సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని మంత్రి కేటీఆర్ చాంబర్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో ఇటీవల వివిధ పార్టీల నేతలు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్... వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే సమయంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లను కలిపి దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మిస్తామని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం పలు హామీలు ఇచ్చారని.. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు సచివాలయంలోని మంత్రి కేటీఆర్ చాంబర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారని, ఇది కోడ్ పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నోటీసులపై సీఎస్ స్పందిస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంత్రి చాంబర్‌లో జరిగిన అంశాలను అంతర్గత వ్యవహారాలుగా పరిగణించాల్సి ఉంటుందని, వ్యక్తిగత, భద్రతా కారణాల దృష్ట్యా వీటిని ప్రభుత్వం తమ పరిధిలోని అంశాలుగా భావిం చటం లేదని గురువారం ఈసీకి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
ప్రభుత్వానికి ఈసీ నోటీసులు
Published Fri, Dec 4 2015 1:37 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement