EC notices
-
మోదీ ‘ఉల్లంఘన’లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్‌షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది. మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.కాగా, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు. -
కోడి, క్వార్టర్ పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్
సాక్షి, వరంగల్: కేసీఆర్ కుటుంబంపై వీరాభిమానంతో అనే ప్రచారంతో కోడి, క్వార్డర్ బాటిల్‌ను హమాలీలకు పంచిన టీఆర్ఎస్ నేతకు షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దసరా సందర్భంగా టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ అనే నేత. దీంతో ఈ టీఆర్ఎస్ సీనియర్ నేతకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 అయితే.. మునుగోడు ఓటర్లకు లిక్కర్, కోడి పంపిణీ చేశారన్న ఆరోపణలపై శ్రీహరి స్పందించారు. అసలు మునుగోడు ఉప ఎన్నికకు.. మద్యం కోడి పంపిణీకి సంబంధం లేదని చెప్తున్నారాయన. రాజకీయ దుర్బుద్ధితో కొందరు కావాలని ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారని, ఆపై తనకు నోటీసులు అందాయని అంటున్నారాయన. సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని.. అదీ వరంగల్‌లోనే దసరా రోజున మద్యం బాటిల్, కోడిని పంపిణీ చేశానని వివరణ ఇచ్చే యత్నం చేశారు రాజనాల శ్రీహరి. ఇదీ చదవండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే! -
రాహుల్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల తుది విడత పోలింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీచేసింది. పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా రాహుల్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న బీజేపీ ఫిర్యాదు మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిసెంబర్ 18, సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సూచించింది. గురువారం (డిసెంబర్ 14న) గుజరాత్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ జరుగనుండగా, మంగళవారం(డిసెంబర్ 12) సాయంత్రంతోనే ప్రచారానికి తెరపడిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం(డిసెంబర్ 13న) పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రాహుల్ గాంధీ.. వాటిలో గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్న బీజేపీ.. ఈసీకి ఫిర్యాదుచేసింది. రాహుల్‌కు ఈసీ నోటీసులు.. రాహుల్ ఇంటర్వ్యూలపై ఈసీకి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు.. -
ప్రభుత్వానికి ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని మంత్రి కేటీఆర్ చాంబర్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో ఇటీవల వివిధ పార్టీల నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్... వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదే సమయంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లను కలిపి దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మిస్తామని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం పలు హామీలు ఇచ్చారని.. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు సచివాలయంలోని మంత్రి కేటీఆర్ చాంబర్లో టీఆర్ఎస్లో చేరారని, ఇది కోడ్ పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నోటీసులపై సీఎస్ స్పందిస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంత్రి చాంబర్లో జరిగిన అంశాలను అంతర్గత వ్యవహారాలుగా పరిగణించాల్సి ఉంటుందని, వ్యక్తిగత, భద్రతా కారణాల దృష్ట్యా వీటిని ప్రభుత్వం తమ పరిధిలోని అంశాలుగా భావిం చటం లేదని గురువారం ఈసీకి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.