TRS leader
-
తీవ్ర అసంతృప్తి.. మరొకవైపు పార్టీ మారమని ఒత్తిడి!
ఎంతటి నాయకులకైనా ఒక్కోసారి అజ్ఞాతం తప్పదు. ఎంత సీనియర్ అయినా ఎన్నికల రాజకీయాలకు దూరం కాక తప్పదు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ సీనియర్ నేతకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన రాజకీయాలు చేయలేకపోతున్నారట. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఆ నేతను బుజ్జగించేందుకు గులాబీదళపతి ఓ పదవి ఇచ్చారట. అయినా ఆనేతలోని అసంతృప్తి చల్లారలేదట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో చూద్దాం.. దశాబ్దాల రాజకీయ అనుభవం. నాలుగు సార్లు ఎమ్మెల్యే..మూడు సార్లు ఎంపీ...ఓసారి కేంద్ర మంత్రి...మరోసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను కనుసైగలతో నడిపించిన నాయకుడు సముద్రాల వేణుగోపాలచారి. గులాబీ దళంలో చేరాక కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీలో టిక్కెట్ లభించలేదు. అయినాగాని రాజ్యసభ ఎంపీ.. లేదంటే ఎమ్మెల్సీ పదవితో పట్టాభిషేకం జరుగుతుందని ఆశించారు. అవేమీ వరించలేదు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి చారిని నామినేట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో ఒక పదవి దక్కినా చారికి సంత్రుప్తి కలగలేదనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సముద్రాల వేణుగోపాలాచారి... మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే.. గులాబీపార్టీలో చేరారు. తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత డిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా చారిని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2018 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీని విజయపథాన నడిపించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వంలో మంచి పదవి లభిస్తుందని చారి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. సీఎం కేసీఆర్‌తో గతం నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతా లభించలేదు. దీంతో చారి తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. గులాబీ పార్టీని వీడి కమలం గూటికి చేరతారనే ప్రచారంతో అప్రమత్తమైన గులాబీ బాస్ చారిని ఇరగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. అయితే చారికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టకున్న ఆయన అనుచరులు..కార్పొరేషన్ పదవితో సరిపెట్టడం అసంత్రుప్తికి గురిచెసిందట. కేంద్రంలోను..రాష్ట్రంలోనూ మంత్రిగా చేసిన వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం తగిన పదవి ఇవ్వలేదని ఆయన అనుచరులు అందోళన చెందుతున్నారట. వేణుగోపాలాచారి స్థాయిని తగ్గించేందుకే కార్పొరేషన్ పదవి ఇచ్చారని పార్టీ పై అక్కసు వెళ్లగక్కుతున్నారట. 2018 ఎన్నికల్లో చారికి టిక్కెట్ లభించలేదు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇలా దశాబ్ద కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావడంపై ఆయన అనుచరులు అందోళన చెందుతున్నారట. ఇకముందు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావద్దని పార్టీ మారైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ చారి మీద ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని చారిపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అనుచరులను చారి బుజ్జగిస్తున్నారని.. కానీ అనుచరులు మాత్రం తగ్గేదేలే అంటున్నారని తెలుస్తోంది. మరి సముద్రాల వేణుగోపాలాచారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
కోడి, క్వార్టర్ పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్
సాక్షి, వరంగల్: కేసీఆర్ కుటుంబంపై వీరాభిమానంతో అనే ప్రచారంతో కోడి, క్వార్డర్ బాటిల్‌ను హమాలీలకు పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దసరా సందర్భంగా టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ అనే నేత. దీంతో ఈ టీఆర్ఎస్ సీనియర్ నేతకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 అయితే.. మునుగోడు ఓటర్లకు లిక్కర్, కోడి పంపిణీ చేశారన్న ఆరోపణలపై శ్రీహరి స్పందించారు. అసలు మునుగోడు ఉప ఎన్నికకు.. మద్యం కోడి పంపిణీకి సంబంధం లేదని చెప్తున్నారాయన. రాజకీయ దుర్బుద్ధితో కొందరు కావాలని ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారని, ఆపై తనకు నోటీసులు అందాయని అంటున్నారాయన. సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని.. అదీ వరంగల్‌లోనే దసరా రోజున మద్యం బాటిల్, కోడిని పంపిణీ చేశానని వివరణ ఇచ్చే యత్నం చేశారు రాజనాల శ్రీహరి. ఇదీ చదవండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే! -
‘ఫ్రీగా క్వార్టర్, కోడి.. కేటీఆర్‌గారూ మీ ఐడియానేనా?’
వైరల్: తెలంగాణ.. జాతీయ స్థాయి రాజకీయాలకు వేదిక కానుందనే చర్చ జోరందుకుంది. దసరా పండుగ నాడు టీఆర్ఎస్ తరపున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారనే జోష్‌లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ తరుణంలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కోడి, క్వార్టర్ బాటిల్‌ను పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అని తెలుస్తోంది. హమాలీలకు దగ్గరుండి మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారాయన. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ నేపథ్యంలో కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. Liquor party! Ahead of #KCR’s ‘national party’ #BRS launch, #TRS party leader Rajanala Srihari distributes liquor and chicken to locals, in Warangal, to celebrate the launch. The leader, reportedly, said he wants #KCR to become PM, his son #KTR to be CM of #Telangana. pic.twitter.com/J0gOYlsKVS — Rishika Sadam (@RishikaSadam) October 4, 2022 ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారాయన. #WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU — ANI (@ANI) October 4, 2022 Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 -
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్‌ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్‌గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
వైరలైన తమ్మినేని కృష్ణయ్య పాత వీడియో.. ‘చావు ఎటునుంచైనా రావొచ్చు’
సాక్షి, ఖమ్మం రూరల్: తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్యకు ముందే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో కృష్ణయ్యను పీక కొరికి చంపుతా అంటూ ప్రత్యర్థులు హెచ్చరించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఏడాదిన్నర క్రితం జరిగిన గ్రామసభలో కృష్ణయ్యకు–ప్రత్యర్థులకు నడుమ ఘర్షణ జరిగింది. ఇందులో ప్రత్యర్థులు చంపుతానని బెదిరించగా, ‘నేను ఎవరికీ భయపడేది లేదు, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమే, నన్ను ఎవరైనా చంపొచ్చు లేదా యాక్సిడెంట్ రూపంలో చావచ్చు లేదా కాల్వలో పడి చావొచ్చు.. చావుకు భయపడే పిరికి వాడిని కాదు’ అన్న మాటలే నేడు నిజమయ్యాయని వీడియో చూసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. అయితే ఈ వీడియో ఆధారంగా రాజకీయ కోణంలోనే కృష్ణయ్య హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం -
వెలుగులోకి తమ్మినేని కృష్ణయ్య ఏడాదిన్నర క్రితం వీడియో
-
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పగలు, ప్రతీకారంతో రగులుతున్న రాజకీయాలు
సాక్షి, ఖమ్మం : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పగ.. ప్రతీకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం రగులుతోంది. తెల్దార్‌పల్లిలో టీఆర్ఎస్ నేత కృష్ణయ్య హత్యతో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. చాలా కాలం తర్వాత జిల్లాలో రాజకీయ హత్య జరగడం చర్చకు దారితీసింది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీలోనే నేతలు, కేడర్ మధ్య వైరం నివ్వురు గప్పిన నిప్పులా ఉంది. మరోపక్క పల్లెల్లో టీఆర్ఎస్, ప్రత్యర్థి పార్టీల నేతలు నువ్వా, నేనా అన్నట్లుగా రాజకీయం చేస్తున్న నేపథ్యాన ఇప్పుడు హత్య జరగడంతో కలకం మొదలైంది. అతిసమస్యాత్మకంగా పాలేరు.. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన పాలేరు నియోజకవర్గం ఇటీవల అతిసమస్యాత్మకంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యాన ఈ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచర వర్గాలు రెండుగా చీలాయి. ఈ నియోజకవర్గంలో వారంలో ఒకటి, రెండు సార్లు ఏదో ఒక చోట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీ పరంగా టీఆర్ఎస్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతుండడం గమనార్హం. గ్రామ స్థాయి నుంచి మండల కేంద్రం వరకు రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖమ్మం రూరల్ మండలం తెల్దార్‌పల్లిలో తుమ్మల అనుచర నేత కృష్ణయ్య దారుణ హత్యతో తుమ్మల వర్గం విషాదంలో మునిగిపోయింది. సీపీఎం పార్టీకి చెందిన నేతలే ఆయనను చంపారని కృష్ణయ్య భార్యతో పాటు కూతురు, కుమారుడు ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో తుమ్మల వర్గానికి.. కందాల వర్గంతో పాటు సీపీఎం మరో ప్రత్యర్థిగా మారిందని రాజకీయ చర్చజరుగుతోంది. ఘర్షణలు .. గలాట పాలేరుతో పాటు వైరా, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లోనూ ఇటీవల టీఆర్ఎస్లో గలాట శృతి మించుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అనుచర వర్గాలు ఘర్షణలకు పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే తమపై కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యేల అనుచరులు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముందు కూడా ఈ ఘర్షణలు, కేసులు విషయమై అంతర్గతంగా జరిగిన సమీక్షలో ఒకరిద్దరు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. అంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్ ఆదేశించినా అది అప్పటికే పరిమితమైంది. ప్రధాన నేతలు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉండగా ఇదే స్థాయిలో అనుచర నేతల్లోనూ వైరం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ ఘర్షణల వరకు వెళ్తోంది. ఎన్నికల నాటికి రాజకీయ వ్యూహాలు, పరిణామాలు మారే అవకాశం ఉన్నా గులాబీ గూటిలో జరుగుతున్న అంతర్‘యుద్ధం’ భయానకంగా మారుతుందనే ప్రచారం సాగుతోంది. ఎందాకైనా తెగిస్తూ.. ప్రధాన నేతల మధ్య వైరం ఒక స్థాయిలో ఉంటే.. గ్రామ స్థాయి నేతల మధ్య మాత్రం ఎంతకైనా తెగించే పరిస్థితులకు దారితీస్తోంది. స్థానికంగా, వ్యక్తిగతంగా నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు గ్రామంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారితే తమ ఉనికి విషయంలోనూ అదే జరుగుతుందనే ఉద్దేశంతో వైరి వర్గం, పార్టీపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడం నిత్యకృత్యమైంది. ఇలా నేతలు.. తమ వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఉనికిని కాపాడుకునేందకు చేస్తున్న రాజకీయంతో ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలు అతిసమస్యాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్ది కొన్నిప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తరించడం గమనార్హం. ప్రధాన నేతల మధ్య వైరం చల్లారితేనే.. గ్రామ, మండల స్థాయిలోని వారి అనుచరులు మధ్య ఘర్షణలకు బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి
సాక్షి, ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ముత్తేశం సంచలన నిజాలు వెల్లడించారు. మద్దులపల్లి దోబి ఘాట్‌కు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ఆటో తమ బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిపారు. బైక్‌పై ఉన్న ఇద్దరు పక్కనే ఉన్న గుంతలో పడిపోవడంతో.. ఆటోలో నుంచి నలుగురు కిందకు దిగి వేటకోడవళ్లతో కృష్ణయ్యపై దాడి చేసినట్లు తెలిపారు. కృష్ణయను దారుణంగా నరకడాన్ని ప్రత్యక్షంగా చూశానని, కృష్ణ స్వామి, నూకల లింగయ్య,నాగేశ్వర్ రావు, మెంటల్ శ్రీను.. ఈ నలుగురు కత్తులతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆటోలో మొత్తం ఆరుగురు రాగా.. మిగతా ఇద్దరు ఆటోలోనే ఉన్నారన్నారు. హత్య చేసిన వారంతా కోటేశ్వర్ రావుతో తిరిగే వారేనని, కృష్ణయ్యను ను ప్లాన్ ప్రకారం హత్య చేశారని తెలిపారు. చదవండి: తుమ్మల అనుచరుడి దారుణ హత్య ‘తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర్ రావు తెల్దారపల్లిలో వేరే పార్టీ పెత్తనం ఉండనివ్వరు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తారు. వారిద్దరి హస్తం లేనిని కృష్ణయ్య హత్య జరగదు. తమ్మినేని కోటేశ్వర్ రావు హత్య జరిగిన తర్వాత మృతదేహం చూస్తూ కారులో వెళ్లిపోయారు. కారులో వెళుతున్న సమయంలో కోటేశ్వర్ రావు ఒక్కరే ఉండటాన్ని గమనించా. నాపై కూడాదాడి చేసే ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న రాళ్లతో ఎదురుదాడి చేశాను. దాడి సమయంలో తనను చంపవద్దని కృష్ణయ్య రెండు చేతులు జోడించి వేడుకున్నారు. తాను ఏ తప్పు చేశాను ఎందుకు చంపుతారని అడిగారు. ఏమాత్రం కనికరం లేకుండా చేతులను నరికివేశారు. మెడపై బలంగా దాడి చేయడంతో నరాలు తెగి నేను చూస్తుండగానే కృష్ణయ్య ప్రాణాలు కోల్పోయారు. కళ్లతో చూస్తుండగానే 5 నిమిషాల్లోనే దాడి చేసి పరారయ్యారు.’ అని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం వెల్లడించారు. -
ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్
సాక్షి, ఆదిలాబాద్: టీఆర్ఎస్లో ముఖ్యనేతల మధ్య ఇప్పటివరకు కొనసాగిన కోల్డ్‌వార్ ఇపుడంతా బహాటమయ్యింది. బస్తీ మే సవాల్ అన్నట్లుగా తోడ కొడుతున్నారు. ముఖ్యనేతలంతా ఒకవైపు అయ్యారు. బోథ్ ఎమ్మెల్యే మరోవైపయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అండతో ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే బోథ్ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. పైచేయి యత్నాలు బోథ్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు రాజకీయంగా పార్టీలో ఉన్న వైషమ్యాలను బహిర్గతపరుస్తున్నాయి. తాజాగా బజార్హత్నూర్ ఎంపీడీఓగా చౌహాన్ రాధాను నియమించారు. బోథ్ మండలంలో ఉపాధి అక్రమాలకు సంబంధించి బాధ్యురాలిని చేస్తూ గడిచిన జెడ్పీ మీటింగ్ రోజు సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఉపాధి అక్రమాలకు సంబంధించి వివరాలు కోరినా అధికారులు ఇవ్వడంలేదని, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పట్లో ఆమెపై వేటు పడింది. ఒక వైపు అక్రమాలపై విచారణ పూర్తిస్థాయిలో జరగనేలేదు.. దుర్వినియోగమైన నిధుల రికవరీ చేపట్టలేదు. ఇదిలా ఉండగానే ఆ ఎంపీడీఓపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బజార్హత్నూర్ మండలంలో పో స్టింగ్ ఇవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే అక్కడ ఇలా జరుగుతుందన్న చర్చ సాగుతోంది. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎమ్మెల్యే రాథోడ్ బా పూరావుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు ప డిన తర్వాత నియోజకవర్గంలో ఆమెకు పోస్టింగ్ రా కుండా చూస్తామని ఎమ్మెల్యే వర్గీయులు సవాలు విసిరారు. పక్క మండలంలోనే ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇప్పించడంలో ఎంపీపీ సఫలీకృతమయ్యా రు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఇది జరిగిందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ పదవీ విషయంలో .. కొద్ది రోజుల క్రితం బోథ్ నియోజకవర్గ అధికార ప్ర తినిధిగా తలమడుగు మండలానికి చెందిన కిరణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నియమిస్తూ సన్మానం చేశారు. అయితే పార్టీపరమైన పదవుల ని యమాకంలో ఎమ్మెల్యేలకు ప్రమేయముండదని జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బహాటంగానే ఖండిస్తూ ఆ నియమాకం చెల్లదని చెప్పడం పార్టీలో చర్చ కు దారితీసింది. అయితే దీని వెనుక మరోక ప్ర చారం జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడిని అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే విష యం బయటకు రావడంతోనే రాథోడ్ బాపూరావు ముందుగానే తన అనుచరుడిని నియమించడం ద్వారా వ్యూహాకత్మకంగా ముందుకు కదిలారు. ఈ అంశం ప్రస్తుతం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. అందరూ ఒకవైపు.. టీఆర్ఎస్ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి గోడం నగేశ్, సీనియర్ నేత లోక భూమారెడ్డిలు ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. గతం నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో ఉన్న విబేధాల కారణంగా జిల్లా ముఖ్యనేతలు అందరూ ఒక్కటై ఆయనకు వ్యతిరేకంగా కదులుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు. జెడ్పీటీసీ అనిల్ జాదవ్ పుట్టినరోజు వేడుకలు గత నెలలో నేరడిగొండలో జరుగగా ముఖ్యనేతలంతా దానికి హాజరుకావడం, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆ వేడుకకు దూరంగా ఉండటం వారి మధ్యలో ఉన్న విభేదాలు కళ్లకు కట్టాయి. ఈ విధంగా జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. -
కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి
సిద్దిపేట రూరల్, సిద్దిపేట కమాన్/తంగళ్లపల్లి (సిరిసిల్ల): ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఓ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్ గ్రామ రైతులను పరామర్శించేందుకు సోమవారం హైదరాబాద్ నుంచి పాల్ బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సిరిసిల్ల సరిహద్దుకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామం జక్కాపూర్‌లో పికెట్ ఏర్పాటు చేసి పాల్‌ను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మీడియాతో పాల్ మాట్లాడుతుండగా జిల్లెల్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అనిల్‌కుమార్ దాడి చేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జక్కాపూర్ రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఎదురైంది. పోలీసులు బందోబస్తు మధ్య పాల్‌ను వెనక్కి పంపారు. సిద్దిపేట పట్టణంలో పాల్ మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు కుటుంబాలను పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాల్‌పై దాడిని ఖండిస్తూ బస్వాపూర్ గ్రామస్తులు నిరసన తెలిపారు. -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
‘పుష్ప’ హీరో, డైరెక్టర్‌పై నోరుజారిన టీఆర్ఎస్ లీడర్, వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతటి ఘనవిజయం సాధించిన పుష్ప మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ ప్రవచన కర్త ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. హీరోను స్మగ్లర్‌గా చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ పుష్ప మూవీ డైరెక్టర్, హీరోని కడిగిపారేశారు. దీంతో గరికపాటి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప మూవీ టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమా డైరెక్టర్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అల్లరిని ఉద్దేశిస్తూ పుష్ప మూవీపై విరుచుకుపడ్డారు. ఆ పిల్లాడు చూడండి పుష్పలో హీరో అనుకుంటున్నాడు. అందులో హీరో అన్నట్లుగానే తగ్గేదే లే అన్నట్టుగా వాడి వ్యవహరం కనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటి హౌళగాళ్లను హీరోలు పెట్టి తగ్గేదే లే అని డైలాగ్ చెప్పించినప్పటి నుంచి పిల్లలను ఆపుడు కష్టంగా మారిందంటూ పుష్ప మూవీ హీరో, డైరెక్టర్‌పై ఆయన దుర్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. -
బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్
సాక్షి, నల్గొండ: దిండి మండల కేంద్రంలోని హైవే మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ జరుగుతోందని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య చిచ్చురేపింది. డిండిలోని హైవే డివైడర్‌పై దాదాపు 1.5 కిలో మీటర్ల దూరం ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్, రెండు జంక్షన్ల నిర్మాణానికి రోడ్డు రవాణా, హైవే రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోటా నుంచి రూ.85 లక్షలు మంజూరయ్యాయి. కాగా, బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ చేయడానికి డిండికి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆచారి భూమి పూజకు రావడం ఏమిటని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నమ్మించి ఫోన్‌తో పరార్.. కట్ చేస్తే.. ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు’ పోలీసులతో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి శనివారం కార్యకర్తలను కలిసేందుకు డిండికి వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని టీఆర్ఎస్ నాయకులు రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆచారి గోబ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. టీఆర్ఎస్ నాయకుల నిరసనపై ముందస్తు సమాచారం ఉండడంతో డిండి ఎస్ఐ.సరేష్, కొండమల్లేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? తెలంగాణలో నియంత పాలన తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు పాలనపై దృష్టి పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గూండాలుగా తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను, డిండి మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి వెళ్తున్న క్రమంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినందుకు కార్యకర్తలు స్వాగతం పలికేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగడం బాధాకరమన్నారు. కేవలం తాను పార్టీ కార్యకర్తలను కలవడానికి మాత్రమే డిండిలో కాసేపు ఆగానని, భూమిపూజకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా నాయకుడు ఏటి.కృష్ణ, ఎంపీటీసీ ఏటి.రాధిక, సైదా, వెంకటయ్య, శ్రీను, జైపాల్, రాఘవ, అంజి,అజయ్, రమేష్ తదితరులున్నారు. -
చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత
సాక్షి,ఇల్లెందు (ఖమ్మం): పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు(55) చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీట మునిగిపోయాడు. గమనించి సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్ఎస్లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్‌నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. -
టీఆర్ఎస్ నేత బూతు పురాణం
-
టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు
-
టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు
సాక్షి, వికారాబద్: ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించి.. కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొందరు మాత్రం మాకివేం వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తాము ఈ నిబంధనలకు తాము అతీతులమన్నట్లు భావిస్తూ.. ఆంక్షలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్ఎస్ నాయకుడు లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి తన ఇంట్లో రికార్డ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చేందిన టీఆర్ఎస్ నాయకుడు ఒకరు లాక్డౌన్ ఆంక్షలు తుంగలో తొక్కి తన ఇంట్లో అర్థరాత్రి రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తించాడు. వందలమందిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్ సందర్భంగా ఆరు దాటితే జనాలను బయటకు అడుగుపెట్టకుండా చూస్తున్న పోలీసులు ఈ విందు-చిందు కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుపైనే -
నల్గొండ: టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడి హత్య
సూర్యాపేట రూరల్: జిల్లాలో సంచలనం సృష్టించిన రాజునాయక్‌తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్‌నాయక్ హత్యోదంతం చిక్కుముడి వీడుతున్నట్లు తెలుస్తోంది.వివాహేతర సంబంధాలు సాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయితీలో మందలించినందుకే కక్ష పెంచుకుని మరికొందరి సహకారంతో శంకర్నా నాయక్‌ను పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అందరితో కలివిడిగా.. రాజునాయక్ తండాలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురైన లూనావత్ శంకర్‌నాయక్ ఉన్నత విద్యావంతుడు. ఎల్ఎల్బీ పూర్తి చేసి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో సర్పంచ్‌గా పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. మూడేళ్లుగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శంకర్‌నాయక్ అందరితో కలివిడిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడుతుండేవాడు. గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. సరికాదన్నందుకే కక్ష పెంచుకుని.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రా మానికి చెందిన ఇద్దరు మహిళలతో కొంతకాలంగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, వీరి వివాదం రెండు మాసాల క్రితం పంచాయితీ పెద్దల వరకు వచ్చింది. అయితే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటున్న శంకర్‌నాయక్ వివాహేతర సంబంధాలు సాగిస్తున్న సదరు యువకులను పంచాయితీలో అందరిముందు మీరు అనుసరిస్తున్న తీరు తప్పని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు జరిగిన పంచాయితీలో సైతం శంకర్‌నాయక్ ఆ యువకులను తప్పుబట్టడడంతోనే కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. శంకర్‌నాయక్ హత్యోదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే దుండగులు పక్కా ప్రణాళికతోనే తమ పథకాన్ని అమలుచేసి మట్టుబెట్టినట్లు అవగతమవుతోంది. కొద్ది రోజులుగా శంకర్‌నాయక్ కదలికలను గమనిస్తూ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి శంకర్‌నాయక్ తన సోదరుడి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన దుండగులు మాటేసి హత్య చేసినట్లు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. శంకర్‌నాయక్ నాయక్ ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తుండడాన్ని తెలుసుకుని, అదే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి దారుణానికి తెగబడినట్లు అర్థమవుతోంది. లొంగిపోయిన నలుగురు నిందితులు రాజునాయక్‌తండా టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లునావత్ శంకర్‌నాయక్ హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్న ట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సదరు నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తామే హత్య చేసినట్లుగా ఒప్పుకుని లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, ఈ విషయాన్ని ఎస్ఐ లవకుమార్ ధ్రువీకరించలేదు. అయితే, శంకర్ నాయక్ హత్యోదంతంలో నలుగురు యువకులే పాల్గొన్నారా..? విద్యుత్ సరఫరా నిలిపివేయడం, హత్య అనంతరం నిందితులు పారిపోయేందుకు సహకరించింది ఎవరు..? ఈ కేసులో సూత్ర, పాత్రధారులపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పలువురిపై హతుడి భార్య ఫిర్యాదు తన భర్తను రాజునాయక్‌తండాకు గ్రామానికి చెందిన సైదా, లునావత్ తార, భూక్యా సురేష్, భూక్యా చందర్, మహేందర్, రమావత్ శ్వేత, లునావత్ పాండునాయక్లే హత్య చేశారని ఆరోపిస్తూ హతుడు శంకర్‌నాయక్ భార్య భారతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లవకుమార్ తెలిపారు. చదవండి: సైనెడ్‌తో కుక్కను చంపి.. తర్వాత ప్రియుడితో కలిసి -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: బేగంబజార్‌లో టీఆర్ఎస్ నేత శాంతిదేవి వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు షాప్‌లు మూసివేయాలని హంగామా చేశారు. ఫ్లై వుడ్ షాప్ మూసివేయాలంటూ షాప్ ఓనర్‌పై శాంతిదేవి దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన షాప్ ఓనర్‌పై శాంతిదేవి అనుచరులు దాడి చేశారు. శాంతిదేవి అనుచరుల దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దాడిపై షాపు ఓనర్... బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్ -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
-
తెలంగాణ భవన్: గన్‌తో టీఆర్ఎస్ నేత హల్చల్
బంజారాహిల్స్: ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో తెలంగాణ భవన్లో నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం భయాందోళనకు దారితీసింది. శనివారం ఓ కార్యకర్త సంబరాల్లో భాగంగా బాణసంచా కాలిస్తే ఏకంగా తెలంగాణ భవన్ ముందున్న పచ్చని పందిరి ఆహుతైంది. ఇది జరిగి అరగంట కాకముందే గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అత్యుత్సాహంతో తన జేబులో ఉన్న గన్ తీసి గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. దీంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. అనుచరులు వారించడంతో శ్రీనివాస్ యాదవ్ తన గన్ను కొద్దిసేపటి తర్వాత జేబులో పెట్టుకున్నారు. తుపాకీతో తెలంగాణ భవన్ లోపలికి వచ్చినా ఎవరూ గుర్తించలేకపోయారు. కొద్దిసేపు ఆయన గన్ ఊపుతూ హల్చల్ చేశారు. అక్కడున్న వారు వారించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! -
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఏజెన్సీల్లో మావోయిస్టులు మరింత అలజడి సృష్టిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో 15 రోజుల వ్యవధిలో మరో వ్యక్తిని హతమార్చారు. ఈ నెల 10న వెంకటాపురం మండలం ఆలుబాకలో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావును హత్య చేయగా, తాజాగా ఆదివారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురం–గోరుకొండ గ్రామాల మధ్య ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్‌ను చంపి, రహదారిపైనే మృతదేహాన్ని వదిలివెళ్లారు. ఈశ్వర్ పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో హతమార్చినట్లు సమాచారం. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయి. మృతుడి గొంతుకు తాళ్లు బిగించి చంపినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. మృతదేహాన్ని చర్లకు తరలించి పోస్టుమార్టం అనంతరం కటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఈశ్వర్ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సనీల్‌దత్ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం మృతుడు ఈశ్వర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కీలక నేతలు హరిభూషణ్, దామోదర్, చంద్రన్నలకు కొరియర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఒత్తిడి చేశారని, అందుకు ఈశ్వర్ నిరాకరించడంతో హతమార్చారని వివరించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత హత్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగారు. అటవీ ప్రాంతంలో ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండలం బోధాపూర్ (అలుబాక)కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడూరి భీమేశ్వర్రావు (బీసు) (48)ను పోలీసు ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు హతమార్చారు. శనివారం అర్ధరాత్రి భీమేశ్వర్రావు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మావోలు లోనికి చొరబడ్డారు. కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి ఆయనను దారుణంగా హత్య చేశారు. హతుడి భార్య మాడూరి కుమారి తన భర్తను ఏమీ చేయవద్దని ఎంత బ్రతిమి లాడినా కనికరించలేదు. కాగా భీమేశ్వర్ పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందువల్లే హతమార్చినట్లు మావోలు ఘటనా స్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నారు. మహదేవ పూర్ మండలం పంకెనలో కమ్మల రాఘవు లును (కాంగ్రెస్ పార్టీ) 2012 మే నెలలో మావోయిస్టులు ఇదే కారణంతో హత్య చేశారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం కలకలం రేపుతుండగా, పోలీసులు అధికార పార్టీ నేతలు, టార్గెట్లను అప్రమత్తం చేస్తున్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కిందటి నెలలో వేర్వేరు ఎన్కౌంటర్లలో 8 మంది మావోలు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడవచ్చని పోలీ సులు అనుమానించారు. అదే నిజమైంది. అధి కార పార్టీ నాయకుడిని టార్గెట్ చేసి చంపేశారు. రాత్రి అసలేం జరిగింది మావోయిస్టులు భీమేశ్వర్‌రావును పథకం ప్రకా రమే హత్య చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భీమేశ్వర్ రావు ఇంటికి చేరుకున్న ఆరుగురు మావోలు ఆయనను బయటకు రావాల్సిందిగా కోరారు. అనుమానం వచ్చిన భీమేశ్వర్ తలుపులు తీయకపోవడంతో... ‘అత్యవసరంగా డబ్బు కావాలి. ఆస్పత్రికి వెళ్లాలి’అంటూ ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బు లేదన్న భీమేశ్వర్ ఇంటి తలుపులు తీయలేదు. దీంతో మావోయిస్టులు తలుపులపై కాల్పులు జరిపి, బద్దలుకొట్టి భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. ఇదే సమయంలో భర్త దగ్గరకు వచ్చిన భార్య కుమారి కూడా తమ వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, రేపు ఇస్తామని పేర్కొంది. తుపాకులు ధరించిన ఇద్దరు ఆమెను పక్కకు లాక్కెళ్లి ‘కదిలితే చంపేస్తాం’అని బెదిరించారు. మరో ముగ్గురు భీమేశ్వర్‌ను ఇంట్లోనే మరోచోటికి తీసుకెళ్లారు. భీమేశ్వర్‌రావును కర్రలతో చితకబాది, కత్తులతో దాడి చేశారు. ‘నన్ను చంపొద్దు.. మీరు ఏం చెబితే అది చేస్తా’అని ఆయన వేడుకున్నా ఆగకుండా దారుణంగా పొడిచారు. ఇంటి వెలుపల సెంట్రీగా ఉన్న మరోవ్యక్తి ‘ఏదో వాహనం వస్తోంది. లైట్లు కనిపిస్తున్నాయ’ని అరవడంతో ఇంట్లో నుంచి మావోయిస్టులు బయటకు పారిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరో 20 మంది బయట కాపలా ఉన్నట్లు తెలిసింది. భీమేశ్వర్ కుటుంబసభ్యుల అరుపులు, ఆర్తనాదాలతో బయటకు వచ్చిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా... అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు భీమేశ్వర్రావుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వెంకటాపూర్ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటన స్థలంలో రెండు బుల్లెట్లు, కత్తులు, మావోయిస్టుల వదిలిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏఎస్పీ శరత్చంద్ర పవార్, వెంకటాపురం సీఐ శివప్రసాద్ సంఘటనపై ఆరా తీస్తున్నారు. ఎంత బతిమాలినా వినలేదు – మాడూరి కుమారి, మృతుడి భార్య బలవంతంగా ఇంట్లోకి వచ్చిన మావోయిస్టులు నేను, మా ఆయన ఎంత బ్రతిమిలాడినా వినలేదు. మా ఆయనను ఏమీ అనవద్దని నేను అడ్డంగా నిలుచుంటే తుపాకులు పట్టుకున్న ఇద్దరు పక్కకు తీసుకెళ్లి కదిలితే చంపుతామన్నారు. ఇంకో ముగ్గురు మా ఆయనను ఇంట్లోనే పక్కకు తీసుకెళ్లి దారుణంగా పొడిచారు. కుటుంబం రోడ్డునపడుతుంది, అనాథలమవుతామని వేడుకున్నా కనికరించలేదు. ఆరుగురు వచ్చారు... అందరూ సాదా దుస్తులు, షార్టులు, టీ షర్ట్లు వేసుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఇదేగతి – లేఖలో మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పోలీసు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నందుకే భీమేశ్వర్‌ను హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరిట వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు. అధికార పార్టీలో ఉంటూ... ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. పార్టీ ఫండ్ ఇవ్వనందుకే హత్య – సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఎస్పీ, ములుగు భీమేశ్వరరావును మావోయిస్టులు పలుమార్లు పార్టీ ఫండ్ అడగ్గా... ఆయన తిరస్కరించారు. దీనితో ఆయనపై మావోలు కక్ష పెంచుకున్నారు. సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు శనివారం అర్ధరాత్రి భీమేశ్వరరావుపై దాడి చేసి... అతిదారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ, రోడ్లను తవ్వి ప్రజాజీవనానికి ఆటంకాలు కల్పిస్తున్నారు. పార్టీ ఫండ్ ఇవ్వని సామాన్య ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో మావోలు హత్య చేస్తున్నారు. -
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
-
టీఆర్ఎస్ నేతను బెదిరించిన దుండగులు
సాక్షి, పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో టిఆర్ఎస్ నాయకుడిని దుండగులు తుపాకితో బెదిరించిన వైనం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దేవయ్యను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తుపాకీతో హత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన దేవయ్య అగంతకుల చేతిలోని తుపాకీ లాక్కొని బయటికి విసిరి వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఇంటి బయటక బురదలో పడటంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఎందుకోసం దేవయ్యపై దాడికి యత్నించారో స్పష్టత లేదు. అయితే దేవయ్యకు స్థానికంగా కొందరితో భూవివాదం ఉన్నట్లు తెలుస్తుంది. జరిగిన సంఘటనపై సమాచారం ఇవ్వడంతో పోలీసులకు అక్కడి చేరుకుని తుపాకి స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే దేవయ్యను హతమార్చేందుకు వచ్చారా, లేక మావోయిస్టుల కదలికల నేపథ్యంలో దేవయ్య టిఆర్ఎస్ నాయకుడు కావడంతో టార్గెట్ చేసి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం దేవయ్య ప్రాణ భయంతో పోలీసుల రక్షణలో ఉండగా... నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తుపాకితో భయపెట్టడంతో కాల్వ శ్రీరాంపూర్ ప్రజలతో పాటు అక్కడి టీఆర్ఎస్ నాయకులు భయాందోళన గురవుతున్నారు. -
శ్రీనివాస్ చనిపోయాడు..
సాక్షి, కరీంనగర్(సిరిసిల్ల): ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తమ సీనయ్య వస్తాడంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన తల్లి, భార్యాబిడ్డలకు కన్నీరే మిగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తంగళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు జంగపెల్లి శ్రీనివాస్(33) గత ఆదివారం సిద్దిపేట జిల్లా బద్దిపడిగె వాగులో కారుతో సహ గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు వారం రోజులపాటు నిరాటంకంగా కొనసాగగా, శనివారం నంగునూరు మండలం దర్గపల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానికులకు చెక్ డ్యామ్ సమీపంలోని చెట్లపొదల్లో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతి వార్త తెలియగానే తల్లి సత్తవ్వ, భార్య మానస గుండెలుపగిలేలా రోదించారు. శ్రీనివాస్ మరణవార్త విని మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లి రాంమోహన్, ఎస్సై అభిలాష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు కృతిక, లాస్య, సోదరుడు శేఖర్ ఉన్నారు. -
టీఆర్ఎస్ నేత హత్య భార్యపై అనుమానం?
సాక్షి, తాండూరు: అదృశ్యమైన టీఆర్ఎస్ నేత నాగరాజ్‌గౌడ్ గొల్ల చెరువులో శుక్రవారం శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నియోజకవర్గంలోని అంగడి రాయిచూర్ గ్రామానికి చెందిన నాగరాజ్‌గౌడ్ 20 ఏళ్ల క్రితం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. నాగరాజ్‌గౌడ్ కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. నాటి నుంచి తన వ్యాపారాలను చూసుకుంటున్నాడు. నాగరాజ్‌గౌడ్ భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండగానే ఆరేళ్ల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను షాద్‌నగర్‌లో ఉంచి కాపురం పెట్టాడు, వీరికి ఒక కూతురు ఉంది. రెండో భార్యను వ్యాపారాల పేరుతో తరచూ పుణెకు తీసుకెళ్తూ మొదటి భార్య లక్ష్మి వద్దకు రావడం తగ్గించడంతో తరచూ గొడవ పడేవారు. వీరి గొడవలు పలు మార్లు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 12న నాగరాజ్‌గౌడ్ మొదటి భార్య వద్దకు రాగా, అదే రోజు రాత్రి భార్యాపిల్లలతో గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణ సమీపంలోకి గొల్ల చెరువులో నాగరాజ్‌గౌడ్ శవమై కనిపించాడు. 12న మిస్సింగ్ కేసు నమోదు.. ఈ నెల 12న తన తండ్రి నాగరాజ్‌గౌడ్ కనిపించడం లేదని కూతురు ప్రియా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగి కేసు విచారణ చేపట్టారు. చెంగోల్ గ్రామానికి వెళ్లి అనుమానితుల వివరాలను సేకరించారు. భార్యే హంతకురాలు..? తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో నివాసముంటున్న నాగరాజ్‌గౌడ్ మొదటి భార్య లక్ష్మితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 22వ తేదీ రాత్రి నాగరాజ్‌గౌడ్‌ను హత్య చేసి గొల్ల చెరువులో పాడేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అనంతరం సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్సై ఏడుకొండలు గొల్ల చెరువుకు చేరుకొని నాగరాజ్ మృతదేహాన్ని వెలికి తీయించారు. అయితే ఈ హత్యోదంతంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. -
ఆస్తి తగాదాలతో టీఆర్ఎస్ నేత హత్య
సాక్షి, దేవరకొండ : కుటుంబ ఆస్తి తగాదాలు చిలికి.. చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. మృతుడు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు. చందంపేట మండలంలో శని వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పాత పోలేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గోప్యానాయక్ కుటుంబానికి చందంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్ (50) కుటుంబానికి కొంత కాలంగా ఆస్తి పంచాయితీ నడుస్తోంది. ఈ విషయమై పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. లాలునాయక్ కుమార్తె రమావత్ పవిత్ర ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ను ఆక్రమించుకొని రోడ్డు వెంట ఏర్పాటు చేసిన దుకాణాలను శనివారం ఆర్అండ్బీ పోలీస్‌శాఖ సంయుక్తంగా తొలగించడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గోప్యానాయక్ కుమారుడు విజయ్‌నాయక్, లాలునాయక్‌లు తారసపడడంతో మాటమాట పెరిగి ఆస్తి విషయమై తగాదా పడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్కడినుంచి బిల్డింగ్‌తండా గ్రామానికి వెళ్లిన ఇరు వర్గీయులు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మారణాయుధాలతో దాడి చేయడంతో లాలునాయక్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతన్ని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లాలు నాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని వర్గీయులు విజయ్‌నాయక్ ఇంటిపై దాడికి దిగి సామగ్రిని ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలేపల్లి, బిల్డింగ్‌తండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పికెట్ ఏర్పాటుచేసినట్లు ఎస్ఐ సందీప్‌కుమార్ తెలి పారు. శాంతిద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సూర్యాపేట రూరల్: సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం యర్కారం గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్నయాదవ్ (39) దారుణ హత్యకు గురయ్యారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓటర్లను కలుసుకునేందుకు వెంకన్నయాదవ్‌తో పాటు, అతని ప్రత్యర్థి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డే ఎల్లయ్య అనుచరులు గ్రా మంలో తిరిగారు. ఈ సందర్భంగా ఓటర్లుగా ఉన్న చింతలపాటి ఉపేందర్, చింతలపాటి జయరాజును కలిసేందుకు వెంకన్నయాదవ్ తన అనుచరులైన చింతలపాటి మధు, బొడ్డు కిరణ్, గుండ్లపల్లి నవీన్, ఆవుదొడ్డి ప్రవీణ్‌తో కలసి వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత మార్గమధ్యలో ఎదురుపడ్డ ఇరు పార్టీలు నేతలు, అనుచరులు వాగ్వాదానికి దిగారు. 20 నిమిషాల తరువాత శనివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో వెంకన్నయాదవ్‌ను వడ్డే ఎల్లయ్యతో పాటు అతని అనుచరులు 15 మందికి పైగా వెంబడించారు. దీంతో వెంకన్నయాదవ్, చింతలపాటి మధు, ఆవుదొడ్డి ప్రవీణ్ పరుగెత్తి గ్రామంలోని ఆవుదొడ్డి వీరయ్య ఇంటి తలుపులు నెట్టుకొని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి వెంట ఉన్న బొడ్డు కిరణ్, గుండ్లపల్లి నవీన్ చెట్లల్లోకి పరారయ్యారు. ఆవుదొడ్డి ప్రవీణ్ ఇదే ఇంట్లో ఉన్న వంట గదిలో దాచుకున్నాడు. వెంకన్నయాదవ్ తలదాచుకున్న ఇంటిని అప్పటికే గమనించిన వడ్డే ఎల్లయ్య, అతని అనుచరులు తల్వార్లు, కర్రలతో అక్కడికి చేరుకుని వెంకన్నయాదవ్, చింతలపాటి మధు దాచుకున్న గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. వడ్డే ఎల్లయ్య అతని అనుచరులు గదిలో కనిపించిన వెంకన్నయాదవ్ తలపై తల్వార్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తొలుత కర్రలతో దాడి చేయడంతో వెంకన్నయాదవ్ ఎడమ చెయ్యి విరిగి వంకర్లు పోయింది. ఆ తరువాత అతన్ని తల్వార్లతో తలమీద, వీపు వెనుకభాగంలో పొడిచారు. దీంతో రక్తమోడుతూ కింద పడిపోయిన వెంకన్న తలపై పక్కనే ఉన్న ఇసురు రాయితో మోదడంతో తల వెనుకభాగం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే సమయంలో హత్య జరిగిన గదిలో ఉన్న మధు పత్తి బస్తాల చాటున దాచుకోవడంతో నిందితుల కంటపడకుండా ఉన్నాడు. వెంకన్న మృతి చెందాడని నిర్ధారించుకున్న నిందితులు కారులో పారిపోయారు. గ్రామంలో ఉద్రిక్తత వెంకన్నయాదవ్ హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్యోదంతం తెల్లవారేసరికి తెలిసిపోవడంతో గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, నేతలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్‌లు హత్య జరిగిన సమాచారాన్ని తెలుసుకుని కొద్దిసేపటికే గ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భారీ బందోబస్తుతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో తదుపరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టిక్కెట్ రాలేదని టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యాపేట: టిక్కెట్ రాలేదనే కారణంతో టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కలకలం రేగింది. టీఆర్ఎస్ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించలేదని తీవ్ర మనస్తాపం చెందిన టీఆర్ఎస్ నేత అబ్ధుల్ రహీం తన నివాసంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పట్టణంలో 39వవార్డు నుంచి టిక్కెట్ ఆశించిన ఆయన భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. రెండు క్రితం నుంచి ప్రచారం చేపట్టారు. అదే వార్డు నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణి కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు.. టిక్కెట్ ఖరారు కాకముందే ఇరువురు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం ప్రకటించిన జాబితాలో సుధారాణికి టిక్కెట్ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు. -
టీఆర్ఎస్ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్): భీమ్‌గల్ మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మాజీ వార్డు సభ్యుడు కలీం హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం, మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. భూ తగాదాలతో హత్యకు గురైన భీమ్‌గల్‌కు చెందిన కలీం సోమవారం మండలంలోని బాబాపూర్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా మంగళవారం రోజంతా భీమ్‌గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలీం మృతదేహానికి సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతని వర్గం వారు హంతకులను కఠినంగా శిక్షించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని నిర్ణయించారు. మంగళవారం భీమ్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో యువకులు పెద్ద సంఖ్యలో బైకులపై ర్యాలీ చేపట్టారు. మృతదేహంతో ఆందోళన.. ఉదయం 10 గంటల సమయంలో కలీం మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. మృతదేహాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొందరు యువకులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లగా, పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు పంపించారు. హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్, మంత్రి రావాలని, అప్పటిదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మైనారిటీ నాయకులతో అధికారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆందోళన విరమించి అంతిమ యాత్ర నిర్వహించారు. తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ముస్లిం మహిళలు ప్రశాంతంగా బంద్ కలీం హత్యకు నిరసనగా చేపట్టిన భీమ్‌గల్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బస్సులు, ఆటోలు నడువలేదు. భారీ బందోబస్తు.. సోమవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఆర్మూర్, నిజామాబాద్ ఏసీపీలు రఘు, శ్రీనివాస్‌కుమార్, ఎస్బీ ఏసీపీ శ్రీనివాస్‌రావ్, స్థానిక సీఐ సైదయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తుకు తరలి వచ్చారు. ప్రత్యేక బలగాలను దింపి పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు. పరామర్శించిన మాజీ మంత్రి కలీం హత్య వార్త తెలిసి మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి భీమ్‌గల్‌కు వచ్చారు. కలీం మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌గౌడ్ తదితరులు కలీం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి -
ఎన్నికల్లో ఓడించాడని టీఆర్ఎస్ నేత హత్య
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సంచలనం సృష్టించిన బ్రహ్మళకుంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలతోనే ఏటుకూరి నరసింహారావును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు హతమార్చినట్లు కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 10న బ్రహ్మళకుంటకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు ఏటుకూరి నరసింహారావు(50) వ్యక్తిగత పనులపై వెళ్లి తాళ్ళపెంట వైపు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యలో మరో ద్విచక్రవాహనంపై నిందితులు బాణోతు గోపి, బాణోతు వెంకటేశ్వరరావు వచ్చి కర్రలతో కొట్టి హతమార్చారు. గత జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా తమ ఓటమికి నరసింహారావు కారణమని భావించి, బాణోతు బీమా కుటుంబ సభ్యులు నరసింహారావు ఇంటికి వెళ్లి మాకు మద్దతు ఇస్తానని చెప్పి మోసం చేశావని, తమకు రూ.30 లక్షలు ఎన్నికల ఖర్చు అయ్యిందని, ఆ డబ్బు పోవడానికి, ఓడిపోవడానికి కారణం తననేనంటూ నరసింహారావును ఇంటి వద్దే తిట్టి బెదిరించారు. ఈ విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినప్పటికీ ఇరు వర్గాలు రాజీ పడ్డారు. పంచాయతీ వ్యవహారాల్లో నరసింహారావు, ప్రస్తుత సర్పంచ్‌తో కలిసి పనిచేస్తుండటంతో బీమా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. నరసింహారావును హతమార్చాలని, అతని స్నేహితులు బాణోతు వెంకటేశ్వరరావు, అజ్మీర రవీంద్ర, బాణోతు కృష్ణ, సోదరుడు బాణోతు మోహన్, తండ్రి బాణోతు బీమా మాట్లాడుకుని పథకం రూపొందించారు. ఒంటరిగా వస్తుండటంతో.. సెప్టెంబర్ 10న ఒంటరిగా కొత్తూరు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి తిరిగి వస్తున్న నరసింహారావును గోపి కర్రతో వెనుక నుంచి తలపై కొట్టాడు. దీంతో నరసింహారావు బండిపై నుంచి కింద పడి, తనను ఏం చేయవద్దని బతిమిలాడినప్పటికీ గోపితో పాటు అతని మిత్రుడు వెంకటేశ్వరరావు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టి, నరసింహారావు మృతి చెందాడని నిర్ధారించుకున్నాకా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముగ్గులపోటీ వద్ద ప్రత్యక్షం.. నరసింహారావును హతమార్చిన గోపి, వెంకటేశ్వరరావు ఇళ్లకు వెళ్లి బట్టలు మార్చుకుని ఏమీ తెలియనట్లు గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ వద్దకు వెళ్లి కొంతసేపు గడిపారు. తరువాత పోలీసుల రంగ ప్రవేశంతో కనిపించకుండాపోయారు. సీఐ రవికుమార్, ఎస్ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్ఐ ఏ శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నరసింహారావుది హత్యగా ప్రాథమింగా నిర్ధారించి, విచారణ చేపట్టారు. ఈ విచారణలో నరసింహారావు హత్యలో మొత్తం ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు పోలీసుల నిగ్గుతేల్చినట్లు ఏసీపీ వెంకటేష్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా బ్రహ్మళకుంట బాణోతు గోపి, ఏ2గా బాణోతు వెంకటేశ్వరరావు, ఏ3 బాణోతు బీమా, ఏ4 బాణోతు మోహన్, ఏ5 అజ్మీర రవీంద్ర, ఏ6 బాణోతు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాణోతు వెంకటేశ్వరరావు సోదరి వాంకుడోతు మంగ్గమ్మపై సైతం సాక్ష్యాధారాలు మాయం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆరుగురు నిందితులను గురువారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసును చేధించిన సీఐ రవికుమార్‌ను, ఎస్ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్‌ను అభినందించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు.. బ్రహ్మళకుంట గ్రామంలో రాబోయే రోజుల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, పెనుబల్లి: పెనుబల్లి మండలం బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణ హత్య రాజకీయ కక్షతోనే అని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. కొట్టి, హతమార్చే ప్రాంతంలో తప్పించుకోవడానికి వీలులేని బ్రిడ్జి వద్దనున్న చెరకు తోట పరిసరాలను దుండగులు ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణహత్య రాజకీయ కక్షతోనే జరిగి ఉంటుందని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తాళ్ళపెంట నుంచి బ్రహ్మళకుంటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరసింహారావును మార్గంమధ్యలో బ్రిడ్జి సమీపంలో చెరకు తోట వద్ద రోడ్డుపై కాపు కాసి కర్రలతో తలపై, నుదురు, మొహంపై తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. పక్కా ప్రణాళికతో.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఏటుకూరి నరసింహారావు (50) వెళ్తున్న విషయాన్ని తాళ్లపెంటలో ఉన్న రైతులు ఫోన్ ద్వారా దుండగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నరసింహారావును కొట్టి, హతమార్చేందుకు... తప్పించుకోవడానికి ఎటువంటి వీలులేని బ్రిడ్జి వద్ద నున్న చెరకుతోట ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. మాటు వేసి, కర్రలతో కొట్టి హతమార్చారు. రాజకీయ హత్యగానే ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలలో ఓ వర్గానికి నరసింహారావు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం విజయం సాధించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రత్యర్థి వర్గం హత్యకు పాల్పడి ఉంటుందని నరసింహారావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మళకుంటకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు స్థానికంగా అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు నరసింహారావు మృతదేహం, సంఘటనా స్థలం వద్ద పడిఉన్న నరసింహారావు ద్విచక్రవాహనం మంగళవారం రాత్రి హత్యకు గురైన నరసింహారావు మృతదేహాన్ని బుధవారం ఉదయం వరకు సంఘటనా స్థలంలోనే ఉంచి పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఖమ్మం నుంచి వచ్చిన క్లూస్ టీం , డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించాక మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం సందర్భంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్, జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావులతో పాటు మండల నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు రక్షణలో బ్రహ్మళకుంట తరలించి, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు నిర్వహించేలా పర్యవేక్షించారు. విచారణ.. కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ , సత్తుపల్లి రూరల్ సీఐ టి. రవికుమార్, ఎస్సై తోట నాగరాజుల ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో అనుమానితులు ఏటుకూరి నరసింహారావు హత్యతో సంబంధం ఉన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాళ్ళపెంటకు చెందిన ఓ మహిళను, ఓ వ్యక్తిని , బ్రహ్మళకుంటకు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తోట నాగరాజు తెలిపారు. -
టీఆర్ఎస్ నేత దారుణ హత్య
-
ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని తూర్పు అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యు డు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేయడంతో కలకలం రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు ఓ ప్రజాప్రతినిధిని చంపడం ఇదే తొలిసారి. పోలీసులు ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కూంబింగ్‌లు జరుపుతూ మావోయిస్టుల కార్యకలాపాలు నివారించగలిగారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలతో మావోయిస్టులు కలకలం సృష్టించారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ సెంట్రల్ కమిటీ.. తెలంగాణలో కార్యకలాపాలను హరిభూషణ్‌కు అప్పగిం చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీ, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధిలో కొత్త కమిటీలు కూడా వేశారు. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ ఉండ గా, కొత్తగా వెంకటాపురం–వాజేడు కమి టీని నియమించారు. జూన్ ఆఖరి వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత బడే చొక్కారా వులతోపాటు 20 మంది మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇంతలోనే మావో యిస్టులు శ్రీనివాసరావును హత్య చేశారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు ఎవరీ శారదక్క? శ్రీనివాసరావు మృతదేహం వద్ద పార్టీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గంగారం గ్రామానికి చెందిన శారద (40) హరిభూషణ్ భార్య. ఆమెను జజ్జరి సమ్మక్క అలియాస్ సారక్క, అలియాస్ శారదగా పిలుస్తారు. జూన్ ఆఖరిలో వారంలో హరిభూషణ్‌తోపాటు శారద కూడా తెలంగాణలోకి వచ్చిందన్న పోలీసుల అనుమానాలు తాజా ఘటనతో నిజమయ్యాయి. కోటేశ్వరరావు రాకతో పెరిగిన దూకుడు మావోయిస్టు పార్టీ బాధ్యతలను నంబాల కోటేశ్వరరావు తీసుకున్నప్పటి నుంచి దూకుడు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరస దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీమా మండవితోపాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. మే ఒకటో తేదీన గడ్చిరోలిలో పోలీసు కాన్వాయ్ మీద దాడి చేయడంతో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. -
ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు
సాక్షి, కొత్తగూడెం : టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఆయన్ను హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ సరి హద్దు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి లోని బెస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసరావును మావోయిస్టులు బలవంతంగా ఆయన బైక్‌పైనే తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను చంపేశారని ఒకసారి, విడుదల చేశారని మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆయన మృతదేహం లభ్యంకావడంతో హత్య సంగతి వెలుగుచూసింది. మావోయిస్టులు శుక్రవారం సాయంత్రం చర్ల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రంపాడు శివారులో ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని, ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. మృతుడికి భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. శ్రీనివాసరావు 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెదమిడిసిలేరు నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వచ్చే నెల 7వ తేదీ వరకు ఆయన పదవీకాలం ఉంది. వేడుకున్నా కనికరించలేదు.. శ్రీనివాసరావును విడుదల చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా మావోయిస్టులు కనికరించలేదు. ఆయన కిడ్నాప్ అయిన వెంటనే గ్రామానికి చెందిన సుమారు 300 మంది సరిహద్దు అటవీప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో తారసపడిన కొందరు ఆదివాసీలు.. శ్రీనివాసరావును వదిలిపెడతారని, మీరు వెనక్కి వెళ్లిపోవాలని వారికి చెప్పడంతో ఆయన్ను విడుదల చేస్తారని భావించారు. అయితే, బుధవారం ఆయన్ను చంపేశారంటూ ప్రచారం జరగ్గా.. గురువారం విడుదల చేశారంటూ ప్రచారం సాగింది. చివరకు హత్యచేసిన సంగతి శుక్రవారం నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తను మావోయిస్టులు హతమార్చడం ఇదే మొదటిసారి. మృతదేహం వద్ద చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే శ్రీనివాసరావును హతమార్చినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు ఆదివాసీ గ్రామాల్లో ఇన్ఫార్మర్లను తయారు చేస్తున్నాడని.. దళాల సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడంతోపాటు ప్రజాసంఘాల వారిని అరెస్టు చేయిస్తున్నాడని ఆరోపించారు. ‘‘ఆదివాసీలకు చెందిన 70 ఎకరాల భూమిని పోలీసుల ప్రోద్బలంతో అక్రమంగా గుంజుకున్నాడు. ప్రశ్నించేవారిని అరెస్టులు చేయిస్తున్నాడు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నాడు. ఆదివాసీలకు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలుస్తుండటంతో ఖతం చేశాం’’అని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో అపహరించినవారిని విడిచిపెట్టారు.. 2014లో తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకు టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ, మరో నలుగురిని మావోయిస్టులు అపహరించి ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత వదిలిపెట్టారు. మావోయిస్టులకు అనుకూలమని చెప్పిన టీఆర్ఎస్.. తర్వాత వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తూ విడుదల చేస్తున్నట్లు అప్పుడు పేర్కొన్నారు. శ్రీనివాసరావును కూడా అలాగే విడుదల చేస్తారని భావించినా, ఆయన్ను హతమార్చారు. శ్రీనివాసరావు ఇన్ఫార్మర్ కాదు చర్ల మండలం బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు అనే రైతును నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మావోయిస్టులు శుక్రవారం ఆయన్ను దారుణంగా కొట్టి చంపారు. ఇది హేయమైన చర్య. శ్రీనివాసరావు పోలీస్ ఇన్ఫార్మర్ కాదు. ఆయనకు పోలీసులతో ఎలాంటి సంబంధం లేదు. మావోయిస్టులు తమ మనుగడ కోసం చర్ల ప్రాంతానికి చెందిన రైతులు, వ్యాపారస్తులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. రైతులకు అండగా నిలిచే శ్రీనివాసరావు వంటి వ్యక్తులను చంపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ -
టీఆర్ఎస్ నేత దారుణ హత్య: అందుకే ఖతం చేశాం
సాక్షి, ఖమ్మం: మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈనెల 8న కిడ్నాప్‌కు గురైన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును దారుణంగా హత్య చేశారు. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం గుర్తించారు. అతని మృతదేహం పక్కనే శబరి ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి శారద పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు. ఆయన కొత్తగూడెం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతగా తెలుస్తోంది. ‘నల్లారి శ్రీనివాసరావును పోలీసులుకు ఇన్ఫార్మర్ అయినందుకు ఖతం చేశాం. ఇంటెలిజెన్సీ, పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫ్మార్మర్లను తయారు చేస్తున్నాడు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పోలీసులకు చేరవేస్తున్నాడు. అలాగే ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయిస్తున్నాడు. అదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల అండతో అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నాడు. ఎస్ఐబీతో కలిసి ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో సీపీఐ మావోయిస్ట్ పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నాడు. అదివాసీ వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నలవడంతో శ్రీనివాసరావును ఖతం చేశాం’’అంటూ లేఖను విడుదల చేశారు. -
నీ ‘నామ’మే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదవులపరంగా జిల్లాకు మరో అవకాశం లభించింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం లభించినట్లయింది. దీంతో రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నామా నాగేశ్వరరావు మొదటిసారి టీడీపీ ఎంపీగా అడుగిడితే.. రెండోసారి టీఆర్ఎస్ ఎంపీగా కాలుమోపనున్నారు. మొదటి పర్యాయం టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అదే లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించే అవకాశం దక్కింది. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరుగురు లోక్‌సభ సభ్యులు గల టీడీపీకి లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించిన నామా నాగేశ్వరరావు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలం వరకు టీడీపీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఆయన.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఉనికి కోల్పోతున్న దశలో ఆయన లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిందే తడవుగా ఆయనకు టీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఐదేళ్లపాటు టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్.. నామాకు టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చింది. హైదరాబాద్‌లో ఎంపిక.. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నామాను పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా అనుభవం ఉండడంతోపాటు జాతీయ స్థాయి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండడాన్ని, సమస్యలపై అవగాహన ఉండడం, ప్రజల వాణిని వినిపించగల నేర్పు ఉండడం వంటి అంశాలు నామా టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడానికి ఉపకరించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2009లో టీడీపీ నుంచి ఆరుగురు లోక్‌సభకు ఎన్నిక కాగా.. అందులో తెలంగాణ నుంచి నామా నాగేశ్వరరావుతోపాటు ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరే ఎన్నికైనా ఆయనకు జాతీయ నేతలతో గల సంబంధాలు.. అప్పట్లో చంద్రబాబు నాయుడితో గల సాన్నిహిత్యం ఆయనను టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిని చేసింది. ఇప్పుడు సైతం సీఎం కేసీఆర్‌తో గల సాన్నిహిత్యం, గత అనుభవం వంటి అంశాలు ఆయనను లోక్‌సభ టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా అయ్యేలా చేసిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై ఆయనకు గళమెత్తే అవకాశం లభించినట్లయింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, పలు రైల్వే లైన్ల ఏర్పాటు వంటి అంశాలను సభలో ప్రస్తావించి.. పరిష్కరించడానికి మరింత అవకాశం లభించినట్లయిందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు విజయం సాధించడం అనంతరం ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించి మెజార్టీ మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడంతోపాటు ఖమ్మం జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం వ్యక్తమవుతోంది. నామా టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు మృతిచెందాడు. మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు వనపర్తి సత్యనారాయణ(53), బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేటలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి వస్తున్నాడు. భద్రాచలం రోడ్‌లోని రైస్ మిల్ సమీపంలో ఇతడి వాహనాన్ని ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలపై దాడి
అల్లాదుర్గం(మెదక్): కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఓటమి భయంతో, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నేపంతో భౌతిక దాడులకు దిగుతున్నారని అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి టీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, పోచయ్యలు గురువారం స్థానిక విలేకర్లతో చెప్పారు. బుధవారం నామినేషన్లు వేసి ఇళ్లకు వెళ్తున్న దళిత టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలపై రాళ్లదాడి చేశారన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన గడ్డం భూమమ్మకు తలపగిలి తీవ్ర గాయాలయ్యయని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వారే దాడులకు పాల్పడుతూ వారిపైనే దాడి చేసినట్లు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, పెద్దేముల్: బోరుబావి తవ్వకం ఓ నాయకుడి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ ప్రజలకు ఎంతో ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే పొలానికి సాగునీరు అందక పంట ఎండిపోతుందని బోరుబావి తవ్విస్తుండగా పక్కపొలానికి చెందిన అన్నదమ్ములు టీఆర్ఎస్ నాయకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాండూరు డీఎస్పీ రామచంద్రడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన దేశ్‌పాండే చంద్రవర్మ ప్రసాద్‌రావు(55) కొన్నాళ్లుగా కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గ్రామంలో 40ఎకరాలకు పైగా పొలం ఉంది. ప్రసాద్‌రావుకు సర్వే నంబర్ 358నంబర్ గల భూమిలో పండిస్తున్న వరి పంట, మామిడి తోటలకు సాగు నీరు అందక ఎండిపోతుందని ప్రసాద్‌రావు పొలంలో మంగళవారం బోరు వేయిస్తున్నాడు. అయితే పక్క పొలానికి చెందిన సోదరులు గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, శివారెడ్డిలు తమ పొలం పక్కనే బోరుబావి తవ్వడం తెలుసుకుని దేశ్‌పాండే ప్రసాద్‌రావు వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో అన్నదమ్ములు కర్రలతో, మట్టి పెళ్లలతో ప్రసాద్‌రావుపై దాడి చేశారు. దాడి జరుగుతుండగా పక్కన ఉన్న వారు విడిపించేందుకు యత్నించారు. అయితే ఆ సోదరులు అతికిరాతకంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్న వారిపైకి వెళ్లారు. దీంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రసాద్‌రావు ప్రాణాలు పోయే వరకు దాడి చేశారని పోలీసుల విచారణలో తేలింది. పాతకక్షలతోనే హత్య చేశారా..? దారుణ హత్యకు గురైన ప్రసాద్‌రావుకు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల అంజిల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, శివారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయంతో ప్రసాద్‌రావు పక్కపొలానికి చెందిన వారితో పలు సార్లు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో పాత కక్షలు, రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రసాద్‌రావును దారుణంగా హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు. అపన్నహస్తం అందించే నాయకుడిగా.. హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడు ప్రసాద్‌రావు గ్రామ ప్రజలకు ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నేతగా ఉన్నాడు. గతంతో సర్పంచ్‌గా ప్రసాద్‌రావు భార్య రజినిపాండే కొనసాగారు. ప్రసాద్‌రావుకు భార్య రజిని, కుమారుడు, కూతురులున్నారు. కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్‌రావు 6నెలల మంబాపూర్ గ్రామంలోనే ఎక్కువుగా ఉంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రతీసారి జరిగే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌లుగా తన వర్గానికి చెందిన వారినే గెలిపిస్తూ గ్రామంలో పట్టు సాధించాడు. ముందస్తు ఎన్నికల నాటి నుంచి మంబాపూర్ గ్రామంలోనే ఉంటున్నారు. గ్రామంలో ఏ కార్యం జరిగిన ప్రసాద్‌రావు హాజరవుతు పార్టీలకతీతంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పథకం వేశారని పలువురు అంటున్నారు. మంచి పేరున్న నాయకుడిగా మారిన ప్రసాద్‌రావు హత్య జరిగిన ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకుని రోదించారు. విచారణ చేసిన డీఎస్పీ రామచంద్రుడు మంబాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు హత్యకు గురైన విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై సురేష్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై గ్రామస్తులతో రెండు గంటల పాటు విచారణ చేశారు. పొలంలో వేసిన బోరు బావిని పరిశిలించారు. బోరు బావి తవ్వకం చేస్తున్న సమయంలో ఉన్న వారితో మాట్లాడి వివరాలను సేకరించారు. మృతుడి భార్య పిల్లలు హైదరాబాద్ నుంచి రాత్రి 8గంటల వరకు చేరుకోలేదు. -
మరోసారి ఆశీర్వదించండి
సాక్షి,కామారెడ్డి: ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్లతో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కోరారు. జిల్లా కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గంప గోవర్ధన్ సమర్పించారు. నామినేషన్ అనంత రం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన దేశంలోనే అగ్రగామిగా నిలిచి పోతుం దని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ దాదాపు రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, జిల్లా గా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కామారెడ్డికి రానున్న రెండేళ్ల లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా నీరందిస్తామన్నారు. రెండు సెట్ల నామినేషన్ దాఖలు.. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్డీవో కా>ర్యాలయం వద్దకు చేరుకున్నాయి. నామినేషన్ అనంతరం గంపగోవర్ధన్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు నిట్టు వేణుగోపాల్‌రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ‘తొలి టికెట్’ చరిత్రను మార్చిన జీవన్‌రెడ్డి
సాక్షి,ఆర్మూర్(నిజామాబాద్): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ కేటాయించిన అభ్యర్థి ఓటమి పాలవుతాడనే అపవాదును ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెరిపేశారు. టీఆర్ఎస్లో మొదటి అభ్యర్థి కూడా విజయం సాధిస్తాడని పార్టీ చరిత్రను తిరగ రాశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొట్టమొదటి టికెట్‌గా ప్రకటించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్ ఓటమి పాలయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు. ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ అధినేత తొలి టికెట్ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో 2013 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్‌లో విజయవంతంగా నిర్వహించారు. దీంతో సభ అనంతరం జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి మరీ టీఆర్ఎస్ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే తన అభ్యర్థి త్వాన్ని కేసీఆర్ ప్రకటించడమే కాకుండా పలు సభల్లో ‘జీవన్‌రెడ్డి నా కుడి భుజం’ అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను కూడగట్టి టీఆర్ఎస్ను బలోపేతం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో టీఆర్ఎస్లో మొదటి టికెట్ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే అపవాదును జీవన్‌రెడ్డి తుడిపేశారు. -
మిర్చీ ఘాటు.. ఓటెంతో స్వీటు
సాక్షి, బాన్సువాడ రూరల్: ఎన్నికల ప్రచారంతో పాటు, ఎల్లారెడ్డిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన మంత్రి పోచారం మార్గమధ్యలో కొత్తాబాదిలోని ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ వేడివేడి మిర్చీలు వేశారు. వాటిని రుచి చూడడంతో పాటు తన వెంట ఉన్న కార్యకర్తలు, అధికారులకు రుచిచూపించారు. ఆయన వెంట నాయకులు రమేష్‌రెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి తదితరులున్నారు. మీ ఓటు నాకే వేయాలమ్మా..! సాక్షి, నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ఆదివారం బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలను అందజేస్తూ తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. వీధివీధినా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వుకు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి వినాయ్‌రెడ్డి -
హ్యాట్రిక్ సాధ్యమయ్యేనా..!
