపించారు. –గొర్లె మోహనరావు, నిర్వాసితుడు, పాడలి ఆదుకుంటారనే నమ్మకముంది టీడీపీకి నిర్వాసితుల ఉసురు తగిలింది. అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ కొట్టుకుపోయింది. నిర్వాసితుల సమస్యలు గాలికొదిలేసి వారిపై కక్షపూరితంగా వ్యవహరించింది. పోలీసులతో ఉక్కుపాదం మోపింది. ఈ పరిస్థితిలో జగనన్న అండగా నిలిచారు. ఆ కృతజ్ఞతతోనే ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారు. నిర్వాసితుల సమసయలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీర్చుతుందన్న నమ్మకం ఉంది. –గొల్లంగి మోహన్రావునిర్వాసితుడు, సుభలయ -
వైఎస్ జగన్‌కు మత పెద్దల అశీర్వచనాలు
-
ప్రజాశీస్సులు ఫలించాయి..
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర నెల్లిమర్లలో దిగ్విజయంగా సాగింది. కొండవెలగాడ, నెల్లిమర్ల మీదుగా సాగిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పట్టారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో ఎంతో మంది ప్రజలు తమ కష్టాలను జగన్ మోహన్‌రెడ్డికి చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణితో విసుగు చెందుతున్నామని.. మీరే మాకు ముఖ్యమంత్రిగా రావాలని ఆశీర్వదించారు. ఉద్యోగ సంఘాల నాయకులు, చేతి వృత్తుల వారు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ప్రజాశీస్సులు ఫలించడంతో జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆనాటి పాదయాత్ర విశేషాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద బహిరంగ సభ జరుగుతోంది.. కిక్కిరిసిన జనం.. అడుగు వేయడం కూడా కష్టమే.. అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గర్భిణి యాల రాజేశ్వరి ఆటోలో ఆ దారి గుండా వెళ్లాల్సి వచ్చింది. జనం మధ్యలోంచి ఆటో వెళ్లలేకపోవడాన్ని వేదిక నుంచే గమనించారు జగన్‌ర మోహన్‌రెడ్డి. వెంటనే ప్రసంగాన్ని ఆపేశారు. నిండు చూలాలి బాధ చూసి చలించిపోయారు. వెంటనే అన్నా.. ఆటోకు దారివ్వండన్నా..అంటూ పదే పదే మైక్‌లో చెప్పారు. జననేత అభ్యర్థనతో అభిమానులంతా క్రమశిక్షణతో పక్కకు జరిగారు. కొందరు రక్షణ వలయంగా ఏర్పడి ఆటోను ముందుకు నడిపించారు..108 అంబులెన్స్‌ల దుస్థితి నేడు ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేశారు. జననేతను చూసేందుకు పోటెత్తిన మహిళలు... ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండలంలో కొండవెలగాడ గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. కొండవెలగాడలోనే రాత్రి బస కావడంతో మరుచటి రోజు ఉదయం 6 గంటల నుంచే జననేతను చూసేందుకు మహిళలు బారులు తీరారు. దీంతో రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే కేరింతలు కొడుతూ ఘనంగా ఆహ్వానించారు. మా గ్రామానికి ముఖ్యమంత్రి వచ్చారంటూ గతంలో జరిగిన సంఘటనను ఎంతో ఆనందంగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.. -
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
-
మనవడికి నేడు పట్టాభిషేకం
అతడే ఒక సైన్యం...అందరి మనస్సులను గెలిచిన ‘అనంత’ మనవడు. ఓదార్పుయాత్రతో జిల్లాలో తొలి అడుగు వేసి...జనంతో మమేకమైన జననేత..ప్రజా సంకల్పయాత్రతో ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్న రాజన్న బిడ్డ. నవరత్నాలతో నవశకానికి నాంది పలికిన నేత. అందుకే ఆంధ్ర రాష్ట్రమంతా ఒక్కటై అపూర్వ విజయాన్నందించగా... నేడు విజయవాడలో పట్టాభిషేకం చేసుకుంటున్న జన హృదయ నేత. సొంత జిల్లా వైఎస్సార్ కడప అభివృద్ధిపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో... మనవడిగా ‘అనంత’పై అంతకు మించిన మమకారం ఉంది. ఓదార్పు, రైతు భరోసా, ప్రజా సంకల్ప యాత్రల్లో జిల్లాలోని పల్లె పల్లెకూ వెళ్లారు. ప్రతి గడపా తొక్కారు. జనం బాధలన్నీ విన్నారు. జిల్లా ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. అందుకే ‘అనంత’ జనం ఆయన వెంటే నడిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వవిజయాన్నందించారు. తమ కష్టాలన్నీ తీరిపోయాయంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మాట తప్పని నైజం జగ నిజమని.. కరువు సీమలో సిరులు పండించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నారు. అనుబంధం ఇలా.. ♦ 2011 జూన్ 20: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా జిల్లాలో తొలి అడుగు..