లిక్కర్, కోడి పంపిణీ చేసిన నాటి దృశ్యం
సాక్షి, వరంగల్: కేసీఆర్ కుటుంబంపై వీరాభిమానంతో అనే ప్రచారంతో కోడి, క్వార్డర్ బాటిల్‌ను హమాలీలకు పంచిన టీఆర్‌ఎస్ నేతకు షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
దసరా సందర్భంగా టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను టీఆర్‌ఎస్ నేత రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ అనే నేత. దీంతో ఈ టీఆర్‌ఎస్ సీనియర్ నేతకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది.
Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022
Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs
అయితే.. మునుగోడు ఓటర్లకు లిక్కర్, కోడి పంపిణీ చేశారన్న ఆరోపణలపై శ్రీహరి స్పందించారు. అసలు మునుగోడు ఉప ఎన్నికకు.. మద్యం కోడి పంపిణీకి సంబంధం లేదని చెప్తున్నారాయన. రాజకీయ దుర్బుద్ధితో కొందరు కావాలని ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారని, ఆపై తనకు నోటీసులు అందాయని అంటున్నారాయన. సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని.. అదీ వరంగల్‌లోనే దసరా రోజున మద్యం బాటిల్, కోడిని పంపిణీ చేశానని వివరణ ఇచ్చే యత్నం చేశారు రాజనాల శ్రీహరి.
ఇదీ చదవండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!
Comments
Please login to add a commentAdd a comment