
పాలమూరు ఎత్తిపోతలపై అనుమానాలు అక్కర్లేదు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ... ఉనికిని కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్ విమర్శులు చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఆగస్టునాటికి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అనుమానాలు అక్కర్లేదన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.