t congress leaders
-
త్రిముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్
-
ప్రజాభవన్ లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్
-
ఏఐసీసీ వార్ రూమ్ లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
-
కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
-
నేడు ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో టీ. కాంగ్రెస్ కీలక భేటీ
-
నేడు హైదరాబాద్ లో టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
-
ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసిన టీ-కాంగ్రెస్ ఆందోళన
-
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో టీ కాంగ్రెస్ పూజలు
సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్రిక్తత నడుమ శుక్రవారం ఉదయమే భట్టి , వీహెచ్ , సీతక్క, అంజనీయాదవ్.. తదితర నేతలు ఆలయానికి చేరుకున్నారు. బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోవడం విశేషం. అదే సమయంలో.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బండికి రాసి ఇవ్వలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మా అధినేత్రి సోనియా గాంధీకి కొవిడ్ వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని పూజ చేశాం. అమ్మవారిని పూజించడం ఎప్పటి నుంచో ఉంది. బండి సంజయ్ పుట్టిన తర్వాతే పూజలు చేయడం లేదు. ఇదేం బండి సంజయ్‌కి రాసి ఇవ్వలేదు. కాంగ్రెస్ భావజాలం తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అమ్మవారు అందరికీ దేవత. హిందువులు అసహ్యించుకునేలా ఉంది బీజేపీ నేతల ప్రవర్తన. రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారాయన. -
టార్గెట్ అసెంబ్లీ.. శాసనసభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసి న వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోటీ చేయా లనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ మేరకు తమ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఫలితాలు తమకు సానుకూలంగా వస్తాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనతోనే వీరంతా అసెంబ్లీ వైపు మొగ్గుచూపుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మధిరలో ‘పట్టు వదలని విక్రమార్కుడు’ నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా, రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఆయన మూడు విడతలుగా నియోజకవర్గంలో పర్యటించారు. ‘పీపుల్స్ మార్చ్’పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లో 400 కిలోమీటర్ల మేర 86 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఎర్రుపాలెం మండలం మినహా నియోజకవర్గంలో ని మిగిలిన మండలాల్లో ఆయన గ్రామగ్రామానికి వెళ్లి ఓ వైపు ప్రజాసమస్యలను తెలుసుకోవడం, తా ను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేసే ప్రయత్నం చేశారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ స్పీడు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ బాట పడుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించడమే ధ్యేయంగా ఈ నెల 21 నుంచి ఆయన యాత్ర చేపట్టారు. టీపీసీసీ పిలుపులో భాగంగా పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో గత ఐదురోజుల్లోనే 40 గ్రామాల్లో పర్యటించారు. ఎండను లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైతు రచ్చబండలు, సభల్లో పాల్గొంటున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ ప్రజల సమస్యలను వారికి వివరిస్తున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కేడర్‌తో కూడా సమావేశమవుతున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం పంపించడం, కార్యక్రమాలు విజయవంతం చేసేలా పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేయడం కోసం ఈ గ్రూపులను ఉపయోగించుకో వాలనేది ఉత్తమ్ ఆలోచనగా చెబుతున్నారు. శివారు నియోజకవర్గంపై యాష్కీ కన్ను ఇక గతంలో నిజామాబాద్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఈసారి హైదరాబాద్ శివార్లలోని ఓ అసెం బ్లీ నియోజకవర్గంపై కన్నేసినట్టు చర్చ జరుగుతోంది. తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానంపై ఆయన గురిపెట్టారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ఎప్పటిలాగే జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటికే అసెంబ్లీ ఇన్చార్జులుగా ఉన్నవారు, గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన నాయకులు పలువురు కూడా వరంగల్ డిక్లరేషన్ పేరుతో గ్రామాల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో పట్టు సాధించే లక్ష్యంతో తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నల్లగొండ నుంచి ఖాయమన్న కోమటిరెడ్డి... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయానికొస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాన ని ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. -
నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దు.. ఢిల్లీకి రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజల్లో ఉండి వారిపక్షాన పనిచేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది. పార్టీ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దు. అలాగని టికెట్ల కోసం ఢిల్లీకి రావొద్దు. స్వతంత్రంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాం’’అని పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు డబ్బు, పోలీస్ బలం ఉందిగానీ జనబలం లేదని.. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేస్తే విజయం సాధించగలమని సూచించారు. టీఆర్ఎస్తో పొత్తు ఉండబోదని, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య గట్టిపోరు జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నంగాం ధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరాటం ‘‘నిన్న నా ప్రసంగంలో తెలంగాణ స్వప్నం గురించి చెప్పాను. తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ఆకాంక్ష ఉంది. కానీ కేసీఆర్ ఆ స్వప్నానికి భంగం కలిగించారు. తెలంగాణను మోసం చేసిన వారితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేశాను. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం ఉండబోతోంది. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నాడు. ఆయనకు డబ్బులకు కొదవలేదు. ప్రభుత్వం ఉంది, పోలీసులున్నారు, అన్ని వ్యవస్థలున్నాయి. కానీ ప్రజలు వారి వెంటలేరు. మనం ప్రజలతో కలిసి మనం ఇచ్చిన రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలి. నియంతృత్వ ప్రభుత్వం కాదు. రైతుల, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఫోకస్ పెట్టాలి. పనిచేస్తేనే ప్రతిఫలం.. పార్టీ టికెట్లు మెరిట్ ప్రతిపాదకనే ఇస్తాం. ఎవరూ భ్రాంతిలో ఉండకండి. తర్వాత నన్ను తప్పుపట్టొద్దు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో.. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, యువత పక్షాన పోరాటం చేస్తారో వారికే పార్టీ టికెట్ ఇస్తుంది. ఇది మన కుటుంబం. ఎవరి పట్లా వివక్ష ఉండదు. పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. ఎంత సీనియర్ అయినా, ఎంత చరిత్ర ఉన్న నాయకుడైనా సరే పనిచేయకపోతే మాత్రం టికెట్లు రావు. స్వతంత్ర సమాచారం, క్షేత్రస్థాయి సమాచారం తీసుకుని టికెట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో ఉంటే టికెట్లు రావు. ఢిల్లీ మాత్రం అసలు రావద్దు. ఢిల్లీ వస్తే బ్యాక్‌ఫైర్ అవుతుంది. హైదరాబాద్‌లో బిర్యానీ బాగుంటుందని, మంచి చాయ్ ఉంటుందని తెలుసు. కానీ వాటిని వదిలిపెట్టి మీ నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లండి. మీరు ప్రజల మధ్యలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లండి వరంగల్ డిక్లరేషన్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇది కేవలం డిక్లరేషన్ కాదు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతుల మధ్య ఒక విశ్వాసపత్రం. దీనికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. తెలంగాణలోని ప్రతి వ్యక్తి, ప్రతి రైతుకు వరంగల్ డిక్లరేషన్‌ను చేరవేయాలి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వచ్చే నెలలో మీ నియోజకవర్గంలో, మీ ప్రాంతంలో డిక్లరేషన్ గురించి పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలి. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం మనది ఆర్ఎస్ఎస్ కుటుంబం కాదు. అక్కడ ఒక వ్యక్తే అన్నీ నిర్ణయిస్తాడు. మనది అలాంటి సంస్థ కాదు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వినాలని, గౌరవించాలని నేను అనుకుంటున్నాను. కానీ మీడియాలో మాత్రం కాదు. ఒక కుటుంబంలాగా నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం. పార్టీ అంతర్గత వ్యవస్థకు మీ ఫిర్యాదులు ఎన్నిసార్లయినా చెప్పండి. కానీ మీడియాలో చెప్పడం వల్ల మనకు నష్టం జరుగుతోంది. దీన్ని ఉపేక్షించేది లేదు. వరంగల్ సభ విజయవంతమైంది. కాంగ్రెస్ నేతలంతా తమ శక్తి మేర పనిచేస్తే ఎలా ఉంటుందో నిన్న చూశాం. యువతకు తలుపులు తెరవండి రాష్ట్రంలో చాలా మంది యువకులు, నాయకులు కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలను గౌరవిస్తారు. వారందరి కోసం పార్టీ తలుపులు తెరిచి ఉంచాలి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాతో కలిసి పనిచేయాలని, టీఆర్ఎస్, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని యువతను కోరుతున్నా. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎలాంటి నష్టం జరిగిందో, ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు రాలేదు. కానీ ఒక కుటుంబాని మాత్రం అన్నీ వచ్చాయి. అందుకే టీఆర్ఎస్ను తెలంగాణ నుంచి తరిమేయడం యువత బాధ్యత. తెలంగాణ యువత కాంగ్రెస్‌లోకి వచ్చి రాష్ట్రంలో మార్పుకోసం కృషి చేయాలని కోరుతున్నా. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నేను అండగా ఉంటా. నేను ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో చెప్తే.. వచ్చి ప్రజల కోసం పనిచేస్తా..’’అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కూడా మాట్లాడారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అకస్మాత్తుగా అమరవీరుల స్మారక చిహ్నం వద్దకు.. సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీభవన్ నుంచి బయలుదేరిన రాహుల్‌గాంధీ.. నేరుగా ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంతాన్ని సందర్శించారు. అమరవీరుల స్మారకం నిర్మాణంలోనూ అవినీతి జరుగుతోందని, దీన్ని నిరూపిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్మారక చిహ్నం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తర్వాత రాహుల్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరారు. రేవంత్, మాణిక్యం ఠాగూర్ తదితరులు ఎయిర్‌పోర్టులో రాహుల్‌కు వీడ్కోలు పలికారు. టీవీ చానళ్ల యజమానులతో సమావేశం శనివారం ఉదయం తాజ్‌కృష్ణ హోటల్లో టీవీ చానళ్ల యజమానులు బీఆర్ నాయుడు (టీవీ5), వేమూరి రాధాకృష్ణ (ఏబీఎన్), చలసాని వెంకటేశ్వర్రావు (సీవీఆర్), టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో రాహుల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారులతో సమాలోచనలు మీడియా యాజమాన్యాలతో సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యమకారులు గద్దర్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, పురుషోత్తం తదితరులతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, అది చాలా ప్రమాదకరమని రాహుల్‌ను కోరారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధమని, ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెరుకు సుధాకర్ చెప్పారు. ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు తెచ్చే దిశగా కృషి చేయాలని కంచె ఐలయ్య కోరారు. మాజీ సీఎం సంజీవయ్యకు నివాళి శనివారం మధ్యాహ్నం సంజీవయ్య పార్కులో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. టీపీసీసీ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. తెలంగాణ కలలను కేసీఆర్ నాశనం చేశారు రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఆకాంక్షను, తెలంగాణ ప్రజల కలలను సీఎం కేసీఆర్ ఒంటిచేత్తో నాశనం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మే తెలంగాణ యువత పార్టీలోకి రావాలి. టీఆర్ఎస్ను ఓడించి ఉజ్వల తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు కావాలి. – గాంధీభవన్‌లో తన సమావేశం వీడియోను జతచేస్తూ రాహుల్ ట్వీట్ KCR has single-handedly destroyed the dream the people of Telangana and Sonia ji had when statehood was granted. I welcome the youth, who believe in the ideology of the Congress, to join us in our mission to defeat TRS and build a glorious Telangana. pic.twitter.com/9Fd2sKgYU1 — Rahul Gandhi (@RahulGandhi) May 7, 2022 -
జగ్గారెడ్డి ఫైర్.. ఆ ఇద్దరు నాపై నెగెటివ్ రిపోర్ట్
-
పార్టీని వీడొద్దని జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నపార్టీ సీనియర్ నేతలు
-
‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు బుధవారం గాంధీభవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు. -