వైఎస్సార్ మృతిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన 23 మంది బాధిత కుటుంబాలకు ఓదార్పు. ♦ 2012 ఫిబ్రవరి 12 : చేనేతల సమస్యలపై ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 48 గంటల నిరాహారదీక్ష. చేనేత కార్మికుల సమస్యలపై ఓ నాయకుడు జిల్లాలో దీక్ష చేయడం ఇదే ప్రథమం. ♦ 2015 ఫిబ్రవరి 22: అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల కోసం ‘రైతుభరోసాయాత్ర’. 5 విడతల్లో 81 కుటుంబాలకు భరోసా. రైతు భరోసా ఫిబ్రవరి 22న ప్రారంభం కాగా 21నే రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్లు జీఓ జారీ చేసిన టీడీపీ సర్కార్. ♦ 2016 అక్టోబరు 4: రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదురుగా ‘రైతుదీక్ష’. రెయిన్గన్ల పేరుతో ప్రభుత్వం చేసిన డ్రామాను తూర్పారబట్టిన జననేత. ‘అనంత’ను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాలని, సాగునీటి ఇబ్బందులు తీర్చాలని డిమాండ్. ♦ 2017 అక్టోబరు 10: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ కళ్యాణమండపంలో ‘యువభేరి’ సభ. యువతను చైతన్యపరిచి... ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరించిన జగన్మోహన్రెడ్డి. ♦ 2017 డిసెంబర్ 4 : ప్రజాసంకల్ప పాదయాత్రతో జిల్లాలోకి ప్రవేశించిన జగన్మోహన్రెడ్డి. మొత్తం 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 175 గ్రామాల్లో సాగిన యాత్ర. ప్రజల కష్టాలు, సమస్యలు స్వయంగా చూసిన జననేత. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాలకు త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ భరోసా. ఒక్క అడుగు కొన్ని లక్షల జీవితాలకు వెలుగైంది. ఆ ఒక్క అడుగే దోపిడీదారుల పాలిట సింహస్వప్నమైంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో జిల్లా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. పదేళ్ల పాటు జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ పదేళ్లలో ఎటు చూసినా సంక్షోభమే. కష్టాలు.. కన్నీళ్లతో ప్రజలు సహవాసం చేస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలోనే పీడిత ప్రజానీకానికి అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. మహానేత మృతిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించిన వారి కుటుంబసభ్యలను పరామర్శించేందుకు తొలిసారిగా ‘ఓదార్పు యాత్ర’తో వేసిన అడుగు.. తర్వాతి రోజుల్లో ప్రభంజనమై సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని మననం చేస్తూ.. సాక్షిప్రతినిధి, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘అనంత’కు అల్లుడు. సొంతజిల్లా కడప కంటే ‘అనంత’పైనే ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఆయన సీఎంగా గద్దెనెక్కిన తర్వాత ‘అనంత’ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించారు. ‘అనంత’ వెంకటరెడ్డి హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ, చాగళ్లు, పెండేకల్లు లాంటి ప్రాజెక్టులతో సాగునీటి కష్టాలు, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలతో తాగునీరు, లేపాక్షినాలెడ్జ్హబ్, సైన్సుసిటీ పేరుతో పారిశ్రామిక అభివృద్ధికి బాసటగా నిలవడం, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఉన్నత విద్యకు దన్నుగా నిలవడం, పంటలబీమా, ఇన్‌పుట్‌సబ్సిడీ, పశుక్రాంతిలతో రైతుకు అండగా నిలవడం...ఇలా ప్రతీ విభాగంలో కూడా జిల్లా ప్రజలకు వైఎస్ అండగా నిలచారు. ఈ క్రమంలో 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణవార్త విని తట్టుకోలేక ‘అనంత’లో 23 మంది గుండెపోటుతో మృతి చెందారు. వీరి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర చేపట్టారు. ఓదార్పుయాత్ర చేస్తూనే ఆయన వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీని స్థాపించారు. చేనేత కార్మికుల సమస్యలపై ‘చేనేత దీక్ష’ చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా.. నేతన్నలకు దన్నుగా జగన్మోహన్రెడ్డి ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 48 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. 2012 ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో ఈ దీక్ష కొనసాగింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు పరిహారం అందించాలని, చేనేతలకు ముడిసరుకులో రాయితీ ఇవ్వాలని 48గంటలపాటు అన్నం మెతుకు ముట్టకుండా దీక్ష చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై ఓ నాయకుడు జిల్లాలో దీక్ష చేయడం ఇదే ప్రథమం. ఈ దీక్ష తర్వాత చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చేసింది. ప్రజల ఆశీస్సులతో తాను అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరించాలని అప్పట్లోనే సంకల్పించారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017 డిసెంబర్ 4 నుంచి 28 వరకూ 279.4 కిలోమీటర్లు జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో మొదలైన ఈ పాదయాత్ర కదిరి నియోజజకవర్గంలో ముగిసింది. మొత్తం 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 175 గ్రామాల్లో యాత్ర సాగింది. పాదయాత్ర జగన్మోహన్రెడ్డిని ప్రజలకు అత్యంత చేరువ చేసింది. జగన్ రాకను ప్రతీ పల్లె ఓ పండుగలా చేసుకుంది. నాలుగేళ్లలో ప్రభుత్వతీరుతో మోసపోయిన వైనం, ప్రజల ఇబ్బందులు, కులవృత్తులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యవకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా సమస్యలు ఏకరువు పెట్టారు. విదేశీయులు సైతం జగన్ పాదయాత్రను చూసేందుకు వచ్చారు. శింగనమల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి అనే రైతు ‘సార్! నాకు చదువు రాదు. ఫ్లెక్సీలు వేయించలేను. పేపర్లో ప్రకటనలు ఇస్తే ఒకేరోజుతో ఆ జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే ఇత్తడి నాగలి ఇస్తున్నా’ అంటూ భారీ ఇత్తడి నాగలి ఇచ్చారు. ‘డిసెంబర్ 23 మధ్యాహ్నం భోజన విరామానికి టెంట్‌లోకి జగన్ వెళ్లారు. అప్పటికే శిబిరంలో ఇద్దరు మహిళలు వేచి ఉన్నారు. వారిని చూసి ఏం తల్లి అని జగన్ అడిగారు. వెంటనే వారు ‘అన్నా! మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం. మా పేర్లు తిప్పమ్మ, ఆనందమ్మ! కూలీ పనికి వెళుతుంటాం. మీ పాదయాత్రకు ఎంతో కొంత ఇవ్వాలని కూలిలో కొంత దాస్తూ వచ్చాం. ఆ డబ్బు తెచ్చాం. తీసుకో అన్నా. పాదయాత్ర విజయవంతానికి మా వంతు భాగం’ అంటూ చిల్లర మూటను జగన్ చేతిలో పెట్టారు. వారి అభిమానానికి చలించిపోయిన జగన్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలీలేదు. రెండు చేతులెత్తి దండం పెట్టారు. ఇలాంటి సంఘటనలు జగన్‌ను కదిలించాయి. తనను ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో, భవిష్యత్‌పై ఎలాంటి నమ్మకం పెట్టకున్నారో జగన్‌కు స్పష్టమైంది. జగన్‌పైనే నమ్మకం ఐదేళ్ల కష్టాలు, కన్నీళ్ల తర్వాత జగన్ నేడు (గురువారం) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేయాలి. జిల్లాలో 3.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. తిరిగి లేపాక్షినాలెడ్జ్హబ్ను తెరపైకి తెచ్చి పరిశ్రమలు రప్పించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించాలి. జిల్లాను సమగ్రాభివృద్ధి బాట పట్టించాలి. ‘అనంత’ కష్టాలను జగన్ అతిదగ్గరగా చూడడం వల్ల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కచ్చితంగా జిల్లా అభివృద్ధి బాట పడుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతకు ప్రత్యేక స్థానమిస్తారని ప్రజలతో పాటు రాజకీయపక్షాలు, మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేతగాజిల్లాలో తొలి అడుగు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర పేరుతో ‘అనంత’లో తొలి అడుగుపెట్టారు. 