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంప్రదాయం కలగలిపి ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు భాష సాంప్రదాయలతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించలేకపోయారు. గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినా, వరుసగా మూడు సార్లు గెలవలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హన్మంత్ సింధే గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఎన్నికయితే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తారు. ఆయన హ్యాట్రిక్ సాధింస్తారో లేదో తేలాలంటే డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 14 సార్లు ఎన్నికలు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జుక్కల్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లయినా అభ్యర్థులు ఎవ్వరూ హ్యాట్రిక్ సాధించలేరు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించారు. కానీ ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించలేరు. 1967, 1972 సంవత్సరంలో సామెల్ విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం 1978, 1983 వరుసగా రెండు సార్లు, 1989, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 1985, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున బేగరి పండరి రెండు సార్లు గెలుపొందారు. 1999 సంవత్సరంలో టీడీపీ తరపున కుమారి అరుణతార విజయం సాధించారు. అలాగే 2009 సంవత్సరంలో టీడీపీ, 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన హన్మంత్‌సింధే వరుసగా రెండు సార్లు చొప్పున గెలుపొందారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సింధేకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉంది. నాలుగోసారి బరిలోకి సింధే ప్రజాసేవ కోసం ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హన్మంత్ సింధే రాజకీయాల్లోకి వచ్చారు. నీటిపారుదలశాఖలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హన్మంత్‌సింధే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన నేత సౌదాగర్ గంగారాం మూడుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ సింధేను కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం ఓడించారు. అప్పటి ఓటమితో గుణపాఠం నేర్చుకున్న సింధే జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. దాంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంత్‌సింధే మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. -
టీఆర్ఎస్ నేత హత్యపై ఈసీ స్పందన
సాక్షి, హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో టీఆర్ఎస్ నాయకుడు నారాయణ రెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. వికారాబాద్ రాజకీయ హత్యపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. (చదవండి : టీఆర్ఎస్ నేత దారుణ హత్య) వికలాంగులకు ఇబ్బందులుండవ్.. జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ) సూచన మేరకు 10 -15 వేల వీల్క చైర్లు అందుబాటులో పెడతామని రజత్‌కుమార్ తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రానికి 8 వీల్ చైర్ల వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రవేశపెడతా. ‘వాదా’(ఓటర్ యాక్సెస్బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్) యాప్ సేవల్ని వినియోగించుకుంటామని అన్నారు. బదిరులకు ప్రత్యేక కరపత్రాలు ముద్రిస్తున్నామన్నారు. ఎన్నికల అధికారులందరికీ ప్రాథమిక సైన్ లాంగ్వేజ్‌పై అవగాహన కల్పించామని రజత్‌కుమార్ చెప్పారు. రెండు రోజుల్లో దివ్యాంగుల సహాయార్థం సీఈఓ తెలంగాణ వెబ్సైట్ అందుబాటులోకి రానుందని రజత్‌కుమార్ వెల్లడించారు. మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు చేసే పింక్ పోలింగ్ కేంద్రాల్లో పింక్ కలర్‌ను వాడబోమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఒక పింక్ స్టేషన్ ఉంటుందని అన్నారు. మహబూబ్‌నగర్‌కు విజయ్ దేవర కొండ.. రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా సానియా మీర్జా, పుల్లెల గోపిచంద్, వీవీఎస్ లక్ష్మణ్, గోరేటి వెంకన్న, అభినయ శ్రీ ( హీరోయిన్), ఆంజనేయులు, మహేంద్ర ( క్రికెటర్), శ్రావ్య ( సింగర్), సుజాత ( టీవీ యాంకర్ ), బాబు నాయక్ (శాస్త్రవేత్త) ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎన్నికల ఐకాన్లు ఉంటారని రజత్‌కుమార్ తెలిపారు. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని తెలిపారు. పింక్ పోలింగ్ కేంద్రాలలో పింక్ కలర్ ఉండదు. -
కారు దిగిన లాలు.. టీఆర్ఎస్కు షాక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్‌కు ఇది ఊహించని ఎదురు దెబ్బే. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, నియోజకవర్గ ఇన్చార్జ్గా కూడా పనిచేసిన కేతావత్ లాలూనాయక్ కారు దిగారు. ఆయా పార్టీలనుంచి నాయకులు వచ్చి టీఆర్ఎస్లో చేరే దాకా ఇన్చార్జి బాధ్యతలు చూసిన లాలూనాయక్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం గేట్లు ఎత్తింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మన్‌గా గెలిచిన బాలునాయక్ గులాబీ గూటికి చేరారు. దీంతో నియోజకవర్గంలో ఇక బలపడొచ్చని ఆ పార్టీ నాయకత్వం భావించింది. అటు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐనుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ కూడా గులాబీ గూటికి చేరడంతో ఇక నియోజకవర్గంలో కారు వేగానికి ఢోకా ఉండదని భావించారు. కానీ.. గత నెల 6వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించాక పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టికెట్ హామీతోనే పార్టీలో చేరిన బాలునాయక్ టికెట్లు ప్రకటించిన పది రోజుల్లోపే టీఆర్ఎస్ను వీడి సొంత గూటికి చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం, అంతకుముందు నుంచి టీఆర్ఎస్లో కొనసాగిన ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్ బాట పట్టారు. తాజాగా, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన లాలూనాయక్ సైతం సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 38,618 (23.85శాతం) ఓట్లు వచ్చాయి. కానీ, ఈ ఓట్లు సాధించిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్‌కు మారారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ పరిస్థితి ఇరకాటంలో పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గణాంకాలు ఏం చెబుతున్నాయి..! నాయకుల మార్పులు, చేర్పుల మాటెలా ఉన్నా.. ఆయా ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. మహాకూటమి బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ ఇప్పుడు మహాకూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ధతుతో సీపీఐ ఇక్కడ పోటీచేసి 57,715 (35.69శాతం) ఓట్లు సంపాదించి విజయం సాధించింది. ఇదే ఎన్నికల్లో టీడీపీ 53,501 (33.04 శాతం) ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇపుడు ఈ మూడు పార్టీలూ కూటమిలో ఉన్నాయి. అంటే గత ఎన్నికల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. 1,11,213 ఓట్లు అవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బిల్యా నాయక్ సైతం ఇపుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్‌కు అపుడు 67,887 ఓట్లు రాగా, టీడీపీ పొత్తుతో కూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ 57,419 ఓట్లు వచ్చాయి. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన రవీంద్ర కుమార్‌కు వ్యక్తిగత ఓటు బ్యాంకు ఎంత ఉంటుంది..? అది టీఆర్ఎస్లోకి మారాక ఎంత పెరిగి ఉంటుంది..? ఈ ఎన్నికల్లో ఎంత ఉపయోగపడుతుంది అన్న చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన 38,618 ఓట్లలో లాలూ నాయక్ వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఎంత..? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారడం వల్ల చీల్చుకుపోయే ఓట్లు ఎన్ని ఉండొచ్చన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటిదాకా ... రెండే పార్టీలు ! దేవరకొండ నియోజకవర్గం 1952 నుంచి 1972 దాకా ఐదు టర్మ్‌లు జనరల్ నియోజకవర్గంగా ఉంది. 1978 ఎన్నికలనుంచి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. మొత్తంగా 2014 వరకు ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక (2002) సహా (కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికై , స్థానం నిలబెట్టుకుంది) పదిహేను మార్లు ఎన్నికలు జరిగాయి. 1952 తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ విజయం సాధించడం మినహా మిగిలిన పధ్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు (1957, 1967, 1978, 1983, 1999, 2009) సీపీఐ ఏడు సార్లు ( 1962, 1972, 1985, 1989, 1994, 2004, 2014) విజయం సాధించాయి. సీపీఐతో పొత్తుల వల్ల టీడీపీ ఇప్పటి వరకు మూడు సార్లే పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఏ ఎన్నికల్లోనైనా టీడీపీకి నలభై వేల ఓట్లకు తగ్గలేదు. 1999 ఎన్నికల్లో 45,907, 2004లో 44,561, 2014 ఎన్నికల్లో 53,501 ఓట్లు సాధించింది. మూడు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకును ఎన్నికల ఫలితాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇప్పటివరకు గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఈ మూడు పార్టీల ఓటు బ్యాంకు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసిందంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఈ పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయడానికి ఎలాంటి వ్యూహం రూపొందిస్తారు..? టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ ఈ అడ్డంకుల్ని అధిగమించి విజయతీరాన్ని ఎలా చేరుకుంటారు..? మహా కూటమి నుంచి ఎవరు అభ్యర్థి అవుతారు..? ఆ పార్టీల నడుమ ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా.. అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌లోకి..లాలు కొండమల్లేపల్లి : దేవరకొండ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జ్ లాలూనాయక్ సోమవారం సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గాన్ని, గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్లాలునాయక్, వడ్త్య రమేశ్‌నాయక్, కిషన్‌నాయక్ తదితరులున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
సాక్షి, కీసర/మేడ్చల్ : టీఆర్ఎస్ నాయకుడి హఠాన్మరణం కీసర మండలంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మార్నింగ్ వాక్ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
-
టీఆర్ఎస్ నేత వాహనంలో 27.35 లక్షలు!
ఇబ్రహీంపట్నం: టీఆర్ఎస్ నాయకుడి వాహనంలో తరలిస్తున్న రూ.27.35 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం వాహనాలు తనీఖీ చేస్తుండగా నగదు తరలిస్తున్న విషయం బయటపడింది. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వివరాల మేరకు.. యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న ఫార్చునర్ (టీఎస్ 09 ఈటీ 1135) వాహనాన్ని తనిఖీ చేయగా అందులో డబ్బుల సంచి గుర్తించారు. సంచిలోని సొమ్మును లెక్కించగా రూ.27.35 లక్షలున్నట్లు తేలింది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, ఆదిభట్ల మాజీ ఉప సర్పంచ్ పల్లె గోపాల్‌ను విచారించి వదిలేశారు. పట్టుబడిన డబ్బులను ట్రెజరీలో డిపాజిట్ చేసి, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆర్డీవో చెప్పారు. ఈ డబ్బులు సక్రమమా లేక అక్రమమా అనేది ఐటీ అధికారులు తేల్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఐటీ అధికారులకు సమాచారం ఇస్తారని వెల్లడించారు. భూ రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్తున్నా చింతపల్లి మండలం పోలేపల్లి వద్ద 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు తీసుకెళ్లగా.. భూ యజమాని అనారోగ్యానికి గురికావడంతో రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. దీంతో డబ్బులతో తిరిగి వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ నుంచి ఇటీవలే ఈ డబ్బులు డ్రా చేశాను. ఈ డబ్బులకు సంబంధించి ఐటీ రికార్డులు సక్రమంగానే ఉన్నాయి. -
ఇబ్రహీంపట్నంలో భారీగా డబ్బులు పట్టివేత..?
-
ఇబ్రహీంపట్నంలో భారీగా డబ్బులు పట్టివేత..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాగా.. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తులు మొదలుపెట్టింది. ఎలక్షన్ స్క్వాడ్లను రంగలోకి దించి ముమ్మురమైన తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న దాదాపు 27 లక్షల నగదును ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం. పట్టుబడిన సొమ్ము ఆదిబట్ల గ్రామ ఉపసర్పంచ్ పల్లె గోపాల్ గౌడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే, గోపాల్‌గౌడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చుచేయడానికే సొమ్మును తరలిస్తున్నారని విమర్శలు గుప్పించాయి. -
లాహోటీ చూపు.. బీజేపీ వైపు
సాక్షి, కొడంగల్ (రంగారెడ్డి): కొడంగల్ టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సీనియర్ నాయకుడు శ్యాసం రామకృష్ణ మౌనంగా ఉన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ టీఆర్ఎస్ నాయకుడు పున్నం చంద్ లాహోటీ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆయనకు కొడంగల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానంలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. పున్నంచంద్ గతంలో బీజేపీలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పలుమార్లు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రజల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వారు.. నామినేటెడ్ పోస్టులు దక్కని వారు కూటమిగా ఏర్పడుతున్నారు. పున్నంచంద్ లాహోటీని ఎన్నికల బరిలో నెలబెట్టి పాత కాపుల సత్తా చాటాలని చూస్తున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి పలుమార్లు పున్నం చంద్‌కు ఫోన్ చేసి సముదాయించినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై పున్నం చంద్ లాహోటీని వివరణ కోరగా వారం రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. నాయకుల కినుక.. కొడంగల్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవ చేస్తున్న తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణా ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు ప్రస్తుతం పార్టీలో సరైన స్థానం లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించి సకల జనుల సమ్మెను విజయవంతం చేసిన పాత కాపులు ఇప్పుడు కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ తొలి ఇన్చార్జ్ శ్యాసం రామకృష్ణతో పాటు నేటితరం నాయకుడు పున్నం చంద్ లాహోటీ వరకు టీఆర్ఎస్పై కినుక వహిస్తున్నారు. -
ఆత్మాభిమాన రక్షణకే ‘కొండా’ గెంటివేత
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆత్మాభిమానాన్ని రక్షించేందుకే కొండా దంపతులను టీఆర్ఎస్ నుంచి గెంటివేసినట్లు నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్‌లోని మహేశ్వరి గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ పేరు కూడా ఉచ్ఛరించే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద స్థలానికి సీఎం రాలేదని ఆరోపణలు చేసిన కొండా సురేఖ తన తండ్రి మరణిస్తే మురళీ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. సురేఖ తండ్రి మరణిస్తే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పీఏ సునీల్ తనకు చెబితే అందరికి సమాచారం అందించానన్నారు. రాజశేఖర్‌రెడ్డి జన్మనిస్తే.. కేసీఆర్ పునర్జన్మను ఇచ్చారని అన్న కొండా దంపతులు ఇప్పుడు టికెట్ ఇవ్వకుంటే విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ తెలంగాణకు అసలు ద్రోహులు కొండా దంపతులేనని అన్నారు. వంచనగిరిలో కుక్కను తుపాకీతో కాల్చి సర్పంచ్ అయిన కొండా మురళీకి తమకు రాజకీయంగా అశ్రయం కల్పించిన వారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ కావాలని 42 మం ది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఇచ్చిన లేఖలో కొండా సురేఖ సంతకం చేయలేదన్నారు. వీరికి తెలంగాణ అనే మాట ఎత్తే అర్హత లేదన్నారు. జిల్లాకు పట్టిన శని పోయిందని, ఇలాంటి దుర్మార్గులను ఏ పార్టీ కూడా చేర్పించుకోవద్దని కోరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రెస్మీట్లో తెలంగాణ ద్రోహులు ఇచ్చిన స్క్రీప్ట్‌ను సురేఖ చదివారని, ఉమ్మడి రాష్ట్రంలో వారి నీతిమాలిన చరిత్ర అందరికి తెలుసన్నారు. నైతిక విలువలు ఏ మాత్రం ఉన్నా కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, వీర బిక్షపతి, ఝెలుగం లీలావతి, శారదాజోషి, కేడల పద్మ, ఉషశ్రీ పద్మ, దామోదర్ యాదవ్, నాయకులు జన్ను జకార్య, రామా బాబూరావు, హరిరమాదేవి, తూర్పాటి సారయ్య, సురేష్‌జోషి, మసూద్, బిల్లా శ్రీకాంత్, రాజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!
చేవెళ్ల (రంగారెడ్డి): మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైంది. ఈనెల 27న కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు ఖారారు అయిందని విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన ఆయన తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఆయన అనుచరులతో చర్చించి వారిని పెద్ద ఎత్తున వెంట తీసుకెళ్లేందుకు సోమవారం చేవెళ్లలో మారోసారి ఆయన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరి అధిష్టానం ఎవరికి టికెట్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే. -
ప్రియురాలి కోసం వేటకొడవలితో...