పేరు కోసమే కొత్త భవనాలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే వందేళ్ల వరకు ఉండగలిగే భవనాలను కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. నీళ్లు, నిధుల కోసం తెచ్చు కున్న తెలంగాణ.. కేవలం నలుగురు వ్యక్తుల చేతు ల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, టి.జీవన్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఆర్ (టి.రామ్మోహన్ రెడ్డి), విజయరమణారావు, కొండేటి శ్రీధర్‌తో కూడి న బృందం సోమవారం రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనాలను సందర్శించింది. ఈ సందర్భంగా విలేకరులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శిలాఫలకాలపై తన పేరు ఉండాలనే తపన కోసమే కేసీఆర్ కొత్త భవనాల నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం, 42 మంది మంత్రులు, 294 మంది ఎమ్మెల్యేలతో పాలన సాగిన సచివాలయం, అసెంబ్లీ ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలకు సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. 1980లో మర్రి చెన్నారెడ్డి హయాంలో కొన్ని భవనాలు నిర్మిస్తే, 2012, 2013లో కొన్నింటిని నిర్మించారని, ఈ నిర్మాణాలకు 30 ఏళ్లు కూడా దాటలేదని వివరించారు. ఉన్న వాటిని కూల్చి కొత్తవి కట్టడం దుర్మార్గమన్నారు. ఇంత పెద్ద సచివాలయంలో ఇప్పటికే అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని, మళ్లీ కొత్తగా కట్టాల్సిన పనిలేదని, చిన్న చిన్న మరమ్మతులతో వాటిని సరిచేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ మహారాజు, చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం.. కొత్త భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్యాయమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మూఢ నమ్మకాలను కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేస్తోందన్నారు. నేడు రూ.400 కోట్లు అని చెప్పిన కేసీఆర్ అంచనాలు.. రూ.2 వేల కోట్ల వరకు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ భవనాల్లో ఇంకా 50 ఏళ్ల వరకు ఉండొచ్చని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడికి తరలించాలని కోరారు. ముందు విద్యను అభివృద్ధి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అమరవీరుల కోసం స్తూపం నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఐదేళ్లు దాటినా ఒక ఇటుక కూడా పెట్టలేదని, అదే విధంగా కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తామన్నా ఆ ఊసేలేదని ధ్వజమెత్తారు. సచివాలయ నిర్మాణంపై ఇప్పటికే హైకోర్టులో కేసు ఉందన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. రైతులు, ఉద్యోగుల సమస్యలను సీఎం పట్టించుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రం సీఎం ఐఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరుకాని ఏకైక వ్యక్తి కేసీఆరేనని అన్నారు. ఎర్రమంజిల్‌లో మెట్రో, షాపింగ్, వివిధ రకాలు కార్యాలయాలు ఉన్నాయని.. అసెంబ్లీ అక్కడికి మారిస్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆసిఫాబాద్‌లో మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. పోడు భూములను తీసుకోవడం తప్పు అన్నారు. పోడు భూముల వద్ద కుర్చి వేసుకొని పేదలకు పంచుతానన్న సీఎం హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. -
ఎంపీ టికెట్ ఎవరికో!
సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని భావించిందో ఏమో.. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ముందుగానే కసరత్తు మొదలెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోసం త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆశావహుల నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీల ద్వారా టీపీసీసీ ఎన్నికల సంఘం దరఖాస్తులను స్వీకరించింది. చాలా మంది డీసీసీలకే దరఖాస్తు చేసుకోగా... కొందరు నేరుగా టీపీసీసీ, ఏఐసీసీలకు 20వ తేదీ వరకు తమ అభ్యర్థనలను పంపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 77కు చేరింది. కాగా అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులపై మంగళవారం టీపీసీసీ ఎన్నికల సంఘం హైదరాబాద్ గాంధీభవన్‌లో మూడు గంటలకు పైగా కసరత్తు చేసింది. ఒక్కో నియోజకరానికి రెండు నుంచి ఐదు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపిన టీపీసీసీ ఎన్నికల సంఘం... వరంగల్ నుంచి ముగ్గురు, మహబూబాబాద్ నుంచి ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. హైకమాండ్‌కు ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లు.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు డీసీసీల నుంచి అందిన జాబితాలను కూడా కీలకంగా భావించారు. ఈ మేరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం వచ్చిన 34 దరఖాస్తులు, మహబూబాబాద్ కోసం వచ్చిన 43 దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరామ్‌నాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారం.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ఏఐసీసీ ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరుల ఎన్నికల కమిటీ మంగళవారం సుమారు మూడు గంటలకు పైగా కసరత్తు చేసిందన్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి ఇద్దరు పేర్లను ఈ కమిటీ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. ఈ జాబితాపైనా మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల ప్రకటనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరులో గాని, మార్చి మొదటి వారంలో గాని అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీనియర్లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. -
‘ఏ అమరులు చెప్తే వారికి పదవులిచ్చారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారి గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్లో ఎవరికి లేదని కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, మదన్‌మోహన్‌రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు అమరుల పేరు చెబితే చనిపోయిన వారి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కేసీఆర్ నిరహార దీక్ష చేస్తే.. ఆత్మహత్య చేసుకుందామంటే హరీష్‌రావుకు అగ్గిపుల్ల కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జాతి, నీతి లేని పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే మహేందర్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని విమర్శించారు. విమర్శలు చేస్తే ఎన్నికలకు పోతామంటున్నారు.. అలాగైతే టీఆర్ఎస్ జీవితాంతం ఎన్నికలకు పోవాలని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే మంచి.. కానీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా అని ప్రశ్నించారు. 2009లో సీపీఎం, టీడీపీలతో టీఆర్ఎస్ పొత్తు ఎలా పెట్టుకుందని నిలదీశారు. తమది ప్రజల కూటమని.. దొంగల కూటమి కాదని తెలిపారు. తమ అధిష్టానం ఢిల్లీలో ఉందని.. మరి కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని.. అందులో ఏ పేజీపైనైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ.. తామిచ్చిన మెట్రో ప్రారంభించి.. తామిచ్చిన ఇళ్లను ప్రారంభిస్తోందని విమర్శించారు. అమరుల కుటుంబాలను కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. అలీబాబా అరడజన్ దొంగల లెక్క తెలంగాణను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. మదన్మోహన్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు కౌరవులైతే.. కాంగ్రెస్ నాయకులు పాండవులని అన్నారు. ఏం అభివృద్ధి చేశారని సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళతారని ప్రశ్నించారు. -
సీట్ల కేటాయింపుపై రాహుల్ కీలక సంకేతాలు..
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు, కమిటీలు, ప్రచారం, రాహుల్ గాంధీ సభలపై సుమారు మూడు గంటలపాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో మంచిపేరున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లోనే టికెట్లు కేటాయిస్తామని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎక్కడ కాస్త బలహీనంగా ఉందో అక్కడ మహాకూటమి సభ్యులకు సీట్లివ్వాలని చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మహాకూటమితో ముందుకెళ్లాలని రాహులకు టీ కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారని, ప్రచారంలో భాగంగా 10 బహిరంగ సభలకు హాజరువుతానని హామీఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సేనని రాహుల్ తెలంగాణ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపారని, భక్తచరణ్ దాస్ ఛైర్‌పర్సన్‌గా ముగ్గురు సభ్యులతో కూడిన ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ కమిటీలో జ్యోతిమణి, సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీలను సభ్యులగా నియమించారన్నారు. టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం: కుంతియా రాహుల్‌తో పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీనియర్ నేతలు, కేంద్రమాజీ మంత్రులతో సహా 38 మంది సమావేశం అయ్యారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. ప్రతి నేతలో రాహుల్ వ్యక్తిగతంగా విడివిడిగా మాట్లాడారన్నారు. నాయకులంతా ఐక్యమత్యంగా పనిచేయాలని కోరారని, మీడియాకు ఎలాంటి వ్యతిరేక వార్తలు ఇవ్వొద్దని సూచించినట్లు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు. టీడీపీ, వామపక్షాలతో చర్చల బాధ్యత పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నేతలకు ఇచ్చారని, ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షునిదే తుదినిర్ణయమన్నారు. తెలంగాణ ప్రజల కోసం మేం పనిచేస్తామని, హిట్లర్, తుగ్లక్‌లా కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీట్ల పంపకంలో మిత్రధర్మాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌తో భేటీ తర్వాత టీ కాంగ్రెస్ నేతలు సంతోషంగా ఉన్నారన్నారు. -
పొత్తులపై రాహుల్ గాంధీ కీలక దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో మహాకూటమిగా ఏర్పడి.. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, బద్ధ విరోధి అయిన టీడీపీతో అనైతిక పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం దిశానిర్దేశం చేశారు. పొత్తుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయించాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టు తెలిసింది. గెలువగలిగే స్థానాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ వదులుకోకూడదని ఆయన టీ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే రిపోర్టు ఉందని భరోసా ఇచ్చారు. నాయకులంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ అంశాలపై మీడియాకెక్కి నష్టం చేకూర్చే ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు. పార్టీ విజయం కోసం సమిష్టిగా పని చేయాలని, సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు ఇస్తానని చెప్పారు. -
మొదటి విడతగా 30-40 మంది అభ్యర్థుల జాబితా..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు హై కమాండ్ నుంచి పిలుపొచ్చింది. టీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ కానున్నారు. కోమటి రెడ్డి సోదరులు, డీకే అరుణతో సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు. గతంలో రాహుల్‌ను కలిసిన సీనియర్లు రాష్ట్ర పరిస్థితులను వివరించారు. పార్టీలో సమన్వయం లోపించిందని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. కొందరు నేతలు టీడీపీ పొత్తు, సీట్ల కేటాయింపుపై పలు అభ్యంతరాలను లేవనెత్తారు. రాహుల్ గాంధీ.. సమన్వయ లోపం, పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవులపై నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మొదటి విడతగా 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. -
హస్తం.. సమాయత్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు దీటుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే పార్టీలో సంస్థాగతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. అందరినీ సమన్వయం చేయడంతోపాటు కలుపుకుని పోయే నేత కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభంజనం వీచినా.. ఎదురొడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 2014లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నాలుగు శాసనసభ స్థానాలను గెలుపొంది.. మెజార్టీ శాసనసభ స్థానాలను గెలుచుకున్న పార్టీగా జిల్లాలో గుర్తింపు పొందింది. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించేందుకు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించేందుకు జిల్లా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నా.. వర్గ పోరు వల్ల ఒకరు అవునంటే.. మరొకరు కాదనే పరిస్థితి ఉండటం.. దీనికి అధిష్టానం ఆమోదముద్ర అవసరం ఉండటం వంటి కారణాలతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు దూకుడు పెంచలేకపోతున్నారనే భావన కార్యకర్తల్లో నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అయితం సత్యం మరణంతో ఖాళీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకం దాదాపు ఆరు నెలలు గడిచినా.. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరే కారణమన్నది బహిరంగ రహస్యమే. దీనిపై అధిష్టానం సత్వర నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను వేగిరం చేసేందుకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటుందని భావించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల ఆశలు ఇప్పటికీ ఫలించలేదు. మనోధైర్యం కల్పించే ప్రయత్నం.. రెండు నెలల క్రితం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో వారిని కార్యోన్ముఖులను చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే సలీం అహ్మద్.. జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఆయనకు జిల్లా పరిస్థితి గురించి కార్యకర్తలు నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేతలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి నేతలను దిగుమతి చేసే విధానానికి ఈ ఎన్నికల్లోన్నైనా స్వస్తి చెప్పాలని పలువురు నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. అలాగే డీసీసీ అధ్యక్ష పదవిని జిల్లాలోని అన్ని వర్గాలను సమన్వయం చేసి.. పార్టీ పట్ల అంకితభావం, పట్టున్న నేతకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జలగంను చేర్చుకోవాలనే డిమాండ్.. ఇక సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావును తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుండెకాయలా ఉన్న ఖమ్మం నగర కాంగ్రెస్‌కు ఇప్పటివరకు కమిటీ వేయకపోవడంపై ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు అధిష్టానం సత్వరమే పరిష్కారం చూపుతుందని, పార్టీ కార్యకర్తలు మరింత అంకితభావంతో పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినా.. కీలక సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనే లక్ష్యంతో పాదయాత్ర చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. అయితే అధిష్టానం అనుమతి కోసం ఆయన సన్నిహితులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. సంస్థాగతంగా అనేక సమస్యలున్నా.