హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడం... ఆ కట్టడాన్ని కూలగొట్టడం సరికాదని టీపీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్, దానం, సుధీర్రెడ్డి తదితర నేతలు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతే కానీ చారిత్రక కట్టడాలు కూల్చగొట్టవదంటూ ప్రభుత్వానికి సూచించారు. చారిత్రక కట్టడాలు కూల్చగొట్టకూడదని నాడు అసెంబ్లీ ముందు మెట్రోలైన్ అలైన్మెంట్నే గతంలో కేసీఆర్ మార్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మరి ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టాలనుకోవడం వెనుక కేసీఆర్కి సొంత అజెండా ఉన్నట్టుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని కూల్చాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని వారు స్పష్టం చేశారు.
కేసీఆర్కు సొంత అజెండా ఉన్నట్టుంది
Published Sat, Aug 1 2015 1:46 PM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM
Advertisement
Advertisement