గీసుకొండ(పరకాల): తన ప్రియురాలిని వెంట తిప్పుకుంటున్నాడని టీఆర్ఎస్ నాయకుడిపై ఓ వ్యక్తి కొడవలితో హత్యా యత్నం చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోనె మల్లయ్య(మల్లారెడ్డి)ని గీసుకొండకు చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్ గ్యాస్ సేఫ్టీ డివైజ్ విక్రయానికి సంబంధించి ఏజెంట్‌గా చేర్పించింది. కాగా శని వారం మల్లారెడ్డితోపాటు టీమ్ లీడర్లు సదానందం, బాలిరెడ్డి, మహిళా అటెండర్ తమ కంపెనీ పనిపై కారులో సంగెం మండలం లోహిత గ్రామానికి బయల్దేరారు. వరంగల్ నగరంలోని అండర్‌బ్రిడ్జి దాటి వెళ్తుండగా గమనించిన మనుగొండ గ్రామానికి చెందిన బోయరాజు (ఊకల్ క్రాస్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని) బైక్‌పై వేగంగా వెళ్లి కారుకు అడ్డంగా పెట్టాడు. మహిళా అటెండర్‌ను ఎందుకు తీసుకెళ్తున్నారని గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఆమె నిద్రిమాత్రలు మింగడంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లారెడ్డి తన కారులో తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోల్కోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద దింపి వెళ్లాడు. అక్కడికి బోయరాజు వచ్చి ఆమెతో గొడవపడి చంపుతానని బెదిరిం చాడు. వితంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఫొటోలు చూపుతూ ఆమెతో తిరగరాదని హెచ్చరించాడు. గీసుకొండలో ఎంపీపీ భర్త రాజ్‌కుమార్ వద్ద మాట్లాడుకుందామని చెప్పి మల్లారెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం గ్రామంలోని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా హోటల్ వద్ద రాజ్‌కుమార్ ఉండగా అతడికి విషయం చెబుతుండగానే అక్కడే ఉన్న బోయ రాజు వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లారెడ్డి మెడపై వేటు వేయడానికి యత్నించాడు. అయితే చొక్కా కాలర్‌కు కొడవలి తగలటంతో మెడపై స్వల్ప గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్‌కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై విఠల్ తెలిపారు. -
సబ్‌రిజిస్ట్రార్‌పై టీఅర్ఎస్ నేత వీరంగం
-
శోకసంద్రమైన కౌడిపల్లి
కౌడిపల్లి(నర్సాపూర్) : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల కిషన్‌రెడ్డి అంత్యక్రియలతో సోమవారం ఆ యన స్వగ్రామం కౌడిపల్లి శోకసంద్రంగా మారిం ది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. కిషన్‌రెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య సుహాసినిరెడ్డి అస్వస్థతగా ఉండటం, కోడలు, అల్లుడు అమెరికాలు ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ప్రజలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. మృతి చెందిన మూడు రోజులకు అంత్యక్రియలు జరగగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని గ్రామస్తులు ఎదురు చూశారు. నర్సాపూర్ నుంచి కౌడిపల్లి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. కౌడిపల్లిలోని రెడ్డి శ్మశాన వాటికలో ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. అతని కొడుకు శేషసాయిరెడ్డి చితికి నిప్పంటించారు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణిమురళీధర్‌యాదవ్, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి మృతదేహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా అతని సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పార్థివదేహం పక్కన కూర్చొని కంటతడి పెట్టడం పలువురిని కలిచివేసింది. కిషన్‌రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి కాగా ఆయన నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన పార్థివ దేహాన్ని నర్సాపూర్ తీసుకువచ్చారు. సోమవారం నర్సాపూర్ నుంచి ర్యాలీగా కౌడిపల్లికి అంతిమ యాత్ర సాగింది. దారి పొడవున పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అస్వస్థతతో అంబులెన్స్‌లో.. కిషన్‌రెడ్డికి లివర్ చెడిపోవడంతో అతనికి భార్య సుహాసినిరెడ్డి లివర్ డొనేట్ చేశారు. కాగా దీంతో అమె అస్వస్థతతో ఉండగా అంత్యక్రియలకు ఆమెను అంబులెన్స్‌లోనే తీసుకువచ్చారు. అంత్యక్రియలు జరుగుతుండగా అంబులెన్స్‌లో నుంచి ఆమె వీక్షించారు. కొడుకు, కోడలు కాళ్లుకడగటం, చితికి నిప్పు అంటించడం కార్యక్రమాలను చేశారు. అంత్యక్రియలలో ఎంపీపీలు పద్మనరసింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సారా యాదమ్మరామాగౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులకు దుర్గారెడ్డి, శివాంజనేయులు, చం ద్రందుర్గాగౌడ్, పిశ్కె శెట్టయ్యా, పుండరీకం గౌడ్, కృష్ణగౌడ్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ స ర్పంచ్‌లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్టూపాన్ని పాలతో శుద్ధి చేసిన టీఆర్ఎస్ నేతలు
-
తిట్లపురాణం
‘యూస్ లెస్ ఫెల్లో.. జాయిన్ అయితే ఎంపీపీకి చెప్పాలన్న జ్ఞానం ఉండదారా.. దొంగ లం.. కొడుకా ఏం రాజకీయం చేద్దామని వచ్చినావురా గంగాధరకు.. ఎంపీపీ పర్మిషన్ తీసుకోవారా.. పని చేయకున్నా కూర్చుండబెట్టి జీతం ఇచ్చినరా ఇడియట్.. పిచ్చిపిచ్చి నకరాలు చేస్తే తన్ని ఎల్లగొడుతా’ .....ఇదంతా గంగాధర ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన దూలం బాలాగౌడ్.. అధికారి ఎంపీడీవో బండుపై అందుకున్న తిట్లపురాణం. తనకు చెప్పకుండా ఎలా వస్తావని ఇలా కడిగి పారేశారు. చెప్పరాని మాటలు, వినటానికి వీలు లేని బూతులు తిట్టడంతో షాక్‌కు గురైన ఎంపీడీవో బండు ‘సభ్యత సంస్కారంతో మాట్లాడు’ అంటూ మౌనం వహించినా వినలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఓ మండల స్థాయి అధికారిని ‘బండు’ కడిగాడు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో సోమవారం సాయంత్రం ఓ ఆడియో వైరల్ అయ్యింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ, ఎంపీడీవోపై కురిపించిన తిట్ల పురాణానికి సంబంధించిన ఈ ఆడియో సారాంశం కాస్తా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. అధికారిని రాజకీయ నాయకులు ఇలా కూడా తిడతారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా.. అధికార పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి నోరు పారేసుకోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్/గంగాధర: గతంలోకి వెళ్తే గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో కొద్ది రోజులు ఈవోపీఆర్డీగా పనిచేసిన బండు ఇక్కడే ఇన్చార్జి ఎంపీడీవోగా సైతం విధులు నిర్వహించారు. ఇతనికి ఇదే మండలానికి చెందిన ఎంపీపీ దూలం బాలాగౌడ్‌కు విభేదాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్‌పై ఎంపీడీవోగా వేములవాడ మండలానికి వెళ్లారు. గంగాధర మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతోపాటు, విధుల్లో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేములవాడ ఎంపీడీవో బండుకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు రోజుల క్రితం విధుల్లో చేరారు. కాగా.. తనకు సమాచారం ఇవ్వకుండా విధుల్లో చేరుతావా అంటూ ఎంపీపీ దూలం బాలాగౌడ్ పత్రికల్లో రాయలేని విధంగా దూషించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇబ్బందులకు గురిచేశాడు గతంలో ఇక్కడ ఈవోపీఆర్డీవోగా, ఇన్చార్జి ఎంపీడీవోగా పని చేసినప్పుడు సైతం ఎంపీపీ దూలం బాలాగౌడ్ ఇబ్బందులకు గురిచేసాడు. తనకు లాభం అయ్యే పని చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అటువంటి సంస్కృతి నాకు లేదు. దీంతో సాలరీలు ఆపాడు. ఎల్పీసీ ఆపాడు. ప్రమోషన్‌పై వేములవాడకు ఎంపీడీవోగా వెళ్లాను. నాలుగు రోజుల క్రితం ఇన్చార్జి ఎంపీడీవోగా గంగాధరకు వచ్చా. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో ఎంపీపీ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు. అసభ్యకరమైన భాషలో చెప్పరాని విధంగా, రాయలేని విధంగా తిట్టాడు. ఈ విషయాన్ని సీఈవోకు వివరించా. మండలంలో ఏ ఎంపీడీవో పనిచేయడానికి ముందుకు రావడంలేదు. తిట్ల విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. – బండు, ఎంపీడీవో, గంగాధర సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించా నేను ఎంపీడీవో విషయంలో మాట్లాడిన దానిలో తప్పేం లేదు. సమాచారం ఇవ్వాలనే విజ్ఞత లేదా అని ప్రశ్నించాను. గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ ఇన్చార్జిగా వచ్చారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదు. నాలుగు రోజుల క్రితం విధుల్లో చేరిన ఎంపీడీవో కనీసం ఎంపీపీకి సమాచారం ఇవ్వాలనే విషయం తెలియదా. జాయినింగ్ లెటర్‌పై ఎంపీపీతో అడ్మిట్ అని రాయించుకున్న తరువాతే బాధ్యతలు తీసుకోవాలనే నిబంధన ఉంది. విధుల్లో చేరి నాలుగు రోజులైంది. ఫోన్ ద్వారానైనా సమాచారం ఇవ్వలేదు. – దూలం బాలాగౌడ్, ఎంపీపీ, గంగాధర -
డీఎస్‌పై జిల్లా నేతల తిరుగుబాటు
-
బంగారం చోరీ కేసులో టీఆర్ఎస్ నేతలు
-
గాంధీభవన్‌కు తాళాలు తప్పవు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అధికారం రానేరాదని, గాంధీభవన్‌కు తాళాలు వేసుకోక తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులెవరూ కాంగ్రెస్‌కు ఓటేయరని అన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటున్నారని, కానీ, ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఎలా దించాలనేదానిపై గాంధీభవన్‌లో నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు. ఉత్తమ్‌కి గిరిజన డిక్లరేషన్ విడుదల చేసే నైతిక హక్కు లేదని, కామారెడ్డి గిరిజన డిక్లరేషన్ హాస్యాస్పదమన్నారు. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనట్టు, టీఆర్ఎస్ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటిదాకా గిరిజనులను వంచించిన కాంగ్రెస్‌పార్టీ, అదే వంచనా తీరును కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గిరిజనులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. -
వేట కొడవళ్లతో వెంటాడి టీఆర్ఎస్ నేత హత్య
ధారూరు: భూతగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. దుండగుల దాడిలో ఓ టీఆర్ఎస్ నేత హత్యకు గురయ్యారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ధారూరు మండలం మైలారానికి చెందిన పెండ్యాల శ్రీనివాస్(38) టీఆర్ఎస్ మండల కార్యనిర్వాహక కార్యదర్శి. ఈయన భార్య యాదమ్మ ధారూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్. మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తతండాలో ఆదివారం జరిగిన ఓ వివాహానికి శ్రీనివాస్ హాజరయ్యాడు. అనంతరం హరిదాస్‌పల్లికి చెందిన జి.వినోద్‌తో కలసి సమీపంలోని తన పొలానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మైలారానికి చెందిన మద్దులపల్లి దాసు(37), రత్నం(36), ప్రశాంత్ (27), అరుణ్(24)లు ఎదురుగా వచ్చి తమ బైక్‌లను దారికి అడ్డంగా పెట్టారు. శ్రీనివాస్, వినోద్ అప్రమత్తమై మైలారం గ్రామం వైపు పారిపోయారు. ప్రత్యర్థులు తరుముకుంటూ వస్తుండగా రోడ్డు మధ్యలో ఉన్న రాయికి తగిలి శ్రీనివాస్ ద్విచక్రవాహనం పడిపోయింది. వెంటనే వినోద్ ప్రాణభయంతో పారిపోయాడు. శ్రీనివాస్ తన అనుచరులకు సెల్ఫోన్లో సమాచారం అందించేందుకు ప్రయత్నించాడు. వెంటనే దుండగులు వేట కొడవలితో అతడి ఎడమ చేతిని నరికారు. మెడ, తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మృతి చెందా డని నిర్ధారించుకున్న దుండగులు ధారూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్, దాస్ మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు, కక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. హత్యతో మైలారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
టీఆర్ఎస్ నేత ఆత్మహత్య
అమీర్‌పేట: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోరబండ రామారావు నగర్‌కు చెందిన డేవిడ్(40) టీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్నాడు. ఓ ప్రైవేటు కంపనీలో పనిచేస్తున్న అతను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్థాపానికి లోనైన డేవిడ్ సోమవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరళించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేద్కర్ జయంతి వేడుకలో రసాభస
-
కాంగ్రెస్ గూటికి ‘అచ్చ’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అచ్చ విద్యాసాగర్ 2009లో పోటీ చేశారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ అచ్చ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గతంలో బహిరంగ లేఖ రాశారు. వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ విషయమై పార్టీ నుంచి స్పందన లేదు. దీంతో కొంత కాలం వేచి చూసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి రావడం, రాజకీయ భవితవ్యంపై కచ్చితమైన హామీ రావడంతో టీఆర్ఎస్ ను వీడేందుకు అచ్చ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11న గాంధీభవన్, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా వెళ్లేందుకు అచ్చ అనుచరులు అంతా సిద్ధం చేస్తున్నారు. -
గులాబీ పార్టీలో ... జోష్ !
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గడిచిన రెండేళ్లలో ఆయా సందర్భాల్లో ఈ అంశం కార్యకర్తల్లో ప్రచారం జరిగినా, ఈ సారి మరింత స్పష్టంగా ఆయన పోటీ చేయడం ఖాయమని విశ్వసిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఆ మేరకు రెండు రోజుల కిందటే స్వయంగా ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ఆయనను అభినందించడానికి ప్రగతి భవన్‌కు తరలివెళ్లారు. జిల్లా నేతలు సైతం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. ఈ సదర్భంగా కూడా జిల్లా నేతలు నల్లగొండకు ఆహ్వానించారని పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు పాల్గొంటున్నారు. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో అయిదు చోట్ల విజయం సాధించింది. అయితే, సూర్యాపేట మినహా మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి లోక్‌సభా స్థానం పరిధిలోనివే కావడం గమనార్హం. నల్లగొండ లోక్‌సభ సీటు పరిధిని నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జుసాగర్, హుజూర్నగర్, కోదాడల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, దేవరకొండలో కాంగ్రెస్ పొత్తుతో సీపీఐ బయట పడింది. సూర్యాటపేలో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. ప్రధానంగా ఈ నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోనే ఉన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే నల్లగొండలో కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కొత్త ఎత్తు వేస్తోందంటున్నారు. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే వ్యూహం రచించారని అంటున్నారు. దీనివల్ల నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం తేలికవుతుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. కేవలం ఏడు సెగ్మెంట్లలో మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్ పోటీస్తే ఆప్రభావం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుందని వీరు విశ్లేషిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఊపు తెచ్చేందుకు ఆయా సందర్భాల్లో కేసీఆర్ ఆయా నియోజకవర్గాలను మార్చి మార్చి పోటీ చేసి ఫలితాలు రాబట్టారు. ఆయన గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఈ మారు నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో పోటీ చేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయనను కలిసిన జిల్లా నేతలు మరో మారు ఆయనను ఆహ్వానించారని అంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలున్న జిల్లాలో గురిచూసి దెబ్బకోట్టేందుకు ఇదే సరైన ఉపాయమన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్ది నెలలే మిగిలి ఉన్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లగా, మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తానికి అధికార పార్టీ కేడర్‌లో జోష్ నింపే పనిలో నాయకత్వం ఉన్నట్లు విదితమవుతోంది. -
అప్పు తీర్చమంటే ఆహుతి చేశారు
సాక్షి, ఆసిఫాబాద్/బెజ్జూరు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఓ దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు! ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ మహిళ మరణించింది. ఈ దారుణ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన దుర్గం స్రవాంతబాయి(45) భర్త తిరుపతి ఆరేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు శంకర్, చిన్న కొడుకు శ్రీనివాస్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. రెండో కొడుకు దాసుతో కలిసి మర్తిడిలో కూలి పనులు చేసుకుంటూ స్రవాంతబాయి జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కామెర దుర్గయ్య కుమార్తె వివాహం సందర్భంగా అతడికి రూ.47 వేలు అప్పుగా ఇచ్చింది. గత కొన్ని రోజులుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. దుర్గయ్య జాప్యం చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. అర్ధరాత్రి ముగ్గురు వెళ్లి.. అప్పు తీర్చమన్నందుకు స్రవాంతబాయిపై దుర్గయ్య కక్ష పెంచుకున్నాడు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మండల కోఆప్షన్ సభ్యుడు బసరాత్‌ఖాన్, దుర్గయ్య భార్య చాలుబాయి, కొడుకు సాయి మంగళవారం అర్ధరాత్రి స్రవాంతబాయి ఇంటికి వెళ్లారు. నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబీకులు 100కు ఫోన్ చేశారు. బెజ్జూరు ఎస్సై శివప్రసాద్ 108 ద్వారా బాధితురాలిని సిర్పూర్(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉన్న ఆమె నుంచి సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ రామారావు సమక్షంలో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. బసరాత్‌ఖాన్, చాలుబాయి, సాయి కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు మరణ వాంగ్మూలంలో ఆమె వెల్లడించింది. తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే చనిపోయింది. మృతురాలి కుమారుడు దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 25న మృతురాలి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. పిల్లలు అనాథలయ్యారు ఇన్నాళ్లు నా చెల్లె తన కొడుకులను తండ్రి లేకపోవడంతో ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఎవరూ లేని వారు అనాథలయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. – జుండే తుకారాం, మృతురాలి అన్న కాంగ్రెస్, దళిత నాయకుల ధర్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాలు, స్రవంతాబాయి బంధువులతో కలిసి మృతదేహంతో సిర్పూర్(టి) ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మృతురాలి ఇల్లు దహనం చేసింది కూడా వారేనని ఆరోపించారు. స్రవాంతబాయి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ నాయకులు కావడంతో పట్టించుకోలేదని ఆరోపించారు. సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా.. అలాంటిదేమీ లేదన్నారు. -
లోన్ రికవరి కోసం వెళ్తే చితకబాదిన టీఆర్ఎస్ నేత
-
రోడ్డున పడ్డాం, రాజీకి రావా..?