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థి పార్టీలతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. కేడర్ చేజారకుండా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలను సమన్వయం చేసి.. గెలుపు కోసం దిశానిర్దేశం చేసే జిల్లా కాంగ్రెస్ రథసారథిపై ఇంకా స్పష్టత రాకపోవడంపై కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇక సుదీర్ఘకాలంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ స్థాయిలో కీలక పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు కొండంత ఆశతో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తారా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనే అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్నప్పటికీ పార్టీకి దిశానిర్దేశం చేసి.. కార్యకర్తలకు కష్టకాలంలో మనోనిబ్బరం కల్పించే నేతల కొరత జిల్లాస్థాయిలో ఉండటం వంటి సమస్యలు పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం ఢిల్లీకి చేరినా.. ఇంకా దానిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోకపోవడం, జలగం ప్రసాదరావును పార్టీలోకి చేర్చుకోకపోవడంపై పార్టీ సంప్రదింపుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినా.. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించకపోవడం వంటి సంస్థాగత సమస్యలపై అధిష్టానం దృష్టి పెడితే కార్యకర్తల్లో మరింత మనోధైర్యం కలగడంతోపాటు కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. -
టికాంగ్రెస్‌లో మొదలైన నేతల కుమ్ములాట
-
‘ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరిచ్చారు. గాంధీభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం కోసం బాధితులు సచివాలయంకు వెళ్తే హోంమంత్రి అరెస్ట్ చేయమనడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటాం: ఉత్తమ్ అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. లక్షలాది మందికి అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా 9 నెలలేనని జోస్యం చెప్పారు. -
సార్.. టైం ప్లీజ్!
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ‘‘తెలంగాణలో పార్టీ బలంగా ఉంది. కానీ, నేతల మధ్య సమన్వయం లేదు. భేదాభిప్రాయాలతో కొంత నష్టం జరుగుతోంది. మీరు చొరవ తీసుకుని సమన్వయం కుదర్చాలి. అందుకు తగిన సమయం కేటాయించాలి..’’ అని కోరారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర పార్టీ సీనియర్లందరితో చర్చించి తగిన కార్యాచరణ రూపొం దించాలన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారమే రాహుల్ పుట్టినరోజు అయినా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో బుధవారం కలిశారు. ఈ బృందంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బండ కార్తీకరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి పట్ల రాహుల్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమయం ఇస్తానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒకట్రెండు నిమిషాలపాటు విడిగా రాహుల్‌తో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘తెలంగాణలో పార్టీ వేగం తగ్గింది. సీనియర్ నేతలందరితో విడివిడిగా చర్చించి కార్యాచరణ రూపొందించాలి. నాయకత్వంపై దృష్టిపెట్టాలి..’ అని విన్నవించగా.. మళ్లీ ఓసారి సమావేశమై లోతుగా చర్చిద్దామని రాహుల్ పేర్కొన్నట్టు తెలిసింది. సీనియర్ నేతలతోనూ భేటీ.. రాహుల్‌ను కలసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరె డ్డి సోదరులు, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియాతో మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు విడివిడిగా మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, మార్పులు చేపట్టాలని వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతోనూ పలువురు నేతలు సమావేశమయ్యారు. మూకుమ్మడిగా పాదయాత్ర.. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం పాదయాత్ర చేయాలని పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల వద్ద ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు పార్టీలోని నేతలంతా మూకుమ్మడిగా పాదయాత్ర చేయాలనే అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. దీనికి పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదులు చేశారన్న వార్తలు అవాస్తవం: కుంతియా రాహుల్ గాంధీకి పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర నాయకత్వంపై నేతలు రాహుల్‌కు ఫిర్యాదు చేసినట్టు కొన్ని టీవీల్లో వచ్చింది. ఎవరూ ఎవరికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. అది కేవలం ఉత్త ప్రచారమే. నేను అక్కడే ఉన్నా.. నేతలంతా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చారు. నిన్న (మంగళవారం) సమయం దొరకకపోవడంతో బుధవారం కలిశారు. పలు ఇతర రాష్ట్రాల నేతలు కూడా కలసి శుభాకాంక్షలు చెప్పారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రెండు రోజుల ముందే ఢిల్లీకి వచ్చి రాహుల్‌ను కలిసి వెళ్లారు. అంతేతప్ప ఈరోజు ఎవరూ ఎవరిమీద ఫిర్యాదు చేయలేదు..’’అని తెలిపారు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్‌గా ఉంటే 15 సీట్లు కూడా గెలవలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావించగా.. ‘‘ఆ విషయంపై నాకు సమాచారం లేదు. రాహుల్ వద్ద ఎలాంటి సంప్రదింపులు జరగలేదు..’’అని కుంతియా స్పష్టం చేశారు. -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ఆహ్వానం మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి బుధవారం ఉదయం బెంగళూరుకు వెళ్లారు. వీరంతా రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. -
డి.కె.అరుణ, పొన్నాల నిరాహార దీక్ష ప్రారంభం
హైదరాబాద్ : జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య శనివారం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారితోపాటు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్తోపాటు వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాబితాలో జనగామ, గద్వాల్ లేకపోవడంతో డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా వారు శనివారం నిరాహారదీక్షకు దిగారు. -
'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకుడు'
హైదరాబాద్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్దంతి జరిగింది. ఈ కార్యక్రమానికి టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు మాజీ మంత్రి డీకే అరుణ, బలరాం నాయక్ పాల్గొన్నారు. అలాగే పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతోపాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లు భట్టివిక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని వైఎస్ఆర్ కలలుగనే వారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
మల్లన్నసాగర్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్‌కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని... అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో నేడు బ్లాక్‌డే అని పార్టీ నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క అభివర్ణించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఆ క్రమంలో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతోపాటు తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు పిలుపు నేపథ్యంలో మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాఅంతటా 144వ సెక్షన్ విధించారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాంతానికి చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.అరెస్ట్ అయిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా ఉన్నారు. -
ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు?
నల్గొండ : తెలంగాణ న్యాయవాదుల సమస్యలపు వెంటనే పరిష్కరించాలని కేంద్రప్రభుత్వాన్ని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఎంపీ గుత్తా మాట్లాడుతూ... న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మరోసారి పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టుకు ఈ సందర్భంగా గుత్తా సూచించారు. నల్గొండ జిల్లాకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు వరప్రదాయని అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ జిల్లాకు 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. తెలంగాణలో ఓ ఎకరా కూడా పారని పులిచింతలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. -
నాంపల్లిలో టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు పేద, మధ్య తరగతి వర్గాలు భరించలేవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శనివారం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నాంపల్లి చౌరస్తాలో టీ.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఇతర పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఛార్జీలు పెంచడమా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహాల్ పీఎస్‌కు తరలించారు. -
యాదాద్రిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో
నల్గొండ: పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శనివారం నల్గొండ జిల్లా యాదాద్రిలోని ప్రముఖ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద ప్రభుత్వ తీరుకు నిరససగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. వైకుంఠ ద్వారానికి వెళ్లే దారిలో నాయకులు బైఠాయించారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... ధర్నాకు దిగన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
'మైనార్టీ నిధుల్లో 30 % కూడా ఖర్చు చేయలేదు'
హైదరాబాద్ : 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముస్లిం రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రూపొందించిన వెబ్ సైట్‌ను ఉత్తమ్ ప్రారంభించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మైనార్టీలను మోసం చేస్తున్న సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందులోభాగంగా 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ... ఈ నెల 21న అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాల సేకరణ చేస్తామని చెప్పారు. ఈ రిజర్వేషన్ల సమగ్ర సమాచారాన్ని muslimresarvation.in వెబ్ సైట్లో పొందుపర్చామన్నారు. 2004లో ఎన్నికల మామీ మేరకు రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్పారు. కానీ... సీఎం కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే... అమలు చేస్తామన్న హామీ ఇచ్చి రెండేళ్లవుతున్న నెరవేర్చలేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేవారు. -
'ప్రతిపక్షానికి ఇష్టం లేనట్లుంది'
హైదరాబాద్ : అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన హరీశ్‌రావు మాట్లాడుతూ... సభ సజావుగా సాగటం ప్రతిపక్షానికి ఇష్టం లేనట్లు ఉందని అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులకు హరీశ్ రావు సూచించారు. -
సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించండి
-
బ్రాండ్ కాదు డామేజ్ హైదరాబాద్: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: గొల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం తగ్గుతుంటే మంత్రి కేటీఆర్ మాత్రం బ్రాండ్ హైదరాబాద్ అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదికలో ఇప్పటిదాకా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల జాబితా నుంచి హైదరాబాద్‌ను తొలగించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు దాస్తున్నాడని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ హైదరాబాద్.. డామేజ్ హైదరాబాద్ అయిందన్నారు. -
'కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు'
హైదరాబాద్ : ఎమ్మెల్సీల గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కె జానారెడ్డి, షబ్బీర్ అలీ ఆరోపించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారం హైదరాబాద్‌లో కె జానారెడ్డి, షబ్బీర్ అలీ స్పందించారు. టీఆర్ఎస్ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. సందర్భాన్ని బట్టి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని వారు స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై ఇప్పుడే చెప్పలేమని జానారెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని వారు విమర్శించారు. -
ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
-
ఏకంగా వెదిక పైనే నిద్రపోయారు!!
-
కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముందు మాటల యుద్ధం నెలకొని ఆ తర్వాత గిరిజన నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బలరాం నాయక్ పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ మండిపడ్డారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్యుద్థం చోటుచేసుకుని వెంటనే ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఇతర కాంగ్రెస్ సభ్యులు వారి వివాదంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. -
సోమేశ్.. టీఆర్ఎస్ ఏజెంట్!
జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కాంగ్రెస్ మండిపాటు * భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ‘‘జీహెచ్ఎంసీ కమిషనర్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇతర పార్టీలకు చెందిన, టీఆర్ఎస్కు ఓటేసేందుకు ఇష్టపడని వారి ఓట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గ్రేటర్‌లోని 42 లక్షల ఓటర్లలో ఇప్పటికే 17 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు’’ అంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు టీ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలనికోరారు. అన్యాయంగా ఎవరి ఓట్లనైనా అధికారులు తొలగించినట్టతే వాటిని తిరిగి జాబితాలో చేరుస్తామని వారికి భన్వర్‌లాల్ హామీ ఇచ్చారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30 నుంచి 40 శాతం ఓట్లను తొలగిస్తూ తద్వారా ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సనత్‌నగర్‌లో 1.4 లక్షలు, ఎల్బీనగర్లో 1.38 లక్షల ఓట్లు తీసేశారని సుధీర్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల అధికారిగా సోమేశ్ ఉంటే గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగబోవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. ఆయన్ను ఏపీ క్యాడర్‌కు కేటాయించినందున తక్షణం పంపేయాలని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చే స్తామని చెప్పారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో నేతల తో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. తాము చెప్పిన మేరకు ఓట్లు తొలగించాలంటూ ఎన్నికల సంఘంపై కూడాఒత్తిడి తె స్తున్నారన్నారు. దీనిపై భన్వర్‌లాల్ రెండు మూడు రోజుల్లో స్పందించకుంటే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ న్యాయం జగరకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. స్మారక స్టాంపుల రద్దు కుటల రాజకీయం... మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ స్మారక తపాల బిళ్లలను కేంద్రం కుటిల రాజకీయాలతో రద్దు చేయడం క్షమార్హం కాదని ఉత్తమ్, భట్టి ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ పోరాటాల ఫలితంగా భూ సేకరణ ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని కేంద్రం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో 20న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
కేసీఆర్ చైనా పర్యటన... ఫిడేల్ వాయించినట్లుంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ పరిపాలనపై టీ కాంగ్రెస్ నేతలు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందనడం టీఆర్ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లడం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో చేసిందేమిటో బహిరంగ చర్చకు మంత్రుల సిద్ధమేనా అని టీఆర్ఎస్కు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అలాగే మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె మృత్యుంజయం మాట్లాడుతూ... కరీంనగర్ డైయిరీ ప్రైవేట్ కంపెనీగా మారడంతో 50 వేల మంది పాడి రైతులకు పెరిగిన పాలసేకరణ ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో 10 నెలలుగా జిల్లా పాడి రైతులకు రోజుకు రూ. 8 లక్షల నష్టం వస్తుందన్నారు. విజయ డైయిరీ ద్వారా పాలను సేకరించి కరీంనగర్ పాడి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో కరీంనగర్ డెయిరీ సహకార సంఘంగా ప్రారంభమై ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను పెంచుకుందని చెప్పారు. రూ.400 కోట్ల విలువైన కరీంనగర్ డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని శ్రీధర్ బాబు, మృత్యుంజయంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబు పాత్ర రుజువైంది
-
కేసీఆర్‌కు సొంత అజెండా ఉన్నట్టుంది
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడం... ఆ కట్టడాన్ని కూలగొట్టడం సరికాదని టీపీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్, దానం, సుధీర్‌రెడ్డి తదితర నేతలు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కానీ చారిత్రక కట్టడాలు కూల్చగొట్టవదంటూ ప్రభుత్వానికి సూచించారు. చారిత్రక కట్టడాలు కూల్చగొట్టకూడదని నాడు అసెంబ్లీ ముందు మెట్రోలైన్ అలైన్‌మెంట్‌నే గతంలో కేసీఆర్ మార్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మరి ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టాలనుకోవడం వెనుక కేసీఆర్‌కి సొంత అజెండా ఉన్నట్టుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని కూల్చాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని వారు స్పష్టం చేశారు. -
'తలసాని రాజీనామాపై స్పీకర్ స్పందించారు'
హైదరాబాద్ : తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా వెంటనే ఆమోదించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కి కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో స్పీకర్ ఎస్ మధుసూదనచారితో కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, డీకే అరుణ, సంపత్‌కుమార్‌లు భేటీ అయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తలసాని రాజీనామాను పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే ఆమోదించిన సంగతి ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. తక్షణమే మంత్రి తలసానిపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. -
పాలమూరు ఎత్తిపోతలపై అనుమానాలు అక్కర్లేదు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ... ఉనికిని కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్ విమర్శులు చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఆగస్టునాటికి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అనుమానాలు అక్కర్లేదన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. -
'వాళ్లు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల అన్ఎంప్లాయిమెంట్తో బాధపడుతున్నారని ఆ రాష్ట్ర వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపల్ కార్మికుడు కూడా వెంట లేకుండా సచివాలయం వద్ద ధర్నా ఎందుకు చేస్తున్నట్లు అంటూ ఆయన కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ నేతలు పేదల కోసం ఉద్యమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సచివాలయం ముట్టడి కోసం యత్నించడంపై తలసాని శ్రీనివాస యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో మున్సిపల్ కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికుల మిగిలిన సమస్యలు కూడా సానుభూతితో పరిష్కరిస్తామని తలసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ధర్నాలు వద్దు దరఖాస్తు చేసుకుంటే చాలని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం చెబుతుందని ఆయన గుర్తు చేశారు. -
టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్.. పీఎస్‌కు తరలింపు
-
టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్.. పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నన్నారు. దాంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన హక్కులు, వేతనాలు పెంచాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగి వారంపైన అయినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద నీళ్లు పోసిన చందంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్‌ను చెత్తా హైదరాబాద్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నాల, షబ్బీర్ అలీతోపాటు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
’సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలి?’
-
'ఆ పదాన్ని' వాడటం సరికాదు
హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ వారంతా హుందాగా వ్యవహారించాలని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు. సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా కేంద్రం, గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు చెబుతూ గందరగోళ పరచడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నత్తనడకన సాగుతుందో లేదో ప్రభుత్వమే పరిశీలించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్, కేసులు నడుస్తున్నాయి... ఆ ఆంశంపై పదేపదే మాట్లాడలేనని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా జానారెడ్డి....శుక్రవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. -
సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చూపిన చొరవ, చేసిన కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఏడాది గడిచిన సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 20న) గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మీడియాను నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ గెలుపు ద్వారానే సోనియాకి నిజమైన కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుందన్నారు. డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓడిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, డి.నాగేందర్, సబిత, డి.కె.అరుణ, డి.శ్రీధర్‌బాబు, టి.రా మ్మోహన్‌రెడ్డి, పొన్నంప్రభాకర్, మధుయాష్కీ, సురేష్‌శెట్కర్, ఎస్.రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. -
టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్... పీఎస్ తరలింపు
హైదరాబాద్: గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతలు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని డీసీసీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వారు పాదయాత్ర చేశారని వెల్లడించారు. అందుకే వారిని అరెస్ట్ చేసి గోషామహాల్ పీఎస్‌కు తరలించినట్లు చెప్పారు. అయితే వారిపై ఏ కేసులు పెట్టాలో పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు శనివారం చేపట్టిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాంపల్లి వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పొన్నాల, షబ్బీర్ అలీ, గండ్ర, వీహెచ్, దానం సహా పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. -
''నిజాం పాలనపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు''
-
నాయకత్వ లోపంవల్లే నష్టపోయాం
-
సానుభూతి సరే... ఓట్లురాలే దారేది?