2011 జూన్ 20న పులివెందుల–తలుపుల మధ్యలోని నామాలగుండు వద్ద ‘ఓదార్పుయాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్రలో 12 రోజుల పాటు సాగింది. వైఎస్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన 23 కుటుంబాలను పరామర్శించారు. కదిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ యాత్ర, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిసింది. మొత్తం 921 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది. యాత్రలో 79చోట్ల వైఎస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్రలో పేదింటి గడపలు తొక్కి వారి కష్టాలను ఆయన కళ్లారా చూశారు. కన్నీరు తుడిచారు. వారి ఇళ్లలో ఒక సభ్యుడిలా కలిసి పోయి వారు పెట్టింది తిన్నారు. వైఎస్‌ను ‘అనంత’ వాసులు ఏస్థాయిలో గుండెల్లో పెట్టుకున్నారో జగన్‌కు యాత్రలో అర్థమైంది. అంతకు మించి తనను గుర్తుపెట్టుకోవాలనే ధృడసంకల్పానికి అప్పుడే బీజం పడింది! చరిత్రలో నిలిచిపోయేలా ‘రైతు భరోసా యాత్ర’ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 జూన్ 8 నుంచి రైతుల వరుస ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం రుణమాఫీ చేస్తానని చెయ్యకపోవడమే. 2014 సెప్టెంబర్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తలేదు. దీంతో అనంతపురం, కర్నూలుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, రుణమాఫీ చేస్తామని చేయకపోవడంతో ఆత్మహత్యలకు తెగిస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. వెంటనే రుణమాఫీ చేసి, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఎక్కడా, ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదని రైతులను కించపరిచేలా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడారు. దీంతో చలించిపోయిన జగన్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని, ఎందుకు వారు చనిపోయారో ప్రభుత్వానికి చెబుతానని అసెంబ్లీలో గట్టిగా చెప్పారు. 2015 ఫిబ్రవరి 22న ‘రైతుభరోసాయాత్ర’ ప్రారంభించారు. మొత్తం 5 విడతల్లో 32రోజుల పాటు జిల్లాలో పర్యటించి 81 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నప్పటికీ, తాను చేయకపోవడంతో ప్రతిపక్షనేతగా వారి కుటుంబాలకు అండగా నిలిచారు. రైతుభరోసాయాత్ర ఫిబ్రవరి 22న ప్రారంభమైతే 21న చనిపోయిన రైతుకుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్లు చంద్రబాబు జీవో జారీ చేశారు. ఇందులో కూడా కేవలం కొద్దిమంది పేర్లను మాత్రమే చేర్చారు. భరోసాయాత్రతో రుణమాఫీ పేరుతో ప్రభుత్వం చేసిన మోసం, వ్యవసాయం చేయలేక రైతులు పడుతున్న అవస్థలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైనం, కుటుంబాలు ఛిన్నాభిన్నమై వలసపోతున్న తీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఒక పాలకుడు రైతుల సంక్షేమానికి ఎలా కట్టుబడి ఉండాలనేది అప్పుడే ఆయన మనసులో నాటుకుంది. నవరత్నాల్లోని ‘రైతుభరోసా’కు అదే కారణమైంది. -
ఒకే ఒక్కడు
సాక్షి, చిత్తూరు : ప్రజా శ్రేయస్సే లక్ష్యం. రాజీపడే ప్రశ్నే లేదు. కేసులకు వెరసే నైజమే కాదు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగే లేదు. ఫీజుపోరు, సాగుపోరు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంపై ధర్నా, కరువు రైతుకు సాంత్వన కోసం పోరాటం.. ఒకటేమిటి.. సమస్య ఎక్కడున్నా ఆయన అక్కడుండేవారు. ప్రజల పక్షాన నిలిచారు.. ప్రభుత్వంతో పోరాడారు. హోదాకోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. పదేళ్ల పాటు జనంలో ఉన్నారు. తండ్రిచ్చిన అభిమానాన్నే వారసత్వంగా చేసుకుని ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఓదార్పు, పాదయాత్రలతో పేదరికాన్ని దగ్గరి నుంచి చూసి చలించిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకు జిల్లా జనం నీరాజనాలు పలికారు. 13 స్థానాల్లో గెలిపించి ప్రజా నాయకుడిని చేశారు. పోరాటమే స్ఫూర్తిగా.. విలువలు, విశ్వసనీయతే లక్ష్యంగా ప్రజా పక్షాన నిలిచారు. అందరూ ఒక్కటై.. సమస్యలు చిన్నవిగా చూపే ప్రయత్నం చేసినా.. ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జనం కోసం నిలబడ్డారు. అందుకే జగన్మోహన్రెడ్డికి జనం పట్టం కట్టారు. 10 సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉండిన ఏకైక నాయకుడు ఆయన. కేవలం ఇద్దరితో ప్రారంభమైన పోరాటం పదేళ్లలో 151కి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు కాదు.. దేశ చరిత్రలోనే ఎవరికీ సొంతం కాని రీతిలో 50 శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న క్రమంపై సాక్షి ప్రత్యేక కథనం. ఓదార్పు యాత్ర.. దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం. జిల్లాలో 36 రోజల పాటు 23 మందిని పరామర్శించారు. సమకాలీన రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా జనంలో అంత విస్తృతంగా ప్రయాణించిన దాఖలాలు లేవు. మహానేత రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో 23 మంది గుండెలు ఆగిపోయాయి. వైఎస్ మరణించిన 22వ రోజు నల్లకాలువ వద్ద జరిగిన సభలో జగన్ హామీ ఇచ్చారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారందరినీ పరామర్శిస్తానని చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే ఓదార్పు యాత్ర చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో 2013 నవంబర్ 30న సమైక్య శంఖారావం నిర్వహిం చారు. ఇంటి తలుపులు వేసుకోండని చంద్రబాబు చెబితే కుప్పం జనం తమ గుండె తలుపులు తెరుచుకుని సమైక్య శంఖారావం సభకు ప్రవాహంలా కదిలివచ్చారు. జగన్మోహన్రెడ్డి అడుగులో అడుగులేస్తూ కదంతొక్కారు. ప్రజా ఉద్యమాలకు మద్దతు వైఎస్ జగన్ ముఖ్యమైన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. పోరాటాలు కొసాగిస్తూనే వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు రైతులు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిం చాలని 2011 ఫిబ్రవరి నుంచి వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. కనీస మద్దతు ధర అందక విలవిల్లాడతున్న అన్నదాతలకు అండగా 2011 మే 15న రైతు దీక్ష చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2012 జనవరి 4న ధర్నాకు దిగారు. వస్త్రవ్యాపారులకు మద్దతుగా 2012 జనవరి 27న భారీగా రాస్తారోకో చేశారు. 2015 డిసెంబర్ 8న కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు. 2017 నవంబర్ 20న హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ 2018 ఫిబ్రవరి 8న విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు. రైతు భరోసా యాత్ర వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలన్నీ అమలు చేయలేదు. దీంతో రైతుల రుణభారం పెరిగి, పంటలు నష్టపోయిన పరిస్థితుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో వారిని ఓదార్చడానికి జగన్ రైతు భరోసా యాత్ర చేపట్టారు. దీంతో రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో ఇచ్చింది. చేనేతలకు భరోసా చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా 2012 ఫిబ్రవరి 12న మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. ఆ తరువాత చేనేత కార్మికులు ఎక్కడ దీక్షలు చేపడితే అక్కడ వారికి సంఘీభావం తెలిపారు. 2017అక్టోబర్‌లో మరోసారి చేనేత దీక్ష చేశారు. అక్కడే 45 సంవత్సరాలకే పింఛన్ పథకం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఇవ్వాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను నిరసిస్తూ కర్నూలులో జలదీక్ష చేపట్టారు. ప్రజా సంకల్పయాత్ర చరిత్ర.. చరిత్రలో ఇదిరవరకూ ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అయ్యారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్ 6న ప్రారంభమైంది. జిల్లాలో 2017 డిసెంబర్ 28న ప్రవేశించింది. 10 నియోజకవర్గాలో 23 రోజుల పాటు 291.1 కిలోమీటర్లు ప్రజలసమస్యలు తెలుసుకుంటూ నడిచారు. జిల్లాలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రకటన చేశారు.పాడి రైతులకు రూ.4 సబ్సీడీ పథకంపై రైతులకు చెప్పారు. రోళ్లుపగిలే ఎండలు, ఎముకలు కొరికే చలి,భారీవర్షాలు అనారోగ్యం ఇవేవీ జగన్పాదయాత్రను అడ్డుకోలేకపోయాయి. -
మనలో ఒకడు.. మనతోనే అతడు
