liquor distribution
-
AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, భారీగా మద్యం పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల నుంచి సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మోదుగు వెంకటేశ్వరరావు, షేక్ షాహిన్ పాషా, జీనుగు అశోక్‌ను అరెస్ట్ చేశారు. -
పచ్చపార్టీ ప్రలోభాలు
సాక్షి, చిత్తూరు/చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్/గిద్దలూరు రూరల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఓవైపు మనీ.. ఇంకోవైపు మద్యం పంపిణీ చేస్తూ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ముందుగానే ఓటమి ఖాయం కావడంతో కాస్తయినా పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నగదు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చాలా సులువుగా అక్కడి మద్యాన్ని సరిహద్దులు దాటిస్తూ డంప్ చేస్తున్నారు. బుధవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గురజాల జగన్మోహన్, ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీకు వచ్చినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు, పెద్ద ఎత్తున మద్యం అందజేశారు. పలమనేరు నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి ‘పచ్చ’ జెండాలు మోస్తూ ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు. అయితే మళ్లీ తాజాగా చిత్తూరు రూరల్ మండలంలో జనసమీకరణ చేసి టీడీపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు ద్విచక్ర వాహనాలుప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు రూ.లక్షలు విలువ చేసే బుల్లెట్లు, ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి టీడీపీ అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో పాల వ్యాపారం చేసే వారికి ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఇచ్చారు. వాటికి టీడీపీ స్టిక్కర్లు అంటించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవిగో ప్రలోభాలు..♦ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లక్ష్మీపురం, ముత్తుకూరుల్లో ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కర్ణాటక మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు రూ.80 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.♦ ఇటీవల చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రూరల్ మండలంలో పిల్లలకు పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో షాదీమహల్ వద్ద రంజాన్ పర్వదినం ముందు రోజు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తరఫున ముస్లింలకు టీడీపీ గుర్తులతో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ♦ గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ తాయిలాల పంపిణీలో స్పీడ్ పెంచారు. రెండు రోజుల ముందు శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో నిత్యావసర వస్తువులతోపాటు చీర, జాకెట్, ప్యాంటు, చొక్కా, మద్యం బాటిల్, రూ.500 నగదు కిట్‌గా పంపిణీ చేశారు. ♦నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ క్వారీల రాజకీయానికి తెరతీశారు. తమ పార్టీలోకి వస్తే క్వారీలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మరికొందరికి డీకేటీ భూములు కూడా ఇస్తామని అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇక పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ♦టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ తాయిలాలు ఊపందుకున్నాయి. ఇటీవల చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని 243 పోలింగ్‌బూత్‌ల్లో ఒక్కో చోట రూ.30 వేల చొప్పున పంపిణీ చేశారు. అలాగే జనసమీ కరణ కోసం ఒక్కొక్కరికి రూ.300 నగదు, మద్యం సీసా, బిర్యానీ అందజేశారు.♦ ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి నామినేషన్ పర్వంలో ఓటులేని వారి చేతికి టీడీపీ జెండా ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి నామినేషన్‌కు నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి జనాన్ని తరలించారు. నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. -
కోడి, క్వార్టర్ పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్
సాక్షి, వరంగల్: కేసీఆర్ కుటుంబంపై వీరాభిమానంతో అనే ప్రచారంతో కోడి, క్వార్డర్ బాటిల్‌ను హమాలీలకు పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దసరా సందర్భంగా టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ అనే నేత. దీంతో ఈ టీఆర్ఎస్ సీనియర్ నేతకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 అయితే.. మునుగోడు ఓటర్లకు లిక్కర్, కోడి పంపిణీ చేశారన్న ఆరోపణలపై శ్రీహరి స్పందించారు. అసలు మునుగోడు ఉప ఎన్నికకు.. మద్యం కోడి పంపిణీకి సంబంధం లేదని చెప్తున్నారాయన. రాజకీయ దుర్బుద్ధితో కొందరు కావాలని ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారని, ఆపై తనకు నోటీసులు అందాయని అంటున్నారాయన. సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని.. అదీ వరంగల్‌లోనే దసరా రోజున మద్యం బాటిల్, కోడిని పంపిణీ చేశానని వివరణ ఇచ్చే యత్నం చేశారు రాజనాల శ్రీహరి. ఇదీ చదవండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే! -
Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బుల పంపిణీ జోరందుకుంది. మద్యం విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. కుల, మహిళా, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అడిగినంత ముట్టచెబుతున్నాయి. మరోవైపు విందులు, వినోదాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఇస్తున్న తాయిలాలు ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ఖర్చు రూ.150 కోట్లు దాటిందని ఓ సర్వే లెక్క కట్టింది. అయితే ధన ప్రవాహాన్ని అదుపు చేయాల్సిన ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బతుకమ్మ పండగకు భారీ ఖర్చు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి బతుకమ్మ పండగ కోసం మహిళలను సమీకరించారు. చౌటుప్పల్, మునుగోడులో జరిగిన బతుకమ్మ పండగ కోసం వచ్చిన మహిళలు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారు. ఒక్కో చోట సుమారు 4 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించారు. మున్సిపాలిటీలు, మండలాల్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి చోట సుమారు 8వేల మందికి విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేశారు. చండూరులో నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.500, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ లిక్కర్ కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఇలా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు చేరో రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. నామమాత్రంగా ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్ పరిశీలకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని, కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా ఎక్కడా పట్టుకున్న జాడలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా లెక్కలు రాస్తున్నారని విమర్శిస్తున్నారు. రూ. కోట్లలో మద్యం అమ్మకాలు ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. కోట్లల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10 వరకు రూ.44,54,01,197 కోట్ల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. మీటింగులకే కోట్లలో ఖర్చు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల సభలకే కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సెప్టెంబర్ 20న మునుగోడులో కేసీఆర్, 21 అమిత్‌షా సభల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా ఖర్చయినట్లు సమాచారం. అలాగే చేరికల కోసం ఒక్కో సర్పంచ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దసరా పండుగ రోజు నియోజవకర్గంలోని 298 బూత్‌లకు బీజేపీ ప్రతి బూత్‌కు రూ.20 నుంచి 20 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రతి బూత్‌కు రూ.10 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థాయినుంచి మంత్రి వరకు ఇన్చార్జ్ లను నియమించింది. అయితే ఒక్కొక్కరి వెంట 25 మంది నుంచి 30 మంది వచ్చి ఆ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. వీరికి భోజనాలు, రవాణ ఖర్చులు భారీగానే అవుతున్నాయి. కుల సంఘాల సమావేశాలకు అంచనాలకు మించి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలను మున్సిపాలిటీలు, మండలాల వారీగా లక్షలు ఖర్చు చేశారు. -
‘ఫ్రీగా క్వార్టర్, కోడి.. కేటీఆర్‌గారూ మీ ఐడియానేనా?’
వైరల్: తెలంగాణ.. జాతీయ స్థాయి రాజకీయాలకు వేదిక కానుందనే చర్చ జోరందుకుంది. దసరా పండుగ నాడు టీఆర్ఎస్ తరపున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారనే జోష్‌లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ తరుణంలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కోడి, క్వార్టర్ బాటిల్‌ను పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అని తెలుస్తోంది. హమాలీలకు దగ్గరుండి మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారాయన. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ నేపథ్యంలో కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. Liquor party! Ahead of #KCR’s ‘national party’ #BRS launch, #TRS party leader Rajanala Srihari distributes liquor and chicken to locals, in Warangal, to celebrate the launch. The leader, reportedly, said he wants #KCR to become PM, his son #KTR to be CM of #Telangana. pic.twitter.com/J0gOYlsKVS — Rishika Sadam (@RishikaSadam) October 4, 2022 ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారాయన. #WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU — ANI (@ANI) October 4, 2022 Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 -
Huzurabad Bypoll: ఇంటింటికీ మటన్.. మద్యం..
ఇల్లందకుంట (హుజూరాబాద్): ‘ఓట్ల కోసం ఇంటింటికీ మటన్, మద్యం పంపించే దౌర్భాగ్యం ఎక్కడా చూడలేదు. డబ్బులతో రాజకీయాలను శాసించాలనుకునే కేసీఆర్ దుష్ట రాజకీయాలను బొంద పెట్టాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆటో సంఘం నాయకులతో మాట్లాడారు. ‘నన్ను కాపాడండి.. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటా. ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తా’ అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అరిగోస పడుతోందని అన్నారు. ‘యావత్తు భారతదేశ చరిత్రలోనే ఒక నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయి ఉంటుందా.. ప్రజల గొంతుకగా ప్రశ్నించే నన్ను రాజకీయంగా ఖతం చేయడానికే కుట్రలు పన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అని ఈటల ఆరోపించారు. -
‘హద్దు’మీరిన కిక్కు
ఇది అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామం కొత్తూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణం. ఈ షాపు కర్ణాటక భూభాగంలో ఉండగా.. మద్యం మాత్రం ఆంధ్రాలో పారుతోంది. ఆంధ్ర సరిహద్దుకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దుకాణానికి వచ్చే కర్ణాటక మద్యం.. రోజూ రాత్రి వేళల్లో సరిహద్దు దాటి మన జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చేరుతోంది. మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఇక్కడ ‘సెబ్’ చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా.. ఈ షాపు నుంచి సరిహద్దు దాటుతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ అక్రమ మద్యం దందాలో ‘సెబ్’ అధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం: మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. కర్ణాటక సరుకు మాత్రం అనంతపురం జిల్లాను ముంచెత్తుతోంది. కట్టడి చేయాల్సిన కొందరు అధికారులే కాసులు తీసుకుని కళ్లుమూసుకుంటుండగా కర్ణాటక మద్యం ఆంధ్రాలోకి అక్రమంగా వచ్చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం నుంచే కర్ణాటక మద్యం భారీగా జిల్లాలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలోనే అక్రమంగా ఆంధ్రలోకి ప్రవేశిస్తున్న కర్ణాటక మద్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం శాండ్ అండ్ లిక్కర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. గుమ్మఘట్ట మండలంలో 2, రాయదుర్గం మండలంలో 2, డి.హీరేహాళ్ మండలంలో 9, బొమ్మనహాళ్ మండలంలో 4 చొప్పున మొత్తం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అయినా అక్రమార్కులు అడ్డదారుల్లో కర్ణాటక మద్యాన్ని జిల్లాకు చేరవేస్తున్నారు. కర్ణాటక పరిధిలో షాపులు.. ఆంధ్ర రోడ్డులో సరాఫరా ఆంధ్రాకు సరిహద్దున ఉన్న కర్ణాటక భూభాగంలో షాపులు ఏర్పాటు చేస్తున్న కొందరు వ్యాపారులు.. సరుకును ఆంధ్రా మద్యం మాఫియాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా అక్రమంగా కర్ణాటక మద్యం కొనుగోలు చేస్తున్న వారు...సరిహద్దు దాటించి ఆంధ్రాలోకి చేర్చి జోరుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. అయితే సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు కర్ణాటక నుంచి మద్యం సరాఫరా కావాలన్నా...ఆంధ్ర పరిధిలోని రోడ్లపైనే వెళ్లాల్సి ఉన్నా.. ‘సెబ్’ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. చెక్‌పోస్టుల్లోనూ వసూళ్లు అక్రమ మద్యం రవాణా అడ్డుకట్ట వేయాల్సిన చెక్‌పోస్టుల్లోని కొందరు ఎస్పీఓలు మామూళ్లకు అలవాటు పడ్డారు. అక్రమ మద్యం వ్యాపారులతో మామూళ్లు తీసుకుని మద్యం వాహనాలను వదిలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా తాగేందుకు ఒకటి, రెండు బాటిళ్లు తెచ్చుకుంటే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయడం, లేకపోతే వారిని భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడం, పట్టుకున్న మద్యాన్ని తిరిగి షాపుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అక్రమ రవాణా బాటలో యువత కర్ణాటక మద్యం విక్రయం ద్వారా ఎక్కువ లాభాలు వస్తుండడంతో సరిహద్దు గ్రామాల్లోని యువకులు మద్యం మాఫియాగా తయారవుతున్నారు. ఒక్కో గ్రామంలో 10 మంది దాకా యువకులు కర్ణాటక మద్యం అక్రమంగా తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. 96 పాకెట్లు ఉన్న ఒక కేస్ అమ్మితే రూ. 5 వేల నుంచి రూ.7 వేల వరకు లాభం వస్తుండడంతో అడ్డదారుల్లో ద్విచక్రవాహనాల్లో కర్ణాటక మద్యం తెస్తున్నారు. అయితే ఎక్సైజ్ (సెబ్) అధికారులు అన్నీ తెలిసినా మామూళ్ల మత్తులో కళ్లుమూసుకున్నారు. ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మాత్రం అడపాదడపా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దాడులు చేస్తూనే ఉన్నాం రాయదుర్గం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో రోజూ దాడులు చేస్తూనే ఉన్నాం. అక్రమ మద్యంపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆంధ్రవారికి మద్యం విక్రయించవద్దని సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు నోటీసులిచ్చాం. సరిహద్దులో నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. – వై.పవన్ కుమార్ , సెబ్ అధికారి, రాయదుర్గం -
మాకు విశేషాధికారాలున్నాయి
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు విశేషాధికారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల వాయిదా, రద్దు, తిరిగి నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలున్నాయన్నారు. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతుంటే జోక్యం చేసుకుని నిష్పాక్షికంగా నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా 126 జెడ్పీటీసీలు, 2,363 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, గతంతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య అసాధారణంగా పెరిగిందన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో బెదిరింపులు, ప్రలోభాలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, అందుకే ఏకగ్రీవాల్లో ఎన్ని న్యాయమైనవో తేల్చేందుకే విచారణ జరపాలని నిర్ణయించామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలని, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అభ్యర్థించారు. ఫాం – 10 ప్రస్తావన లేకుండా కౌంటర్ 657 పేజీల కౌంటర్లో న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన దాదాపు 25 తీర్పులను నిమ్మగడ్డ ప్రస్తావించారు. పిటిషనర్లు ప్రధానంగా ప్రస్తావించిన ఫాం – 10 (అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఇచ్చే పత్రం) గురించి కనీసం ఒక్క పదం కూడా ఆయన కౌంటర్లో పేర్కొనకపోవడం గమనార్హం. కౌంటర్లో మొత్తం ఎన్నికల కమిషన్ అధికారాల గురించే ప్రస్తావించారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తయిందా లేదా అని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరా తీశారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమ్మగడ్డతో సీఎస్ భేటీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై నివేదిక పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీల వారీగా కౌంటింగ్, రీ కౌంటింగ్ జరిగిన తీరుపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం ఎస్ఈసీకి నివేదిక అందజేసినట్టు తెలిసింది. కౌంటింగ్ తీరుపై ఎస్ఈసీ నివేదిక కోరిన విషయం తెలిసిందే. -
లంచ్ బాక్స్ తెరచి చూస్తే షాక్..!!
హర్దోయ్/ఉత్తరప్రదేశ్ : సామాజిక సమ్మేళనం పేరిట దేవాలయంలో మద్యం పంపిణీ జరిగింది. ఈ ఘటన హర్దోయ్‌లోని శ్రావణ దేవి ఆలయంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. మీటింగ్‌లో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో పెట్టి మద్యం సీసాలను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లలకు కూడా అవే బాక్సులు ఇచ్చారు. బాక్స్ తెరచి చూడగా అందులో ఆహారంతో పాటు మద్యం సీసా కూడా ఉండడంతో పిల్లలు షాక్ అయ్యారు. ఈ వార్త బయటకు తెలియడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే చేశారు.. దేవాలయంలో మద్యం పంపిణీ ‘ఒక దురదృష్టకర సంఘటన’ అని హర్దోయ్ ఎంపీ అన్షుల్ వర్మ వ్యాఖ్యానించారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇటీవలే సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీపై దుష్ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. మీటింగ్‌లో పాల్గొన్న చిన్న పిల్లలకు సైతం మద్యం బాటిళ్లు చేరడం దుశ్చర్య అని అన్నారు. ఇంత భారీ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతోంటే ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. కాగా, కార్యక్రమానికి హాజరైన పలు గ్రామాల పెద్దలు లంచ్ బాక్స్‌లు తీసుకొని, ఆయా గ్రామాల్లోని తమ వర్గంవారికి తప్పక పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్ చెప్పున్న వీడియో ఒకటి బయటపడింది. అయితే, నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్‌ని దోషిని చేయడం ద్వారా బీజేపీ ఈ వివాదం నుంచి బయటపడాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. నితిన్, నరేష్‌లు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
టోకెన్ కొట్టు.. మద్యం పట్టు: నిజామాబాద్
కాలం మారేకొద్ది మనుషులూ మారుతున్నారు. అంతేనా అంటే రాజకీయ పార్టీలూ మారుతున్నాయి! సభలు, సమావేశాలకు వచ్చేవారికి కాస్తయినా మర్యాద చేయాలి. అందుకు వచ్చినవారికి ఒక్కో టోకెన్ చొప్పున ఇస్తున్నారు. ఆ టోకెన్‌ను సంబంధిత వైన్స్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు వైన్స్‌ల నిర్వాహకులు సహకరించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం అది నేరమంటున్నారు. సాక్షి, కామారెడ్డి క్రైం: రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికలంటేనే డబ్బు, మద్యంతో సావాసం. ఇదివరకు గ్రామంలోని ఓ పార్టీ పెద్దమనిషి చీటి రాసి ఇస్తే కల్లు దుకాణంలో కల్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎన్నికల వేళ కల్లును ఆశించే వారే లేరు. ప్రచారానికి వచ్చే వారి నుంచి మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మద్యం, నగదులాంటి ప్రలోభాలకు ఓటర్లను గురిచేయడం నేరం. ఇలాంటి నిబంధనలను తప్పించుకుంటూ తమ వారికి మద్యం, నగదు అందించేందుకు ఆయా పార్టీల పెద్దలు కొత్తదారులు వెతుకుతున్నారు. మద్యం దుకాణాల ద్వారా తమ కార్యకర్తలకు మందు సరఫరా చేసేందుకు కొత్తగా టోకెన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు జనాన్ని తరలించిన సందర్భాల్లో, ఇతర ప్రచార కార్యక్రమాల సమయాల్లో మద్యాన్ని నేరుగా ఇవ్వకుండా టోకెన్లు ఇస్తున్నారు. వారిచ్చిన టోకెన్ తీసుకుని వైన్స్‌కు వెళితే ఒక్కో లోకెన్కు ఒక మందు బాటిల్ చొప్పున ఇచ్చేస్తారు. గతంలోనూ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సమయాల్లో ఈ విధమైన పద్ధతులను అనుసరించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో టోకెన్లకు గిరాకీ బాగా పెరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ వ్యాపారమే పరమావధిగా తీసుకుంటున్న వైన్స్‌ల నిర్వాహకులు పార్టీల పెద్దలకు తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మచ్చికతో రాజకీయ మర్యాద.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టోకెన్ పద్ధతిలో మద్యం పంపిణీ నడుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పార్టీ సమావేశం అనంతరం కొందరు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఓ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు తనకు పైనుంచి వచ్చిన 70 టోకెన్లు పంచేశానని, మిగిలినవారు అడిగితే ఎక్కడి నుంచి తేవాలనడం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ వెంట వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ప్రచారం పూర్తయ్యాక మర్యాదలు చేసేందుకు నేరుగా కొంత డబ్బును, మద్యం టోకెన్లను ఇచ్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మద్యం నిల్వలు తమ దగ్గర పెట్టుకునే బాధలేకుండా రాజకీయ పార్టీల నేతలకు వైన్స్‌ల నిర్వాహకులు విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో టోకెన్ పద్ధతిలో మద్యం విక్రయించే వారిపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. అయినా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. టోకెన్ పద్ధతిలో మద్యం కొనుగోళ్లకు అనుమతి లేదు. రాజకీయ పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతులను అవలంబిస్తుండగా దుకాణాల యజమానులు వ్యాపారం ముసుగులో పార్టీలకు సహకారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బెల్టుషాపుల్లో సైతం టోకెన్ సిస్టం అమలవుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలాచోట్ల దాడులు చేసి అక్రమ మద్యం నిల్వలు, రవాణాను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసులు చేశారు. టోకెన్ విధానంలో మద్యం విక్రయాలు చేయకూడదని చెబుతున్నారు. తమ దృష్టికి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
వీడియో : మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
కోయంబత్తూర్ : అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు మద్యం, డబ్బు పంచుతూ అడ్డంగా బుక్కయిపోయారు. ఆ వీడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఆర్ జయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. అయితే అందుకు జనాలను సమీకరించేందుకు ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మద్యం, డబ్బును పంచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 60 బస్సుల్లో ఆయన ప్రజలను వేడుకలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పక్కనే ఓ వ్యక్తి 2వేల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రిజిస్టర్లో రాసుకుంటూ ఉండటం, ఆ పక్కనే మద్యం బాటిళ్ల కాటన్ డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండటం కనిపించింది. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం మరో వాదనను రేపుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభపెడుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కనకరాజ్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఎంజీఆర్ జయంతి వేడుకల కోసం వేదిక వద్దకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం తాను డబ్బును కేటాయించినట్లు ఆయన చెబుతున్నారు. తమిళ ప్రజలు డబ్బు, మద్యానికి తలొగ్గే రకం కాదని.. ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. డబ్బు,మద్యం, మిల్క్ టోకెన్లు, చివరకు ఫోన్ రీఛార్జీ కూపన్లు, మొబైల్ వాలెట్ పేమెంట్లను కూడా పలువురు నేతలు పంపిణీ చేయటంతో ఎన్నిక రద్దైన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించనుంది. -
మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
-
పతాక స్థాయికి ప్రలోభాలు
సాక్షి, గుంటూరు : ఎన్నికల వేళ టీడీపీ ప్రలోభాల పర్వం పతాక స్థాయికి చేరింది. పచ్చ నోట్లు విసిరేస్తే ప్రజలు ఓట్లు రాల్చేస్తారని నమ్మకమో.. మద్యం మత్తులో ముంచేస్తే దాసోహ మంటార నే ధైర్యమో.. తెలుగుదేశం నేతల ప్రచారానికి తెరపడిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. ఓటుకు నోటు అంటూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. సందట్లో సడేమియాగా ఓటర్లు చూసుకుంటారులే.. ఈ ఒక్కరోజు గడిస్తే ఇక మనల్నేం చేస్తారులే అనుకున్నారో.. ఏమో ఇష్టం వచ్చినట్లు దొంగనోట్లు, కల్తీ మద్యం పంపిణీ విస్తృతం చేసేశారు. ఓటుకు వెయ్యి పంచిన చోట రెండు ఐదువందల నోట్లు ఇచ్చారు. వాటిలో ఒకటి అసలిది.. మరొకటి నకిలీది.. ఓటర్లకు పంపిణీ చేస్తూ ఓట్లన్నీ మాకే వేయాలంటూ ప్రమాణాలు చేయించుకున్నారు. అవి తీసుకున్న ఓటర్లు ఆనక నకిలీవని తేలడంతో ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా జిల్లా అంతటా పాకింది. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు పంచిన నగదు నకిలీదని తేలిపోయింది. ముఖ్యంగా గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో ఇలాంటివి పంపిణీ చేసినట్లు తెలిసి ఓటర్లు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న నేతలు ఎక్కడో పొరపాటు జరిగిందంటూ అడిగిన వాళ్లకు మాత్రం వాటిని మార్చి కొత్త నోట్లను ఇచ్చేశారు. టీడీపీ చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు వారికి ఓటు ద్వారానే దెబ్బకుదెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. కల్తీ మద్యం తాగి టీడీపీ అభిమాని మృతి.. ఇదిలా ఉంటే చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో ఓ టీడీపీ అభిమాని తమ పార్టీ వారి వద్దకు వె ళ్లి మద్యం తాగాడు. అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎల్లో మీడియా ఆ ప్రభావం టీడీపీపై పడకుండా ఉండేందుకు నెపం ఇతర పార్టీలపై మోపాలని ప్రయత్నాలు చేసింది. మృతుని కుటుంబసభ్యులతో రాజీ కుదుర్చుకుని అనారోగ్యంతో మృతి చెందినట్లు అందరికీ చెప్పించారు. వృతుడు టీడీపీకి అభిమాని కావడం ఇతర పార్టీల వారి వద్దకు అసలు వెళ్లే అవకాశం లేదనే విషయం తేలిపోవడంతో టీడీపీ నేతలు కల్తీమద్యం పంపిణీ చేస్తున్నారని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీశారని, దీంతో వాటిని మార్చి మరో బ్రాండ్ అందిస్తున్నారని సమాచారం. -
టీడీపీ మద్యం తాగి.. కార్యకర్త మృతి
తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తెచ్చిన మద్యం వాళ్ల సొంత పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. టీడీపీ వర్గాలు పంచిపెట్టిన నకిలీ మద్యాన్ని తాగి ఓ కార్యకర్త మరణించాడు. ఆ జిల్లాలోని నాదెండ్ల మండలం గొరిజవోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంపిణీ చేసిన మద్యం తాగి షేక్ సుబానీ అనే కార్యకర్త మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పార్టీ కోసం జెండా మోసిన సుబానీ.. ఇప్పుడు వాళ్లిచ్చిన మద్యం వల్లే మరణించాడంటూ అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. -
‘పచ్చ’పాములు
సాక్షి, ఏలూరు : ఓటర్లను డబ్బు, మద్యంతో కాటేసేందుకు పచ్చ పార్టీ పాములు వస్తున్నాయి. కులాల చిచ్చుతో, మతాల ఉచ్చుతో ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కాలని చూస్తున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెర తీసింది. విచ్చలవిడిగా ప్రాంతాల వారీగా కొన్నిచోట్ల ఇప్పటికే డబ్బు, మద్యం పంపకాలు ప్రారంభించింది. కుల, మత పెద్దలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోంది. రసీదు పుస్తకాలతో ముందస్తు హామీలు గుప్పిస్తోంది. లారీలు, ఆటోలు కొనిస్తామంటూ మాయమాటలతో ఓటర్లకు వల వేస్తోంది. ఏలూరులో డ్వాక్రా గ్రూపునకు రూ.3వేలు చొప్పున ఇస్తున్నారు. ఓటర్లకు రూ.300 ఇచ్చారు. కొవ్వూరు, గోపాలపురంలలో ఓటుకు రూ.500 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పోలవరంలో ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ చేస్తున్నారు. కుల, మత సంఘాల పెద్దలకు రూ.10,000 వేలు చొప్పున పంచుతున్నారు. ఆ వర్గంలోని వారందరితో ఓట్లు వేయించాల్సిందిగా ఒప్పందం చేసుకుంటున్నారు. నిడదవోలులో డ్వాక్రా సంఘాలకు రూ.3వేలు, పాస్టర్లకు రూ.2వేలు, ఆటో డ్రైవర్లకు రూ.500, ఆర్ఎంపీ డాక్టర్లకు రూ.1000 ఇస్తున్నారు. లారీలు, ఆటోలు కొనిచ్చేస్తామంటూ డ్రైవర్లకు వల వేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఓటుకు రూ.1000 ఇవ్వడానికైనా వెనుకాడడం లేదు. ఇక్కడ ఇప్పటికే ఓటర్లకు రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం, విందు అందిస్తున్నారు. తణుకులో ఏకంగా రసీదు పుస్తకాలు పంచిపెడుతున్నారు. దానిలో ఓటర్ల బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ రాయించుకుంటున్నారు. బ్యాంకు రుణాలు రద్దు చేస్తామంటూ ప్రలోభపెడతున్నారు. ఓటరు అవసరమేంటో రాయాలని, గెలిచాక దానిని తీరుస్తామని నమ్మబలుకుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1500 వరకు ఇచ్చేందుకైనా సిద్ధపడుతున్నారు. ఉంగుటూరులో ఓటుకు రూ.300, ఆచంటలో రూ.1000 చొప్పున పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే మరికొంత ఇచ్చేందుకు వెనకాడకూడదని టీడీపీ భావిస్తోంది. ఇక్కడ మద్యం పంపిణీకి టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడిక్కడ మద్యం నిల్వలు చేస్తోంది. పెనుగొండ మండలం మునపర్రు గ్రామంలో రూ.35వేలు విలువైన మద్యం, పెనుమంట్ర మండలం మార్టేరులోనూ టీడీపీకి చెందిన మద్యంను ఆదివారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడమే దీనికి ఉదాహరణ. దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్‌లో ఓటుకు రూ.300 ఇచ్చారు. నరసాపురంలోనూ ఓటుకు రూ.1000 నుంచి రూ.1500 వరకూ ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.