సాక్షి, హైదరాబాద్: తనపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటేనే తన మొదటి భార్య సంగీతను కాపురానికి రానిస్తానని బహిష్కృత టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... 53 రోజులుగా తాను, తన తల్లిదండ్రులు రోడ్డుపై ఉంటున్నామని తెలిపారు. తమ ఇంటిని సంగీత అధీనంలోని తీసుకుందని, ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టించారని వాపోయారు. తనతో రాజీకి సంగీత రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. మూడేళ్లుగా రాజీకి ప్రయత్నిస్తున్నా, ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని, తల్లిదండ్రులపైనే ఆధారపడి బతుకుతున్నానని చెప్పారు. కూతురంటే ప్రాణమని, తనకు వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తన కూతురి పేర ఆస్తి రాయాల్సిన అవసరం లేదన్నారు. విభేదాలన్నీ మర్చిపోయి వస్తే సంగీతను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. కేసులు ఉపసంహరించుకుంటేనే ఆమెతో రాజీ పడతానని తేల్చి చెప్పారు. నిరూపిస్తే దీక్ష విరమిస్తా: సంగీత రాజీకి తాను రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడే దీక్ష విరమిస్తానని సంగీత తెలిపింది. ఎక్కడోవుండి మాట్లాడం కాదని, ఇంటికి వచ్చి రాజీ గురించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం శ్రీనివాస్‌రెడ్డికి సరదా అని ఆరోపించారు. కాగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్‌లోని భర్త ఇంటి ముందు సంగీత 53 రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
దీక్ష విరమించా.. ధర్నా కొనసాగిస్తా: సంగీత
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన భార్య సంగీత చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తనకు, తన పిల్లవాడికి న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్‌లోని అతని ఇంటి ముందు ఆమె 52 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి విదితమే. మహిళా సంఘాలు, సామాజికవేత్త దేవి సూచనల మేరకు ఆమె దీక్షను విరమించింది. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే ధర్నాను మాత్రం కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆమెకు న్యాయం చేయాలని దేవి విజ్ఞప్తి చేశారు. కాగా, తన భర్త, అత్తమామలతో మాట్లాడి న్యాయం చేయాలని సంగీత వేడుకుంటున్నది. -
52 రోజులుగా భర్త ఇంటి ముందు దీక్ష
-
హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తా
-
స్పష్టమైన హామీ ఇస్తేనే...: సంగీత
సాక్షి, హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలంటూ సంగీత చేస్తున్న దీక్ష గురువారానికి ఐదోరోజుకు చేరింది. బోడుప్పల్‌లోని భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. తనకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని సంగీత స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డి, అత్త, మామలు ఐలమ్మ, బాల్‌రెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు కాగా, అత్త ఐలమ్మకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. కాగా అమ్మాయి పుట్టిందనే నెపంతో తనను ఇంటి నుంచి గెంటేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డిని, అందుకు ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గత అయిదు రోజులుగా సంగీత బోడుప్పల్‌లోని అత్తగారింటి వద్ద ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్‌రెడ్డి ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు. అప్పటికే మొదటి భార్య స్వాతి నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి గెంటేసి దేవీ జగదీశ్వరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో సంగీత న్యాయపోరాటానికి దిగింది. ఆమెకు పలు మహిళా, ప్రజాసంఘాలు మద్ధతుగా నిలిచాయి. మంత్రి కేటీఆర్ సూచన మేరకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సైతం బుధవారం బాధితురాలిని పరామర్శించి దీక్షకు మద్ధతు పలికారు. ఈ క్రమంలో ఆమె అత్తింటి వారితోనూ, బంధువులతో ఆయన జరిపిన చర్చలు విఫలం కావడంతో సంగీత భర్త, అత్త,మామల ను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టులతో తనకు న్యాయం జరిగినట్లుగా భావించడం లేదని, సామాజికంగా, ఆర్ధికంగా తనకు భద్రత కల్పించాలని సంగీత కోరారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. హోటల్లో చర్చలు.. సంగీతకు మద్ధతు తెలిపిన ఎంపీ మల్లారెడ్డి ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి సంగీత అత్తింటి వారితో మేడిపల్లిలోని ఒక హోటల్లో చర్చలు జరిపా రు. సంగీత తరుపున రాపోలు రాములు, తోటకూర జంగయ్య, సంగీత బాబాయి చర్చల్లో పాల్గొన్నారు. సంగీతకు పరిహారం, రక్షణ, జీవన భృతిపై చర్చలు జరిగాయి. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో చర్చలు విఫలమయ్యాయి. దీనికితోడు సంగీతకు అన్ని వైపుల నుంచి మద్ధతు పెరగడంతో పరారీలో ఉన్న సంగీత అత్త పులకండ్ల ఐలమ్మ, మామ బాల్‌రెడ్డి, భర్త శ్రీనివాస్ రెడ్డిలను నిన్న సాయంత్రం పోలీసులు.... అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: సంగీత
సాక్షి, హైదరాబాద్: తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించలేదని సంగీత స్పష్టం చేశారు. తన అత్తమామలను అరెస్ట్ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తన పాపకు భరోసా కల్పించాలని, భార్యగా తనకు దక్కాల్సిన గౌరవం కావాలన్నారు. అత్తింటి వారిని తాను డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తన భర్త పులగండ్ల శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద వరుసగా నాలుగు రోజు ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. సంగీతను మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగీతకు న్యాయం చేస్తామని, మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని హామీయిచ్చారు. సంగీత అత్తమామలను అరెస్ట్ చేసి, శిక్ష పడేలా చేస్తామన్నారు. సంగీత, ఆమె బిడ్డను అన్నివిధాల ఆదుకుంటామని భరోసాయిచ్చారు. శ్రీనివాసరెడ్డి ఆస్తిలో వాటా ఇప్పించడమే కాకుండా, కొంత నగదు కూడా ఇప్పిస్తామన్నారు. అత్తమామలను అరెస్ట్ చేసే వరకు తాను దీక్ష విరమించబోనని సంగీత స్పష్టం చేయడంతో.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంగీతకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా కోదండరాంకు ఆమె తెలిపారు. సంగీతకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. -
తాగిన మైకంలోనే.. టీఆర్ఎస్ నేత
సనత్‌నగర్: టీఆర్ఎస్ నేత వల్లభు శ్రీనివాసరావు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 15న అర్ధరాత్రి సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలంలో వీఎస్‌రావును హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి సోదరి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాగిన మైకంలో జరిగిన వివాదమే హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురుగు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తె వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీఎస్‌రావు లింగయ్యనగర్ సాయి జయ ఆర్చిడ్ అపార్ట్మెంట్లో ఉంటూ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌గా పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరిన అతడికి స్థానికంగా పలువురితో విబేధాలు ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ రాత్రి గంగానగర్‌కు చెందిన మిర్జా హరూన్‌బేగ్, తన స్నేహితులు అశోక్‌కాలనీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం,, మహ్మద్ ఖలీల్ , తాజుద్దీన్‌తో కలిసి సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం సేవించారు. అదే సమయంలో వీఎస్‌రావు డ్రైవర్ సునీల్‌సింగ్ జాదవ్ కనిపించడంతో హరున్ అతనిని అడ్డుకుని వీఎస్‌రావు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పాడు. దీంతో అతను వీఎస్‌రావు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్నట్లు చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి వీఎస్ రావును కలిసి, తమకు మద్యం తాగించాలని కోరారు. అనంతరం అందరూ కలిసి బీరు బాటిళ్లు తీసుకుని ఖాళీ ప్లాట్‌కు వచ్చారు. హరుర్, వీఎస్‌రావు మద్యం తాగుతుండగా, సయ్యద్‌యాసిన్ అలీ కొద్ది దూరంలో కూర్చున్నాడు. అబ్రార్, ఖలీల్, తాజుద్దీన్, సునీల్‌సింగ్ జాదవ్ తమకు మద్యం చాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరితో అనవసరంగా గొడవలకు దిగుతున్నావంటూ హరుర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, తనపై అనవసర ఆరోపణలు చేస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. వీఎస్‌రావును చంపాలని నిర్ణయించుకున్న హరుర్ తన స్నేహితుడు ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్ యాసిన్ అలీకి ఫోన్ చేశాడు. సాజిద్ అక్కడికి వచ్చేసరికి ఇద్దరూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో హరుర్ తన చేతిలోని బీర్ బాటిల్‌తో వీఎస్‌రావు తలపై కొట్టగా, సాజిద్ అక్కడే ఉన్న గడప చెక్కతో తలపై బలంగా మోదడంతో అతను కుప్పకూలాడు. అనంతరం అక్కడే ఉన్న గ్రనైట్ రాయితో అతని తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి పరారవుతున్న వారికి స్నేహితులు ఎదురుపడటంతో తాము వీఎస్‌రావు చంపేశామని, అటువైపు వెళ్లవద్దని చెప్పడంతో ఏడురుగు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు చేదించారిలా... వీఎస్‌రావు ఫోన్ కాల్ డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. క్షణికావేశంతో చేసిన హత్యేనని, పథకం ప్రకారం చేసింది కాదని విచారణలో వెల్లడించారు. హత్య తరువాత పరారైన హరుర్, యాసిన్ అలీ ఖర్చుల నిమిత్తం అబ్రార్, ఖలీల్, తాజుద్దీన్ డబ్బులు పంపించినట్లుగా అంగీకరించారు. హత్య విషయం దాచిపెట్టిన సునీల్‌సింగ్ జాదవ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సాజిద్ పరారీలో ఉన్నాడు. -
నిత్య పెళ్లికొడుక్కి షాక్
సాక్షి, హైదరాబాద్: నిత్య పెళ్లికొడుకు, తమ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీయిచ్చారు. మరోవైపు సంగీతకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సంగీతకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆయన వెనుదిరిగారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. మూడు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోంది. ఇంటికి తాళం వేసి అత్తమామలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. తనతో విడాకులు తీసుకోకుండా మూడో పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసేందుకు వచ్చిన సంగీత, ఆమె సోదరుడు రంజిత్‌రెడ్డిపై శ్రీనివాస్‌రెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగీత ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మామ బాల్‌రెడ్డి, అత్త ఐలమ్మ, మూడో భార్య దేవిజగదీశ్వరిలపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
కొనసాగుతున్న సంగీత ఆందోళన
-
టీఆర్ఎస్ నేత మూడు పెళ్లిళ్లు, మరో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్ : బోడుప్పల్ టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పెళ్లిళ్ల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన సంగీతకు... మూడో భార్య దేవి జగదీశ్వరి తల్లి మద్దతుగా నిలిచింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి శ్రీనివాస్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. తన బిడ్డ అమాయకురాలని, 19ఏళ్ల తన కూతుర్ని...40ఏళ్ల శ్రీనివాస్ రెడ్డి మూడోపెళ్లి ఎలా చేసుకుంటాడని అన్నారు. ఇదేంటని తాను ప్రశ్నించినందుకు తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, తన కూతుర్ని తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనతో పాటు పిల్లల్ని చంపేస్తామని బెదిరించడంతో భయంతో నిజామాబాద్ వెళ్లి అక్కడ బతుకుతున్నామని తెలిపారు. రేపు ఇదే పరిస్థితి తన కూతురికి రాదనే నమ్మకం ఏంటని, ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని ఎంతమందిని మోసం చేస్తారని విలపించారు. టీఆర్ఎస్ నేతల అండతోనే శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోతున్నాడని దేవి జగదీశ్వరి తల్లి అన్నారు. తన బిడ్డ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే... తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు తన కూతురితో శ్రీనివాస్ రెడ్డి చెప్పించాడని ఆమె పేర్కొన్నారు. మరోవైపు సంగీత రెండోరోజు కూడా భర్త ఇంటి ఎదుట తన ఆందోళనను కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. సంగీత అంతకు ముందు శ్రీనిసవారెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది. మరోవైపు ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. సంగీతకు న్యాయం జరగాలనే...తాము సంఘీభావం తెలిపేందుకు వచ్చామన్నారు. సంగీత ప్లాన్ మీదే వచ్చింది... కాగా రెండోభార్య సంగీతను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చివేసి, ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో శ్రీనివాసరెడ్డిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మూడున్నరేళ్లు అవుతుందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకపోయిందన్నాడు. అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలురకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంగీతకు డబ్బు మాత్రమే కావాలని, తనతో కాపురం చేసేందుకు ఆమె ఇష్టపడటం లేదన్నాడు. తాను సంపాదించిది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు ...తన దగ్గర ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.