తండ్రి సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వాన్నే ధిక్కరించారు..కేసులు పెట్టి కష్టాల పాల్జేసినా లెక్కచేయలేదు.. పదవిని తృణప్రాయంగా త్యజించి పార్టీ పెట్టారు.. ప్రజాక్షేత్రంలోకి దూకారు..నేనున్నానంటూ అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచారు.. వారితో మమేకమయ్యారు.. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం తృటిలో చేజారినా జావగారిపోలేదు..ప్రజలే నా కుటుంబం.. వారి లోగిళ్లే నా ఇల్లు.. అంటూ నిత్యం వారిలోనే, వారితోనే గడిపారు..మహానేత మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చినా.. హుద్‌హుద్ దాటికి కకావికలమైన విశాఖను ఆర్తిగా అక్కున చేర్చుకున్నా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే లక్ష్యమంటూ తొలిసారి విశాఖలో యువభేరి మోగించినా.. భూబకాసురుల నుంచి విశాఖను రక్షించేందుకు సేవ్ విశాఖ అని గర్జించినా.. అవినీతి పాలకుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినదించినా.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మహాసంకల్పం పూనినా.. ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించేందుకు నవరత్నాలను సిద్ధం చేసినా.. ఆ ఒక్కడికే చెల్లింది. అవే అతడిని మేరునగధీరుడిగా నిలిపాయి. అఖండ విజయంతో సీఎం సింహాసనంపై కూర్చుండబెట్టాయి. ఆటంకాలను, కుట్రలను, దాడులను ఎదుర్కొంటూ.. మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించిన జగన్మోహనుడు.. సంక్షేమ పాలనతో ఆంధ్రభోజుడుగా ఖ్యాతి గడించాలని..అంగళ్ల రతనాలు అమ్మినారట అచట.. అని నాటి కృష్ణదేవరాయల పాలనన జ్ఞప్తికి తెచ్చేలా.. రాష్ట్ర ప్రజలందరి ఇళ్లలో నవరత్నాల వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. నింపుతారని మనసారా విశ్వసిస్తూ.. జిల్లాలో ఆ పోరాట యోథుడి తొమ్మిదేళ్ల జ్ఞాపకాల ముద్రలు... మన్యం.. మైదానం.. సేవాపథికుడ్ని చూసి జయహో అంటోంది.కష్టాలకు వెరవని ధీరత్వానికి ఊరూ, వాడా సలాం చేస్తోంది.ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎందాకైనా వెళ్లే గుణాన్ని విశాఖ జనం మెచ్చుకుంటోంది.ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవే మిన్నగా భావించి నూతన చరిత్రను లిఖించిన జగన్మోహనుడిని మనసారా ఆశీర్వదిస్తోంది.ప్రజాసేవలో తరించి.. ప్రజల కష్టాల్ని తన కష్టంగా భావించి.. ప్రజాతీర్పుతో సంక్షేమ ప్రదాతగా నిలవబోతోన్న రాజన్న తనయుడి ప్రమాణస్వీకార మహోత్సవ వేళ నాటి జ్ఞాపకాల్ని తలచుకుంటోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొడుతోంది. కొయ్యూరు(పాడేరు): మహానేత మరణాన్ని తట్టుకోలేక మండలంలోని నల్లగొండకు చెందిన వాకపల్లి లక్ష్మి(50) మరణించింది. ఓదార్పు యాత్రలో భాగంగా రాజన్న తనయుడు జగన్మోహన్రెడ్డి 2010 ఏప్రిల్‌లో ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. దీనికి గుర్తుగా వైఎస్సార్ అభిమానులు గ్రామంలో మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతికి ఇక్కడ పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ‘జగన్మోహన్రెడ్డి రాకతో తమ గ్రామం పుణ్యం చేసుకుందని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతారనే విశ్వాసం తమకుందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని’ చెప్పారు మాజీ సర్పంచ్ పల్లి చిన్నభాయి. అన్నదాతకు అండగా... ♦ అనకాపల్లి: తమ ప్రాంతం కష్టసుఖాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి భాగస్వాములయ్యారని, పలుమార్లు తమ ప్రాంతాన్ని సందర్శించారని ఆయన ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందాన్నిస్తోందని చెబుతున్నారు అనకాపల్లి వాసులు. ♦ ఓదార్పుయాత్రలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ♦ పైలిన్ తుపాన్ ప్రభావంతో పంట నీటమునిగింది. అన్నదాతను పరామర్శించేందుకు ఆవఖండంను సందర్శించారు. ♦ హుదూద్ తుపాన్ కారణంగా ధ్వంసమైన తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తుమ్మపాల మీదుగా వెంకుపాలెం చేరుకుని దారిపొడవునా రైతులతో మాట్లాడారు. వారికి భరోసానిచ్చారు. ♦ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 2018 ఆగస్ట్ 29న అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ♦ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 7న అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరై ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారు. పదిలమైన జ్ఞాపకం కోటవురట్ల(పాయకరావుపేట): ‘ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్మోహన్రెడ్డి పాదయాత్ర కోటవురట్ల మీదుగా గొట్టివాడ చేరుకుంది. గ్రామస్తులందరం తలుపులమ్మతల్లి పండుగను చేసుకుంటున్నాం. ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చిన జగనన్న చూసి ఉబ్బితబ్బిబయ్యాం. అందరినీ పలకరించి కష్టసుఖాలను తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ క్షణాలు మరిచిపోలేనవి.’ అని చెబుతున్నారు గొట్టివాడ గ్రామ ప్రజలు. దోస్త్ మేరా దోస్త్... పాడేరు : తమ స్నేహితుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణం తమకు ఆనందదాయక సందర్భమని చెబుతున్నారు వైఎస్జగన్మోహన్రెడ్డి స్నేహితులు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో పదేళ్ల(1979–89)పాటు జగన్మోహన్రెడ్డితో కలిసి చదువుకున్నామని నాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు పాడేరుకు చెందిన కిముడు వెంకటలింగం, కిల్లు సుధాకర్ నాయుడు. జిల్లాలో ప్రజా సంకల్పయాత్రకు వచ్చినప్పుడు తమను పేరుపేరునా పలకరించి ఎంతో అభిమానం చూపారని వారు చెప్పారు. పేరులో అభిమానం జ్ఞానాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా..ఆయన కుటుంబం అన్నా ప్రజానీకంలో అభిమానం ఎప్పుడూ తొణికిసలాడుతుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. జ్ఞానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు పాత్రపల్లి సునీల్‌కి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానం. ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నా వల్లమాలిన ప్రేమ. గురువారం ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో సునీల్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. సునీల్ తన కుమారుడుకు వైఎస్సార్ అని.. కుమార్తెకు షైనీ వర్ష (వైఎస్ జగన్ కుమారై పేరు) అని నామకరణం చేసుకుని వారిని తమ పిల్లల్లో చూసుకుంటున్నారు. అంతేకాదు సునీల్ రాజశేఖరరెడ్డితో పాదయాత్రలో నడిచారు. అలాగే 2018లో వైఎస్ జగన్‌తోనూ పాదయాత్రలో పాల్గొన్నారు. కుటుంబంతో కలసి దొండపర్తిలో జగన్‌ను కలసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ సీఎం కాబోతుండడంతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ కుటుంబం ఆనందం వ్యక్త పరుస్తోంది. -
విజయవాడకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రికి సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. -
గాంధీ, వాజ్‌పేయిలకు మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్‌కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. మహాత్మ గాంధీ, వాజ్‌పేయిలకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు. కాగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ, విదేశీ నేతలు సహా దాదాపు 8000 మంది అతిధులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పార్టీల నేతలు, పరిశ్రమ వర్గాలు, దౌత్యవేత్తలు, రాయబారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. -
మోదీ ప్రమాణ స్వీకారానికి ఆ ఇద్దరు సీఎంలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హాజరుకావడం లేదు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమల కారణంగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని వారు వెల్లడించారు. ఇక రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీకి భూపేష్ బాఘేల్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నానని పేర్కొన్నారు. మరోవైపు తమ మంత్రివర్గ సహచరుల ప్రమాణ స్వీకారం కూడా గురువారం ఉన్నందున తాను ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
నేడే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
-
వైఎస్ జగన్ సీఎం అవ్వాలని పదేళ్లగా..
-
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత
-
రేపే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం
-
నాయకులందరికీ ఆహ్వానం : వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులను ఆహ్వానించామని పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 30 (గురువారం)న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పలుచోట్ల వాహనాల దారిమళ్లింపు చేపట్టారు. ఈ వేడుకకు హాజరుకానున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ క్వానాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్ధం చేస్తున్నారు.