టీ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ క్లాస్ తెలంగాణలో పార్టీ హస్తవ్యస్తం ఎన్నికల ప్రచారంపై తీవ్ర అసంతృప్తి రాహుల్ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆదేశం కీలకమైన ‘పోల్ మేనేజ్మెంట్’ సంగతైనా చూడండి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు, ఎన్నికల ప్రచార సరళిపై కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలకు ఆయన క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఈ ప్రాంత నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. నాలుగురోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్ గురువారం కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ పరిశీలకులు వయలార్ రవి, కేబీ కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం ఛైర్మన్ కొప్పుల రాజులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రచార సరళి, తెలంగాణ కాంగ్రెస్ పెద్దల తీరు, బహిరంగ సభలకు జనసమీకరణ వంటి అంశాలను సమీక్షించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని దిగ్విజయ్‌సింగ్ సహా సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగురోజులే మిగిలిన ఉన్నందున కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్, కొప్పులరాజు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సుమారు 30 నియోజకవర్గాల్లో పర్యటించిన విషయాన్ని, అక్కడ పార్టీ నేతల్లో నెలకొన్న విబేధాలు, పార్టీ పరిస్థితిని వివరించారు. ఇటీవల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ హాజరైన బహిరంగ సభలకు జనం ఏ విధంగా వచ్చారని దిగ్విజయ్ వారిని ఆరా తీయగా, ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగలేదని జైరాం, కొప్పుల వివరించారు. ఒకవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున జనసమీకరణలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటూ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమనే భావనను ప్రజలకు కలగజేస్తుంటే, కాంగ్రెస్ నేతలు కనీసం జిల్లాకో బహిరంగ సభను కూడా విజయవంతంగా నిర్వహించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ ఫోన్ చేసి ఎన్నికల ప్రచార సరళి, జన సమీకరణపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే నాలుగురోజులు అత్యంత కీలకమైనందున సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు హాజరయ్యే బహిరంగ సభలను ఈసారైనా సక్సెస్ చేసి ప్రజల్లోకి విజయసంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం వరంగల్, హైదరాబాద్‌లలో నిర్వహించే బహిరంగ సభలకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లో తగిన మూల్యం చెల్లించుకుందనే భావన ప్రజల్లోకి వెళ్లే ప్రమాదముందని దిగ్విజయ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏదేమైనా పోలింగ్ దగ్గర పడుతున్నందున పోల్ మేనేజ్మెంట్ కీలకమని, తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. సబిత, రాజగోపాల్‌రెడ్డిలకు ఫోన్: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు దిగ్విజయ్‌సింగ్ ఫోన్ చేసినట్టు తెలిసింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. వెంటనే మల్‌రెడ్డిని ప్రచారం నుంచి తప్పుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ రెబెల్‌గా రంగంలో ఉన్న మల్రెడ్డి రాంరెడ్డిని ప్రచారం నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలని రాజగోపాల్‌రెడ్డికి సూచించారు. దీంతోపాటు భువనగిరిలో ఈనెల 26న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హాజరయ్యే బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ది సొంత ఎజెండా: ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రలోనూ రాహుల్‌గాంధీ పర్యటిస్తారని చెప్పారు. వరంగల్, హైదరాబాద్‌లో శుక్రవారం జరిగే బహిరంగ సభల్లో రాహుల్‌గాంధీ నిర్మాణాత్మకంగా చేయబోయే ప్రసంగం చారిత్రాత్మకమవుతుందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు తాను ఇక్కడే ఉంటానని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానని చెప్పారు. 26న ఆసిఫాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈనెల 26న ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి కె.జానారెడ్డి సహా సీనియర్ నేతలంతా ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ మీడియాకు వివరించారు. రెబెల్స్ వివరాలు అందించిన కోదండరెడ్డి: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఎన్నికల్లో ఏయే స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ పోటీ చేస్తున్నారని, వారి వెనుక ఎవరెవరున్నారనే వివరాలను దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. నాగర్‌కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు అజ్మతుల్లా హుస్సేన్, పద్మ, సూరీడు తదితరులు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఎల్బీ స్టేడియానికి దిగ్విజయ్‌సింగ్: మరోవైపు దిగ్విజయ్‌సింగ్ మాజీమంత్రి దానం నాగేందర్, టీపీసీసీ ప్రోటోకాల్ చైర్మన్ హెచ్.వేణుగోపాల్‌రావుతో కలిసి ఎల్బీ స్టేడియానికి వెళ్లారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఫోన్లో మాట్లాడారు. ‘రెబెల్స్’ మద్దతుదారులకు నోటీసులు! తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై గురువారం సమీక్ష జరిపిన పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ రెబెల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం. కోదండరెడ్డితో భేటీ సందర్భంగా ఆయన ఈ అంశంపై చర్చించారు. తిరుగుబాటు అభ్యర్థులకు అండగా నిలుస్తున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ప్రధానంగా మునుగోడు బరిలో రెబెల్‌గా నిలిచిన తన కుమార్తె పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని, అలాగే నిజామాబాద్‌లో పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. శుక్రవారంలోగా సరైన సమాధానం రాకుంటే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేసే అవకాశముంది. -
'ఆ గ్రామాలు సీమాంధ్రలో కలపకుండా అడ్డుకోండి'
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలలో భద్రచలం రెవెన్యూ గ్రామం మినహా పలు గ్రామాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. అయితే తమను తెలంగాణలోనే ఉంచాలని అయా గ్రామాల ప్రజలు ఇటీవల ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు చేసిన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ వద్దంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు పార్టీలు నేతలు కేంద్రంపై ఒత్తిడి చేశారు. దాంతో పోలవరం ముంపునకు గురయ్యే కొన్ని గ్రామాలను మాత్రం సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం అంగీకరించింది. -
గవర్నర్‌తో సమావేశమైన టీ-కాంగ్రెస్ నేతలు
-
సీఎల్ఫీ కార్యాలయంలో టీ కాంగ్రెస్ నేతల భేటి
-
సిఎంతో టి-కాంగ్ ప్రజాప్రతినిధుల భేటి