
కర్ణాటక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పరమేశ్వరను అభినందిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ఆహ్వానం మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి బుధవారం ఉదయం బెంగళూరుకు వెళ్లారు. వీరంతా రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు.