
ఇల్లందకుంట (హుజూరాబాద్): ‘ఓట్ల కోసం ఇంటింటికీ మటన్, మద్యం పంపించే దౌర్భాగ్యం ఎక్కడా చూడలేదు. డబ్బులతో రాజకీయాలను శాసించాలనుకునే కేసీఆర్ దుష్ట రాజకీయాలను బొంద పెట్టాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆటో సంఘం నాయకులతో మాట్లాడారు.
‘నన్ను కాపాడండి.. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటా. ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తా’ అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అరిగోస పడుతోందని అన్నారు. ‘యావత్తు భారతదేశ చరిత్రలోనే ఒక నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయి ఉంటుందా.. ప్రజల గొంతుకగా ప్రశ్నించే నన్ను రాజకీయంగా ఖతం చేయడానికే కుట్రలు పన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అని ఈటల ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment