సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం | Cong credits Sonia Gandhi for formation of Telangana | Sakshi
Sakshi News home page

సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం

Published Sat, Feb 21 2015 1:56 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం - Sakshi

సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చూపిన చొరవ, చేసిన కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఏడాది గడిచిన సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 20న) గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మీడియాను నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు.

జానారెడ్డి మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ గెలుపు ద్వారానే సోనియాకి నిజమైన కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుందన్నారు. డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓడిందన్నారు. కార్యక్రమంలో పార్టీ  నేతలు  నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, డి.నాగేందర్, సబిత, డి.కె.అరుణ, డి.శ్రీధర్‌బాబు, టి.రా మ్మోహన్‌రెడ్డి, పొన్నంప్రభాకర్, మధుయాష్కీ, సురేష్‌శెట్కర్, ఎస్.రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement